‘సముద్రపు అలల నుంచి కరెంట్’
పణజి: సముద్రపు అలల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చే యడానికి గల మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఇజ్రాయెల్ సాంకేతికతను ఉపయోగించి దీన్ని సుసాధ్యం చేయాలనుకుంటోంది. గోవాలో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందనీ, అలల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్తు చౌకగా లభించడంతోపాటు పర్యావరణహితంగానూ ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు.
అలాగే ప్రస్తుతమున్న సంప్రదాయ రవాణా వ్యవస్థ స్థానంలో పర్యావరణహిత వ్యవస్థను ప్రవేశపెట్టడానికి గల మార్గాలను పరిశీలించాలని గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ను గడ్కారీ కోరారు.