Pew Research
-
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
చక్రవర్తి (40) ఐటీ టెక్నికల్ మేనేజర్. శుభ్ర (32) ఐటీ బిజినెస్ అనలిస్ట్. ఈ దంపతులు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, నాణ్యమైన జీవితం కోరుకుంటూ 2019లో విదేశానికి వెళ్లిపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కెనడా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 2022 మార్చిలో వీరు టొరంటోకు వెళ్లిపోయారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు ఉన్నత విద్య పేరుతో వెళ్లి, కోర్సు ముగిసిన అనంతరం అక్కడే అవకాశాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ కెరీర్ మొదలు పెట్టిన వారు కూడా విదేశీ అవకాశాల కోసం అన్వేíÙస్తున్నారు. కానీ, వలసపోవడం అంత సులభ ప్రక్రియ కాదు. దానికి చాలా సమయం తీసుకుంటుంది. అనుకున్న గడువు కంటే ముందుగా ఆరంభించాలి. దీనికి ఎన్నో పత్రాలు సమరి్పంచాలి. ముందస్తు ప్రణాళిక మేరకు నడుచుకుంటే అనుకున్న విధంగా విదేశీయానం సుఖవంతమవుతుంది. ఈ దిశగా ఆలోచన చేసే వారు నిపుణుల సూచనలు తెలుసుకోవడం వల్ల మెరుగైన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది. ‘ప్యూ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉద్యోగ వలసలు భారత్ నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘2020లో 1.79 కోట్ల మంది అంతర్జాతీయ వలసవాదుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 1.12 కోట్ల మంది మెక్సికో, 1.08 కోట్ల మంది రష్యా మూలాలు కలిగి ఉన్నారు’’అని ‘ప్యూ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. మన దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశాలకు వలస పోతున్నట్టు ఈ నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘విదేశీయాన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలి. అప్పుడు అది సులభతరం అవుతుంది. ఏదైనా ఊహించని ఘటన ఎదురైనా ఎదురుకావచ్చు. మరో ఆరు నెలల్లో వెళ్లాలని అనుకుంటే ఇప్పుడే ఆ ప్రక్రి యను ప్రారంభించాలి’’అనిక్యానమ్ ఎంటర్ప్రైజెస్ సీఈవో క్యాలబ్రెస్ సూచించారు. క్యానమ్ అనేది న్యూయార్క్‌కు చెందిన బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ. వివరాలతో సరైన ప్రణాళిక ఎలా..? చక్రవర్తి, శుభ్ర 2019లో కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, 2020లో కరోనా రాకతో ఆలస్యం అయింది. కాకపోతే భారత్‌లో వారు పనిచేస్తున్న కంపెనీయే ఇద్దరు బదిలీకి ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైనా సాఫీగా విదేశానికి తరలిపోయారు. కానీ, ప్రతి ఒక్కరికీ ఇలా జరగాలని లేదు. ‘‘కొందరు విద్యార్థులుగానే విదేశాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగంలో చేరిపోతారు. కొందరు స్వదేశంలోనే విద్య పూర్తి చేసుకుని నిపుణులుగా తర్వాత విదేశీ ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కొందరు వ్యాపారవేత్తలుగా వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. చివరిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా విదేశీ పౌరసత్వం సొంతం చేసుకోవచ్చు’’అని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్లోబల్‌గేట్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అభినవ్ లోహియా వివరించారు. విదేశంలో ఉద్యోగం సంపాదించి వలసపోవడం అన్నింటిలోకి ప్రముఖమైనది. ‘ఎక్స్‌పాట్ ఇన్సైడర్ 2021’ సర్వే ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న 59 శాతం మంది భారతీయులు కెరీర్లో మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారే. అంతర్జాతీయంగా ఈ రేటు 47 శాతంగానే ఉంది. ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో 23 శాతం మంది సొంతంగా ఉద్యోగాన్ని వెతుక్కోగా, 19 శాతం మందిని అంతర్జాతీయ సంస్థలు సొంతంగా నియమించుకున్నాయి. 14 శాతం మందిని వారి సంస్థలే పంపించాయి. కేవలం 3 శాతం మంది వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. బ్రిటన్ను తీసుకుంటే భారత్ నుంచి ఎక్కువమంది స్కిల్డ్ వర్కర్ వీసా ద్వారానే అక్కడికి వెళుతున్నారు. 2022లో భారతీయులు 1,03,000 యూకే వీసాలను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 148 శాతం ఎక్కువ. 2022లో యూకే జారీ చేసిన వర్కర్ వీసాల్లో 46 శాతం భారతీయులకే దక్కాయి. జాబ్ ఆఫర్ ఉన్న వారికే స్కిల్డ్ వర్కర్ వీసా జారీ చేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా ఉండాలి’’అని ఏవై అండ్ జే అసోసియేట్స్ డైరెక్టర్ యాష్ దుబాల్ తెలిపారు. స్టూడెంట్ వీసా ద్వారా విదేశాలకు వెళ్లడం మరో మార్గం. ఇది పరోక్ష మార్గం కిందకు వస్తుంది. సాధారణంగా స్టూడెంట్ వీసా గడువు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ఏడాది గడువుతో కూడిన విజిట్ పాస్ పొందొచ్చు. ఈ కాలంలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం పొందిన ఆరు నుంచి రెండేళ్ల అనంతరం (వివిధ దేశాల్లో వివిధ కాల వ్యవధి) శాశ్వత నివాస హోదా పొందొచ్చు. స్టూడెంట్ వీసా ఖర్చు అన్నది వివిధ దేశాల మధ్య మారిపోతుంటుంది. కొన్ని దేశాల్లో పౌరసత్వం కొనుగోలు చేసుకోవడం మరొక మార్గం. పరిమితి మేరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈబీ–5 వీసా తీసుకోవచ్చు. అమెరికాలో ఈబీ–5 వీసా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్íÙప్ సర్వీస్ ప్రాయోజిత ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు స్వల్ప వ్యవధిలోనే పౌరసత్వం ద్వారా వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. విద్యార్థులు అయితే యూనివర్సిటీ ర్యాంకింగులు చూడాలి. కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వాన్ని పరిశీలించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లేవారు ముందే విజయావకాశాలను అంచనా వేసుకోవాలి. వ్యయాలు చూడాలి.. ఏ దేశానికి, ఏ రూపంలో వెళ్లాలనే దాని ఆధారంగా ఖర్చు మారిపోతుంది. ఓ కంపెనీలో పనిచేసే నిపుణుడు అదే కంపెనీ ఉద్యోగిగా వేరే దేశానికి వెళ్లేట్టు అయితే టికెట్, రవాణా చార్జీలను పెట్టుకుంటే చాలు. ఇమిగ్రేషన్ చార్జీలను కంపెనీలే భరిస్తాయి. వీసా, లీగల్ ఫీజు వంటి ఇతర వ్యయాలు కూడా ఉంటాయి. ‘‘నా స్నేహితులు కొందరు ఉద్యోగం కోసం ఇక్కడకు (కెనడాకు) వచ్చారు. తగిన ఉద్యోగం వెతుక్కునేందుకు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండాల్సి వచి్చంది. ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. కనుక ఇక్కడకు వచ్చే వారు ముందుగానే ఈ ఖర్చుల గురించి తెలుసుకోవాలి. అందుకు సరిపడా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని రావాలి. తమ ఖర్చులకు సరిపడా డబ్బులున్నట్టు ఆధారాలు కూడా చూపించాలి’’అని శుభ్ర తెలిపారు. కెనడాకు వెళ్లాలంటే ఒక వ్యక్తికి ఎంతలేదన్నా 15,500 కెనడియన్ డాలర్లు కావాలి. అదే దంపతులకు అయితే 21,000 డాలర్లు, పిల్లలతో వెళ్లాలంటే 30,000 డాలర్లు అవసరమవుతాయి. అమెరికాకు వెళ్లాంటే గ్రీన్ కార్డ్ కోసం కనీసం 1.8 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. అదే ఆ్రస్టేలియాకు వెళ్లాలంటే నలుగురు సభ్యుల కుటుంబానికి 30,000 నుంచి 40,000 ఆ్రస్టేలియన్ డాలర్లు కావాలి. ‘‘ఈబీ–5 వీసా కోసం పెట్టుబడి వేర్వేరుగా ఉంటుంది. అమెరికా అయితే ఈబీ–5 వీసా ఖర్చు 8 లక్షల డాలర్లు. కెనడా అయితే 12 లక్షల కెనడియన్ డాలర్లు. ఈబీ–5 వీసాకు ముందు లోతైన పరిశీలన ఉంటుంది. సంబంధిత వ్యక్తి చేసే పెట్టుబడులకు మూలాలు, ఎంత మందికి ఉపాధి కలి్పస్తున్నారన్నది చూస్తారు. దీనికి అదనంగా అమెరికాలో పరిపాలనా, న్యాయపరమైన చార్జీలు 75,000 డాలర్లు అవుతాయి. అటార్నీ ఫీజులు 10,000–20,000 డాలర్లు పెట్టుకోవాలి. అదే యూకే అయితే స్కిల్డ్ వర్కర్ వీసా కోసం దరఖాస్తు ఫీజు 625 నుంచి 1,423 బ్రిటిష్ పౌండ్లు ఉంటుంది. హెల్త్‌కేర్ సర్‌చార్జీ మరో 624 బ్రిటిష్ పౌండ్ల వరకు ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, హోటల్ తదితర చార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వెళ్లే ముందుగా.. ‘‘విదేశానికి వలస వెళ్లే వరకు రెండు దేశాల కరెన్సీని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నివసించే దేశానికి సంబంధించి పన్ను నిబంధనలు, పౌర చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లో నివాస ప్రమాణాలు చాలా ఎక్కువ. కనుక తగినన్ని నిధులు సిద్ధం చేసుకుని వెళ్లాలి. పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురుకావచ్చు’’ అని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్ రావు సూచించారు. ఇక బీమా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలా దేశాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరిగా అమల్లో ఉంది. తీసుకునే బీమాలో వేటికి కవరేజీ ఉంది, లేనిదీ తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత భారత్‌లో కేవైసీల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పెట్టుబడులు కలిగిన ఆరి్థక సంస్థలకు విదేశాల్లోని చిరునామా ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా హోదా మార్చుకోవాలి. అప్పుడు స్వదేశంలో పెట్టుబడులు, పన్నుల బాధ్యతలు కొనసాగించుకోవచ్చు. విదేశాలకు తరలిపోయే వారు స్వదేశంలో విలువ తరిగిపోయే ఆస్తులను వదిలించుకుని వెళ్లడమే సరైనది. విలువ పెరిగే రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యతలను ఎవరో ఒకరు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకుని, అన్నీ విచారించుకుని, తగిన ప్రణాళికతో బయల్దేరితే విదేశీయానం సుఖవంతమవుతుంది. -
కరోనా.. అధ్యక్ష ఎన్నికలపై అమెరికన్ల మనోగతం!
వాషింగ్టన్ : కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగింది. ఈ క్రమంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న అగ్రరాజ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడతాయనే వార్తలు వచ్చాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాటిని ఖండించారు. అయితే ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. ఓటింగ్‌పై కరోనా ప్రభావం ఉండనుందని ఇటీవలి ప్యూ రీసెర్చి సర్వేలో వెల్లడైంది. దాదాపు మూడింట రెండొంతుల అమెరికన్లు కరోనా సంక్షోభం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలిపింది. ఈ సర్వే కోసం ఏప్రిల్ 7 నుంచి 12 వరకు 4,917 మంది అమెరికన్ల అభిప్రాయం తీసుకున్నట్టు ప్యూ రీసెర్చి పేర్కొంది. అందులో 67 శాతం అమెరికన్లు చాలా వరకు కరోనా అధ్యక్ష ఎన్నికల్లో.. ప్రజలు ఓటు వేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చాలా మంది అమెరికన్లు నవంబర్లోనే ఈ ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ డెమోక్రట్స్లో 46 శాతం మాత్రం నవంబర్‌లో ఎన్నికలు న్యాయంగా జరుగుతాయనే దానిపై తక్కువ విశ్వాసం వెలిబుచ్చారు. కాగా, ఈ సర్వేలో మొయిల్ ద్వారా ఓటింగ్‌ను సమర్థిస్తారా అని ప్రశ్నించగా.. 70 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. అలాగే అన్ని రకాల ఎన్నికలకు కూడా మెయిల్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని సగానికి పైగా అమెరికన్లు మొగ్గు చూపుతున్నారని ‘ప్యూ’ సర్వే వెల్లడించింది. కాగా, నవంబర్ 3న జరగనున్న ఎన్నికలను ట్రంప్ వాయిదా వేయాలని చూస్తున్నారని డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల తేదీ మార్చాలనే ఆలోచన తనకు లేదని ట్రంప్ పేర్కొన్నారు. చదవండి : అమెరికాలో హెచ్ 1 బీ టెన్షన్... -
భారత్‌ను కలవరపెడుతున్నవి ఆ రెండే..
సాక్షి, న్యూఢిల్లీ : నిరుద్యోగం, ధరల పెరుగుదలే దేశాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలని తాజా సర్వే వెల్లడించింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవడంతో పాటు దేశంలోని ప్రధాన సమస్యలను మోదీ సర్కార్ డీల్ చేసే తీరుపై ప్రజల్లో నిరాశే నెలకొందని అమెరికాకు చెందిన పీఈడబ్ల్యూ రీసెర్చి సెంటర్ ఇటీవల ప్రచురించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను గత ఏడాది మే-జులైలో నిర్వహించగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో సర్వేను ప్రచురించారు. భారత ఓటర్లను అధికంగా ఆందోళనకు గురిచేస్తున్నదని నిరుద్యోగం, ధరల పెరుగుదలేనని ఈ సర్వే తేల్చింది. అధికారుల్లో పేరుకుపోయిన అవినీతి, ఉగ్రవాదం, నేరాలు సైతం భారత ఓటర్లను కలవరపెడుతున్నాయని పేర్కొంది. పది ఆందోళన కలిగించే అంశాల్లో పారిశ్రామికవేత్తల్లో అవినీతి, వాయుకాలుష్యం కూడా చోటుచేసుకున్నాయి. రెండోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుందని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా మోదీ హయాంలో నిరుద్యోగ భారతంలో ఎలాంటి మార్పు లేకపోవడం, కొత్త కొలువులు పెద్దగా రాకపోవడం పట్ల యువత ఆగ్రహంగా ఉన్నట్టు సర్వే నివేదిక పెదవివిరిచింది. ఇక ధరల పెరుగుదలతో జీవితం దుర్భరంగా మారిందని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, అవినీతి పెరిగిందని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొంటున్నామని మోదీ సర్కార్ చాటిచెబుతుండగా, ఉగ్రవాదం మరింత పెచ్చుమీరిందని 59 శాతం మంది చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నారని కేవలం 21 శాతం మందే అభిప్రాయపడ్డారు. కాగా, భారత్‌లో 20 ఏళ్ల కిందటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం సగటు జీవి ఆర్థిక పరిస్థితి మెరుగైందని 65 శాతం మంది చెప్పడం గమనార్హం. ఆర్థికంగా సగటు జీవి చితికిపోయాడని కేవలం 15 శాతం మందే వెల్లడించారు. ఇక భారత్‌లో ప్రజాస్వామ్యం పనితీరుపై 54 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 2017లో 79 శాతం మంది ప్రజాస్వామ్య తీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. -
మతం మాకు చాలా ముఖ్యం!
► భారత్‌లో 80% మంది.. అమెరికాలో 50% మంది వెల్లడి ► మతానికి ప్రాధాన్యతనిచ్చే జనం ఇథియోపియాలో అత్యధికం ► చైనాలో అత్యల్పం.. 100 మందిలో ముగ్గురే మతవిశ్వాసులు ► 2050 నాటికి మారనున్న మత సమీకరణాలు: ప్యూ రీసెర్చ్ సర్వే భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తమ జీవితంలో మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఇటువంటి వారు ఇథియోపియాలో అత్యధికంగా ఉంటే.. చైనాలో అతి తక్కువగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడిస్తోంది. 2015లో ప్రపంచ వైఖరుల సర్వేలో భాగంగా.. మతం విషయంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్నదానిపై అధ్యయనం చేశారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రజల్లో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తేలింది. సర్వేలో ప్రశ్నించిన వారిలో దాదాపు అందరూ ఇథియోపియన్ ఆర్థొడాక్స్ చర్చ్ అనేది తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని బదులిచ్చారు. మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంది. మెజారిటీ ముస్లిం మతస్తులైన అక్కడి ప్రజల్లో 97 శాతం మంది మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇక పాకిస్తాన్, ఇండొనేసియా, బుర్కినా ఫాసో తదితర దేశాల్లో 90 శాతానికన్నా ఎక్కువ మంది తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైన భాగమని స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకన్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకు మతం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్థికంగా శక్తివంతమైన చాలా దేశాల్లో మతం ముఖ్యమైన అంశంగా పరిగణించే జనం 20 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తమ జీవితాల్లో మతాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఈ సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో సగానికన్నా ఎక్కువ మంది మతాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించడం విశేషం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మతాన్ని ముఖ్యమైన విషయంగా పరిగణించే వారి సంఖ్య చైనాలో అతి తక్కువగా ఉంది. అక్కడ ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే మతం చాలా ముఖ్యమైనదని చెప్పారు. 2050 నాటికి క్రైస్తవులతో సమానంగా ముస్లింలు... ప్రపంచ జనావరణాలు, జనాభాలు మారుతున్న పరిస్థితుల్లో.. ప్రపంచంలో మత సమీకరణాలు 2050 నాటికి గణనీయంగా మారతాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు. అప్పటికి ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభాకు సమానంగా పెరుగుతుందని అంచనా. మరోవైపు.. ఏ మతాన్నీ ఆచరించని ప్రజల సంఖ్య పెరగడం నెమ్మదిస్తుందని.. ఫలితంగా ప్రపంచ జనాభాలో ఇటువంటి వారి శాతం మరింత తక్కువ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ► హిందువుల జనాభా 1970లో 46 కోట్లుగా ఉంటే.. 2010 నాటికి 103 కోట్లకు పెరిగింది. ఈ సంఖ్య 2050 నాటికి 138 కోట్లకు పెరుగుతుందని అంచనా. ► క్రైస్తవుల సంఖ్య 1970లో 123 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 217 కోట్లకు పెరిగింది. ఈ జనాభా 2050 నాటికి 292 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► ముస్లింల జనాభా 1970లో 57 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 160 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 276 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ► ఏ మతం ఆచరించని వారి సంఖ్య 1970లో 71 కోట్లు కాగా.. 2010 నాటికి 113 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 123 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► బౌద్ధ మతస్తుల సంఖ్య 1970లో 23 కోట్లు ఉంటే.. 2010 నాటికి 49 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఈ మతస్తుల సంఖ్య అంతే ఉంటుందని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఆళ్లు మారిపోయారు బాసూ!
కొంతకాలంగా అమ్మాయిలకు ముదుర్లు అనే ముద్ర వేస్తున్నారట మగాళ్లు. అయితే, ఇది అబద్ధం అంటున్నారు అమ్మాయిలు. మరి నిజమేంటో ఇద్దరూ ఓ నిర్ణయానికి రాలేకపోతుంటే అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ వీరికి మాట సాయం చేసింది. ఏంటో వినండి! అమ్మాయిలు ముదుర్లుగా ఏమీ మారిపోలేదు. గతంలో వారిలో గుట్టలు గుట్టలుగా పోగుపడి ఉన్న అమాయకత్వాన్ని తొలగించుకున్నారట. ఈ విషయాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ ధ్రువీకరించింది. ఎందుకిలాంటి నిర్ణయానికి వచ్చిందో ఆ సంస్థ వివరించింది. ఇంతకుముందు శారీరక బలహీనత వల్ల స్త్రీ స్వేచ్ఛ కాస్త తక్కువగా ఉండేది. సమాజంలో భద్రత ప్రమాణాలు పెరిగాక, విద్యారంగంలో విజయాలు సాధిస్తున్న తరువాత తమకు ఉన్న ఆప్షన్లను తెలుసుకోగలుగుతున్నారు. ఆప్షన్లు ఉన్నపుడు వారికి ఎంపిక అవకాశం దక్కింది. దీంతో సెలెక్టివ్‌గా ఉండగలుగుతున్నారు అని ‘ప్యూ రిసెర్చి’ పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో పాతికేళ్లు నిండి పెళ్లి కాకుండా ఉండిపోతున్న వారి సంఖ్య మునుపటి సంవత్సరాలతో పోలిస్తే బాగా ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో మొదటిది కాస్త స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అక్కడ మనలాగా ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లేకున్నా... కాస్త భద్రత కలిగిన వృత్తిలో (ఉద్యోగం పోగొట్టుకున్నా వెంటనే మరో ఉద్యోగం తెచ్చుకోగలిగిన నైపుణ్యాలున్న వారు) ఉన్నవారిని ఎంచుకుంటున్నారు.78 శాతం అమ్మాయిలు ఇలాంటి వారిని కోరుకుంటున్నారు. సంతానం గురించి తమ లాంటి ఆలోచన ఉన్న వారినే పెళ్లాడాలని 62 శాతం యువకులు కోరుకుంటుంటే, యువతులు 70 శాతం మంది కోరుకుంటున్నారు. అబ్బాయిల్లో నైతిక, ఆధ్మాత్యిక భావాలుండాలని కోరుకున్న యువతుల శాతం 38 శాతం ఉండటం గమనార్హం. ఇద్దరి అభిప్రాయాలు కలిసింది విద్యలోనే. బాగా చదువుకున్న వ్యక్తి భాగస్వామి కావాలని అబ్బాయిలు -అమ్మాయిలు ఒకే స్థాయిలో అంటే 28 శాతం మంది కోరుకుంటున్నారు. ఇదే పరిస్థితి మన దేశంలో గమనిస్తే ఇంకాస్త ఆసక్తికరంగా ఉంది. ఎంపిక అవకాశం పాశ్చాత్య దేశాల్లో ఐదు దశాబ్దాలుగా మెల్లగా వృద్ధి చెందగా, అక్కడ అయిదు దశాబ్దాల్లో కనిపించిన వృద్ధి ఇక్కడ రెండు దశాబ్దాల్లోనే కనిపించింది. ఇటీవలి కాలంలో మన దేశంలో వధువుల కొరత ఉంది. నిజానికి ఇది కొరత కాదు, వారికి వరుడి లక్షణాలను ఎంచుకునే అవకాశం రావడంతో పెళ్లిళ్లు చేసుకునే వయసు పరిమితి మరింత పెరిగింది. దీనివల్ల అబ్బాయిల్లో ఆందోళన పెరిగింది. సాధారణంగానే ఇక్కడ ఇరువురికీ నాలుగైదేళ్లు వయసు తేడా ఉండేది. ఇప్పుడు అది కూడా మెరుగుపడింది. రాష్ట్రాలను బట్టి వధువుల కొరత వెయ్యిమందికి 30-180 వరకు ఉంటోంది. దీనివల్ల ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగంలో స్థిరపడిన అబ్బాయిలు, మంచి కుటుంబ వారసత్వం ఉన్న వారు, సామాజికంగా, ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబాల వారికి అమ్మాయిల ఆమోదం లభిస్తోంది. నిజానికి ఇదేమీ స్వార్థం కాదు. ముందుచూపు మాత్రమే. కాబట్టి... అబ్బాయిలు కూడా కాలేజీల్లో ఉండగానే కెరీర్ ప్లానింగ్‌తో పాటు, మ్యారేజ్ ప్లానింగ్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉండే నిజం ఇది.