సాక్షి, న్యూఢిల్లీ : భారత్ అమ్ములపొదిలో అణు క్షిపణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిహంత్ చేరింది. ఈ జలాంతర్గామి విజయవంతంగా తొలి గస్తీని పూర్తిచేసుకుని రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిబ్బందిని అభినందించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో 6000 టన్నుల ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను అభివృద్ధి చేశారు.
తొలి గస్తీని విజయవంతంగా పూర్తిచేయడంతో ఐఎన్‌ఎస్ అరిహంత్ పూర్తిస్ధాయి అణు జలాంతర్గామిగా సేవలు అందించనుంది. ఈ విజయంతో అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వారికి దీటైన జవాబిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు. ఐఎన్‌ఎస్ అరిహంత్ రాకతో ఇప్పటికే అణుజలాంతర్గాములను నిర్మించి నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ల సరసన భారత్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment