patel reservations
-
హార్దిక్‌కు రెండేళ్ల జైలు
మెహసానా: పటీదార్ల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్‌కు గుజరాత్‌లోని ఓ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 జూలైలో విస్నగర్లో జరిగిన అల్లర్లు, ఆస్తి నష్టం కేసులో హార్దిక్‌తో పాటు లాల్జీ పటేల్, ఏకే పటేల్‌కు శిక్ష పడింది. అయితే వెంటనే అదేకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అల్లర్లు సృష్టించడం, ఆస్తి నష్టం, చట్ట వ్యతిరేకంగా సమావేశం కావడం వంటి కేసుల్లో వారు ముగ్గురూ దోషులుగా తేలినట్లు విస్నగర్ సెషన్స్ కోర్టు జడ్జి వీపీ అగర్వాల్ తీర్పులో పేర్కొన్నారు. వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 14 మందిని సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది. పటీదార్ రిజర్వేషన్ల కోసం విస్నగర్లో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారిందని, దీనివల్ల ఆస్తి నష్టం, మీడియాపై దాడులు జరిగాయని మెహసానా జిల్లాలో 2015 జూలై 23న ఎఫ్ఐఆర్ నమోదైంది. సత్యం, రైతులు, యువత, పేదవారి కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని బెదిరింపులతో బీజేపీ ‘హిట్లర్ షాహీ’ ఆపలేరని హార్దిక్ పటేల్ మీడియాతో పేర్కొన్నారు. -
పటేళ్ల పంతం నెగ్గిందా?
గుజరాత్లో పాటీదార్ల వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. 2015లో హార్ధిక్ పటేల్ నాయకత్వాన మొదలైన పాటీదార్ల రిజర్వేషన్ ఆందోళన అత్యధిక పటేళ్లను బీజేపీకి దూరం చేసింది. రిజర్వేషన్ అమలు చేస్తామనే రాహుల్ హామీతో వారిని ఆకట్టుకోవడం మొదటిసారి గుజరాత్ రాజకీయ, సామాజిక చిత్రాన్ని సమూలంగా మార్చే పరిస్థితి తలెత్తింది. పర్యవసానంగా బీజేపీ సీట్లకు గండికొట్టి, కాంగ్రెస్‌కు లాభం చేకూర్చింది. ఎక్కువ సీట్లు ఇచ్చినా బీజేపీకి దక్కని ప్రయోజనం రెండేళ్ల నుంచీ బీసీ కోటా కోసం ఆందోళన సాగిస్తున్న పాటీదార్లను ప్రసన్నం చేసుకోడానికి ఈసారి బీజేపీ ఎక్కువ మంది పటేళ్లకు టికెట్లు ఇచ్చింది. ఆ వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ పోటీ చేసే అవకాశమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం పాటీదార్ రిజర్వేషన్ ఉద్యమ నేతే (హార్ధిక్‌పటేల్) తనకు మద్దతు ప్రకటించడంతో ఈసారి పటేళ్లకిచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించింది. బరిలో నిలిచేందుకు అవసరమైన 25 ఏళ్లు రాకపోవడంతో పాటీదార్ నేత హార్దిక్ పోటీ చేయలేదు కానీ తమ నేతలు కొందరికి టికెట్లు సాధించగలిగారు. పాటీదార్ల మద్దతు బాగా తగ్గిపోయిందన్న విషయం గ్రహించిన బీజేపీ వారికి వ్యతిరేకంగా బాహాటంగా బీసీలను ఆకట్టుకునే సాహసం చేయలేకపోయింది. బీసీల్లో ఎక్కువ శాతమున్న మత్స్యకారులైన కోలీల మద్దతు విషయంలో బీజేపీ కొంత విజయం సాధించింది. ఎస్సీలు, బీసీలు, పాటీదార్ల యువనేతల మద్దతు కాంగ్రెస్‌కు లభించడం కొంత వరకు ఆ పార్టీకి మేలు చేసింది. తమకు కోటా రాదని తెలిసినా కేవలం మోదీకి, విజయ్ రూపాణీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు ‘గుణపాఠం’ చెప్పాలనే హార్ధిక్, ఇతర యువ పాటీదార్ నేతల మాటలు పెద్ద తరం పటేళ్లకు రుచించలేదు. ఒక్కసారిగా బీజేపీకి కులమంతా దూరం కావడం తెలివైన వ్యూహం కాదని వారు భావించడంతో పాటీదార్ ఓట్లు కూడా చాలా ప్రాంతాల్లో బీజేపీకి అవసరమైన స్థాయిలో పడ్డాయి. అన్ని వర్గాల నుంచీ తగ్గిన మద్దతు? పాటీదార్ల స్థానంలో ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా బీజేపీకి పూర్తిగా పడకపోయినా బీజేపీ 99 సీట్లు గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయమేనని చెప్పాలి. పది శాతమున్న ముస్లింల ఓట్లు పెద్దగా బీజేపీకి పడకపోయి నా, దాదాపు 12 శాతమున్న పటేళ్లలో తమ సర్కారుపై కోపం పీకలదాకా ఉన్నా ఈ ఎన్నికల్లో కాషాయ పక్షం మెజారిటీ సాధించ డం ఈ పార్టీ నేతలు సైతం ఊహించని వాస్తవం. పాటీదార్ యువత అంచనా వేయలే నంతగా దూరమైనప్పటికీ ఇతర బీసీలు, ఆదివాసీలను ఆకట్టుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు కొంత వరకు సఫలమయ్యాయని ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13 ఎస్సీ రిజర్వుడ్ సీట్లలో ఏడు, 23 ఆదివాసీ నియోజకవర్గాల్లో దాదాపు సగం దక్కించుకోవడం కూడా బీజేపీ మెజారిటీకి దోహదం చేశాయి. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ
అహ్మదాబాద్: గుజరాత్లో పటేళ్లకు ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పిస్తామని, ఓబీసీ కోటా వారికి వర్తించే అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తామని గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. అలాగే రైతు రుణ మాఫీతో పాటు కార్మికులకు రూ. 10కే పౌష్టికాహరం అందిస్తామంది. ఉన్నత కులాల్లో వెనకబడిన వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ఆదుకునేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది. చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఎల్ఐజీ(తక్కువ ఆదాయ వర్గం) ఇళ్లు ఇవ్వడంతో పాటు పెట్రోల్ ,డీజిల్ ధరల్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ఇన్చార్జ్ అశోక్ గెహ్లోట్ సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని రద్దు చేస్తామని, రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. -
'నన్ను చంపుకో.. ఫైట్ మాత్రం ఆగదు'
అహ్మదాబాద్: 'అమిత్ షా అవసరం అయితే మీ బలగాలతో దాడులు చేయించుకోండి.. చంపించుకోండి.. నేను పోతే నాలాంటివాళ్లు చాలామంది వస్తారు.. నేను బతికున్నంత వరకు పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ సాధన ఉద్యమం మాత్రం ఆగదు' అని గుజరాత్లో పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్ కావాలని తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్న యువ ఉద్యమ కెరటం హార్ధిక్ పటేల్ అన్నారు. దయచేసి తమ ఉద్యమంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కోరారు. పటేళ్ల ఉద్యమం ఆపేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో హార్థిక్ పటేల్ చాలా తీవ్రంగా స్పందించాడు. బీజేపీ చీఫ్ చెప్పినంతమాత్రాన తమ ఉద్యమం ఆపేయాలా అని ప్రశ్నించాడు. 'పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న ఉద్యమానికి దూరంగా ఉండమని నేను అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కోరినంత మాత్రానా మా ఉద్యమం ఆగదు. నేను బ్రతికున్న వరకు ఈ ఉద్యమాన్ని ఆపను. బలగాలతో మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అదీ చేసుకోండి. అవసరం అయితే నన్ను చంపేసుకోండి. మీరు నన్ను చంపేసినా నాలాంటి ఎందరో హార్ధిక్ పటేళ్లు వస్తారు. మా డిమాండ్లు స్వీకరించేందుకు ప్రయత్నించండి మాకు న్యాయం చేయండి. అలా కాకుంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి' అంటూ పటేల్ అమిత్ షాకు సవాల్ విసిరారు. తామేం హరెన్ పాండ్యా, అమిత్ జెత్వా, సంజయ్ జోషిలం కాదని చెప్పారు. అమిత్ షా ఎలా పనిచేస్తారో తమకు తెలుసని, అందుకే తమకు ధర్నాలు, నిరసనలు, సభలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదని అననారు. అవసరం అయితే, బలగాల సాయంతో తమ ఉద్యమాన్ని తుదముట్టించేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, ఈ విషయం ముందే గ్రహించిన తాము ఆయన దయచేసి ఈ ఉద్యమంలో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నామని పటేల్ బహిరంగంగా మీడియా ద్వారా అమిత్ షాకు స్పష్టం చేశాడు. -
బ్యాంకులను ఖాళీ చేసేస్తున్నారు!
పటేల్ వర్గానికి రిజర్వేషన్లలో కోటా కల్పించాలంటూ గుజరాత్లో జరుగుతున్న ఆందోళన రోజురోజుకూ మరింత తీవ్రతరం అవుతోంది. తాజాగా పటేల్ వర్గానికి చెందినవాళ్లు అక్కడి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. బ్యాంకులలో తమ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లలోని సొమ్మును వెనక్కి తీసేసుకుంటున్నారు. తద్వారా ఆర్థిక దిగ్బంధనం సృష్టించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నది వాళ్ల వ్యూహం. బాబూభాయ్ పటేల్ అనే ఓ చిరుద్యోగి పొద్దున్నే బ్యాంకుకు వెళ్లి, తన పేరుమీద ఉన్న రెండు లక్షల రూపాయలు డ్రా చేసేసుకున్నారు. దానిమీద వడ్డీ రాకపోయినంత మాత్రాన తనకు వచ్చే నష్టం ఏమీ లేదని.. కానీ ప్రభుత్వానికి సమస్య తీవ్రత తెలిసి వస్తుందని ఆయన అన్నారు. ఒక్కరోజులోనే తమ బ్యాంకులో రూ. 27 లక్షలను డ్రా చేసేశారని ఉత్తర గుజరాత్లో పటేల్ వర్గం ఎక్కువగా ఉండే వాద్రాద్ గ్రామంలో బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో.. బ్యాంకుల లోంచి ఎంత మొత్తం నగదును బయటకు తీసేస్తారో చూడాల్సి ఉంది. -
సూరత్ నుంచి మలి దశ పోరాటం!
-
సూరత్ నుంచి మలి దశ పోరాటం!
గుజరాతీ పటేళ్ల ‘ఓబీసీ’ ఉద్యమంపై హార్దిక్ పటేల్ అహ్మదాబాద్: గుజరాత్లో పటేల్ సామాజిక వర్గాన్ని ఇతర వెనకబడిన కులాల్లో(ఓబీసీ) చేర్చాలన్న డిమాండ్‌తో ప్రారంభమైన తమ ఉద్యమం మలి దశను మంగళవారం సూరత్ నుంచి ప్రారంభించనున్నట్లు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. ఈ రెండో దశ ఉద్యమం మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ఈ దశలో గ్రామ, తాలూకా స్థాయిల్లో కార్యక్రమాలు ఉంటాయన్నారు. అహ్మదాబాద్‌లో ఆగస్టు 25న హార్దిక్ నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారి, 10 మంది చనిపోవడం తెలిసిందే. ఢిల్లీ నుంచి సోమవారం గుజరాత్ తిరిగొచ్చిన హార్దిక్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ రిజర్వేషన్ పోరాటానికి దేశవ్యాప్తంగా అనేక కులాలు, వర్గాల నుంచి గట్టి మద్దతు లభించిందని తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామన్నారు. రెండో దశ ఉద్యమంలో చేపట్టబోయే కార్యక్రమాలను మంగళవారం ప్రకటిస్తామన్నారు. మహాత్మాగాంధీ చూపిన శాంతి మార్గంలో తమ పోరాటం ఉంటుందన్నారు. తన ఢిల్లీ పర్యటన వివరాలు చెబుతూ.. తమ రిజర్వేషన్ పోరాటానికి గుజ్జర్ వికాస పరిషత్, కుర్మి క్షత్రియ మహాసభ, అంజన చౌదరి సమాజ్, రాష్ట్రీయ గుజ్జర్ మంచ్ తదితర సంస్థలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు ఇచ్చాయన్నారు. ‘గుజ్జర్లు, కుర్మిలు, చౌదరీలు ఇంకా చాలామంది మాతో ఉన్నారు. త్వరలో మా ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసి, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. మా తదుపరి బహిరంగ సభ యూపీలోని లక్నోలో ఉంటుంది’ అని తెలిపారు. పటేల్, గుజ్జర్, కుర్మి సామాజిక వర్గాల జనాభా దాదాపు 27 కోట్లు ఉంటుందని, తమకు కూడా రిజర్వేషన్లు కావాలంటూ ఆ 27 కోట్లమంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపిస్తామన్నారు. అహ్మదాబాద్‌లో చెలరేగిన హింసకు పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. -
ఇక బాపూజీ బాటలో ఉద్యమం
పటేల్ వర్గానికి ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కల్పించాలంటూ తాను చేస్తున్న పోరాటాన్ని ఇక సూరత్ నుంచి కొనసాగిస్తానని హార్దిక్ పటేల్ చెప్పాడు. పాటీదార్ అనన్మత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్.. ఢిల్లీ నుంచి సోమవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. తన ఉద్యమానికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, రాబోయే రోజుల్లో దీన్ని దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని చెప్పాడు. గుజరాత్లో ఉన్న మొత్తం 137 మంది నాయకులతో ఓ సమావేశం ఏర్పాటుచేశామని, రెండో విడత పోరాటానికి కార్యాచరణను అందులోనే ఖరారు చేస్తామని చెప్పాడు. ఈసారి తాలూకా, గ్రామస్థాయిపై దృష్టి పెడతామన్నాడు. ఇది మొత్తం దేశం దృష్టిని ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్లో తాము ఇకమీదట నిర్వహించే కార్యక్రమాలు, ర్యాలీల గురించి మంగళవారం ప్రకటిస్తామని హార్దిక్ పటేల్ చెప్పాడు. బాపూజీ చూపిన బాటలోనే తమ ఉద్యమం సాగుతుందని అన్నాడు.