హరిత గృహాలు లాభదాయకం | agriculture story | Sakshi
Sakshi News home page

హరిత గృహాలు లాభదాయకం

Published Wed, Jan 18 2017 9:55 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

హరిత గృహాలు లాభదాయకం - Sakshi

హరిత గృహాలు లాభదాయకం

- ‘అనంత’కు అనుకూలం
– ఏడీహెచ్‌ సత్యనారాయణ, రుక్‌జ్వాన్‌ పీడీఎం వేణుగోపాలరెడ్డి


అనంతపురం అగ్రికల్చర్‌ : పాలీహౌస్, గ్రీన్‌హౌస్, షేడ్‌నెట్స్‌ లాంటి హరిత గృహాల ద్వారా పండ్లు, కూరగాయలు, పూల సాగు లాభదాయకమని ఉద్యానశాఖ ఏడీ–1 సీహెచ్‌ సత్యనారాయణ తెలిపారు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నప్పటికీ రైతులకు పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయన్నారు.   ప్రాంతీయ ఉద్యాన శిక్షణ  కేంద్రంలో రైతులకు నిర్వహించిన శిక్షణ  కార్యక్రమంలో ఆయనతోపాటు బెంగళూరులో ఉన్న రుక్‌జ్వాన్‌ కంపెనీ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ (పీడీఎం) వేణుగోపాలరెడ్డి, కంపెనీ ప్రతినిధులు రైతులకు అవగాహన కల్పించారు.  హరిత గృహాల ద్వారా రక్షిత సేద్యం ‘అనంత’ అనువైన ప్రాంతమన్నారు.
 
హరిత గృహాల్లో పంటల సాగు
పాలీహౌస్, గ్రీన్‌హౌస్, షేడ్‌నెట్స్‌ కింద కలర్‌ క్యాప్సికం, దోస, కర్భూజా, కళింగర, గ్రీన్‌ కుకుంబర్, టమోటా, వంగ, మిరప, క్యాబేజీ, బీన్స్, కాలీఫ్లవర్, జర్బేరా లాంటి పూల సాగు చేసుకోవచ్చు. మరికొన్ని పండ్లు, ఔషధ మొక్కలు పెంచవచ్చు. ఎకరా పాలీహౌస్‌ నిర్మాణానికి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అందులో ఉద్యానశాఖ 50 శాతం సబ్సిడీ వర్తింపజేస్తుంది. నిర్మాణానికి ముందు మట్టి, నీటి పరీక్షలతో పాటు నులిపురుగులు, శిలీంధ్రనాశినిల గురించి తెలుసుకునేందుకు సాయిల్‌   అనాలసిస్‌ చేయించుకోవాలి. భూమిలో సహజంగా ఉన్న పోషకపదార్థాలు తెలుసుకుని పంటకు అవసరమైన ఇతరత్రా ఎరువులతో యాజమాన్య చర్యలు చేపట్టాలి. వేసవి మినహాయించి మిగిలిన కాలాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువ పంట దిగుబడులు పొందవచ్చు. బిందు, మినీ స్ప్రింక్లర్ల ద్వారా నీరు కట్టడం చాలా అనుకూలం. మొక్కలకు నీటితో పాటు, ఎరువులను, సూక్ష్మపోషక పదార్థాలను సులభంగా అందించవచ్చు. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే రెండేళ్లలో పెట్టిన పెట్టుబడులు తప్పకుండా చేతికివస్తాయి. మూడో సంవత్సరం నుంచి మంచి ఆదాయం లభిస్తుంది.
 ------------------------------------------------
పాలీహౌస్‌లో పంటల వారీగా వాతావరణ నియంత్రణ వివరాలు.
పంట        పగటి ఉష్ణోగ్రత (డిగ్రీలు)    రాత్రి ఉష్ణోగ్రత (డిగ్రీలు)    గాలిలో తేమ  శాతము    ---------------------------------------------------------------------------------------------------    
కూరగాయలు/పండ్లు    22–30            16–20        60–65    
సిమ్లా మిర్చి        22–24            18–20        70–75    
వంగ            22–28            18–22        50–65    
దోస            20–26            18–20        70–90    
ఖర్బూజ            20–26            18–20        70–75    
పుచ్చకాయ        21–25            16–18        70–80    
సమ్మర్‌ స్క్వాష్‌        20–26            16–18        70–75    
లెట్యూస్‌            21–24            18–20        65–70    
స్ట్రాబెర్రీ            21–23            17–19        60–65     
చేమంతి            18–22            16–17        68–70    
గులాబి            21–28            16–17        60–62    
కార్నేషన్‌            16–20            12–13        70–72    
జెర్బెరా            20–25            13–15        65–70    
 గ్లాడియోలస్‌        16–20            10–12        70–75

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement