Pennsylvania State University
-
ఒకే సమయం నిద్రతో ఒత్తిడికి కళ్లెం
న్యూఢిల్లీ: నిద్ర. అలసిన శరీరాన్ని అమాంతం ఆక్రమించి మరోలోకానికి తీసుకెళ్లే అదృశ్యదేవత. అలాంటి నిద్రాదేవత ఆవాహన చిన్నారుల్లో రోజూ ఒకేసమయంలో జరిగితే ఒనగూరే ప్రయోజనాలు అంతాఇంతా కాదని తాజా పరిశోధనాలో వెల్లడైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ మేరకు ఆరేళ్ల వయసు చిన్నారులపై ఒక విస్తృతస్థాయి, సుదీర్ఘ పరిశోధన చేశారు. పుట్టినప్పటి నుంచి రెండున్నరేళ్ల వయసు వచ్చే వరకు కొందరు చిన్నారులను వారి తల్లిదండ్రులు శ్రద్ధాసక్తులతో పెంచేలా ఆ పేరెంట్స్‌కు శిక్షణనిచ్చారు. చిన్నారి వేర్వేరు సందర్భాలకు తగ్గ భావోద్వేగాలు, శారీరక అవసరాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి ఆలనాపాలనా బాధ్యతలను చక్కగా నెరవేర్చేలా చూశారు. మారాంచేసినపుడు గారాబం చేయకుండా పరిస్థితిని చక్కగా విడమరిచి చెప్పేలా తల్లిదండ్రులకు తగు తరీ్ఫదునిచ్చారు. అలసపోయి నిద్రలోకి జారుకునేటపుడు నిద్రకు అనువైన వాతావరణం ఉండేలా చూడడం, దీపాలన్నీ ఆర్పేసి చిన్నారులను వీపుపై తడుతూ బుజ్జిగించి పడుకోబెట్టడం వంటివి చేయాలని పరిశోధకులు సూచించారు. పరిశోధనలో ఏం తేలింది? ఇలా చేయడం వల్ల చిన్నారులు రోజూ ఒకే సమయానికి పడుకోగలిగారు. నిద్రసమయం కూడా దాదా పు వారి వయసుకు తగ్గట్లు ఉండేది. దీంతో చిన్నారులు తమ దైనందిన జీవితంలో చవిచూసిన భావోద్వేగాలను చక్కగా నియంత్రించుకోవడం పరిశోధకులు గమనించారు. ఒకే సమయంలో నిద్రపోవడం వల్ల గాఢ నిద్ర సాధ్యమైంది. ‘‘స్థిరమైన నిద్రాకాలం అనేది పిల్లల ఎదుగుదలకూ ఎంతో తోడ్పడింది. నిద్రసరిగా పట్టకపోవడం వంటి సమస్యలు వీరిలో తలెత్తలేదు’’అని పరిశోధకులు చెప్పారు. సంబంధిత వివరాలు డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ పిడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇతర చిన్నారుల్లో ఇబ్బందులు పరిశోధనకు ఎంచుకున్న పిల్లలతో పోలిస్తే అస్తమానం అస్తవ్యస్త్య సమయాల్లో నిద్రించే పిల్లల్లో భావోద్వేగాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో కీలక పరిశోధకుడు అద్వా డాడ్జీ చెప్పారు. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీలో బిహేవియర్ హెల్త్ విభాగంలో సేవలందిస్తున్నారు. పరిశోధకులు పిల్లలు రోజు ఏ సమయానికి నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రపోతున్నారు, గాఢనిద్ర వివరాలు తెల్సుకునేందుకు వాళ్ల మణికట్టుకు మానిటర్లను అమర్చారు. ఎలాంటి ప్రయోగాలు చేశారు? ఒకేసమయంలో నిద్రించే పిల్లలకు ఒక పెద్ద బొమ్మల సమూహం నుంచి ఒకేఒక్క బొమ్మను తీసుకుని ఆడుకోవాలని సూచించారు. ప్రతి బొమ్మను విడివిడిగా ఒక చిన్న పెట్టెలో తాళం వేసి దాచారు. ఆ పెట్టెల తాళంచెవులను ఇచ్చి తెరచి తీసి ఆడుకోవాలని సూచించారు. ఏ తాళంచెవికి ఏ పెట్టే తెరచుకుంటుందో కనిపెట్టేందుకు.. ఒకేసమయంలో నిద్రించే పిల్లలు మాత్రం శ్రద్ధగా ఒక్కో పెట్టెను తాళంచెవితో తెరచే ప్రయత్నంచేశారు. నిద్రానియమంలేని పిల్లలు మాత్రం ఒక్కో పెట్టెను తెరిచే ఓపికలేక ఆవేశంతో ఆ తాళం చెవులను విసిరిపారేశారు. మరో ప్రయోగంలో రెండు రకాల పిల్లలను ఒకచోటచేర్చి కలిసి ఆడుకోండని సూచించారు. ఈ సందర్భంలోనూ నిద్రనియంత్రణ ఉన్న పిల్లలు తోటి పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంచేశారు. కొందరు పిల్లలను వారంలో ప్రతి రోజూ ఒక 20 నిమిషాలు ముందుగా లేదా 20 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయేలా చేశారు. ఇంకొందరిని వారంరోజులపాటు ఏకంగా రెండు గంటలు ముందుగా లేదంటే ఆలస్యంగా నిద్రపోనిచ్చారు. 20 నిమిషాల తేడాతో నిద్రించిన పిల్లల్లో భావోద్వేగాల నియంత్రణ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. -
నీలి బెండపూడికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన నీలి బెండపూడి.. ప్రతిష్టాత్మకపెన్సిల్వేనియా యూనివర్శిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులవ్వడం గర్వకారణమని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. Congratulations to Neeli Bendapudi garu for being elected as the President of Penn State University. Hailing from Vizag & an alumnus of Andhra University, she's the 1st woman & person of colour to lead Pennsylvania’s flagship university.@penn_state — YS Jagan Mohan Reddy (@ysjagan) December 10, 2021 కాగా, భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లిన ఆమె ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. చదవండి: (అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
పెంపుడు కుక్కలపై 50 లక్షల కోట్ల ఖర్చు!
న్యూఢిల్లీ : పెంపుడు కుక్కల విలువెంత? అని తెలివైన వారిని అడిగితే ఏమంటారు? వెలలేని అంత లేదా అమూల్యం అంటారు! మార్కెట్లో వాటి కొనుగోలు రేట్లడిగితే అందరు కాకపోయినా కొందరైతే చెబుతారు. వాటి జీవితం విలువను డబ్బుల్లో అంచనా వేస్తే ఎంత ? అప్పుడు వాటి కొన్న రేటునే కాకుండా వాటి ఆహారానికి, మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవి ఎంత కాలం జీవిస్తున్నాయి? అన్న అంశాల ఆధారంగా వాటి జీవితాల విలువను ఆర్థికంగా అంచనా వేయవచ్చు. అయితే ఈ విలువ దేశాలనుబట్టి, ప్రాంతాలనుబట్టి మారిపోయే అవకాశం ఉంది. పెంపుడు కుక్కలకు అధిక ప్రాధాన్యమిస్తోన్న అమెరికాలో వాటిపై ఎటా 70 బిలియన్ డాలర్లు (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నారు. అదే అమెరికన్లు పిజ్జాలపై ఏటా 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు), చట్టబద్ధంగా దొరికే గంజాయి కోసం వారు ఏడు బిలియన్ డాలర్లు (దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు) చేస్తున్నారు. పెంపుడు కుక్కల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెంపుడు కుక్కలకు యాంటి వైరస్ ఇంజెక్షన్ల ఇవ్వడానికి వెటర్నరీ డాక్టర్లకు మొత్తం 20 బిలియన్ డాలర్లు (14.5 లక్షల కోట్ల రూపాయలు), ఇతర మందుల కోసం 16 లక్షల డాలర్లు (11.5 లక్షల కోట్ల రూపాయలు), వాటి ఆహారం కోసం 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానుల ఇంటింటి తిరగడంతోపాటు, వెటర్నరీ డాక్టర్లను సంప్రతించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. వీటి ఆధారంగా సరాసరి ఓ పెంపుడు కుక్క జీవితం విలువను పదివేల డాలర్లు (దాదాపు 7.25 లక్షల రూపాయలు)గా నిర్ధారించారు. ఏటా అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా పది లక్షల పెంపుడు కుక్కలు మరణిస్తున్నాయి. పెంపుడు కుక్కల కోసం వాటి యజమానులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు అతి తక్కువగా నష్ట పరిహారం అభిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రస్తుతం పెంపుడు కుక్కల ధర ఎంత ఉందో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తున్నారని, వాటి మందులకు, ఆహారానికి అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యజమానులతో పెంపుడు కుక్కలకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను ఎలా వెలగడతారని వారు ప్రశ్నించారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ పాలసీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సైమన్ ఎఫ్ హీడర్, ఓక్లహామ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డెవెన్ కార్ల్సన్, అదే యూనివర్శిటీ రీసర్చ్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జో రిప్బెర్గర్లు సంయుక్త ఈ అధ్యయనం చేశారు. -
సూర్యుడికి పొరుగున హిమ నక్షత్రం!
మన సౌర కుటుంబానికి పొరుగున.. కేవలం 7.2 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉన్న అతి చల్లని నక్షత్రం ఇది. పేరు ‘వైజ్ జే085510.83071442.5’. ఇప్పటిదాకా కనుగొన్న బ్రౌన్ డ్వార్ఫ్ నక్షత్రాల్లో ఇదే అత్యంత చల్లనిదట. ఇదెంత చల్లగా ఉంటుందంటే.. మైనస్ 48-13 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతతోనే ఉంటుందట. అంటే.. ఇదో మంచు నక్షత్రం అన్నమాట. మన సూర్యుడిలాంటి నక్షత్రాలు కేంద్రక సంలీనం చర్య వల్ల హైడ్రోజన్‌ను హీలియం వాయువులుగా మారుస్తూ నిరంతరం అంతులేని వేడి, వెలుగులు, రేడియేషన్ విరజిమ్ముతుంటాయి. కానీ బ్రౌన్ డ్వార్ఫ్ వంటి మరుగుజ్జు నక్షత్రాలలో చాలా తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి.. వాటిలో కేంద్రక సంలీనం చర్యలు జరగవు. అందువల్ల అవి చల్లగానే ఉంటాయి. తాజా మరుగుజ్జు నక్షత్రం ద్రవ్యరాశి గురుగ్రహం కన్నా 10 రెట్లు మాత్రమే ఎక్కువ కావడంతో ఇది పూర్తిస్థాయి నక్షత్రంగా మారలేకపోయిందట. దీనిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన వైజ్, స్పిట్జర్ స్పేస్ టెలిస్కోపుల ద్వారా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కెవిన్ లూమన్ కనుగొన్నారు. ఇలాంటి నక్షత్రాలపై అధ్యయనం ద్వారా అతిచల్లని గ్రహాలపై వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.