Patanjali Yogpeeth
-
పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన మోదీ
హరిద్వార్: పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ నిర్మించిన పరిశోధన కేంద్రం పతంజలి యోగ్‌పీఠ్ ను ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురు బాబా రాందేవ్‌కి ప్రధాని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యోగా ప్రాచుర్యానికి, ఆయుర్వేద వైద్యానికి, ఔషధాలకు విశిష్టతను కల్పించారని భారత ఆయుర్వేద ఉత్పతులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్పుంజుకుందని ప్రధాని చెప్పారు. అయితే ఈ ఉత్పత్తులు వారికి చేరడం లేదని, పతంజలి పరిశోధన ద్వారా వచ్చే ఉత్పత్తులు వారికి చేరువ కావాలన్నారు. దేశానికి గర్వకారణమైన చారిత్రక, వారసత్వ సంపదను విస్మరించకూడదని ప్రధాని సూచించారు. పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ బృందం రూపొందించిన ప్రపంచ హెర్బల్ ఎన్సైకిలో పీడియాను మోదీ విడుదల చేశారు. అలాగే రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అహ్మాదాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. తద్వారా దేశవ్యాప్తంగా యోగాను పాపులర్ చేయనున్నామని ప్రధాని ప్రకటించారు. ఈ ఉత్సవంలో సాధ్యమైనంతమంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
రాందేవ్ ఆశ్రమంలో ఖాదర్ ఖాన్‌కు చికిత్స
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్‌కు యోగా గురు రాందేవ్ బాబా పతంజలి యోగపీఠంలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం 'హో గయా దిమాగ్ కా దహీ' సినిమాలో నటిస్తున్న ఖాదర్ ఖాన్ చికిత్స బాధ్యతను సినిమా యూనిట్ తీసుకుంటుందని దర్శకుడు ఫౌజియా అర్షి తెలిపారు. ఆయన సంపూర్ణారోగ్యం పొంది, మళ్లీ షూటింగుకు రావాలని తామంతా కోరుకుంటున్నామన్నారు. సినిమా నిర్మాత సంతోష్ భారతీయ కూడా ఖాదర్ ఖాన్ ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. అందుకే ముంబై నుంచి హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠానికి తీసుకెళ్లామన్నారు. ఖాదర్ ఖాన్‌ను బాబా రాందేవ్, ఆశ్రమంలోని ఆయుర్వేద గురువు ఆచార్య బాలకిషన్ సాదరంగా స్వాగతించారని ఫౌజియా అర్షి చెప్పారు. 'హో గయా దిమాగ్ కా దహీ' సినిమాలో ఇంకా ఓంపురి, సంజయ్ మిశ్రా తదితరులు నటిస్తున్నారు. ఇది కాక పరేష్ రావెల్, జాన్ అబ్రహం, సునీల్ శెట్టిలతో కలిసి 'హేరా ఫేరీ 3' సినిమాలో కూడా ఖాదర్ ఖాన్ నటిస్తున్నారు. -
బాబా రామ్‌దేవ్‌కు స్వేచ్ఛ
లండన్: దాదాపు రెండు రోజులుగా విచారణ పేరుతో తమ నిర్బంధంలో ఉంచిన యోగా గురు రామ్‌దేవ్‌ను బ్రిటన్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు శనివారం విడుదల చేశారు. యోగా శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం లండన్ చేరుకున్న ఆయనను కస్టమ్స్ అధికారులు హీత్రూ విమానాశ్రయంలో నిలిపేశారు. నిర్బంధానికి తగిన కారణాలేమీ చెప్పకుండానే ఆయనను మొదటిరోజు ఆరుగంటలపైనే విచారించారు. బిజినెస్ వీసాపై గాకుండా సందర్శకుల వీసాపై ప్రయాణించడంపైనే అధికారులు ఆయనను ప్రశ్నించారని సమాచారం. శనివారం సాయంత్రం భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్‌తో కలిసి హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన రామ్‌దేవ్, చీఫ్ ఇమిగ్రేషన్ అధికారిని కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం అధికారులు ఆయన స్వేచ్ఛగా బ్రిటన్‌లో తన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని స్పష్టంచేశారు. అధికారుల ప్రకటన తర్వాత రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ, తన నిర్బంధం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ హస్తం ఉండవచ్చని అన్నారు. అంతకు ముందు ఈ విషయంపై స్పందించడానికి బ్రిటన్ హోం శాఖ నిరాకరించింది. బ్రిటన్‌లో యోగా శిబిరాల నిర్వహణతో పాటు పతంజలి యోగాపీఠ్ (బ్రిటన్) ట్రస్టు కార్యక్రమాల్లో రామ్‌దేవ్ ప్రసంగించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం లండన్‌లోని లాంప్టాన్ పార్కులో ప్రవాసభారతీయుల సదస్సులో రామ్‌దేవ్ కీలక ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిర్బంధం విషయం కొలిక్కి వచ్చేవరకు ఆ కార్యక్రమం నిలిపేశారు. రామ్‌దేవ్ నిర్బంధం తీవ్రమైన విషయమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కోరారు.