Pinky
-
ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ‘పింకీ’
కిరణ్, మౌర్యాణి జంటగా నటించిన తాజా చిత్రం ‘పింకీ’. సీరపు రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుమన్ , శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్ గా విడదులకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..`జనం, జరిగిన కథ చిత్రాలు చేసిన దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ గారు. ఆయన దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తన నిర్మాణంలో వస్తోన్న ఈ పింకీ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా` అన్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు సినిమా. ఈ సినిమా విడుదలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా` అన్నారు. దర్శకుడు సీరపు రవి కుమార్ మాట్లాడుతూ...`ఇది నా మొదటి సినిమా. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరించారు. ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్` అన్నారు. నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ..`సీరపు రవి కుమార్ చెప్పిన కథ నచ్చడంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు. -
ఆస్కార్ గెలిచిందని స్థలమిచ్చారు.. ఇప్పుడేమో కూల్చేస్తామంటూ!
2009లో ఆస్కార్ అవార్డ్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం స్మైల్ పింకీ. ఈ చిత్రంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన పింకీ జీవితం ఆధారంగా మెగాన్ మైలాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆరేళ్ల పాప పేరు పింకీ సోంకర్. ఆమె తన తండ్రితో కలిసి ఆస్కార్ అవార్డ్‌ను అందుకుంది. ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా పింకీ పేరు మారుమోగిపోయింది. అయితే పింకీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో నివసిస్తోంది. అయితే గతంలో ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు పింకీ కుటుంబానికి అధికారులు కొంత భూమిని ఇచ్చారు. ప్రస్తుతం అదే స్థలంలో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తోంది పింకీ ఫ్యామీలీ. అయితే తాజాగా ఈ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా పింకీ ఫ్యామిలీకి కూడా ఇంటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు. మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో చాలామందికి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మించామని చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఇంటిని కూల్చివేస్తామనడం యూపీతో పాటు దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. 2008లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించినప్పుడు ఆ పాప వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం 20 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు 12వ తరగతి చదువుతోంది. మా కుటుంబ అవసరాలు తీర్చేందుకు నాన్న పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని గతంలో పింకీ వెల్లడించింది. -
కాంస్య పతక బౌట్లో పింకీ పరాజయం
Pinky loses bronze World Wrestling Championship.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం చేజారింది. నార్వేలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో మహిళల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత రెజ్లర్ పింకీ కాంస్య పతక బౌట్లో ఓడిపోయింది. జెనా రోజ్ బుర్కెర్ట్ (అమెరికా)తో జరిగిన బౌట్లో పింకీ 2–5తో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవీందర్ (61 కేజీలు), రోహిత్ (65 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో మరో నలుగురు భారత బాక్సర్లు
ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 2006లో స్వదేశంలో జరిగిన ఈవెంట్లో భారత్ అత్యధికంగా ఎనిమిది పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అనంతరం జరిగిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ ఈ తరహా ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది. పుష్కర కాలం తర్వాత మళ్లీ సొంతగడ్డపై భారత బాక్సర్లకు తమ ఉత్తమ ప్రదర్శనను సమం చేసే అవకాశం లభించింది. ఇలా జరగాలంటే నేడు జరిగే ఎనిమిది క్వార్టర్ ఫైనల్స్‌లోనూ భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌తో ప్రత్యర్థుల పని పట్టాల్సి ఉంటుంది. బరిలో దిగిన అందరూ గెలిస్తే భారత్ ఖాతాలోఎనిమిది పతకాలు ఖాయమవుతాయి. న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఎవరైనా... నేపథ్యం ఎంత ఘనంగా ఉన్నా... అవేవీ లెక్క చేయకుండా భారత మహిళా బాక్సర్లు దూసుకుపోతున్నారు. పంచ్‌ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ ముందంజ వేస్తున్నారు.ఆదివారం నలుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా... సోమవారం మరో నలుగురు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఇక్కడి కేడీ జాదవ్ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు సోనియా చహల్ (57 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. అయితే 75 కేజీల విభాగంలో మాత్రం భారత బాక్సర్ సవీటి బూరా పరాజయం పాలై ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 10 వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతుండగా... భారత్ నుంచి సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు) మినహా మిగతా ఎనిమిది మంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. విజయం... వివాదం హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా చహల్ పాల్గొన్న 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్ ఫలితం వివాదాస్పదమైంది. ఈ బౌట్లో సోనియా 3–2తో 2014 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత స్టానిమిరా పెట్రోవా (బల్గేరియా)ను ఓడించింది. రెండో రౌండ్ వరకు వెనుకబడి ఉన్న సోనియా చివరి రౌండ్లో పుంజుకొని గెలిచింది. అయితే తుది ఫలితంపై సోనియా ప్రత్యర్థి స్టానిమిరా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆతిథ్య దేశం బాక్సర్లకు బౌట్ జడ్జిలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. సోనియాను రిఫరీ విజేతగా ప్రకటించే సందర్భంలో నిర్వేదంగా నవ్వుతూ, చూపుడు వేలును ఊపుతూ ఆమె నిరసన ప్రకటించింది. స్టానిమిరా కోచ్ పీటర్ యొసిఫవ్ లెసోవ్ ఏకంగా రింగ్‌లోకి నీళ్ల సీసాను విసిరేశాడు. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) అతడి అక్రిడిటేషన్‌ను రద్దు చేసి పోటీల ప్రాంతం నుంచి బహిష్కరించింది. ఇతర బౌట్లలో పింకీ 5–0తో ఇంగ్లండ్‌కు చెందిన ఎలిస్ ఎబొని జోన్స్‌పై,సిమ్రన్‌జిత్ 5–0తో మెగన్ రీడ్ (స్కాట్లాండ్)పై ఏకపక్ష విజయాలు సాధించారు. 75 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. ఇందులో సవీటి బూరా 0–5తో ఎల్జిబీటా వొజిక్ (పోలండ్) చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు ►54 కేజీలు మనీషా గీ స్టొయికా (బల్గేరియా) ►69 కేజీలు లవ్లీనా గీ స్కాట్ కయి (ఆస్ట్రేలియా) ►81 కేజీలు భాగ్యవతి గీ జెస్సికా (కొలంబియా) ►48 కేజీలు మేరీకోమ్ గీ వు యు (చైనా) ►57 కేజీలు సోనియా గీ కాస్టెనాడ (కొలంబియా) ►ప్లస్ 81 కేజీలుసీమా గీ జియోలి యాంగ్ (చైనా) ►51 కేజీలు పింకీ రాణి గీ చోల్ మి పాంగ్ (కొరియా) ►64 కేజీలు సిమ్రన్‌జిత్ గీ అమీ సారా (ఐర్లాండ్) మధ్యాహ్నం గం.1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పాపం.. పసివాడు
గచ్చిబౌలి: అమ్మ కనిపించక 19 రోజులైంది.. నాన్నేమో దూరంగా ఉన్నాడు.. హోంలో ఆ ఎనిమిదేళ్ల బాలుడు అనాథలా మిగిలిపోయాడు. పింకీ హత్య కేసు నేపథ్యంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్‌కు చెందిన పింకీ కుటుంబసభ్యులు ఇటుక బట్టీలలో కూలీ పనులు చేస్తున్నారు. పింకీకి 13 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దినేష్‌తో వివాహం జరిగింది. కొడుకులు దేవ్(10), జతిన్(08), కూతురు నందిని(05) ఉన్నారు. పెద్ద కొడుకు దేవ్, కూతురు న ందిని భర్త వద్ద వెళ్లి చిన్న కొడుకు జతిన్‌ను తీసుకొని మూడేళ్ల క్రితమే వికాస్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. నమ్మి వంచిచిన వికాస్ కశ్యప్ మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను కోసి మూటగట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పేడేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు రానున్న కుటుంబ సభ్యులు పింకి కుటుంబ సభ్యలు కటిక పేదరికంలో ఉన్నారు. కనీసం చిన్నప్పటి నుంచి పోటో కూడా దిగలేదని పోలీసులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకునే పింకీ తల్లిదండ్రులు, సోదరుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా లేక పోవడంతో ఎవరూ వచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పింకీ తండ్రి డప్పూ లియా, సోదరుడు సింతూ లియా, సోదరికి మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఉస్మానియా మార్చురీలో ఉన్న పింకీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సన్నహాలు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే పింకీ మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పంపాలని బీహర్ పోలీసులతో మాట్లాడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఇష్ట ప్రకారమే అంత్య క్రియలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. వారికి ఇష్టమైతే మృతదేహాన్ని తీసు కెళ్లవచ్చని, లేదా హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేస్తామంటే తమ సహకారం ఉంటుందన్నారు. జతిన్‌ను తీసుకెళ్లేందుకు తండ్రి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
పింకీ.. దెయ్యమై తగలబెట్టేసింది!
దెయ్యాలు -ప్రతీకారం కథలు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సినిమా కథను మరిపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో సంచలనం రేపింది. ఆ నగరంలో గాజులు తయారుచేసే కుటుంబానికి చెందిన ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయింది. ఇంట్లోని వస్తులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. దుస్తులు, డబ్బులు, గాజుల తయారీకి ఉపయోగించే వస్తువులు ఏవీ మిగల్లేదు. సర్వం కాలి బూడిదైంది. దీంతో ఆ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు. దీంతో పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే దెయ్యమై కుటుంబాన్ని నాశనం చేసిందని గ్రామంలో వదంతులు షికార్లు చేశాయి. మరోవైపు పింకీ తనకు కలలో చాలాసార్లు కనిపించిందని, చంపేస్తాననీ, సర్వనాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించిందని పింకీ అత్తగారు వాపోతోంది. పింకి మరణం తర్వాత ఆమె భర్త నాగేంద్ర రెండోపెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా దెయ్యం పట్టి పీడిస్తోందని, నాగేంద్ర కొడుకును కూడా బలితీసుకుందని అంటున్నారు. అప్పుడే నాగేంద్ర తండ్రి మంత్రగాళ్లను సంప్రదించారని, దీంతో ఆగ్రహం చెందిన పింకీ దెయ్యం ఆ కుటుంబంపై పగ తీర్చుకుందనే వార్తలు గ్రామంలో గుప్పుమన్నాయి. కానీ ఈ వార్తలను హేతువాద సంఘాలు కొట్టి పారేస్తున్నాయి. మండు వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ సంభవిస్తాయని.. వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.