podu Agriculture
-
పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ..
-
ఫారెస్ట్ అధికారులు ,పోడు రైతులకు మధ్య ఘర్షణ
-
‘అగ్రి’ కమిషనరేట్ ముట్టడిలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళా రైతులను అక్ర మంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని నిర సిస్తూ కిసాన్ కాంగ్రెస్ నిర్వహించిన వ్యవ సాయ కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం ఉదయం గాంధీ భవన్లో సమావేశమైన టీపీసీసీ కిసాన్ సెల్ నేతలు అక్కడి నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయానికి బయలుదేరారు. వీరిని గాంధీభవన్ గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కిసాన్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపు లాటలో టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి కింద పడిపోయారు. అయినా, ఆయన్ను బలవంతంగా అదుపులోనికి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించ డంతో కిసాన్ కాంగ్రెస్ నేతలు అడ్డుకు న్నారు. అన్వేశ్‌రెడ్డిని వదిలిపెట్టిన పోలీసులు, మిగిలిన వారిని అదుపులోకి తీసుకు న్నారు. కొందరిని మాత్రమే కమిషనరేట్‌కు వెళ్లేందుకు అనుమతించడంతో... కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం వెళ్లి వినతిపత్రం అందజేసింది. రైతుల రక్తాన్ని తాగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల రక్తాన్ని తాగుతోం దని టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. పోడు వ్యవసా యం చేసుకుంటున్న మహిళా రైతులను అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం అన్యాయమని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలిం గ్ను అడ్డుకున్నందుకు గాను రైతులను నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ ఏర్పాటయ్యాక మొత్తం 8వేల మంది ఆత్మహత్యలు చేసుకు న్నారని ఆయన తెలిపారు. ఆత్మహత్య చేసు కున్న రైతు కుటుంబాలకు జీవో 194 ప్రకా రం పరిహారం చెల్లించాలని, అన్నదాతల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతు కమి షన్ను ఏర్పాటు చేయాలని, రైతులకు సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలను అంద జేయాలని, రైతు బీమాతో పాటు పంటల బీమాను అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
15 మందికి నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పడాల భూదేవి, 93 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించి చండీగఢ్ అద్భుతంగా పేరు సంపాదించి, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన శతాధిక వృద్ధ అథ్లెట్, మష్రూమ్ మహిళ, జార్ఖండ్ లేడీ టార్జాన్ సహా 15 మంది 2019 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా మహిళా శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40–బీహార్), అరిఫా జాన్ (33–శ్రీనగర్, జమ్మూ కశ్మీర్), చారి ముర్ము (47–జార్ఖండ్), నిలజా వాంగ్మో (40–లేహ్), రష్మీ ఊర్థర్దేశ్ (60–పుణే, మహారాష్ట్ర), మాన్ కౌర్ (103–పాటియాలా, పంజాబ్), కళావతీ దేవీ (68–కాన్పూర్, ఉత్తరప్రదేశ్), తాషి, నుంగ్షీ (కవలలు) (28– డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్), కౌషికి చక్రవర్తి (38–కోల్‌కతా, పశ్చిమబెంగాల్), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్ (వాయుసేన మొదటి మహిళా పైలెట్లు), భగీరథి అమ్మా (105)– కాత్యాయని(98) (అలప్పుజ–కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. పౌష్టికాహార లోపాల్ని నివారించండి: ప్రధాని నారీశక్తి అవార్డు పొందిన 15 మందిలో 14 మందితో ప్రధాని మోదీ తన నివాసంలో ముచ్చటించారు. పిల్లల్లో, మహిళల్లో ఉన్న పౌష్టికాహార లోపాల్ని నివారించడం, నీటిని బొట్టు బొట్టు సంరక్షించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నారీ మణులు సాధించిన లక్ష్యాలు కేసు స్టడీలుగా యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో కశ్మీర్‌కు చెందిన ఆరిఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. భూదేవి విజయగాథ ముగ్గురు ఆడపిల్లల తల్లినని తాను ఏనాడూ చింతించ లేదని భర్త వదలి వేస్తే కన్న వారింటిలో ఉండి గ్రామీణ, గిరిజన మహిళల వికాసానికి నడుం కట్టానని నారీశక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి అన్నారు. ఆమె అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను వివరించారు. గిరిజనుల్లో సవర తెగకు చెందిన తనకు చిరుప్రాయంలోనే వివాహమైతే ముగ్గురూ ఆడపిల్లలనే కన్నానని మెట్టినింటి వారు బయటకు పంపేశారన్నారు. తండ్రి చాటు బిడ్డగా పొలం పనిని నేర్చుకున్నానని, తనలాంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. 1–70 గిరిజన చట్టంలోని హక్కులు, మహిళా హక్కులను గురించి సభల్లో తెలుసుకున్నానని ఆ చట్టం కింద మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి కొన్ని వేల ఎకరాల పోడు భూమిని సేకరించి చిరుధాన్యాల సాగుకు పూనుకున్నామన్నారు. పంటను మార్కెట్‌కు పంపితే డబ్బులు వస్తాయి కానీ పౌష్టికాహారం అందదు, అందుకే వాల్యూ అడిషన్ను చేకూర్చాలని నిర్ణయించాము. కంపెనీలను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పొడిగా మార్చి మార్కెటింగ్ చేయడం, బిస్కెట్లుగా తయారు చేయడం వంటివి మొదలు పెట్టాము. ఈరోజు తాము 15,000 మంది ఐసీడీఎస్ పథకం కింద ఉన్న బాలబాలికలకు (3–4 ఏళ్లలోపు) బిస్కెట్లు సరఫరా చేసి పౌష్టికాహారం అందజేయగలుగుతున్నాము. కలెక్టర్ సహకారంతో పంటలను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఆమె వివరిస్తుండగా ప్రధాని అభినందించారు. భూదేవి తాను ప్రసంగించేటపుడు తనకు హిందీ రాదని అయినా హిందీలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాననన్నారు. ఆమె చక్కగా హిందీ , కొన్ని ఇంగ్లీషు పదాలతో కలగలిపి చేసిన ప్రసంగం ప్రధానిని హత్తుకుంది. మీరు హిందీ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడలేననే చింత వద్దు అని అన్నారు. -
పోడు ‘పోరాటం’..!
పర్ణశాల: ఏజన్సీలోని పచ్చని పల్లెలు.. ఇప్పుడు పోడు భూముల వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు గిరిజనులు తాము కష్టపడి పోడు కొట్టి, వాటి రక్షణ కోసం అటవీ అధికారులతో కొట్లాడారు. కానీ ఇప్పుడు ఒకరి పోడు భూమిని మరొకరు దుక్కులు దున్నుతున్నారు. ఘర్షణకు దిగుతున్నారు. దీంతో పల్లెలు పగతో రగిలిపోతున్నాయి. దుమ్ముగూడెం మండలంలో రోజుకొక్క ఊరిలో పోడు భూముల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. కేసులు నమోదవుతున్నాయి. గిరిజనులు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్నారు. రెండు రోజుల క్రితం సిగారం, రామరావుపేట గ్రామాల మధ్య పోడు వివాదంతో మొదలైన ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణలో ఒక మహిళకు తీవ్రంగా, ఇంకొందరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ తరువాత రోజు జిన్నెలగూడెం, చింతగుప్ప గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. గురువారం చిన్ననల్లబల్లి మరో ఘటన జరిగింది. ఇలా ప్రతి రోజు ఏదో ఒక ఊరిలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ వివాదాలను రాజకీయ లబ్దికోసం వాడుకునేందుకు పావులు కదుపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన భూతగాదాలు అన్ని గ్రామాల్లో రాత్రులే జరిగాయి. ఇప్పటికైనా ఈ వివాదాలను పోలీసు ఉన్నతాధికారులు పరిష్కరించకపోతే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంది. -
కారేపల్లిలో ఉద్రిక్తత
కారేపల్లి: ‘‘గత 40 సంత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతాన్ని వదిలి పొమ్మంటే.. మేము ఏడికి పోతాం.. చావనైనా చస్తాం కానీ ఇక్కడి నుంచి మాత్రం పోయేదిలేదని’’ పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళలు అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తాడేపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక మహిళలు అధికారుల మీదకు తిరగబడటంతో పాటు తోపులాటకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన కారుల్లో మహిళలు ఎక్కువగా ఉండటంతో.. అధికారులు పెద్ద ఎత్తున మహిళ సిబ్బందిని పిలిపించి ఆందోళనకారులను శాంతింపచేయడానికి యత్నిస్తున్నారు. -
నెలనెలా పండుగలే..
భాష, వేషధారణలోనూ విభిన్నం అడవులే వారికి ఆయువుపట్టు ఇదీ జిల్లా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల తీరు కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. రాజకీయాలు తెలియని మనస్తత్వం.. ప్రతి నెలా పండుగలు.. పండుగలకు అనుగుణం గా ప్రత్యేక పూజలు.. అందుకు తగ్గట్టుగా వేషధారణ.. ఇదీ ఆదివాసీ గిరిజనుల ప్రత్యేకత. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల కు పెట్టింది పేరు. వివిధ తెగల రూపంలో జీవిస్తున్న వారి ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. వారి సంస్కృతి సంప్రదాయాలూ అందరికీ ఆశ్చర్యం కలిగించేవే. జిల్లా గిరిజన జీవనంపై నేటి సండే స్పెషల్. జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 4 లక్షల 95 వేల 794 మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. అయితే లంబాడా(బంజార)లను ప్రభుత్వం 1977 సంవత్సరంలో గిరిజనులుగా గుర్తించడంతో ఆనాటి నుంచి వీరు గిరిజనులుగా గుర్తింపు పొందారు. గోండులు, కొలాంలు, మన్నెవార్, తోటి, ప్రధాన్‌లు, నాయక్‌పోడ్, ఆంద్, కోయా, ఇతర జాతులను ఆదివాసీలుగా వ్యవహరిస్తుండగా వీరిలో కొలాం, మన్నెవార్, తోటి తెగలను పీటీజీ(ఆదిమ గిరిజన తెగలు)గా వ్యవహరిస్తారు. గోండులు గోండుల ప్రధాన వృత్తి పోడు వ్యవసాయం. ఆదిమ జాతి గిరిజనులైన గోండులు గోండి భాషలో మాట్లాడుతారు. కుస్రం హన్మంతరావు గోండు లిపిని రూపొందించారని చరిత్రకారులు పేర్కొన్నారు. అయితే ఇటీవల నార్నూర్ మండలం గుంజాలలో గోండుల లిపి వెలుగులోకి వచ్చింది. దీంతో లిపిపై పరిశోధనలు జరుగుతున్నాయి. గోండు గూడాల్లో జీవించేవారు మర్యాదకు, క్రమశిక్షణకు మారు పేరు. ఆచార వ్యవహారాలు పాటించడంలో వారికి వారే సాటి. కొమురం భీమ్ కాలం నుంచి గోండులది పోరాటతత్వం. మారుముల ప్రాంతాల అడవుల్లో జీవిస్తున్న వీరు ఎవరైనా కొత్తవారు గూడెంలోకి వస్తే ‘రాం...రాం’(నమస్కారం) అని ఆహ్వానిస్తారు. వీరు తమ గూడెం పటేల్ మాట కాదనరు. గోండులు కాలికి చెప్పులు వేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టరు. ఇతరులను అనుమతించరు. గూడాల్లో ఏ చిన్న పండుగైన అంతా కలిసి సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. గోండులు పెర్సాపెన్, ఆకిపెన్, జంగుబాయి తదితర దేవుళ్లను నమ్ముతారు. దీపావళీ సమయంలో గోండులు దండారీ పండుగను అత్యంత నియమనిష్టలతో జరుపుకుంటారు. గిరిజన సంస్కృతి నుంచి పుట్టిన రాయిసెంటర్ల (న్యాయస్థానం) తీర్పును గోండులు శిరసావహిస్తారు. కొలాంలు అభివృద్ధిలో వెనుకబడిన ఆదివాసీ తెగల్లో కొలాం గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వీరు కొలామీ భాషలో మాట్లాడుతారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో జీవిస్తారు. వ్యవసాయం, వెదురు బుట్టలు, తడకలు అల్లడం వీరి ప్రధాన వృత్తులు. వీరు ముఖ్యంగా భీమల్ పేన్ దేవతను కొలుస్తారు. థింసా నృత్యం చేస్తారు. కొలాం జాతుల్లో తెలుగు మాట్లాడే వారిని మన్నెవార్ అంటారు. గోండుల ఆచార వ్యవహారాలకు వీరి ఆచార వ్యవహారాలకు పెద్దగా తేడా లేనప్పటికీ కొన్ని పద్ధతులు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధాన్, తోటి రాజ్‌గోండుల కాలంలో ప్రధాన్, తోటి తెగలకు చెందినవారు కవులుగా ఉండేవారని చరిత్రకారులంటారు. ప్రధాన్‌లు అధికంగా మరాఠీ మాట్లాడుతారు. వ్యవసాయం ప్రధాన వృత్తి. తోటి తెగవారు అత్యంత వెనుకబడి ఉన్నారు. ప్రధానంగా గోండి భాష మాట్లాడుతారు. తోటిలలో అధిక శాతం ఇతర ప్రాంతాలకు వలసలు సాగిస్తూ జీవనం కొనసాగిస్తారు. కిక్రీ వాయిద్యాలు వాయించటం, చుక్కబొట్టులు వేయడంలో వీరు సిద్ధహస్తులు. ఆంద్, నాయిక్‌పోడ్ ఆంద్ తెగ వారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు కాగా.. మరాఠీ భాషలో మాట్లాడుతారు. వీరి జనాభా అంతంతే. వ్యవసాయం జీవనాధారం. పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు. లంబాడీ రాష్ట్రంలో లంబాడీలను రాష్ట్ర ప్రభుత్వం 1977లో గిరిజన తెగల్లో చేర్చింది. జిల్లాలో ఉన్న లంబాడీలు ఆదిమజాతి గిరిజనుల కంటే అభివృద్ధి చెందిన వారు. గోండు జనాభా తరువాత వీరు రెండో స్థానంలో ఉన్నారు. వీరు వ్యవసాయమే కాకుండా వ్యాపారం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారు. వీరు నిర్వహించే తీజ్ ఉత్సవాలు ఎంతగానే ఆకట్టుకుంటాయి. అడవి బిడ్డల జాతరలు ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో నిర్వహించే వివిధ జాతర ఉత్సవాలు వారి సంస్కృతి సంప్రాదాయాలు, ఆచార వ్యవహరాలే ప్రధానంగా సాగుతాయి. ఆదివాసీలకు నాగోబా జాతర అత్యంత పవిత్రమైనది. నాగోబాతో పాటు ఖాందేవ్, బుడుందేవ్, మహాదేవ్, జంగుబాయి ఇలా.. ప్రతీ జాతర వారికి ప్రత్యేకమైనదే. నాగోబా జాతర ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కొలువై ఉంది. ఏటా పుష్య మాసంలో అమావాస్య అర్ధరాత్రి మెస్రం వంశీయులు పవిత్ర గంగజలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో జాతర ప్రారంభిస్తారు. ఈ పూజలకంటే ముందు ఇంద్రాయిదేవీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. మెస్రం వంశీయులలో ఏడు దైవతలను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. మెస్రం వంశంలో ఉన్న 22 తెగలవారు అత్యంత నియమనిష్టలతో నాగోబాను కొలుస్తారు. నాగోబా పూజలకు ముందు మెస్రం వంశీయులు పవిత్ర గంగజలం కోసం కాలినడకన జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి రేవు అత్తల మడుగు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగజలం తీసుకొచ్చి పుష్యమి అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. దక్కన్ పీఠభూమిలోనే ఆదివాసీలకు ముఖ్యమైనది కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది. ఖాందేవ్ జాతర నాగోబా జాతర ప్రారంభానికి ముందు నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ జాతర జరుగుతుంది. పుష్య పౌర్ణమికి ఖాందేవ్‌ను తొడసం వంశీయులు కొలువడం ద్వారా జాతర ప్రారంభమవుతుంది. 15 రోజుల పాటు జరుగుతుంది. పూర్వ కాలంలో తోడసం వంశాస్థుడైన ఖమ్ము పటేల్‌కు రాత్రి వేళ కలలో ఖాందేవుడు ప్రత్యక్షమై గ్రామమంత సుఖసంతోషాలతో ఉండాలంటే నీ వ్యవసాయ భూమిలో నేను కొలువయ్యాయని తనను కొలవాలని పేర్కొన్నాడని.. నాటి నుంచి ఏటా పుష్య పౌర్ణమితో ఖాందేవును తొడసం వంశీయులు కొలుస్తున్నారు. ఈ జాతర ముగింపుతో ఇక్కడికి వచ్చిన ఆదివాసీలు నాగోబా జాతర కేస్లాపూర్‌కు తరలివెళ్తారు. బుడుందేవ్ జాతర నాగోబా జాతర ముగింపు మరుసటి రోజు ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్ జాతరను మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలతో ప్రారంభిస్తారు. పది రోజుల పాటు నిర్వహిస్తారు. పూర్వకాలంలో గౌరాపూర్ అనే గ్రామంలో ఉన్న ఆవుల మందలో ఉన్న ఆంబోతు(ఎద్దు) పశువుల మంద నుంచి తప్పించుకొని శ్యాంపూర్ ప్రాంతంలో ఉన్న పంట చేలల్లో పడి పంట నాశనం చేయడంతో ఆగ్రహించిన కొత్వాల్‌లు వారి వద్ద ఉన్న ఆయుధంతో ఆంబోతును సంహరించారని మృతి చెందిన ఆంబోతును దూర ప్రాంతంలో పారేయడానికి వెళ్తుండగా అక్కడే బండరాయిగా మారి బుడుందేవ్‌గా అవతరించిందని పూర్వీకుల కథనం. మహాదేవ్ జాతర శ్యాంపూర్‌లో బుడుందూవ్ జాతర ముగింపుతో సిర్పూర్(యు) మండల కేంద్రంలో మహాదేవ్ జాతర ప్రారంభమవుతోంది. ఆత్రం వంశీయులు ప్రత్యేక పూజలతో మహాదేవ్‌ను కొలిచి ప్రారంభించే జాతర పదిహేను రోజులపాటు సాగుతుంది. అంతేకాకుండా మండలంలోని లింగాపూర్‌లో జగదాంబ జాతరను బంజారాలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహిస్తారు. జంగుబాయి జాతర శార్దూల వాహిని దుర్గమాత ప్రతి రూపమే జంగుబాయి అని ఆదివాసీల నమ్మకం. ఏటా పుష్య మాసంలో నెల రోజుల పాటు ఆదివాసీలు అత్యంత నియమనిష్టలతో జంగుబాయిని కొలుస్తారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు కెరమెరి మండలం పరందోళి గ్రామం సమీపంలో గల శంకర్‌లొద్ది అటవీ ప్రాంతంలో జంగుబాయి కొలువై ఉన్న ఈ ప్రదేశమంతా పదుల సంఖ్యలో దేవతలున్నాయని పూర్వకాలం నుంచి ప్రచారంలో ఉంది. జంగుబాయి దేవతను ఆదివాసీలోని ఆరు తెగలకు చెందిన వంశస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ పూజలకు జిల్లా, ఏజెన్సీ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీగా ఆదివాసీలు, ఇతరులు తరలివెళ్తారు. నెలనెలా పండుగలే ఆదివాసీ గిరిజనులు సంవత్సర కాలంలో నిర్వహించుకునే పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. చైత్రమాసం(ఏప్రిల్)లో చెంచు భీమన్న మెర్మి పండుగతో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. వైశాఖ(మే)లో పెర్సాపెన్ పూజలు చేస్తారు. జ్యేష్ఠ మాసం(జూన్)లో విదిరి మొహుతుక్ పండుగతో ఆకి దేవర వద్ద జొన్నలతో నైవేద్యం సమర్పిస్తారు. ఆషాడం(జులై)లో ఆకిపెన్ పండుగతో పంట చేలల్లో కలుపుతీత పనులు ప్రారంభించడంతో పాటు పంటల దిగుబడులు పెరగాలని పచ్చదనం సంతరించుకున్న అడవి తల్లి చల్లంగా చూడాలని వేడుకుంటారు. శ్రావణం(ఆగస్టు)లో బంజారాలు తీజ్ పండుగ, ఆదివాసీలు శ్రావణమాసం చివరలో పొలాల పండుగ, జాగేయ్ మాతరీ జాగేయ్ పండుగలు నిర్వహిస్తారు. భాద్రపద(సెప్టెంబర్)లో పెత్రమాస(పెద్దల పండుగ), అశ్వీయుజ(అక్టోబర్)లో దండారీ, మృ గశిర(డిసెంబర్)లో కొత్త పంటలు ఇంటికి వచ్చే సందర్భంగా సెట్టి పండుగ జరుపుకుంటారు. ఇవే కాకుండా కాలాన్ని బట్టి దురాడి, మరుగోళ్ల ఉత్సవం, దాటుడి పండుగలతో పాటు దసరా, దీపావళీ, ఉగాది, హోలీ తదితర పండుగలను ఘనంగా చేస్తారు. దండారీ సంబురం గోండులు దీపావళీ సందర్భంగా జరుపుకునే దండారీ పండుగ అతి ప్రధానమైనది. అకాడి నుంచి మొదలై దీపావళీ తరువాత రెండు రోజులకు బొడుగ పండుగతో దండారీ ఉత్సవాలు ముగిస్తారు. దండారీ ఉత్సవాల్లో భాగంగా గోండులు ఆషాడ మాసం లేదా దసరా తర్వాతి రోజుల్లో అకాడి పెన్ దేవతకు పూజలు నిర్వహించి దండారీ ఉత్సవాలు ప్రారంభిస్తారు. దండారీలో ఆటపాటలకు ఉపయోగించే పర్రా, వెట్టె, తుడుం, డప్పు, పెప్ప్రి తదితర సంగీత పరికరాలను, నెమలి ఈకలతో కుంచెం కట్టిన గుస్సాడీ కిరీటాలను, ఇతర వస్తు సామగ్రిని గూడెం గ్రామ పటేల్ ఇంటి ముందు పేర్చి సంప్రదాయ రీతిలో పూజలు జరుపుతారు. ఈ నృత్యాల్లో గుస్సాడీ, చచ్చొయి-చాహోయి, థింసా, గుమ్మెలాట ప్రధానమైనవి. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమ నిష్టలతో ఉంటారు. బంజారాల బతుకమ్మ తీజ్ లంబాడీలు(బంజారాలు) నిర్వహించే ఉత్సవాల్లో తీజ్ అతి ముఖ్యమైనది. రాఖీపౌర్ణమి నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు గిరిజన తండాల్లో పెళ్లి కాని యువతులు నిర్వహించే తీజ్‌ను బంజారాల బతుకమ్మ పండుగ అనవచ్చు. రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలను పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతీ ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్టమన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు చల్లుతారు. రోజూ పూజలు నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు. పూర్వ కాలంలో తీవ్ర కరువు కాటకాలు వచ్చినప్పుడు గిరిజన పెద్దలు(నాయక్)లు తమ ఆరాధ్య దైవమైన జగదాంబ మాతను వేడుకోగా ఏటా శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు నిర్వహించాలని సూచించిందని చెప్తారు. కాగా, తీజ్ అంటే పచ్చదనం. -
మా బతుకు గోదారేనా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అడవిని నమ్ముకున్న ఆదివాసీ గిరిజనులకు పెద్ద ఆపదే వచ్చింది. ఆధునిక ప్రపంచంతో అంతగా సంబంధం లేని ఏజెన్సీ గిరిజనుల ‘పోడు’ జీవితానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందన్న వార్తలు ఇప్పుడు జిల్లా గిరిపుత్రుల్లో అలజడిని రేపుతున్నాయి. సంస్కృతి, సాంప్రదాయాల పరంగా దశాబ్దాల తరబడి తెలంగాణతో ముడిపడి ఉన్న బంధంతో పాటు పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవించే వీరిని.. పరిహారం చెల్లించి వేరే ప్రాంతానికి వెళ్లాలంటుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని తమకు సీతమ్మ కష్టాలు వచ్చాయని వారు వాపోతున్నారు. ముంపు పేరుతో తమను ఆంధ్రకు తరలించినా, తాము అక్కడ ఉండలే మని, ఈ ప్రాంతంలోని చెట్టూ, పుట్టాతో తరతరాలుగా అనుబంధం ఉందని, తెలంగాణను విడిచి వెళ్లలేమని వారు తెగేసి చెపుతున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఓటెక్కడేయాలి బాబూ...! సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏడు మండలాల ప్రజలను సీమాంధ్రలో కలపాల్సి వస్తుండడంతో వారు ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. కుక్కునూరు, వేలే రుపాడు, బూర్గంపాడు మండలాలు ఓ వైపు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు మరోవైపు ముంపునకు గురవుతాయి. వీటిని ఆంధ్ర ప్రాంతంలో కలిపితే జిల్లా భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. ప్రస్తుతం 46 మండలాలు ఉండగా.. ఆ సంఖ్య 42కు తగ్గిపోతుంది. మూడు మండలాల్లో సగం గ్రామాలు ఆంధ్రలో, సగం తెలంగాణలో ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలలో సీమాంధ్రలో కలిసే గిరిజనులు ఓటుహక్కు ఎక్కడ వినియోగించుకుంటారనేది తేలడం లేదు. ప్రస్తుతానికి యథాతథంగా అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక అసెం బ్లీ, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలోనే వారి ఓట్లుంటాయని చెపుతున్నా, తర్వాతయినా వారిని ఎక్కడకు పంపుతారనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే ఓ టు హక్కు తెలంగాణలో ఉండి ప్రజలు సీ మాంధ్రలో ఉంటే వారి సమస్యల పరిష్కారం రెంటికీ చెడ్డ రేవడే అవుతుంది. అసలు ఆ ఎమ్మెల్యేలు ఏ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలన్నది కూడా సమస్య కానుంది. ఈ పరిస్థితుల్లో వా రి అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించే అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ ఓటు హ క్కు విషయంలో పార్లమెంటులో బిల్లు పెట్టేంతవరకు ఏదీ ఊహించలేమని, అప్పుడే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తుందని చెపుతున్నారు. రహదారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు... సీమాంధ్రకు న్యాయం చేయాలనే వాదనలో భాగంగా భద్రాచలం డివిజన్‌ను ఆ ప్రాంతంలో కలిపితే.. తమకు అష్టకష్టాలు తప్పవని గిరిజనులు అంటున్నారు. ఎందుకంటే గోదావరి నది ఇవతల కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలో ఐదు రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తాయి. ఇవన్నీ పాల్వంచ డివిజన్లో ఉంటాయి. ఇప్పుడు సీమాంధ్రలో కలిస్తే అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రి వెళ్లడానికి వీరు కనీసం 130 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక గోదావరి అవతల వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగా చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. అవి భద్రాచలం డివిజన్లోనికి వస్తాయి. రాష్ట్రం విడిపోయి సీమాంధ్రలో కలిస్తే వీరంతా విశాఖపట్నం లేదా కాకినాడ వెళ్లాలి. కాకినాడ వెళ్లాలంటే ఘాట్ రోడ్డులో 200 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి ఉంటుంది. విశాఖపట్నం అయితే 300 కిలోమీటర్లు వెళ్లాలి. ఎటు వెళ్లాలన్నా ఒక పూటంతా ప్రయాణం చేయాల్సిందే. విద్య, వైద్యం, ఇతర సౌకర్యాల కోసం సింగిల్రోడ్డులో అంతదూరం వెళ్లి రావడం ఎంత కష్టమో చెప్పలేని పరిస్థితి. జిల్లా కేంద్రం మధ్యలో ఏర్పాటు చేస్తే (రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో) వారికి తిప్పలు తప్పినట్లే. ఇక, ముంపు పేరుతో సీమాంధ్రలో కలిపే సుమారు 1.6 లక్షల మందిని ఏ నియోజకవర్గంలో ఎలా కలుపుతారన్నది అంతుపట్టడం లేదు. వాస్తవానికి అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాలను కలపాలన్నా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీనిని ఎలా పరిష్కరిస్తారన్నది కూడా ఇబ్బందిగా మారనుంది. పరిహారం ‘ఏం’ చేస్తారు? ఇక, పోలవరం ముంపునకు గురయ్యే వారికి ప్రభుత్వం చెల్లించే పరిహారం కూడా ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతంలో నిర్ధారించిన విధంగా అందరికీ పరిహారం చెల్లించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి రూ.1.40 లక్షలు, ఆంధ్రప్రాంతంలో ముంపునకు గురవుతున్న వారికి రూ. 3.50 లక్షల చొప్పున కొందరికి మాత్రమే చెల్లించారు. ఇందుకు రిజిష్ట్రేషన్ విలువలు, భూసారం, మార్కెట్ ధర, రెండు పంటలు, మూడు పంటలు లాంటి సాకులు చూపారు. ఇంకా చాలా మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తారా? పాత అగ్రిమెంట్ మేరకు వెళతారా అన్నది స్థానిక గిరిజనుల్లో చర్చనీయాంశమవుతోంది. నూతన చట్టం ప్రకారం ఇచ్చినా ఆరేడు లక్షలకు మించి రావు. ఈ నేపథ్యంలో తాము పరిహారం తీసుకుని వెళ్లిపోతే వారిచ్చే డబ్బుతో ఆంధ్ర ప్రాంతంలో అర ఎకరం కూడా కొనలేమని స్థానిక గిరిజనులంటున్నారు. పోడు వ్యవసాయం చేసుకునే తమకు ఆ డబ్బు దేనికి సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాల మధ్యలోని అటవీ భూములను పోడు చేసుకుని జీవించేందుకు సిద్ధంగా ఉన్నామే తప్ప ఆంధ్రకు వెళ్లే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్రకు వెళితే పరిహారం చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా ఇక్కడి గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ఓటు హక్కుతో సహా పూర్తిగా ఆ ప్రాంతంలో కలుపుకోకుండా తమను సీమాంధ్ర ప్రాంతం కింద గుర్తిస్తే అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలకు తాము రెంటికీ చెడ్డ రే వడిలా మారుతామని వాపోతున్నారు. అసలు తమకు పరిహారం ఇప్పించేందుకు ఎవరు పోరాడుతారు.. తమను ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వీరికి సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.