హెచ్‌సీయూ స్కాలర్ ఆత్మహత్య
- అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకిన విశాల్
- హైదరాబాద్ నల్లగండ్లలో ఘటన
హైదరాబాద్: ప్రఖ్యాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్ టాండన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగుండ్లలోని అపర్ణ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అతను.. శనివారం సాయంత్రం భవంతి 14వ అంతస్తు నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు.
హెచ్‌సీయూలో జనరల్ స్టడీస్‌లో పీహెచ్డీ చేస్తోన్న విశాల్.. తన తల్లితో కలిసి నల్లగండ్లలోని అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. అయితే తల్లి ముంబై వెళ్లగా, శనివారం ఇంట్లో విశాల్ ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతుడి స్వస్థలం కర్ణాటకలోని బెల్లామ్ ప్రాంతమని, చనిపోయే ముందు కుటుంబ సభ్యులకు మెయిల్ చేసినట్లు గుర్తించామని చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.