గాంధీభవన్ వద్ద ఆందోళన చేస్తున్న కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు
సాక్షి, హైదరాబాద్: పోడు వ్యవసాయం చేసుకుంటున్న మహిళా రైతులను అక్ర మంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని నిర సిస్తూ కిసాన్ కాంగ్రెస్ నిర్వహించిన వ్యవ సాయ కమిషనరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. సోమవారం ఉదయం గాంధీ భవన్‌లో సమావేశమైన టీపీసీసీ కిసాన్ సెల్ నేతలు అక్కడి నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ లోని వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయానికి బయలుదేరారు.
వీరిని గాంధీభవన్ గేటు ముందే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కిసాన్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపు లాటలో టీపీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి కింద పడిపోయారు. అయినా, ఆయన్ను బలవంతంగా అదుపులోనికి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించ డంతో కిసాన్ కాంగ్రెస్ నేతలు అడ్డుకు న్నారు. అన్వేశ్‌రెడ్డిని వదిలిపెట్టిన పోలీసులు, మిగిలిన వారిని అదుపులోకి తీసుకు న్నారు. కొందరిని మాత్రమే కమిషనరేట్‌కు వెళ్లేందుకు అనుమతించడంతో... కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం వెళ్లి వినతిపత్రం అందజేసింది.
రైతుల రక్తాన్ని తాగుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల రక్తాన్ని తాగుతోం దని టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకేట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. పోడు వ్యవసా యం చేసుకుంటున్న మహిళా రైతులను అరెస్టు చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం అన్యాయమని, వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలిం గ్‌ను అడ్డుకున్నందుకు గాను రైతులను నిర్బంధించి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ ఏర్పాటయ్యాక మొత్తం 8వేల మంది ఆత్మహత్యలు చేసుకు న్నారని ఆయన తెలిపారు. ఆత్మహత్య చేసు కున్న రైతు కుటుంబాలకు జీవో 194 ప్రకా రం పరిహారం చెల్లించాలని, అన్నదాతల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతు కమి షన్‌ను ఏర్పాటు చేయాలని, రైతులకు సబ్సిడీ మీద నాణ్యమైన విత్తనాలను అంద జేయాలని, రైతు బీమాతో పాటు పంటల బీమాను అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment