polyhouse
-
నారు పెంచడం ద్వారా ఉపాధి పొందుతున్న యువరైతు
-
పాలీహౌస్‌లపై నీలినీడలు!
సాక్షి, గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన పంటలు పత్తి, మొక్కజొన్న, వరికి ధీటుగా కురగాయలు సాగవుతున్నాయి. ఆయా జిల్లాలో పరిధిలో మొత్తం పంటలు సుమారు 15లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తుండగా.. ఇందులో సుమారు 4లక్షల ఎకరాలకుపైగా పలు రకాల కురగాయల పంటలు సాగులో ఉండటం వల్ల ఉమ్మడి జిల్లాలో ‘వెజిటటుల్ హబ్’ ఆవిర్భవించింది. ప్రత్యేకించి గజ్వేల్, పటాన్చెరు, సిద్దిపేట, నర్సాపూర్, మెదక్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో కురగాయలు విస్తారంగా సాగులో ఉన్నాయి. శ్రమను నమ్ముకొని జీవించే కురగాయల రైతులకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏ యేటికాయేడు కుంగదీస్తున్నాయి. నష్టాల బారిన పడిన రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలో కురగాయల రైతులకు లాభాల పంట పండించడానికి ‘పాలీహౌస్’ ప్రభుత్వం తరుణోపాయంగా భావించి అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఎకరాకు 75శాతం సబ్సిడీ కింద రూ.39 లక్షలను ప్రభుత్వం అందజేయనున్నది. రైతు తన వాటా కింద రూ.8.44లక్షలు చెల్లిస్తే చాలు...‘పాలీహౌస్’కు సంబంధించి అన్ని రకాల పరికరాలను పొలంలో బిగిస్తారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పథకం ఆశించిన విధంగా అమలు కాలేదు. 2014–15, 2015–16, 2016–17 ఏడాదిలకు సంబంధించిన కేవలం 200 ఎకరాలకు మాత్రమే పథకాన్ని వర్తింపజేయగలిగారు. పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలోనే 250 ఎకరాల్లో రైతులకు పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులను అదేశించింది. కానీ ఈ టార్గెట్‌ను మూడేళ్లల్లో కూడా సాధించలేకపోయారు. పలువురు రైతులకు మంజూరు పత్రాలు వచ్చినా.. నిధులు విడుదల కాక కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు. నిధుల కొరత వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఇకముందు పథకం అమలుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ‘వెజిటబుల్ హబ్’నే విస్మరిస్తే ఎలా...? రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా విస్తారమైన కురగాయల సాగుతో ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న కురగాయలు హైదరాబాద్ నగరానికే కాకుండా ఢిల్లీ, కలకత్తా, చంద్లాపూర్, బెంగుళూర్ లాంటి ప్రధాన నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క రోజు ఇక్కడి నుంచి కురగాయలు వెళ్లపోతే దేశంలోని ప్రధాన కురగాయల మార్కెట్లన్నీ అల్లాడే పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం రైతులకు అభ్యున్నతి దోహదపడే ‘పాలీహౌస్’ పథకానికి నిధులు బంద్ చేసి.. ఎత్తివేయడానికి ప్రయత్నించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కురగాయల సాగు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనైనా ఈ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయాలని రైతులు కోరుంటున్నారు. -
‘లాబ్’తో నారు.. లాభాల జోరు!
ఈ అభ్యుదయ రైతు పేరు గుదేటి సుబ్బారెడ్డి (43). గుంటూరు జిల్లా చుండూరులో మూడేళ్ల క్రితం అరెకరం పాలీహౌస్ నిర్మించి బంతి నారు పెంచి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. 18–24 రోజులు పెంచి.. ఏడాదికి 10 బ్యాచ్‌ల బంతి నారును బెంగళూరు తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. గతంలో రసాయనిక ఎరువులు వాడే వారు. న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివశంకర్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా(లాబ్)ను పరిచయం చేసిన తర్వాత మెరుగైన ఫలితాలు పొందుతున్నాడు.అర లీటరు లాబ్ ద్రావణాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి టన్ను కొబ్బరిపొట్టుపై చల్లుతారు. పాలీహౌస్‌లోని ట్రేలలో కొబ్బరిపొట్టును నింపి బంతి విత్తనం వేస్తారు. 15 రోజుల మొక్కలకు చీడపీడలు సోకకుండా.. లీటరు నీటికి 3 ఎం.ఎల్. కానుగ నూనెను కలిపి ఒకసారి పిచికారీ చేస్తారు. ఏడాదికి 50 లక్షల బంతి మొక్కలను ఎగుమతి చేస్తున్నానని.. మొక్క రూ.2.50 చొప్పున అమ్ముతున్నానని సుబ్బారెడ్డి తెలిపారు. రసాయనిక ఎరువులు వాడినప్పటì తో పోల్చితే.. లాబ్ వాడకం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా పెరుగుతున్నాయి. రెండు రోజులు ముందుగానే మొక్కలు సిద్ధమవుతున్నాయి. త్వరగా మెత్తబడకుండా తాజాగా ఉంటున్నాయని, ఖర్చు కూడా పది శాతం తగ్గిందని సుబ్బారెడ్డి(99632 93921) సంతోషంగా చెప్పారు. పాలీహౌస్ పక్కనే ఎకరంన్నర నిమ్మ తోటలో కూడా లాబ్ ద్రావణాన్ని వాడుతున్నారు. నిమ్మకాయల నాణ్యత పెరిగిందని ‘సాక్షి సాగుబడి’తో ఆయన చెప్పారు. గోంగూర మొక్కలు.. గోంగూరను విత్తనం వేసి పెంచాల్సిన అవసరం లేదు. పీకిన గోంగూర మొక్కలనే మార్కెట్లో కొంటారు కదా? ఆకులను కోసుకున్న తరువాత, ఆ మొక్కలను ఇలా తిరిగి పెరట్లోనో, కుండీల్లోనో, మిద్దె తోటల్లోనో నాటుకోవచ్చు. అవసరానుగుణంగా నీరు చల్లాలి. మళ్లీ వేరూనుకొని చిగురిస్తాయి. కొంతకాలానికి తిరిగి ఆకును ఇస్తాయి. – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోట నిపుణులు -
నారు నాణ్యతే రైతుకు రొక్కం!
సాగు పద్ధతి ఏదైనప్పటికీ రైతు మంచి ఉత్పాదకత, అధిక నికరాదాయాన్ని ఆర్జించాలంటే.. విత్తనం.. ఆ విత్తనంతో తయారైన నారు కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. వైరస్ వంటి రుగ్మతల్లేని నారును సమకూర్చుకోవటం ప్రాథమిక అవసరం. ఈ అవసరాన్ని తీర్చే ఉదాత్త లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్ శివారులో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పింది. గత పది నెలలుగా లక్షలాది సంఖ్యలో పూలు, కూరగాయ పంటలకు సంబంధించి నాణ్యమైన నారును రైతులకు అందించింది. వందలాది మంది రైతులు, అధికారులు శిక్షణ పొందారు. కూరగా యలు, పూల సాగులో ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రైతులకు అందిస్తున్న అరుదైన నైపుణ్య కేంద్రంపై ప్రత్యేక కథనం.. తెలంగాణ ఉద్యాన శాఖ హైదరాబాద్ శివారులో (జీడిమెట్ల గ్రామం పైపుల రోడ్డులో) పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ పది నెలలుగా ఉద్యాన రైతులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నది. 8 పాలీహౌస్‌లు, 6 వాకింగ్ టన్నెల్స్, షేడ్‌నెట్ హౌస్‌లు ఉన్నాయి. వీటిలో జెర్బర, కార్నేషన్, ఆర్కిడ్స్ తదితర ఖరీదైన పూలు, క్యాప్సికం, టమాటో, కీరదోస, బ్రకోలి, చెర్రీ టమాటోలు, ఆకుకూరలను అత్యాధునిక రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కొన్ని పంటలను పురుగుమందులు చల్లకుండా సాగు చేస్తున్నారు. నెలకు 12 లక్షల నారు సరఫరా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన స్వయం నియంత్రిత హరితగృహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్లగ్లింగ్స్ నర్సరీ పద్ధతిలో చీడపీడలు, వైరస్ సోకకుండా అత్యాధునిక సదుపాయాల మధ్య నెల రోజులు పెంచిన నాణ్యమైన నారును రైతులకు అందిస్తున్నారు. రసాయనిక/సేంద్రియ పద్ధతుల్లో లేదా పాలీహౌస్‌లు/షేడ్‌నెట్ హౌస్‌లు, సాధారణ పొలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఈ నారును తీసుకెళ్తు్తన్నారు. నెలకు 12 లక్షల నారును అందించే సామర్థ్యం ఉంది. దీన్ని 15 లక్షలకు పెంచే సన్నాహాలు చేస్తున్నారు. ముందే చెల్లించాలి ఈ హైటెక్ ఆటోమేటెడ్ గ్రీన్హౌస్లో పెంచిన నారును రెండు పద్ధతుల్లో రైతులకు అందిస్తున్నారు. క్యాప్సికం, బంతి, టమాటో పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు తెచ్చి ఇచ్చి, మొక్కకు 60 పైసల చొప్పున సర్వీసు చార్జిగా చెల్లిస్తే.. నెల రోజులు పెంచిన రోగరహితమైన నాణ్యమైన నారును సరఫరా చేస్తారు. సేంద్రియ, రసాయనిక సేద్యం చేసే రైతులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణ రకాల నారు కావాలనుకునే రైతులు విత్తనాలు తెచ్చి ఇవ్వనవసరం లేదు. మొక్కకు 75 పైసల చొప్పున డబ్బు చెల్లించి తమకు కావాల్సిన రకం నారును నెల రోజుల తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి వచ్చి తీసుకెళ్లవచ్చు. టమాటో, వంగ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యాప్సికం, కాకర, బీర తదితర కూరగాయ పంటలకు సంబంధించిన మేలైన నారు మొక్కలను రైతులు పొందడానికి అవకాశం ఉంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్ హౌస్‌లలోనే కాదు.. ఆరుబయట పొలాల్లో పంటలు సాగు చేసే రైతులు సైతం ఈ మొక్కలను వాడుతుండటం విశేషం. వేస్ట్ డీకంపోజర్‌తో నులిపురుగులకు చెక్! కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం రూపొందించిన వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పంటలకు వాడుతున్నారు. ఈ కేంద్రంలో వంద మంది రైతులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు. మట్టి ద్వారా పంటలకు సోకే తెగుళ్లను ఇది నివారిస్తున్నదని, నులిపురుగుల (నెమటోడ్స్)ను ఇది నూటికి నూరు శాతం నివారిస్తుందని రాజ్‌కుమార్ తెలిపారు. వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుందని, వానపాముల వృద్ధికి అనువైన సూక్ష్మ వాతావరణం కల్పిస్తుందన్నారు. కూరగాయల బెడ్ తయారీలోనూ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ఉపకరిస్తోందన్నారు. ఇంటిపంటల సాగుదారులకు చేదోడు ఇళ్ల మీద సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి సైతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సేవలందిస్తున్నది. మేడలపైన సిల్పాలిన్ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటల సాగు డెమోను ఈ కేంద్రం భవనం పైన ఏర్పాటు చేశారు. గార్డెనింగ్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్యాప్సికం(మొక్క రూ.2), వంగ, టమాటో, క్యాబేజీ నారు(మొక్క రూ.2)ను, బంతి, చామంతి నారును విక్రయిస్తున్నారు. పనస, దొండ, బొప్పాయి (రెడ్‌లేడీ) మొక్కలను రూ. 20కి అమ్ముతున్నారు. కుండీలు, మట్టి+ఎరువు మిశ్రమాన్ని కూడా అందుబాటులో ఉంచారు. గాలులను తట్టుకునే షేడ్‌నెట్ హౌస్! తీవ్రమైన గాలులను సైతం తట్టుకొని నిలిచే కొత్త తరహా షేడ్‌నెట్ హౌస్‌ను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. దీని పైకప్పు సమతలంగా ఉండదు. ఎగుడు, దిగుడుగా ఉంటుంది. మధ్యలో నుంచి గాలి, వెలుతురు పారాడుతూ ఉంటాయి. ఎండ ఏటవాలుగా దీని లోపలి మొక్కల పైకి ప్రసరిస్తూ ఉంటుంది. దీనికి 50% మోనో షేడ్‌నెట్ వాడటంతోపాటు, షేడ్‌నెట్‌ను ఫ్రేమ్‌కు క్లిప్పులతో అనుసంధానం చేయటం విశేషం. ఈ సరికొత్త షేడ్‌నెట్ హౌస్‌ను జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవి పంటగా టమాటా సాగు చేయబోతున్నారు. దీంట్లో ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లలో పంటలు సాగు చేయవచ్చు. టమాటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పుచ్చ, మస్క్‌మిలన్, వంగ, కొత్తిమీర తదితర పంటలను సాగు చేయవచ్చని, నర్సరీ పెంపకానికి కూడా ఇది అనువుగా ఉంటుందని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్చార్జ్ రాజ్‌కుమార్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. చ. మీ.కు రూ. 500 వరకు ఖర్చవుతుందన్నారు. మేడలపైన ఇంటిపంటల సాగుకూ ఇది అనువైనదే! నాణ్యమైన కూరగాయ పంటల నారు రైతులకు ఇస్తాం! కూరగాయలు, పూల సాగులో తెలంగాణ రైతులను రారాజులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ప్రారంభమైన పంటల కాలనీలలో కూరగాయ పంటల రైతులకు సబ్సిడీపై ఇప్పటికే 25 లక్షల నాణ్యమైన, వైరస్ రహిత నారును అందించాం. ప్రస్తుతం నెలకు 12 లక్షల నాణ్యమైన నారును ఉత్పత్తి చేస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా 15 లక్షలకు పెంచబోతున్నాం. మంచి కూరగాయ పంటల నారు కావాలనుకున్న రైతులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా డబ్బు చెల్లించిన రైతులకు నెల రోజుల్లో నాణ్యమైన నారు అందిస్తున్నాం. సబ్సిడీపై నారు కావాల్సిన పంటల కాలనీల రైతులు అధికారుల ద్వారా లేఖ రాయించాలి. – గాజుల రాజ్‌కుమార్, ఇన్చార్జ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు coejeedimetlahyd@gmail.com – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: కె.రమేశ్, సీనియర్ ఫొటో జర్నలిస్టు -
హరిత గృహాలు లాభదాయకం
- ‘అనంత’కు అనుకూలం – ఏడీహెచ్ సత్యనారాయణ, రుక్జ్వాన్ పీడీఎం వేణుగోపాలరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : పాలీహౌస్, గ్రీన్హౌస్, షేడ్‌నెట్స్ లాంటి హరిత గృహాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల సాగు లాభదాయకమని ఉద్యానశాఖ ఏడీ–1 సీహెచ్ సత్యనారాయణ తెలిపారు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నప్పటికీ రైతులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్నారు. ప్రాంతీయ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయనతోపాటు బెంగళూరులో ఉన్న రుక్జ్వాన్ కంపెనీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (పీడీఎం) వేణుగోపాలరెడ్డి, కంపెనీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు. హరిత గృహాల ద్వారా రక్షిత సేద్యం ‘అనంత’ అనువైన ప్రాంతమన్నారు. హరిత గృహాల్లో పంటల సాగు పాలీహౌస్, గ్రీన్హౌస్, షేడ్‌నెట్స్ కింద కలర్ క్యాప్సికం, దోస, కర్భూజా, కళింగర, గ్రీన్ కుకుంబర్, టమోటా, వంగ, మిరప, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్, జర్బేరా లాంటి పూల సాగు చేసుకోవచ్చు. మరికొన్ని పండ్లు, ఔషధ మొక్కలు పెంచవచ్చు. ఎకరా పాలీహౌస్ నిర్మాణానికి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో ఉద్యానశాఖ 50 శాతం సబ్సిడీ వర్తింపజేస్తుంది. నిర్మాణానికి ముందు మట్టి, నీటి పరీక్షలతో పాటు నులిపురుగులు, శిలీంధ్రనాశినిల గురించి తెలుసుకునేందుకు సాయిల్ అనాలసిస్ చేయించుకోవాలి. భూమిలో సహజంగా ఉన్న పోషకపదార్థాలు తెలుసుకుని పంటకు అవసరమైన ఇతరత్రా ఎరువులతో యాజమాన్య చర్యలు చేపట్టాలి. వేసవి మినహాయించి మిగిలిన కాలాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పంట దిగుబడులు పొందవచ్చు. బిందు, మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీరు కట్టడం చాలా అనుకూలం. మొక్కలకు నీటితో పాటు, ఎరువులను, సూక్ష్మపోషక పదార్థాలను సులభంగా అందించవచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రెండేళ్లలో పెట్టిన పెట్టుబడులు తప్పకుండా చేతికివస్తాయి. మూడో సంవత్సరం నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ------------------------------------------------ పాలీహౌస్లో పంటల వారీగా వాతావరణ నియంత్రణ వివరాలు. పంట పగటి ఉష్ణోగ్రత (డిగ్రీలు) రాత్రి ఉష్ణోగ్రత (డిగ్రీలు) గాలిలో తేమ శాతము --------------------------------------------------------------------------------------------------- కూరగాయలు/పండ్లు 22–30 16–20 60–65 సిమ్లా మిర్చి 22–24 18–20 70–75 వంగ 22–28 18–22 50–65 దోస 20–26 18–20 70–90 ఖర్బూజ 20–26 18–20 70–75 పుచ్చకాయ 21–25 16–18 70–80 సమ్మర్ స్క్వాష్ 20–26 16–18 70–75 లెట్యూస్ 21–24 18–20 65–70 స్ట్రాబెర్రీ 21–23 17–19 60–65 చేమంతి 18–22 16–17 68–70 గులాబి 21–28 16–17 60–62 కార్నేషన్ 16–20 12–13 70–72 జెర్బెరా 20–25 13–15 65–70 గ్లాడియోలస్ 16–20 10–12 70–75 -
పాలీహౌస్ను ప్రారంభించిన మంత్రి
మహేశ్వరం(రంగారెడ్డి): ఓ రైతుకు చెందిన పాలీ హౌస్‌ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలం పరిధిలోని మంకాల గ్రామంలో నిర్మంచిన పాలీ హౌస్‌ను సొంత జిల్లా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు.