Patrolling system
-
‘అణు’ బెదిరింపులకు జవాబు
న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వెల్లడించారు. అణు బెదిరింపులకు పాల్పడేవారికి అరిహంత్ తగిన సమాధానమని ప్రశంసించారు. పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ‘దేశానికి, శాంతికి శత్రువులుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. భారత్‌కు వ్యతిరేకంగా వారు ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగకూడదు’ అని అన్నారు. అరిహంత్ పూర్తిగా విజయవంతం కావడంతో ఇక నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే సత్తా భారత్‌కు చేకూరింది. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి ఇదే. ‘అరిహంత్ భారత్‌కు గర్వకారణం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ, ప్రత్యేకించి ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందికి నా అభినందనలు. వారి సేవలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఓ విశ్వసనీయమైన అణు నిరోధకం అత్యవసరం’ అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశానికి ఇదో గొప్ప విజయమనీ, ఇతర దేశాల నుంచి భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ రక్షణ కల్పించడంతోపాటు ఈ ప్రాంతంలో శాంతి వాతావరణం నెలకొనేలా చేస్తుందన్నారు. అరిహంత్ సామర్థ్యం @ 3,500 కి.మీ. ► అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం ► అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్ఎస్ అరిధమన్ తయారీ ఈ ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్–2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంత్ కూడా పూర్తిగా విజయవంతం కావడంతో గాలి, భూమి, నీరు.. మూడింటిలో ఎక్కడి నుంచైనా అణ్వస్త్రాన్ని భారత్ ప్రయోగించగలదు. ► ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఈ జాబితాలో భారత్ ఆరో దేశంగా చేరింది. ► డెబ్బైకి పైగా అణు జలాంతర్గాములతో అమెరికా ఈ విభాగంలో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న రష్యా వద్ద దాదాపు ముప్పై, ఫ్రాన్స్, బ్రిటన్ల వద్ద చెరో 10–12 అణు జలాంతర్గాములు ఉన్నాయి. ► ఐఎన్ఎస్ అరిహంత్ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు. అదే చైనా, రష్యా, అమెరికాల వద్ద ఉన్న అణు జలాంతర్గాములు 5 వేల కిలో మీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు. ► జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె–15 బాలిస్టిక్ క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. ► అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఐఎన్ఎస్ అరిహంత్‌ను అభివృద్ధి చేసింది. ► ఐఎన్ఎస్ అరిహంత్ పొడవు, వెడల్పులు వరుసగా 110 మీటర్లు, 11 మీటర్లు ► నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్ ఇందులో ఉంటుంది. ► ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు. ► కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్‌ను తొలిసారిగా సముద్రంలోకి పంపారు. ► అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్ఎస్ అరిహంత్‌ను నౌకా దళంలోకి తీసుకున్నారు. -
ఆ దేశాల సరసన భారత్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ అమ్ములపొదిలో అణు క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ చేరింది. ఈ జలాంతర్గామి విజయవంతంగా తొలి గస్తీని పూర్తిచేసుకుని రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిబ్బందిని అభినందించారు. ఐఎన్ఎస్ అరిహంత్ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో 6000 టన్నుల ఐఎన్ఎస్ అరిహంత్‌ను అభివృద్ధి చేశారు. తొలి గస్తీని విజయవంతంగా పూర్తిచేయడంతో ఐఎన్ఎస్ అరిహంత్ పూర్తిస్ధాయి అణు జలాంతర్గామిగా సేవలు అందించనుంది. ఈ విజయంతో అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వారికి దీటైన జవాబిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు. ఐఎన్ఎస్ అరిహంత్ రాకతో ఇప్పటికే అణుజలాంతర్గాములను నిర్మించి నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ల సరసన భారత్ చేరింది. -
ఐఎన్ఎస్ అరిహంత్‌తో ఆ దేశాల సరసన..
-
రక్షణం.. ఇక తక్షణం!
* రక్షక్‌లకు ‘రెస్పాన్స్ టైమ్’.. నగరంలో అమలు * ‘డయల్ 100’తో పెట్రోలింగ్ వ్యవస్థ అనుసంధానం * జీపీఎస్‌తో ‘తెరపైకి’ అన్ని గస్తీ వాహనాలు * గొడవలు జరిగినా, ప్రమాదం సంభవించినా తక్షణమే ఘటనాస్థలికి.. సాక్షి, హైదరాబాద్: గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం.. వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం.. నేరాలు జరిగే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ ఉండేలా చూడటం.. ఇవే ప్రధాన ఎజెండాగా రక్షక్‌లకు ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ నిర్ధారించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్-100’తో అనుసంధానించారు. ఈ అత్యాధునిక జీపీఎస్ ఆధారిత విధానం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి ఠాణాకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) సైతం తమ గస్తీ వాహనాల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నారు. దీని అమలు కోసం కమిషనరేట్‌లోని ప్రతి గస్తీ వాహనానికీ ఓ ట్యాబ్ అందించారు. ఈ తరహాలో ‘డయల్-100’ను రక్షక్లతో అనుసంధానించి, యాప్ రూపంలో ట్యాబ్‌ల్లోకి చేర్చడం దేశంలోనే తొలిసారి. ఈ అత్యాధునిక విధానం ఎలా పనిచేస్తుందన్న అంశంపై కథనం... 1. తెరపై కనిపించే ‘రక్షక్’లు.. బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే సిబ్బంది.. బాధితుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటారు. గస్తీ వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానిస్తున్న నేపథ్యంలో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఎక్కడుందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుని కాల్‌ను అతనికి సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనానికి డైవర్ట్ చేస్తారు. వాహనంలోని సిబ్బందికి ‘100’ నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్ ద్వారా ట్యాబ్‌లో రింగ్ వస్తుంది. ఫోన్ ఎత్తిన వెంటనే ట్యాబ్ తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితునికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’ అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్ చేయాలి. 2. ‘నొక్కితే’ టైమ్ మొదలైనట్లే.. ఎక్నాలెడ్జ్ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్ టైమ్’ ప్రారంభమవుతుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకునే వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఆధారాల కోసం ఫొటోలు తీస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదైతే స్థానిక పోలీసుల్ని అప్రతమత్తం చేసి.. ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలను రక్షక్ సిబ్బంది ఆన్లైన్ ద్వారా సంబంధిత ఎస్‌హెచ్‌వోకు పంపిస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’ బటన్ నొక్కడంతో ‘రెస్పాన్స్ టైమ్’ పూర్తవుతుంది. ఈ బాధ్యతను ఎస్హెచ్వోకే అప్పగించారు. కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించి గస్తీ వాహనాలు ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడానికీ, ‘కాల్ క్లోజ్డ్’ బటన్ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు. 3. ఇలా పర్యవేక్షిస్తారు ప్రతి డివిజన్, జోన్ వారీగా ఎన్ని కాల్స్ వచ్చాయి? ఎన్ని క్లోజ్ అయ్యాయి? ఎంత సమయం పట్టింది? అనే అంశాలను నిత్యం ఉన్నతాధికారులు ‘డాష్‌బోర్డ్’ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్ టైమ్’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరినీ తీసుకుని ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ను నిర్ధారిస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క. టైమ్ ఎక్కువ తీసుకున్న వాహనాల్లోని సిబ్బంది నుంచి ఆలస్యానికి కారణం తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు.