Power chages hike
-
మేము న్యూట్రల్..ఎన్డీఏ కాదు,ఇండియా కాదు: విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖపట్నం:నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం(డిసెంబర్24) మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు.మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాంరాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యంమేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయనిజమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడునిజేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుందిజేపీసీకి పార్టీ వైఖరిని వైఎస్ జగన్ స్పష్టం చేస్తారువిద్యుత్ ఛార్జీల పెంపుపై 27న నిరసనలు: గుడివాడ అమర్నాథ్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలుఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీల రూపాయి కూడా పెంచమని హామీ ఇచ్చారుఅధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారుఅధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేలకు కోట్లకు పైగా భారాన్ని మోపారువైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాంవచ్చే నెల నుంచి రూపాయిన్నర వరకు యూనిట్ పై భారం పడుతుందిఆరు నెలల కాలంలో 75 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారుసంక్షేమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదునాణ్యమైన విద్యుత్తు విద్య, వైద్యాన్ని అందిస్తామని చెప్పి నాణ్యమైన మద్యాన్ని అందజేస్తున్నారు -
ఆరు నెలల్లో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: అమర్నాథ్రెడ్డి
సాక్షి,అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం(డిసెంబర్24) రాజంపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది.ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. -
విద్యుత్ చార్జీలు పెంచితే ఉద్యమిస్తాం: రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. సోమవారం(అక్టోబర్ 28) ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికలకు ముందు ఐదు సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలు పెంచేది లేదని బాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పి నవంబర్ ఒకటవ తేదీ నుంచి విద్యుత్ చార్జీలు పెంచనున్నారు. ఎన్నికల ముందు ఒక మాట,ఇప్పుడు ఇంకో మాట సరైన పద్ధతి కాదు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రస్థాయిలో ఉద్యమిస్తుంది.విద్యుత్ చార్జీలు పెరిగితే ప్రజల జీవితాలు గాడాంధకారంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రజలు 164 సీట్లు ఇచ్చి బాబుకు ఇస్తే, బాబు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చారు. మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపనున్నారు. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పేరు చెప్పి,విద్యుత్ చార్జీల రూపంలో దండుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచి చేనేత,అమ్మ ఒడి,ఇతర సంక్షేమాలు రద్దు చేసి బాబు పాలన సాగిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారమైనా సరే రానున్న రోజుల్లో విద్యుత్ చార్జీలు పెంచకూడదు అని డిమాండ్ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు బాబు పాలనలో దాదాపు 57 వేల కోట్లు విద్యుత్ కోసం అప్పు చేశారు. కోవిడ్ కాలంలో కూడా వైఎస్ జగన్ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఎలాంటి విపత్కర పరిస్థితి లేని ఈ సమయంలో బాబు ఎందుకు విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు?వైఎస్ జగన్ హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ అందించి దాదాపు రూ. 650 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీ చెల్లించారు. మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పి మద్యం ఏరులై పారేలా చేస్తున్నారు. ఐదు సంవత్సరాలు ఇలాగే పాలన కొనసాగితే రాష్ట్ర ప్రజలు అప్పుల్లో కూరుకుపోతారు. ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించేలా పోరాడతాం. కరెంట్ ఆఫీసులను చుట్టుముడతాం,ఉద్యమం తీవ్రతరం చేస్తాం,దీక్షలకు పూనుకుంటాం’అని రాచమల్లు హెచ్చరించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఇది మీరిచ్చిన వాగ్దానామే: వైఎస్ జగన్ -
కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల అంశంపై ఈఆర్సీ వద్దకు కేటీఆర్ వెళ్ళడం ఒక పెద్ద జోక్ అని, ఆయన ఒక జోకర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం(అక్టోబర్22) మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ‘పార్లమెంట్లో ఒక్క సీటు రాకున్నా,అసెంబ్లీలో ఓడించినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును పేదవాళ్ళకు మా ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర మంత్రులు సంజయ్,కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కి ఎంత నిధులు తెచ్చారు’అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.పార్లమెంట్ సెంట్రల్‌హాల్ తరహాలో అసెంబ్లీ..‘రూ.49కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని ఆధునికీకరిస్తోంది. ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ,కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్ కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది. రెండూ ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుంది’అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. -
AP: వినియోగదారులకు భారీ ఊరట.. విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్లే..
సాక్షి, అమరావతి విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ ఊరట కలిగించాయి! వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరీలోనూ చార్జీలను పెంచాలని డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఏటా ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రావడం ఆనవాయితీ. పేదలు మినహా అన్ని వర్గాల వినియోగదారులపై ఎంతో కొంత పెంపు సాధారణంగా ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈదఫా చార్జీలు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులపై వచ్చే ఏడాది విద్యుత్ చార్జీల భారం ఉండదని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన 2023–24 వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరల ప్రతిపాదనపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ గురువారం విశాఖలో మొదలైంది. శనివారం వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు వెబ్ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు (లైవ్ స్ట్రీమింగ్) చూడవచ్చు. డిస్కమ్‌ల సీఎండీలు తమ టారిఫ్ నివేదికలో గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక విద్యుత్ వినియోగంపై చార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. కేవలం ఇంటెన్సివ్ పరిశ్రమల (ఫెర్రో అల్లాయిస్) టారిఫ్‌ను మాత్రమే మార్చాలని ఏపీఈఆర్సీని డిస్కమ్‌లు కోరాయి. హెచ్‌టీ పరిశ్రమలకు వర్తించే టారిఫ్‌నే వాటికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశాయి. ఫెర్రో పరిశ్రమలు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. అక్కడ ధరలు పెరిగినప్పుడు, వేసవిలోనూ డిస్కమ్‌ల నుంచి విద్యుత్ తీసుకుంటున్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికంగా నష్టపోతున్నట్లు సీఎండీలు మండలికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అభిప్రాయాల స్వీకరణ తొలిరోజు 20 మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభ్యంతరాలు, సూచనలను, తెలియచేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చిత్తూరు జిల్లా పాకాలకు చెందిన మునిరత్నంరెడ్డి తిరుపతిలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) సర్కిల్ కార్యాలయం నుంచి ఏపీఈఆర్సీ దృష్టికి తెచ్చారు. కుటీర పరిశ్రమలకు విద్యుత్ లోడ్ పరిమితిని 20 హెచ్‌పీ వరకు పెంచాలని కావలికి చెందిన శాంతకుమార్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా బాగుందని కడప జిల్లా నుంచి రమణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల తరహాలో బీసీలకు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వాలని పాకాల నుంచి మునుస్వామి నాయుడు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఎస్ఈ కార్యాలయం నుంచి మాట్లాడిన వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. వ్యవసాయం, గృహాలకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై భారం లేదు విద్యుత్ వినియోగదారులపై చార్జీల భారం మోపేలా డిస్కమ్‌లు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా గురువారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిస్కమ్‌లన్నీ సామాన్యులపై భారం మోపేందుకు అంగీకరించకపోవడం శుభపరిణామమన్నారు. గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులపై 2023–24లో ఎలాంటి భారం ఉండదని చెప్పారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు రాయితీలు కొనసాగిస్తూ డిమాండ్ చార్జీలు, టైమ్ ఆఫ్ ది డే, కనీస చార్జీల పెంపు అంశాల్లో మార్పులు చేయాలని డిస్కమ్‌లు కోరినట్లు తెలిపారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు. డిస్కమ్‌లకు ప్రభుత్వం నుంచి రావాలి్సన బకాయిల విషయంలో రాజకీయ ఆరోపణలన్నీ నిరాధారమని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలను తెలియచేయవచ్చన్నారు. అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. విద్యుత్ సేవల్లో జాప్యం జరిగితే సంబంధిత డిస్కమ్‌లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలి్సందేనని, దీనికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారిపై భారం పడకుండా ప్రభుత్వం, ఏపీఈఆర్సీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డిస్కమ్‌లు చేసే ఎన్నో ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నామని, సహేతుక కారణాలుంటే మినహా ఈఆర్సీ అనుమతులు మంజూరు చేసే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ కార్యదర్శి రాజబాపయ్య, ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు, సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డితో పాటు డిస్కమ్‌ల డైరెక్టర్లు ఏవీవీ సూర్యప్రతాప్, డి.చంద్రం, బి.రమేష్‌ప్రసాద్, ఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. – ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి -
TS: ప్రజలకు ఊరటనిచ్చిన ప్రభుత్వం.. విద్యుత్ చార్జీల పెంపు లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇప్పుడున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత రిటైల్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించాలంటూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎనీ్పడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్)లు ప్రతిపాదించాయి. ఈ మేరకు 2023–24 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)తోపాటు రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను ఉత్తర, దక్షిణ డిస్కంల డైరెక్టర్లు పి.గణపతి, ఎస్.స్వామిరెడ్డి బుధవారం ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు (టెక్నికల్) ఎం.డి.మనోహర్ రాజుకు సమర్పించారు. ప్రతిపాదనల వివరాలను చైర్మన్ శ్రీరంగారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.2023–24లో రూ.54,060 కోట్ల వ్యయం అవుతుందని.. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యథాతథంగా అమలుచేస్తే రూ.43,525 కోట్లు మాత్రమే వస్తాయని రెండు డిస్కంలు అంచనా వేసినట్టు తెలిపారు. రూ.10,535 కోట్ల లోటు వస్తుండగా.. ఆ మేరకు విద్యుత్ సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆశిస్తున్నట్టుగా పేర్కొన్నాయని వివరించారు. ఉచిత, రాయితీ పథకాలు యథాతథం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతినెలా ఎస్సీ, ఎస్టీల గృహాలకు 101 యూని ట్లు, క్షౌరశాలలు, లాండ్రీలకు 250 యూని ట్ల వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్, పౌల్ట్రీఫారాలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌పై రూ.2 రాయితీ పథకాలు యథాతథంగా వచ్చే ఏడాది అమలు చేస్తామని డిస్కంలు ప్రతిపాదనల్లో తెలిపాయి. పెంచేదీ, తగ్గించేదీ మేమే నిర్ణయిస్తాం: ఈఆర్సీ ప్రస్తుత విద్యుత్ చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని డిస్కంలు ప్రతిపాదించినా.. వాటి ఆర్థిక పరిస్థితులను పరిశీలించిన తర్వాత అవసరమైన మేర చార్జీల తగ్గింపు లేదా పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు స్పష్టం చేశారు. డిస్కంల ప్రతిపాదనలను ఈఆర్సీ వెబ్సైట్లో పెట్టి, అన్నివర్గాల వినియోగదారుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ చార్జీలను తగ్గించాలన్న విజ్ఞప్తులు తమ పరిశీలనలో ఉన్నాయని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. కాగా.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై ఉందని శ్రీరంగారావు పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు, ఎత్తిపోతల పథకాల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఉత్తర డిస్కం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని విలేకరుల ప్రశ్నలకు బదులుగా చెప్పారు. కొన్ని డివిజన్లలో విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ) 50శాతానికి మించి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఎస్ఏ పేరిట యూనిట్‌కు 30పైసలదాకా వడ్డనకు చాన్స్! బొగ్గు ధరల పెరుగుదలతో పడుతున్న అదనపు విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని.. ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్ఎస్ఏ)ల రూపంలో ఎప్పటికప్పుడు వసూలు చేసేందుకు డిస్కంలు అనుమతి కోరగా.. అందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రకటించినట్టు శ్రీరంగారావు తెలిపారు. ప్రతి నెలా యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా 30పైసల వరకు ఈ అదనపు చార్జీలు వసూలు చేసేందుకు ఈ నిబంధనలు అనుమతిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముసాయిదా నిబంధనలను పంపామని, దీనిపై తుది ఉత్తర్వులు జారీచేశాక అమల్లోకి వస్తాయని వివరించారు. డిస్కంల ప్రతిపాదనల్లోని ముఖ్య గణాంకాలివీ.. ► 2023–24లో విద్యుత్ అవసరం అంచనా: 83,113 మిలియన్ యూనిట్లు ► వినియోగదారులకు విద్యుత్ విక్రయ అంచనా: 73,618 మిలియన్ యూని ట్లు (మిగతాది నష్టాలు, ఇతర రూపా ల్లో వినియోగం) ► వార్షిక ఆదాయ అవసరం అంచనా: టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.36,963 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు రూ.17, 095 కోట్లు. మొత్తం రూ.54,060 కోట్లు. ► ప్రస్తుత విద్యుత్ చార్జీలతో రానున్న ఆదాయ అంచనా: రూ.43,525 కోట్లు ► ఆదాయ లోటు టీఎస్ఎస్పీడీసీఎల్కు రూ.3,211 కోట్లు, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌కు రూ.7,324 కోట్లు. మొత్తం లోటు రూ.10,535 కోట్లు. (ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.) ► 2023–24లో సగటున ఒక్కో యూనిట్ విద్యుత్ సరఫరాకు అయ్యే వాస్తవ వ్యయ అంచనా: రూ.7.34 చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఇది ప్రజా వ్యతిరేక చర్య: ఉత్తమ్ కుమార్
హైదరాబాద్ : కేసీఆర్ సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచడం అన్యాయమని, ప్రజా వ్యతిరేక చర్య అని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొగ్గు, ముడి చమురు ధరలు సగానికి పైగా తగ్గిన నేపథ్యంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సబబు కాదని ఆయన సోమవారిమిక్కడ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, రూ.816 కోట్ల భారాన్ని సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. -
'విద్యుత్ ఛార్జీల పెంపు వెనక అవినీతి'
హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక పెద్ద అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ఆరోపించారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు దిగుమతుల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ మైసూరా రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుభారం ప్రజలపై పెట్టడం దుర్మార్గమంటూ దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. విద్యుత్ లోటు కేవలం అంకెల గారడి తప్ప నిజమైన భారం కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును వైఎస్ఆర్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అవినీతి, దుబార, స్వలాభం కోసమే విద్యుత్ కొనగోళ్లు జరుగుతున్నాయని మైసూరా రెడ్డి అన్నారు.