బాబు వల్లే విద్యార్థుల్లో అయోమయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. చంద్రబాబు అసమర్థ పాలన వల్ల విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొందని అన్నారు.
పేదలు ఉన్నత విద్య చదవాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పోడుస్తోందని ఆరోపించారు. దాదాపు 3 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు తెలంగాణలో వివిధ కోర్సులు చదువుతున్నారని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు.