Pragatibhavan
-
భవిష్యత్తుకు భరోసా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రాజుకున్న వేడి క్రమంగా చల్లబడుతోంది. పార్టీ నేతల మధ్య సయోధ్యకు జరుగుతున్న ప్రయత్నాలు ఒకటొకటిగా కొలిక్కి వస్తున్నాయి. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని బుజ్జగించిన అధినేత కేసీఆర్.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆ నియోజకవర్గం టికెట్ ఖరారు చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య నడుమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో రాజీ కుదిరింది. నర్సాపూర్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనను కూడా రెండు మూడురోజుల్లో తొలగించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి, పటాన్చెరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై కూడా కేటీఆర్ దృష్టి సారించారు. జనగామ, నర్సాపూర్‌తో పాటు నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మరో వారం రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలన్న ముత్తిరెడ్డి? ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, వెంకట్రాంరెడ్డి శుక్రవారం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి వెళ్లారు. అంతా కలిసి ప్రగతిభవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ముత్తిరెడ్డికి టికెట్ నిరాకరణకు కారణాలను వివరించిన కేసీఆర్.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సహకరించి ఆయన గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం ఏదో ఒక ప్రాధాన్యత కలిగిన పదవి ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో ఎమ్మెల్సీగానూ అవకాశం కల్పిస్తానని హామీ ఇ చ్చినట్లు తెలిసింది. అయితే తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి కావాలని ముత్తిరెడ్డి కోరగా ప్రస్తుతం ఎమ్మెల్సీ పల్లా నిర్వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్ష పదవిని కేసీఆర్ ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా ముత్తిరెడ్డి బెట్టు వీడిన నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ అభ్యరి్థగా పల్లా పేరును కేసీఆర్ ఖరారు చేశారు. నర్సాపూర్, కల్వకుర్తిపై త్వరలో స్పష్టత నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలో నెలకొన్న ప్రతిష్టంభనపై బీఆర్ఎస్ అధినేత దృష్టి సారించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా టికెట్ కోసం పట్టుబడుతుండటంతో అభ్యర్థి ప్రకటనను పెండింగులో పెట్టారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తానని మదన్‌రెడ్డి స్పష్టం చేస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమ లేదా మంగళవారం అందుబాటులో ఉండాల్సిందిగా ఇద్దరు నేతలకు ప్రగతిభవన్ నుంచి సమాచారం వెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కల్వకుర్తి టికెట్‌ను ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి కూడా శుక్రవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలిసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు కసిరెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నప్పటికీ సీఎం ఇతర సమావేశాలతో బిజీగా ఉండటంతో భేటీ వాయిదా పడింది. కసిరెడ్డికి ఒకటి రెండురోజుల్లోనే మరోమారు పిలుపు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తనను కల్వకుర్తి అభ్యరి్థగా ప్రకటించి, సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు తాను ఖాళీ చేసే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కసిరెడ్డి కోరుతున్నారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానన్న రాజయ్య! స్టేషన్ ఘన్పూర్ టికెట్ విషయంలో నెలకొన్న పంచాయితీ కూడా ప్రగతిభవన్ వేదికగా కొలిక్కి వ చ్చింది. ఎమ్మెల్సీ పల్లా శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యరి్థ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వెంటబెట్టుకుని కేటీఆర్ వద్దకు వెళ్లారు. సంప్రదింపులు, చర్చల అనంతరం కడియం శ్రీహరి అభ్యరి్థత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు రాజయ్య ప్రకటించారు. కడియం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని రాజయ్యకు ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే గతంలో శ్రీహరికి వరంగల్ ఎంపీగా అవకాశం ఇ చ్చినందున తనకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాజయ్య కోరినట్లు సమాచారం. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని రాజయ్య పట్టుబట్టినట్లు సమాచారం. అయితే కేటీఆర్ ఏదో ఒక చట్టసభలో క చ్చితంగా పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతో రాజయ్య అంగీకరించినట్లు తెలిసింది. కేటీఆర్‌తో భేటీ అనంతరం కడియం శ్రీహరి గెలుపు కోసం పనిచేస్తానంటూ రాజయ్య ప్రకటించారు. కాగా పార్టీ నిర్ణయం మేరకు తనకు మద్దతు ప్రకటించిన రాజయ్యకు కడియం ధన్యవాదాలు తెలిపారు. -
ప్రగతిభవన్ వద్ద రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం
శామీర్‌పేట్: భూమి సమస్య పరిష్కారం కావడంలేదని రైతు దంపతులు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం... మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 444/ఎలో 35 గుంటల భూమిని వెంకగళ్ల భిక్షపతి, మరో 35 గుంటల భూమిని అతని సోదరుడు చంద్రయ్య పేరున యజమాని అబాబుల్ రెహమాన్ అలియాస్ బాబుదొర, అతని సోదరుల నుండి 1993లో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నారు. చంద్రయ్య కొనుగోలు చేసిన 35 గుంటల భూమిని కూడా ఆ తర్వాత భిక్షపతి కొనుగోలు చేసి పట్టా చేసుకున్నాడు. ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాసుబుక్కులను ఇవ్వాలని(మ్యుటేషన్) భిక్షపతి మండల రెవెన్యూ, ఆర్డీవో కార్యాలయంలో పలుసార్లు దరఖాస్తు చేశాడు. కాగా ఈ భూములకు సరైనపత్రాలు లేకపోవడంతోపాటు ఈ భూవివాదం సివిల్‌కోర్టులో ఉన్నదని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో నమోదు చేయలేదు. అయితే, ఈ పట్టాభూమిని తాము భిక్షపతికి అమ్మలేదని, తన భూమిలోకి అతడు రాకూడదని అబాబుల్ రెహమాన్ పలుసార్లు హెచ్చరించాడు. భిక్షపతి తమ భూమిని అన్యాక్రాంతం చేసి చుట్టూ కడీలు(స్తంభాలు) నాటాడని అబాబుల్ రెహమాన్, అతని సోదరులు శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆర్డర్‌తో భూయజమానులు ఇటీవల భూమిలోని కడీలను తొలగించారు. భిక్షపతితోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు పెట్టారు. దీంతో తమ భూసమస్య ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మనస్తాపం చెందిన భిక్షపతి, ఆయన భార్య బుచ్చమ్మ సోమవారం ప్రగతిభవన్ ముందుకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వివరణ...: పట్టాభూమిని కొల్తూర్‌కు చెందిన భిక్షపతి అన్యాక్రాంతం చేసినట్లు భూయజమాని ఫిర్యాదు చేయడంతో పూర్వాపరాలను పరిశీలించామని, విచారణ జరిపి ఈ నెల 12న భిక్షపతితోపాటు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశామని శామీర్‌పేట పోలీసులు తెలిపారు. సివిల్ కోర్టు పరిధిలో కేసు నడుస్తోందని, కోర్టు ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. -
ఉద్రిక్తత..పలువురు బీజేపీ నేతల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారానికి తెర పడటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. విధ్వంసం సృష్టిస్తారన్న ముందస్తు సమాచారంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు మోహరించారు. బీజేపీ శ్రేణుల ఆందోళనల సమాచారంతో ప్రగతిభవన్, టీఆర్ఎస్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తచర్యగా పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లిలో ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ హౌస్ అరెస్ట్ చేశారు. (రక్తపాతం జరిగేలా బీజేపీ ప్రోత్సహిస్తుంది : కేటీఆర్ ) హయత్‌నగర్‌లో బీజేపీ ధర్నా... హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహిస్తున్నారు. డీజీపీ ఆఫిస్, ప్రగతిభవన్ ముట్టడిస్తామని తమపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నేతలు భైటాయించారు. నేతలను అరెస్ట్ చేసి తమ హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే సామ రంగారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కళ్లెం రవీందర్ రెడ్డి 20మంది కార్యకర్తలను హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
బస్సులు నడుపుదామా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అంతర్రాష్ట్ర బస్సులు, వాహన ప్రయాణాలకు తాజా మార్గదర్శకాల్లో కేంద్రం అనుమతిచ్చింది. (రాష్ట్రంలో కొత్త సడలింపులపై నిర్ణయాలు) అంతర్ జిల్లా బస్సు సర్వీసులు, ఇత ర వాహనాల ప్రయాణాలకు సైతం పచ్చజెండా ఊపింది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ సడలింపులను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి రాష్ట్ర మంత్రివర్గం ఓ నిర్ణ యం తీసుకోనుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యా ప్తి జీహెచ్ఎంసీ పరిధిలో అధికంగా ఉండటం తో ఇక్కడ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లకు అనుమతిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఈ విషయాలపై కేబినెట్ కూలంకషంగా చర్చించి నిర్ణ యం తీసుకోనుంది. అలాగే రాష్ట్రంలో పంట సాగు విధివిధానాలపై సైతం చర్చించనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించే అవకాశముంది. (31 దాకా లాక్డౌన్) సీట్ల నమూనాలు రెడీ... ఆర్టీసీ బస్సులను తిప్పేందుకు ప్రభుత్వం అనుమతిస్తే కచ్చితంగా ప్రయాణికుల మధ్య భౌతికదూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి వరుసకు ఒకరే ఉండేలా నమూ నా రూపొందించారు. సూపర్ లగ్జరీ విషయం లో రెండు నమూనాలు సిద్ధం చేశారు. వరుసకు ఒకరే ఉండేలా ఒక రకం, మూడు సింగిల్ సీట్ల తో వరుసకు ముగ్గురు చొప్పున ఉండేలా రెండో నమూనా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఓ బస్సును కూడా సీట్లు మార్చి రెడీ చేశారు. ఇందులో సీఎం దేనికి అనుమతిస్తే ఆ నమూనాతో బస్సులు తిప్పుతారు. ఇక అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా.. అది ఇప్పుడే శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కర్ణాటకలో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి తిప్పొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎట్టి పరిస్థితిలో ఆయా రాష్ట్రాలకు బస్సులు తిప్పే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. రాజధానిలో లాంగ్ రూట్లలో సిటీ బస్సులు! హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో మిగతా ప్రాంతాల మధ్య పరిమిత సంఖ్యలో సిటీ బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికిప్పుడు కాకున్నా వచ్చే నెల మొదటి వారం నుంచి వాటిని తిప్పొచ్చన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కూడా సీఎం ముందుంచనున్నారు. నగరంలో దూరప్రాంత రూట్లుగా ఉన్న 50 మార్గాలను అధికారులు గుర్తించారు. సీటుకు ఒకరు, రెండు సీట్ల మధ్య ఒకరు నిలబడేలా.. వెరసి ఓ వరుసలో ముగ్గురు చొప్పు న ప్రయాణికులను అనుమతిస్తూ తిప్పాలనేది వారి ఆలోచన. కండక్టర్లు బస్సులో కాకుండా, ఆయా రూట్ల స్టాపుల్లో ఇద్దరు చొప్పున ఉంటారు. ముందు డోర్ వద్ద ఒకరు టికెట్లు జారీ చేస్తుండగా, వెనక డోర్ నుంచి దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు చెక్ చేస్తూ రెండో కండక్టర్ డ్యూటీలో ఉంటారు. మధ్యలో రన్నింగ్‌లో ఎవరైనా ప్రయాణికులు బస్సు ఎక్కితే టికెట్ తీసుకొనే అవకాశం ఉండనందున రెండో కండక్టర్‌ను పెట్టి చెకింగ్ విధులు అప్పగించనున్నారు. ప్రయాణికులు ముందు డోర్ నుంచి ఎక్కి వెనుక డోర్ నుంచి దిగాల్సి ఉంటుంది. కేవలం లాంగ్‌రూట్లుగా గుర్తించిన మార్గాల్లోనే బస్సులు తిరుగుతాయి. కేసులు ఎక్కువగా ఉన్న మార్గాల్లో తిరగవు. సీఎం ఆదేశం మేరకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
యువ ఆవిష్కర్తకు కేటీఆర్ అభినందన
సాక్షి, హైదరాబాద్: తక్కువ ఖర్చుతో వరి కలుపు తీసే పోర్టబుల్ యంత్రాన్ని కనిపెట్టిన యువ ఆవిష్కర్త అశోక్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అశోక్‌కు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫణీంద్ర సామతో కలిసి అశోక్ శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్ ప్రస్తుతం దేవరకొండ ఒకేషనల్ కాలేజీలో అగ్రికల్చర్ కోర్సు చదువుతున్నాడు. రైతుల కోసం వరిలో కలుపు మొక్కలను తీసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఈ ఆవిష్కరణకు కోల్‌కతాలోని విజ్ఞాన భారతి (విభ) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019’లో వ్యవసాయ రంగం కేటగిరీలో మొదటి బహుమతి లభించింది. గతంలో వినికిడి లోపంతో బాధపడే వారికి ఉపయోగపడేలా నిరీ్ణత సమయంలో వాసన విడుదల చేసే అలారం యంత్రం, చిన్న రైతుల కోసం బహుళార్థ సాధక హ్యాండ్ టూల్ తదితరాలను అశోక్ రూపొందించాడు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, పల్లె సృజన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదర్శనల్లో తన ఆవిష్కరణలను అశోక్‌కు ప్రస్తుతం కలుపు యంత్రానికి సంబంధించి 17కు పైగా తయారీ ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల ద్వారా రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాకు రావాలని కేటీఆర్‌కు ఆహా్వనం దక్షిణాఫ్రికా పర్యటనకు రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆ దేశ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన నాగరాజు.. ఏడాది కాలంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా విభాగం ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, సేవలను కేటీఆర్‌కు వివరించారు. సౌతాఫ్రికా విభాగం చేపట్టిన పనులతో ముద్రించిన మేగజైన్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. -
త్వరలోనే నగదు రహిత తెలంగాణ
-
త్వరలోనే నగదు రహిత తెలంగాణ
► బ్యాంకు అధికారులతో భేటీలో సీఎం కేసీఆర్ ►కొద్ది రోజులుగా డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ ►నగదు రహిత విధానంపై ఆలోచన మారాలి.. ప్రజల్లో మార్పు రావాలి ►రాష్ట్రానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ►అందించేందుకు ముందుకొచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత విధానంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లిం పులను అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ ముందుకు వచ్చింది. మంగళవారం ఆ బ్యాంకు అధికా రులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి డిజిటల్ విధానాన్ని అలవరుచుకుంటుందని, నగదు రహిత లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా ప్రతిరోజు అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు జరుపు తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ప్రజలకు సాంకేతికత ఉపయోగించుకోవడం తెలియదని కాదని... నగదు వాడకంలో ఉండటంతో డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలు అలవాటు కాలేదని చెప్పారు. అందుకే ప్రజల ఆలోచనా విధా నాన్ని మార్చే దిశగా అవగాహన కల్పించా లని, అందుకు బ్యాంకులు తగిన సహకారం అందించాలని సీఎం కోరారు. తొలి దశలో ప్రభుత్వ చెల్లింపులు... అరుుతే హడావుడి, ఆగమాగం చేయవద్దని... మొదటి దశలో ప్రభుత్వంతో సంబంధమున్న ఆర్థిక లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్ పేర్కొ న్నారు. రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాలు, కాం ట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగుల జీతాలు వంటివన్నీ డిజిటల్ రూపంలో జరగాలని చెప్పారు. రైతులకు ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాలను మళ్లించాలని, వారు డ్రా చేసుకునే క్రమంలో ఎలక్ట్రానిక్ చెల్లింపుల పద్ధతి క్రమంగా అలవాటవుతుం దని పేర్కొన్నారు. అయితే ప్రజలకు నగదు లావాదేవీల అవసరం కొంతమేరకు ఎల్లప్పు డూ ఉంటుందని చెప్పారు. రాబోయే కాలంలో అన్ని రకాల పన్నులు రద్దయి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మాత్రమే విధించే అవకాశాలున్నాయని.. భవిష్యత్తు మార్పులకు అనుగుణంగా ప్రజల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకు మేనే జర్లు, అధికారులు ప్రజలకు సహకరిం చాలని సూచించారు. బ్యాంకు అధికారులతో సమా వేశమై చర్చలు జరపాలని మంత్రి కె.తారక రామారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతా దికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్ మల్హోత్రా, అవిజిత్ షా, జితా మిత్రా, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. 14న టీఎస్ వాలెట్ ఆవిష్కరణ ఈనెల 14న జరిగే కలెక్టర్ల సదస్సులో టీఎస్ వాలెట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించ నున్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిం చిన ఈ మొబైల్ యాప్‌ను కలెక్టర్ల సదస్సులో విడుదల చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ప్రచారమే కీలకం నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించేలా మీడియా ద్వారా ప్రసారం చేయాలని మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. నగదు నోట్లుంటే దొంగలెత్తుకుపోయే ప్రమాదముందని.. డిజిటల్ పద్ధతిలో పూర్తి భద్రత ఉంటుందనే కోణంలో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల వారీగా ఎన్ని కార్డులున్నాయి, ప్రజల అవసరాలు తీరుస్తున్నాయా.. లేదా, వాడుకలో ఉన్నవెన్ని, కొత్తగా అవసరమైనవెన్ని.. వంటి అంశాలపై బ్యాంకుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని సీఎంవో అధికారులకు సూచించారు. మొబైల్ అప్లికేషన్ల ద్వారా బ్యాంకు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేలా గ్రామీణ యువతకు శిక్షణనివ్వాల్సిన అవస రముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వారి ద్వారా గ్రామాల్లో రైతులు, కూలీలు, నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలన్నారు. -
వ్యవ‘సాయం’ చేస్తాం
ఈ రంగానికే పెద్దపీట - ఆంక్షలు లేకుండా రుణమాఫీ - పతి ఎకరాకు నీరందిస్తాం - పార్టీలతో సంబంధం లేకుండా పనిచేయాలి - వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి - అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుదాం : ఎంపీ బీబీపాటిల్ కలెక్టరేట్ : నవ తెలంగాణ నిర్మాణంలో వ్యవసాయ, సంక్షే మ రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ రంగాల్లో 85శాతం మంది ప్రజలు ఉన్నందున వీటిపైనే దృష్టి సారిస్తామన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రగతిభవన్‌లో గురువారం జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ముందుగా తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ మౌనం పాటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో మొత్తం 32లక్షల మంది రైతుల రూ.22వేల కోట్ల రుణాలను ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు. ఇందులో బంగా రం పెట్టి తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. జిల్లాలో రూ. 2,675కోట్ల రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆరువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 650 కిలోమీటర్ల గోదావరి, 370 కిలో మీటర్ల కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నందున వీటిద్వారా లక్షల ఎకరాలకు నీరందించేందుకు కంకణం కట్టుకున్నామన్నారు. ఉద్యమనేత నుంచి ప్రభుత్వ రథసారధిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను, లక్ష్యాలను సంపూర్ణంగా నెరవేర్చడానికి అందరం ఐక్యమత్యంతో కృషి చేద్దామన్నారు. గుడ్గవర్నెన్స్తో ప్రజలకు మిత్రులుగా సేవలు అందించడానికి పార్టీలతో సంబంధం లేకుండా పని చే యాలని పోచారం సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని చెప్పా రు. జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి, విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. వసతిగృహాలను అధికారులు తనిఖీ చేయాలని, అవసరమైతే రాత్రిబస చేయాలన్నారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. జిల్లాను, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ డి. వెంకటేశ్వర్రావు, ఎస్పీ తరుణ్‌జోషి, జడ్పీ సీఈఓ రాజారాం, డీఆర్ఓ రాజశేఖర్, అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.