poltical crisis
-
రజనీ రాజకీయాల్లోకి వచ్చినా వేస్ట్: సోదరుడు సత్యనారాయణ రావు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ మధ్య రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించి తర్వాత వెనక్కి తగిన విషయం తెలిసిందే. దానికి ఆరోగ్యం సహకరించడం లేదనే కారణాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ, అప్పటి నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం జైలర్‌తో పాటు తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్రలోనూ నటిస్తున్నారు. ఇవి గాక మరో రెండు చిత్రాలకూ పచ్చజెండా ఊపేశారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా ఉపయోగం లేదని స్వయానా ఆయన సోదరుడు సత్యనారాయణ రావు పేర్కొనడం విశేషం. ఇందుకు కారణాన్ని కూడా వివరించారు. రజనీకాంత్ ఇకపై రాజకీయాల్లోకి రావాలని, వచ్చినా ప్రయోజనం ఏమీ లేదనీ వ్యాఖ్యానించారు. కారణం ఆయన వయస్సు ఏడు పదులు దాటడమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఆయన ఎవరికీ మద్దతు పలికే అవకాశం లేదని స్పష్టం చేశారు. దేవుని దయ వల్ల ఆయన సుదీర్ఘ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సోదరుడు సత్యనారాయణ ఆకాంక్షించారు. సోమవారం తిరుచెందూర్ కుమారస్వామి ఆలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రజినీకాంత్ నటిస్తున్న జైలర్, లాల్ సలాం చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్‌ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్‌ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
రాజపక్స అధికారం చెల్లదు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా నియమించిన మహిందా రాజపక్స అధికారం చెలాయించడం కుదరదని శ్రీలంక కోర్టు సోమవారం తేల్చిచెప్పింది. రాజపక్స కేబినెట్ మంత్రులూ విధులు నిర్వర్తించరాదంది. మైత్రిపాల వివాదాస్పద నిర్ణయాన్ని సవాలు చేస్తూ 122 మంది పార్లమెంట్ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12, 13న చేపడతామని తెలిపింది. అనర్హులు ప్రధాని, మంత్రులుగా ఉంటే భర్తీ చేయలేనంత నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజపక్స ప్రధాని పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ, జనతా విముక్తి పేరమునా(జేవీపీ), తమిళ్ నేషనల్ అలియన్జ్ పార్టీలు గత నెలలో కోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని విక్రమసింఘె చెప్పారు. అక్టోబర్ 26న రణిల్ విక్రమ్‌సింఘేను తొలగించిన సిరిసేన ఆ పదవిని మహిందా రాజపక్సకు కట్టబెట్టడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల్ని మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని రాజపక్స ప్రకటించారు. కేబినెట్‌ను సస్పెండ్ చేయడం సరికాదని, రాజ్యాంగపర విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకే ఉందని పేర్కొన్నారు. ముగింపు దిశగా సంక్షోభం సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ను రద్దుచేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఈ కేసు తుది విచారణకు రానుంది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న సిరిసేన అంతకు ముందే పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నారని ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. -
చచ్చామనుకున్నాం : శ్రీలంక మాజీ క్రికెటర్
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: విక్రమ సింఘేనే ప్రధాని శ్రీలంక పార్లమెంటు రద్దు -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది. అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి.. శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది. భారత్‌కు ఆందోళనకరమే రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది. దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది. 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘మాల్దీవుల’పై మోదీ మంతనాలు
వాషింగ్టన్: మాల్దీవుల అంతర్గత సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. ఇరువురి నేతల మధ్య అఫ్గానిస్తాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితి, రోహింగ్యాల అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు వైట్‌హౌజ్ తెలిపింది. మాల్దీవుల్లో అత్యయిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేసిన ట్రంప్, మోదీ..అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థల పునరుద్ధరణ, పౌర హక్కుల పరిరక్షణ ప్రాధాన్యతపై చర్చించారని శ్వేతసౌధం పేర్కొంది. ట్రంప్ దక్షిణాసియా విధానానికి అనుగుణంగా అఫ్గానిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ వలసొచ్చిన రోహింగ్యా ముస్లింల దుస్థితిపై చర్చించారు. ఉత్తరకొరియా అణు పరీక్షల అంశమూ చర్చకొచ్చింది. ఏప్రిల్‌లో జరగాల్సిన ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్‌తో మరో సమస్య కాకూడదు: చైనా మాల్దీవుల సంక్షోభ పరిష్కారానికి భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని చైనా పేర్కొంది. భారత్‌తో తమ సంబంధాల్లో ఈ వ్యవహారం మరో సమస్యగా మారాలని కోరుకోవడం లేదని స్పష్టం చేసింది.మాల్దీవుల సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించి తదనుగుణంగా మసలుకోవాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ శుక్రవారం సూచించారు. మాల్దీవుల్లో మోహరించడానికి భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయన్న వార్తలపై స్పందిస్తూ..ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకపోవడం అంతర్జాతీయ సంబంధాల్లో ముఖ్య సూత్రమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, మాల్దీవుల్లో పరిస్థితి మరింత క్షీణించే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. -
పాక్, చైనాలకు మాల్దీవుల దూతలు
మాలె: మాల్దీవుల అంతర్గత సంక్షోభ పరిష్కారానికి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ పాకిస్తాన్, చైనా, సౌదీ అరేబియాలకు ప్రత్యేక దూతలను పంపారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా తీరికలేని షెడ్యూల్ కారణంగా తమ ప్రతినిధి ఇక్కడికి రావడం లేదని ఢిల్లీలో మాల్దీవుల రాయబారి వెల్లడించారు. తమ దేశంలోని పరిస్థితులను వివరించేందుకు మాల్దీవుల ఆర్థికాభివృద్ధి మంత్రి మహ్మద్ సయీద్ చైనాకు, విదేశాంగ మంత్రి మహ్మద్ ఆసిమ్ పాకిస్తాన్‌కు, వ్యవసాయ మంత్రి మహ్మద్ షైనీ సౌదీ అరేబియాకు వెళ్లారు. ఢిల్లీలో మాల్దీవుల రాయబారి అహ్మద్ మహ్మద్ గురువారం స్పందిస్తూ..తమ ప్రతినిధి పర్యటనకు తొలుత భారత్‌నే ఎంచుకున్నామని కానీ, ఈ వారంలో మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాలు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండబోతుండటం వల్లే విరమించుకున్నామని తెలిపారు. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యంపై భారత్ వెలిబుచ్చిన ఆందోళనలపై ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎవరైనా ప్రతినిధిని పంపే ముందు ప్రత్యేక ప్రొటోకాల్ ఉంటుందని, తమ ప్రతినిధి ఎందుకు రాబోతున్నారో భారత్‌కు మాల్దీవులు తెలియజేయలేదని వెల్లడించాయి. -
వచ్చేవారం కశ్మీర్‌కు రామ్ మాధవ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ అనిశ్చితి తెరదించేందుకు బీజేపీ అధిష్టానం ఓ అడుగు ముందుకేసింది. ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీతో చర్చించేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వచ్చేవారం జమ్మూ వెళ్లనున్నారు. కశ్మీర్లో గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-పీడీపీ మధ్య సయోధ్య కుదర్చటంలో మాధవ్ కీలకంగా వ్యవహరించారు.