pratap kumar reddy
-
దాడి చేసింది టీడీపీ రౌడీలే
సాక్షి, అమరావతి: ఆర్టీసీ డ్రైవర్‌పై కావలిలో దాడి చేసిన రౌడీలు విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీకి చెందినవారేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడి చేసిన రౌడీలు ‘ఐ సపోర్ట్ బాబు..’ బ్యానర్లు పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు జనసేన జెండా కప్పుకోగా మరొకరు బీజేపీ నేత అనుచరుడిగా ఉన్నట్లు చెప్పారు. ఆధారాలతో సహా రౌడీ మూకల ఫోటోలను మీడియాకు ఆయన విడుదల చేశారు. ప్రశాంత ప్రాంతం కావలిలో ఎవరు ఎటువంటి వారో ప్రజలకు బాగా తెలుసన్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా లోకేశ్, పవన్ కల్యాణ్ బుర్రలేని మాటలు మాట్లాడారని విమర్శించారు. దొంగలే.. దొంగ దొంగ అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలసి తాను ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించి వెళ్తుండగా సంఘటన స్థలం వద్ద ఏం జరిగిందో వివరాలు సేకరించాలని పోలీసులకు సూచించినట్లు చెప్పారు. టీడీపీ, దాని తోక పార్టీలు ప్రతి విషయాన్ని వైఎస్సార్ సీపీకి ఆపాదించే యత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. డ్రైవర్‌పై దాడి చేసిందెవరో కావలి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. నిందితుడు సుధీర్‌పై నాలుగు రాష్ట్రాల్లో వందల కేసులున్నాయని, అవన్నీ బయటకు తీస్తామని తెలిపారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన వారు ఒక్కరున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మరి లోకేశ్ అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. ప్రధాన ముద్దాయి సుధీర్ గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్ అనే వ్యక్తి పక్కన నిందితుడు గుర్రంకొండ అరుణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో జనసేన తరఫున తనపై పోటీ చేసిన సుధాకర్ వద్ద ఇలాంటి గ్యాంగులు చాలా ఉన్నాయని, వాటిని హైదరాబాద్‌లో మోహరించి ఏం చేస్తున్నాడో తమకు సమాచారం ఉందన్నారు. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ‘ఐ సపోర్ట్ బాబు’ అనే బ్యానర్ పట్టుకున్నాడని చెప్పారు. శివారెడ్డి జనసేన కార్యకర్తే అనే విషయాన్ని పవన్ తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారో గుర్తు పెట్టుకోవాలన్నారు. -
కావలి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ (ఫోటోలు)
-
కావలి ఎమ్మెల్యే తనయుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
నెల్లూరు: కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కావలి మండలం గౌరవరం వద్ద ఉన్న రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరై వరుడు బాల సాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ఆశీర్వదించారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి తదితర నేతలు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. -
కావలి ‘యువనేస్తం’ లో రసాభాస
సాక్షి, కావలి : నెల్లూరు జిల్లా కావలిలో యువనేస్తం కార్యక్రమం రసాభాసగా సాగింది. కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. కార్యక్రమంలో ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ. వెయ్యి కోతపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇంటో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. దీంతో టీడీపీ నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డగించారు. టీడీపీ ఇచ్చిన హామీలను గుర్తుచేసినందుకుగాను ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వార్గాల మధ్య లోపులాట జరిగింది. పోలీసుల వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. యువనేస్తం కాదు యువ మోసం చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరించి గందరగోళం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యేగా అధికార కార్యక్రమంలో పాల్గొంటే రౌడీలను తెచ్చి బెదిరిస్తున్నారని ఆరోపించారు. రౌడీలకు, గుండాలకు భయపడేది లేదన్నారు. -
కావలి ‘యువనేస్తం’ కార్యక్రమంలో రసాభాసా
-
కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర
-
ఏపీ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగిస్తాం
-
ప్రత్యేకహోదా కోసం అడ్డుపడుతుంది చంద్రబాబే
-
'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?'
నెల్లూరు/చిత్తూరు: తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఇక, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడి తీరుపై స్పందిస్తూ ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబుకు అసలు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గర జోకర్లుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. -
కావలి ఎమ్మెల్యేకు అంబటి పరామర్శ
కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. సోమశిల ఆయకట్టు భూములకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్‌తో ప్రతాప్ కుమార్ రెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కాగా కావలి ఎమ్మెల్యే దీక్షపై మంత్రి నారాయణ విమర్శలు ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలిపేలా ఉన్నాయని అంబటి అన్నారు. వైఎస్ పాలనలో తప్ప రైతులకు ఏనాడూ సుఖం లేదని, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. -
సాగునీటి కోసం కావలి ఎమ్మెల్యే నిరాహార దీక్ష
-
'సభను నడిపిన తీరుకు అధికార పక్షం సిగ్గుపడాలి'
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రానీయకుండా అధికారపక్షం వ్యవహరించిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చంద్బాషా, నారాయణస్వామి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద వారు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రభుత్వానికి అండగా నిలిచి... సభను ఏకపక్షంగా నడిపారని విమర్శించారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యలు, నూతన రాజధాని, ఉద్యోగుల తొలగింపు, నిరుద్యోగులు, ఐకేసీ, అంగన్వాడీ వంటి ప్రజా సమస్యలపై సభలో తాము లేవనెత్తిన ఏ అంశానికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని వారు గుర్తు చేశారు. మైనారిటీ సమస్యలు లేవనెత్తడానికి కూడా అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశృ఼రు. సభను నడిపిన తీరుకు అధికారపక్షం సిగ్గుపడాలని అన్నారు. -
బాబు అసమర్థత వల్లే అయోమయం
చెవిరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జలీల్‌ఖాన్‌లు ధ్వజం సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు అసమర్థత వల్ల విద్యార్థుల్లో అయోమయం నెలకొందని, ఆంధ్ర విద్యార్థులు ఎక్కడ చదువుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం సహచర ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జలీల్‌ఖాన్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో వీరంతా ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముందని చెప్పారు. విదేశీ పర్యటనలు, ప్రచారంపై ఉన్న మోజు విద్యార్థుల భవిష్యత్తుపట్ల కనబరచాలని హితవు పలికారు. హుద్‌హుద్ సాయం పంపిణీ చేయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇళ్ళల్లో, గోడౌన్లలో దాచుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల గోడౌన్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసిన విష యం వాస్తవమో కాదో చెప్పాలన్నారు. తన నియోజకవర్గంలో మూడేళ్లుగా పంటలు ఎండిపోతున్నాయని కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
బాబు వల్లే విద్యార్థుల్లో అయోమయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొందని అన్నారు. పేదలు ఉన్నత విద్య చదవాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పోడుస్తోందని ఆరోపించారు. దాదాపు 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు తెలంగాణలో వివిధ కోర్సులు చదువుతున్నారని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
బాబు వల్లే విద్యార్థుల్లో అయోమయం