People facing problems
-
గుర్రంగడ్డ.. కష్టాల అడ్డా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చుట్టూ కృష్ణా నది.. మధ్యలో ఊరు.. విద్య, వైద్యం, నిత్యావసరాలు ఏది కావాలన్నా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా పడవలో నది దాటాల్సిందే.నది ఉప్పొంగే సమయంలో అయితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. తెలంగాణలోనే ఏకైక ద్వీపంగా పేరు పొందిన గుర్రంగడ్డ వాసుల పరిస్థితి ఇది. పాలకులు మారుతున్నా తమ బాధలు తీరడం లేదని.. వంతెన నిర్మాణం చేపట్టినా ఏళ్లకేళ్లుగా సాగుతూనే ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.సాహసం చేయాల్సిందే..జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో కృష్ణానది మధ్యలో గుర్రంగడ్డ ఉంది. గద్వాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవి వైశాల్యం సుమారు 2,400 ఎకరాలు. ఇక్కడ సుమారు 200 కుటుంబాలు నివసిస్తుండగా, జనాభా వెయ్యికి పైనే ఉంటుంది. గ్రామస్తులు ఇక్కడి 1,500 ఎకరాల్లో వేరుశనగ, వరి వంటి పంటలు సాగు చేస్తున్నారు.ఇక్కడ ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఆపై చదువుకోవాలన్నా, ఏదైనా అనారోగ్యానికి గురైనా, నిత్యావసరాలు కావాలన్నా, చివరికి రేషన్ సరుకుల కోసం కూడా.. నది దాటి వెళ్లాల్సిందే. ఏటా వానాకాలం మొదలై నదిలో ప్రవాహం పెరిగాక కష్టాలు మరింతగా పెరుగుతాయి. దీనితో ఇక్కడి పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఇక ప్రతిదానికీ నది దాటాల్సి రావడంతో ఈ ఊరు పిల్లలను పెళ్లి చేసుకునేందుకు గానీ, ఊరి వారికి పిల్లను ఇచ్చేందుకు గానీ వెనుకాడే పరిస్థితి ఉందని.. ప్రస్తుతం 40 మందికిపైగా పెళ్లికాకుండా ఉన్నారని స్థానికులు అంటున్నారు.6 ఏళ్లుగా పిల్లర్ల దశలోనే వంతెనగుర్రంగడ్డకు సుమారు ఆరేళ్ల కింద వంతెన మంజూరైంది. అప్పటి నుంచి నిర్మాణం సాగుతూనే ఉంది. ఏటా వానాకాలం ముందు పనులు ప్రారంభించడం, వరద పెరగగానే నిలిపివేయడం కాంట్రాక్టర్‌కు పరిపాటిగా మారిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు ఐదుసార్లు నోటీసులిచ్చామని, వచ్చే ఏడాది వానాకాలంలోపు వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని ఇరిగేషన్ ఈఈ జుబేర్ అహ్మద్ తెలిపారు.ఈ ఫొటోలోని మహిళ పేరు పద్మమ్మ. గుర్రంగడ్డకు చెందిన ఆమెకు అయిజ మండలం ఉప్పలకు చెందిన వెంకటేశ్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. పుట్టింటికి రావాలంటే నది దాటాలి. దాంతో ఎప్పుడు వచి్చనా భర్తతో కలిసి వస్తుంది. నదికి వరద పోటెత్తితే.. బోట్లు నడవక కొన్నిరోజులు గ్రామంలోనే ఉండిపోవాల్సి వస్తుందని.. అందుకే ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది.ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని దాటుతున్నాం గ్రామంలో ఆస్పత్రి లేదు. ఏ చిన్న చికిత్స కోసమైనా గద్వాలకు వెళ్లాలి. గర్భిణిగా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యాక చెకప్ కోసం చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బోట్లో నది దాటాల్సి వచి్చంది. వరద వచి్చనప్పుడు ఏ సమస్య వచ్చినా కష్టమే. – సంధ్య, గ్రామ మహిళ -
ఇళ్లపై పడుతున్న ఓసీపీ బండరాళ్లు
సాక్షి, భూపాలపల్లి : భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీలో బాంబుల మోతలకు కాలనీ వాసులు బెంబేలెత్తుతున్నారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు–2లో జరుగుతున్న బొగ్గు, మట్టి వెలికితీత పనుల్లో భాగంగా చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్లతో మంగళవారం బండరాళ్లు వచ్చి సమీప కాలనీల్లోని ఇళ్లపై పడినాయి. ఓసీపీ–2 సమీపంలోని గాంధీనగర్ కాలనీలోని చిక్కుల దేవేందర్ ఇంటిపై సుమారు 5 కిలోల బరువు గల బండరాయి పడడంతో పై కప్పు రేకులు పగిలిపోయాయి. అయితే ఆ సమయంలో దేవేందర్ భార్య ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ బండరాయి ఆమె మీద పడకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. నిబంధనలు గాలికి కాలనీలకు 500 మీటర్ల దూరంలో ఓసీపీలో బాంబు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలని నేషనల్ గ్రీన్ట్రిబ్యూనల్ సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కేవలం వంద మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్లు చేపట్టడం వలన ఇలా బండరాళ్లు వచ్చి ఇళ్లపై పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా పేలుళ్ల శబ్దంతో గోడలు పగుళ్లు బారుతున్నాయని వాపోయారు. బ్లాస్టింగ్ చప్పుళ్లతో బెంబేలెత్తుతున్న జనం ప్రతి రోజు రెండు సార్లు బాంబుబ్లాస్టింగ్ చేయడం వలన ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని జంగేడు, పక్కీరుగడ్డ, ఆకుదారివాడ, సుభాష్‌కాలనీ, గాంధినగర్, శాంతినగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా అధిక సామర్థ్యం గల బాంబులను వినియోగించడం వలన ఇళ్లు కదులుతున్నాయని బాధితులు గోడును వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఓసీపీ–1లో చేపట్టిన బ్లాస్టింగ్ వలన గడ్డిగానిపల్లి గ్రామంలోని ఇళ్లపైన బండరాళ్లు పడిన సందర్భాలు ఉన్నాయి. అయిన్నప్పటికీ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడంలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
సహారా బ్యాంక్‌పై ఫిర్యాదు
ఆర్మూర్‌టౌన్ : పట్టణంలోని సహార బ్యాంక్ ఖాతాదారులకు రావాల్సిన డబ్సులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులు గురిచేస్తు న్నారని మంగళవారం బ్యాంక్ ఖాతాదారు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రాఘవేందర్ అధికారులను, సిబ్బంది, ఏజెంట్లను పిలిపించి ఇరువర్గాలవారితో మాట్లాడా రు. బ్యాంక్ అధికారులు ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు. బాధితుల కు తెలియకుండా బాండ్ రెన్యూవల్ చేయకూడదని సీఐ సూచించారు. బ్యాంక్ మేనేజర్ రషిత్హుస్సేన్ మాట్లాడుతూ..డబ్బుల ఇబ్బందులు ఉండడంతో కొన్ని బాండ్లు రెన్యూవల్ చేశారని, సెబీ ఆదేశాల మేరకు డబ్బులు మొత్తం చెల్లిస్తామని తెలిపారు. -
ఆధార్ అవస్థలు ఎన్నాళ్లో..?
వికారాబాద్ అర్బన్ : కొత్త ఆధార్ కార్డు పొందాలన్నా, ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి లింక్ చేయడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మొదట్లో తీసుకున్న చాలా మందికి వారి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ లేదు. ఓటీపీ నెంబర్ తెలుసుకునేందుకు ఆధార్ కేంద్రం నిర్వాహకులే వారి నెంబర్లు ఇచ్చి అప్పటికి పని ముగించారు. ఇటీవల బ్యాంకుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సొంత ఫోన్ నెంబర్ ఆధార్ లింకు ఉండాలని చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసినా సకాలంలో పని జరగడంలేదు. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునే వారు రెండింతలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఆధార్‌కు ఫోన్ నెంబర్ లింకు ఉండాలనే నిబంధన పెట్టారు. దీంతో చాలా మంది విద్యార్థుల దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అడుగుతున్నారు. ఇటీవల పోలీసులు రోడ్డుపై వాహనదారులు ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నా, హెల్మెట్ లేకున్నా పిట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసులకు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. దీనికి ఫోన్ నెంబర్ తప్పకుండా లింక్ ఉండాల్సి వస్తోంది. ఇలా ప్రతిదానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో పాటు దానికి ఫోన్ నెంబర్ ఉండాలనడం మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. జిల్లా కేంద్రంలో ఒకేఒక ఆధార్ కేంద్రం ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలన్నా, కొత్త కార్డు తీసుకోవాలన్నా వారం రోజుల సమయం పడుతుంది. ఆధార్ కార్డు విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని అధికారులు మరో ఆధార్ కార్డు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
అభివృద్ధి అంటే ఇదేనా బాబూ ?
-
మళ్లీ మొదలైన నోట్ల కష్టాలు
-
9వ రోజూ కిక్కిరిసిన బ్యాంక్‌లు
-
నిజాంపేట్‌లో అన్నదాన కార్యక్రమం
-
సార్లూ.. కదలండి!
యాచారం, న్యూస్‌లైన్ : పేదలకు సొంత ఇల్లు.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలలో ఒకటి. నిలువ నీడ లేని వారందరికీ గూడు కల్పించాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు మాల్ గ్రామంలో 2008 సంవత్సరంలో 271మందికి సర్వే నంబర్ 569లో 40 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. 2009 సంవత్సరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. ఇందిరమ్మ పథకం తొలి విడతలో మాల్ గ్రామాన్ని ఎంపిక చేశారు. అర్హులుగా ఎంపిక చేసిన 271మందికి ఒకే చోట స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. దీనికి ఇందిరమ్మ కాలనీగా పేరు పెట్టారు. ఈ కాలనీలో వసతుల కల్పన కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. వెంటనే 150మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. సకాలంలో బిల్లులు అందడంతో 40మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ హఠాన్మరణంతో ఇందిరమ్మ కాలనీని, ఇళ్ల నిర్మాణాలను అధికారులు పట్టించుకోవడం మానేశారు. బిల్లులు అందకపోవడం తదితర సమస్యలతో చాలామంది ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా నిలిపివేసుకున్నారు. ఇక ఇల్లు కట్టుకున్నా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో కొంతమంది సొంతంగా డబ్బులు ఖర్చు చేసుకొని అర కిలోమీటర్ దూరం నుంచి వైర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థిక స్తోమత లేని వారు అంధకారంలోనే మగ్గుతున్నారు. ఖర్చు కాని రూ.55లక్షల నిధులు మాల్ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీ తదితర వసతుల కల్పన కోసం ప్రభుత్వం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ.50లక్షల నిధులు మంజూరు చేసింది. కాలనీకి విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖకు రూ.5లక్షలను గృహ నిర్మాణ శాఖ చెల్లించింది. ఈ మేరకు కాలనీకి 40 స్తంభాలను పంపించిన అధికారులు, తీగలు బిగించడం మర్చిపోయారు. దీంతో స్తంభాలు దొంగల పాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో మంజూరైన నిధుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు కావడం లేదు. బిల్లు రాక నిర్మాణం నిలిపేశాం ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిసి సంతోషపడ్డాం. రూ.50వేలు అప్పు చేసి ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టాం. బిల్లు కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాం. కులం పేరు తప్పు పడింది, సరిచేస్తామంటున్నారు తప్ప బిల్లు ఇవ్వడం లేదు. దీంతో ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. - గునుగంటి శోభ, ఇందిరమ్మ కాలనీ ఇళ్ల ఎదుటే మురుగు నీరు కాల్వలు లేక మురుగు నీరు ఇళ్ల ఎదుటే నిలుస్తోంది. కంపు భరించలేక పోతున్నాం. రాత్రిపూట ఈగలు, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. వీధి దీపాలు లేకపోవడంతో బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. రోడ్లు, డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా స్పందించడం లేదు. - జి.వసంత, ఇందిరమ్మ కాలనీ అధికారులకు శ్రద్ధ లేదు వైఎస్ హయాంలో పేదలు ఇళ్లు నిర్మించుకున్న వెంటనే బిల్లులు వచ్చేవి. కాని నేడు ఆ పరిస్థితి లేదు. రూ.లక్షల నిధులు అందుబాటులో ఉన్నా వసతులు కల్పించడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం పేదలకు శాపంగా మారింది. చాలామంది ఇళ్లు కట్టుకోవడం లేదు. - చిన్నోళ్ల పద్మజ, సర్పంచ్, మాల్ అన్ని శాఖల అధికారులు స్పందించాలి మాల్లోని ఇందిరమ్మ కాలనీకి విద్యుత్ సరఫరా కోసం ఆ శాఖకు రూ.5లక్షల డీడీ ఇచ్చాం. కానీ నేటికీ విద్యుత్ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. అన్ని శాఖల అధికారులు కృషి చేస్తే కాలనీవాసుల సమస్యలు పరిష్కారమవుతాయి. -కరుణాకర్‌రెడ్డి, హౌసింగ్ ఏఈ, యాచారం -
సంక్షేమ పథకాలు అందక ప్రజలకు ఇబ్బందులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పాలనా యంత్రాంగంలో అతిముఖ్యమైన పాత్ర పోషించే రెవెన్యూ శాఖ అధికారుల దీర్ఘకాలిక సెలవులు, పలు పోస్టుల ఖాళీలతో అస్తవ్యస్తంగా మారింది. డీఆర్వో జయరామయ్య నెల రోజులుగా సెలవులో ఉండగా, మరికొంత మంది అధికారులు ఆయన బాటనే పట్టారు. ఈ శాఖలో వందల కొద్దీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంక్షేమ పథకాల అమలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రేషన్ కార్డులు, ఆధార్, ఓటు హక్కు నమోదు, జనణ, మరణ ధ్రువీకరణతో పాటు, భూమి కొలతలు, పౌరసరఫరాలు, భూసేకరణ, నాలా, ప్రకృతి వైపరీత్యాలు, ఆపద్బంధు, మీ-సేవ తదితరాలకు సంబంధించి రెవెన్యూ అధికారుల పాత్ర కీలకం. అలాంటి రెవెన్యూ శాఖలో అధికారుల లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీర్ఘకాలికంగా ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పాలన అటకెక్కింది. పలు మండలాల్లో తహశీల్దార్‌తో పాటు డిప్యుటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్‌లు, వీఆర్వో, వీఆర్ఏల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామాలు, పట్టణాల్లో ఈ శాఖలో పనులు కుంటుపడుతున్నాయి. ఒక్కో వీఆర్వో మూడు, నాలుగు గ్రామాలకు ఇన్చార్జి కొనసాగుతున్నారు. దీంతో గ్రామాల్లో రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. తహశీల్ కార్యాలయంలో ఎమ్మార్వోతో పాటు, సెక్షన్ సూపరింటెండెంట్ ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం డీఆర్వో జయరామయ్య సెలవులో ఉన్నారు. ఈయన బాధ్యతలను ఏజేసీ శేషాద్రి చూస్తున్నారు. నిజామాబాద్ ఆర్డీఓ, జిల్లా రెవెన్యూ కార్యాలయంలో సూపరింటెండెంట్, నిజామాబాద్ మండలంలో మూడు వీఆర్ఓ పోస్టుల్లో ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. జక్రాన్‌పల్లి మండలంలో 16 గ్రామాలకు గాను ఐదుగురు వీఆర్వోలు, డిచ్పల్లి మండలంలో 19 గ్రామాలకు ఆరుగురు వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఇలా ప్రతి మండలంలో రెవెన్యూశాఖలో ఖాళీలు దర్శనమిస్తున్నాయి.ప్రస్తుతం జిల్లాలో ఆర్ఐల పోస్టులు 32, జూనియర్ అసిస్టెంట్లు 44, టైపిస్టులు 34, వీఆర్వోలు 212, వీఆర్ఏలు 136 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేస్తేగానీ రెవెన్యూ పాలన గాడిలో పడేలా కనిపించడం లేదు.