pre quarter finals
-
ఆంధ్ర అవుట్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కథ ముగిసింది. లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకున్న ఆంధ్ర ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. చిన్నస్వామి స్టేడియంలో ఉత్తరప్రదేశ్ జట్టుతో సోమవారం జరిగిన రెండో ప్రిక్వార్టర్ ఫైనల్లో రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆంధ్ర జట్టు నిర్దేశించిన 157 పరుగుల విజయలక్ష్యాన్ని ఉత్తరప్రదేశ్ (యూపీ) జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్ రింకూ సింగ్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), విప్రాజ్ నిగమ్ (8 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి ఉత్తరప్రదేశ్ జట్టుకు విజయాన్ని అందించారు. ఒకదశలో ఉత్తరప్రదేశ్ జట్టు విజయానికి 24 బంతుల్లో 48 పరుగులు అవసరమయ్యాయి. ఆంధ్ర మీడియం పేసర్ కేవీ శశికాంత్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రింకూ, విప్రాజ్ 22 పరుగులు పిండుకోవడంతో ఫలితం యూపీ జట్టు వైపునకు మొగ్గింది. చివరి 3 ఓవర్లలో యూపీ విజయానికి 26 పరుగులు అవసరంకాగా... ఆ జట్టు 2 ఓవర్లలోనే 26 పరుగులు సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. విప్రాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆంధ్ర బౌలర్లలో కొడవండ్ల సుదర్శన్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు, త్రిపురాన విజయ్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ సత్యనారాయణ రాజుకు దక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఎస్డీఎన్వీ ప్రసాద్ (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు), కేవీ శశికాంత్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు. శ్రీకర్ భరత్ (11 బంతుల్లో 4), అశ్విన్ హెబ్బర్ (11 బంతుల్లో 11; 1 ఫోర్, 1 సిక్స్), షేక్ రషీద్ (14 బంతుల్లో 18; 3 ఫోర్లు), పైలా అవినాశ్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), రికీ భుయ్ (18 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), త్రిపురాన విజయ్ (16 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో వెనుదిరిగారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ 2 వికెట్ల చొప్పున తీయగా... మొహసిన్ ఖాన్, శివమ్ మావిలకు ఒక్కో వికెట్ లభించింది. అంతకుముందు జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో బెంగాల్ జట్టు మూడు పరుగుల తేడాతో చండీగఢ్‌పై గెలిచింది. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో సౌరాష్ట్ర; బరోడాతో బెంగాల్; ముంబైతో విదర్భ; ఢిల్లీతో ఉత్తరప్రదేశ్ తలపడతాయి. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సినెర్ సులువుగా...
న్యూయార్క్: ఈ ఏడాది దూకుడు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ యానిక్ సినెర్ (ఇటలీ) సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సినెర్ ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలవడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు, వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సినెర్... యూఎస్ ఓపెన్‌లో తనకు క్లిష్టతరమైన ప్రత్యర్థులు మూడో ర్యాంకర్ అల్కరాజ్ (స్పెయిన్), డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)లు ఇంటిముఖం పట్టడంతో టైటిల్ ఫేవరెట్‌గా అవతరించాడు. సినెర్తోపాటు మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) వరుసగా ఆరో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. వరుస సెట్లలో... పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సినెర్ 6–1, 6–4, 6–2తో గంటా 53 నిమిషాల్లో క్రిస్టోఫర్ ఒ కానెల్ (ఆ్రస్టేలియా)పై అలవోక విజయం సాధించాడు. ఏకంగా 15 ఏస్‌లు సంధించిన సినెర్, 46 విన్నర్లు కొట్టాడు. మిగతా మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–3, 6–4, 6–3తో ఫ్లావియో కొబొలి (ఇటలీ)పై, పదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆ్రస్టేలియా) 6–3, 6–7 (4/7), 6–0, 6–0తో ఇవాన్స్ (బ్రిటన్)పై, తాజా వింబుల్డన్ క్వార్టర్ ఫైనలిస్ట్, 14వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–7 (5/7), 6–3, 6–1, 7–6 (7/3)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్లో పౌలా బదోసా మహిళల సింగిల్స్‌లో 26వ సీడ్ పౌలా బదోసా (స్పెయిన్) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బదోసా 6–1, 6–2తో యాఫన్ వాంగ్ (చైనా)పై గెలిచి ఐదో ప్రయత్నంలో ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ (2022), టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఐదోసీడ్ జాస్మిన్ పావ్లీని (ఇటలీ), ఆరో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–2తో 25వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై సునాయాసంగా గెలిచింది. ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–3, 6–4తో 30వ సీడ్ పుతిన్త్సెవ (కజకిస్తాన్)పై గెలుపొందగా, ఆరో సీడ్ పెగూలా (అమెరికా) 6–3, 6–3తో బోజెస్ మనెరియో (స్పెయిన్)ను ఓడించింది. మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 6–2తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించగా, 16వ సీడ్ లుడ్మిలా సామ్సోనొవా (రష్యా) 6–1, 6–1తో ఆష్లిన్ క్రుయెగెర్ (అమెరికా)పై నెగ్గింది. ‘మిక్స్డ్’ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఇండోనేసియన్ భాగస్వామి అల్దిలా సుత్జియదితో కలిసి ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న జంట రెండో రౌండ్లో 0–6, 7–6 (7/5), 10–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–సుత్జియది జోడీ నాలుగో సీడ్ మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా)–క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జంటతో తలపడుతుంది. ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న భాగస్వామి! ఇదివరకే పురుషుల డబుల్స్‌లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మరోవైపు పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 2–6, 2–6తో టాప్ సీడ్ మార్సెల్ గ్రెనోలర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది. -
Thailand Open 2023: సింధు, శ్రీకాంత్‌లకు చుక్కెదురు
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రియాన్షు రజావత్, మిథున్ మంజునాథ్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, మాళవిక తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మరోవైపు కిరణ్ జార్జ్, లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, అష్మిత చాలిహా తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌కు కిరణ్ షాక్ పురుషుల సింగిల్స్‌లో 26వ ర్యాంకర్ వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో 21వ ర్యాంకర్ శ్రీకాంత్ 8–21, 21–16, 14–21తో ఓడిపోయాడు. సాయిప్రణీత్ 14–21, 16–21తో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ప్రియాన్షు 19–21, 10–21తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా) చేతిలో, సమీర్ వర్మ 15–21, 15–21తో జొహాన్సన్ (డెన్మార్క్), మిథున్ (భారత్) 21–17, 8–21, 15–21తో కున్లావుత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. ప్రపంచ 59వ ర్యాంకర్ కిరణ్ జార్జ్ 21–18, 22–20తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్ రన్నరప్ షి యు కి (చైనా)పై సంచలన విజయం సాధించగా... లక్ష్య సేన్ 21–23, 21–15, 21–15తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై కష్టపడి గెలిచాడు. 26 నిమిషాల్లోనే... దాదాపు రెండు నెలల తర్వాత మరో అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కేవలం 26 నిమిషాల్లో 21–13, 21–7తో వెన్ జు జాంగ్ (కెనడా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ అష్మిత 21–17, 21– 14తో భారత్‌కే చెందిన మాళవికను ఓడించింది. తొమ్మిదేళ్ల తర్వాత... కెనడా ప్లేయర్, ప్రపంచ 15వ ర్యాంకర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 13వ ర్యాంకర్ పీవీ సింధు 8–21, 21–18, 18–21తో ఓటమి చవిచూసింది. మిచెల్లి చేతిలో సింధు ఓడిపోవడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13,18–21, 21–17తో రస్ముస్ జెర్ –సొగార్డ్ (డెన్మార్క్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
World Boxing Championships: నరేందర్ ముందుకు... శివ థాపాకు చుక్కెదురు
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నరేందర్ బెర్వాల్ (ప్లస్ 92 కేజీలు), గోవింద్ సహాని (48 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... దీపక్ కుమార్ (51 కేజీలు) రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. అయితే స్టార్ బాక్సర్ శివ థాపా పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. తొలి రౌండ్ బౌట్లలో నరేందర్ 4–1తో మొహమ్మద్ అబ్రోరిదినోవ్ (తజికిస్తాన్)పై, గోవింద్ 5–0తో మెహ్రోన్ షఫియెవ్ (తజికిస్తాన్)పై, దీపక్ 5–0తో లూయిస్ డెల్గాడో (ఈక్వెడోర్)పై విజయం సాధించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన శివ థాపా ఈసారి మాత్రం నిరాశపరిచాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన శివ థాపా 3–4తో డోస్ రెస్ యురీ (బ్రెజిల్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లలో భారత బాక్సర్లు హుసాముద్దీన్ (57 కేజీలు), ఆశిష్ చౌధరీ (80 కేజీలు), నవీన్ (92 కేజీలు) పోటీపడతారు. -
బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలనం
తాష్కెంట్: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ నిశాంత్ దేవ్ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తాష్కెంట్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 71 కేజీల తొలి రౌండ్ బౌట్లో నిశాంత్ దేవ్ 5–0తో సర్ఖాన్ అలియెవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిశాంత్ దేవ్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఇదే టోర్నీలో అలియెవ్ కాంస్య పతకం సాధించాడు. Madrid Open:: ప్రపంచ నంబర్‌వన్ జోడీకి బోపన్న ద్వయం షాక్ రెండు నెలల వ్యవధిలో రెండోసారి ప్రపంచ నంబర్‌వన్ జోడీని బోల్తా కొట్టిస్తూ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జోడీ 6–3, 6–2తో ప్రపంచ నంబర్‌వన్ వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) ద్వయంపై గెలిచింది. మార్చిలో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ ఫైనల్లో కూలాఫ్–స్కప్‌స్కీ జంటను ఓడించి బోపన్న ద్వయం విజేతగా నిలిచింది. -
FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వవ్యాప్తంగా మెస్సీకి యమా క్రేజ్ ఉంది. క్రిస్టియానో రొనాల్డోతో సమానంగా ఫ్యాన్ బేస్ కలిగిన మెస్సీ చివరి వరల్డ్‌కప్ ఆడుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా జట్టుకు ఫిఫా టైటిల్ అందించాలనే లక్ష్యంతోనే మెస్సీ బరిలోకి దిగినట్లుగా అనిపిస్తుంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చాడు. మరో మూడు అడుగులు దాటితే కప్ అర్జెంటీనా సొంతం అవుతుంది. అయితే నాకౌట్ దశ కావడంతో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిబాట పట్టాల్సిందే. ఈ స్థితిలో మెస్సీ ఎలా జట్టును ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో మూడు గోల్స్ సాధించిన మెస్సీ ఓవరాల్‌గా ఫిఫా వరల్డ్‌కప్స్‌లో తొమ్మిది గోల్స్ నమోదు చేశాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఆటలో మెస్సీ రారాజు మాత్రమే కాదు.. ప్రశాంతతకు మారుపేరు. మ్యాచ్ సమయంలో అతను సహనం కోల్పోయింది చాలా తక్కువసార్లు అని చెప్పొచ్చు. అయితే మెస్సీ కొడుకు మాత్రం అల్లరిలో కింగ్‌లా కనిపిస్తున్నాడు. శనివారం అర్థరాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌కు మెస్సీ భార్య అంటోనిలా రొక్కుజో తన కుమారుడితో హాజరయ్యింది. మ్యాచ్‌లో 35వ నిమిషంలో మెస్సీ గోల్ చేసినప్పుడు కొడుకుతో కలిసి సంతోషాన్ని పంచుకున్న అంటోనిలా మెస్సీకి ప్లైయింగ్ కిస్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కాసేపటికే మెస్సీ కొడుకు తనలోని తుంటరితనాన్ని బయటికి తీశాడు. నోటిలో ఉన్న చూయింగ్ గమ్‌ను బయటకు తీసి తన ఎదురుగా ఫ్యాన్స్‌పైకి విసిరేశాడు. ఈ చర్యతో షాక్ తిన్నా వాళ్లు వెనక్కి తిరిగి చూడగా.. చేసింది మెస్సీ కొడుకని తెలుసుకొని ఏమీ అనలేకపోయారు. అయితే తల్లి అంటోనిలా రొక్కుజో మాత్రం కొడుక్కి చివాట్లు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఫన్నీ కామెంట్స్‌తో రెచ్చిపోయారు. ''మెస్సీ వారసుడు అంటున్నారు.. అతని లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. ఈ పిల్లాడి వల్ల చాలా ముప్పు.. వెంటనే స్కూల్‌కు పంపించేయండి.. వాళ్ల నాన్న కనిపించేసరికి అతనిపై వేద్దామనుకున్నాడు.. కానీ మిస్ అయిపోయింది..'' అంటూ పేర్కొన్నారు. ఇక ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించిన మెస్సీ బృందం డిసెంబర్ 10న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ మెస్సీ కెరీర్లో 1000వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గోల్ చేసిన మెస్సీ దిగ్గజం మారడోనా రికార్డును బద్దలు కొట్టాడు. Bro who pissed Messi's son Mateo off this much?? 😭😭 pic.twitter.com/GvK0snj7vY — mx (@MessiMX30iiii) December 4, 2022 చదవండి: 60 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన ఫ్రాన్స్ ఫుట్‌బాలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మెద్వెదెవ్కు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా వివాదాస్పద టెన్నిస్ ప్లేయర్ నిక్ కిరియోస్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం సృష్టించాడు. తన దూకుడైన ఆటతో కిరియోస్ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఇంటిదారి పట్టించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 25వ ర్యాంకర్ కిరియోస్ 7–6 (13/11), 3–6, 6–3, 6–2తో మెద్వెదెవ్పై విజయం సాధించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిరియోస్, మెద్వెదెవ్ ఏస్‌లతో హడలెత్తించారు. కిరియోస్ 21, మెద్వెదెవ్ 22 ఏస్‌లు సంధించారు. అయితే అందివచ్చిన బ్రేక్ పాయింట్లను సద్వినియోగం చేసుకున్న కిరియోస్ విజయం రుచి చూశాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన కిరియోస్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో మరో రష్యా ప్లేయర్ ఖచనోవ్‌తో కిరియోస్ ఆడతాడు. తాజా ఓటమితో మెద్వెదెవ్ వచ్చే సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. మెద్వెదెవ్ స్థానంలో నాదల్ (స్పెయిన్), అల్కరాజ్ (స్పెయిన్), కాస్పర్ రూడ్ (నార్వే)లలో ఒకరు ప్రపంచ నంబర్‌వన్ అవుతారు. మరోవైపు ఐదో ర్యాంకర్ కాస్పర్ రూడ్, ఖచనోవ్ కూడా తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రూడ్ 6–1, 6–2, 6–7 (4/7), 6–2తో ముటెట్ (ఫ్రాన్స్)పై, ఖచనోవ్ 4–6, 6–3, 6–1, 4–6, 6–3తో కరెనో బుస్టా (స్పెయిన్)పై, బెరెటిని (ఇటలీ) 3–6, 7–6 (7/2), 6–3, 4–6, 6–2తో ఫోకినా (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో ఏడో సీడ్ కామెరూన్ నోరి (బ్రిటన్)పై గెలిచారు. కోకో గాఫ్, జబర్ తొలిసారి... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా టీనేజర్ కోకో గాఫ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), 17వ ర్యాంకర్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 46వ ర్యాంకర్ ఐలా తొమ్లాయనోవిచ్ (ఆస్ట్రేలియా) తొలిసారి యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 7–5, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై గెలుపొందగా... జబర్ 7–6 (7/1), 6–4తో కుదెర్మెటోవా (రష్యా)ను ఓడించింది. మూడో రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన తొమ్లాయనోవిచ్ అదే జోరు కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లో 7–6 (8/6), 6–1తో సమ్సోనోవా (రష్యా)పై గెలిచింది. కెరీర్లో 42వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న గార్సియా 6–4, 6–1తో అలీసన్ రిస్కే అమృత్‌రాజ్ (అమెరికా)ను ఓడించింది. -
ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్, నిరుటి రన్నరప్ మెద్వెదెవ్, గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల ఈవెంట్లో సిమోనా హలెప్ (రొమేనియా), అరిన సబలెంక (బెలారస్), ఇగా స్వియటెక్ (పోలండ్)లు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ మెద్వెదెవ్ 6–4, 6–4, 6–2తో వరుస సెట్లలో వాన్ డి జండ్షల్ప్ (నెదర్లాండ్స్)పై అలవోక విజయం సాధించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్... గంటా 55 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. క్రొయేషియా స్టార్ మారిన్ సిలిచ్ 7–5, 7–6 (7/3), 3–6, 6–3తో ఐదో సీడ్ అండ్రీ రుబ్లెవ్ (రష్యా)కు షాకిచ్చాడు. మిగతా మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ 6–3, 7–5, 6–7 (2/7), 6–4తో బెనాయిట్ పైర్ (ఫ్రాన్స్)పై, తొమ్మిదో సీడ్ ఫెలిక్స్ అగర్ అలియసిమ్ (కెనడా) 6–4, 6–1, 6–1తో డానియెల్ ఇవాన్స్ (ఇంగ్లండ్)పై, 11వ సీడ్ జానిక్ సిన్నెర్ (ఇటలీ) 6–4, 1–6, 3–6, 6–1తో తరో డానియెల్ (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో రెండో సీడ్ సబలెంక (బెలారస్) 4–6, 6–3, 6–1తో మర్కెటా వొండ్రోసొవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) 6–2, 6–3తో డారియా కసత్కినా (రష్యా)పై అలవోక విజయం సాధించింది. 14వ సీడ్ హలెప్ 6–2, 6–1తో డంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై గెలిచింది. -
సోఫియాకు షాక్
న్యూయార్క్: ఊహించని ఫలితాలతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ముందుకు సాగుతోంది. కరోనా వైరస్ కారణంగా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులు ఈ టోర్నీకి దూరమైనా... బరిలో దిగిన టాప్–10లోపు క్రీడాకారిణులు కూడా తడబడుతున్నారు. తాజాగా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ ఎలీసె మెర్టెన్స్ (బెల్జియం) 75 నిమిషాల్లో 6–3, 6–3తో సోఫియా కెనిన్‌కు షాక్ ఇచ్చి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మెర్టెన్స్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 26 అనవసర తప్పిదాలు, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన సోఫియా ఏదశలోనూ మ్యాచ్‌లో కోలుకునేలా కనిపించలేదు. సోఫియా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–20 సీడింగ్స్‌లో ముగ్గురు మాత్రమే (సెరెనా–మూడో సీడ్, ఒసాకా–నాలుగో సీడ్, మెర్టెన్స్–16వ సీడ్) బరిలో మిగిలారు. సెమీస్‌లో జెన్నిఫర్ బ్రేడీ ఒకవైపు రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరగగా... అమెరికాకే చెందిన 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ తన కెరీర్లోనే తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ బ్రేడీ 6–3, 6–2తో 23వ సీడ్, ప్రపంచ 35వ ర్యాంకర్ పుతింత్సెవా (కజకిస్తాన్)ను ఓడించింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రేడీ ఆరు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌కు ముందు తన కెరీర్లో 12 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన బ్రేడీ ఏనాడూ క్వార్టర్ ఫైనల్ చేరలేదు. ఒసాకా, షెల్బీ రోజర్స్ మధ్య రెండో క్వార్టర్ ఫైనల్ విజేతతో సెమీఫైనల్లో బ్రేడీ తలపడుతుంది. అమ్మలు అదుర్స్... మరోవైపు ‘మదర్స్’ అజరెంకా (బెలారస్), పిరన్కోవా (బల్గేరియా) తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు సంపాదించారు. 2016 డిసెంబర్లో మగ బిడ్డకు జన్మనిచ్చిన అజరెంకా ఆరు నెలలపాటు... 2018 ఏప్రిల్‌లో మగ బిడ్డకు జన్మనిచ్చిన పిరన్కోవా రెండేళ్లపాటు ఆటకు దూరమయ్యారు. యూఎస్ ఓపెన్‌తో పునరాగమనం చేసిన 33 ఏళ్ల పిరన్కోవా... అలీజి కార్నె (ఫ్రాన్స్)తో 2 గంటల 49 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–4, 6–7 (5/7), 6–3తో గెలిచింది. 20వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్)తో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 5–7, 6–1, 6–4తో నెగ్గింది. 2015 తర్వాత ఈ టోర్నీలో అజరెంకా క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనాతో పిరన్కోవా; మెర్టెన్స్తో అజరెంకా తలపడతారు. బోపన్న జంట పరాజయం పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. బోపన్న–షపోవలోవ్ ద్వయం 5–7, 5–7తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హŸరియా టెకావ్ (రొమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. గంటా 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 17 అనవసర తప్పిదాలు చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 91 వేల డాలర్లు (రూ. 67 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. థీమ్ తడాఖా... ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)పై అనర్హత వేటు పడటంతో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ రావడం ఖాయమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన రెండో సీడ్, డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ 15వ సీడ్ ఫీలిక్స్ అగుర్ అలియసిమ్ (కెనడా)పై 7–6 (7/4), 6–1, 6–1తో నెగ్గి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెండు గంటల ఏడు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. నెట్ వద్దకు 18 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–1, 6–0తో టియాఫో (అమెరికా)పై, పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–3, 6–3, 6–3తో ఆరో సీడ్ బెరెటిని (ఇటలీ)పై నెగ్గారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుబ్లెవ్తో మెద్వెదెవ్; మినార్‌తో థీమ్ ఆడతారు. -
ప్రిక్వార్టర్స్‌లో రాహుల్, రోహిత్ యాదవ్
గువాహటి: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన చిట్టబోయిన రాహుల్ యాదవ్, రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ 21–12, 21–11తో డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్)పై... రోహిత్ 21–19, 21–19తో ప్రతుల్ జోషి (రైల్వేస్)పై విజయం సాధించారు. ఈ ఇద్దరితోపాటు లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్), హర్షీల్ డాని (మహారాష్ట్ర), ఆర్యమాన్ టాండన్ (ఎయిరిండియా), కౌశల్ (మహారాష్ట్ర), సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ), గుమ్మడి వృశాలి (ఆంధ్రప్రదేశ్) నాలుగో రౌండ్లో ఓటమి చవిచూశారు. గాయత్రి 17–21, 17–21తో రియా ముఖర్జీ (రైల్వేస్) చేతిలో ఓడిపోగా... శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయి... రెండో గేమ్‌లో 2–10తో వెనుకబడిన దశలో వృశాలి గాయం కారణంగా వైదొలిగింది. -
ప్రిక్వార్టర్స్‌కు హారిక
ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ సోచి (రష్యా): నిర్ణాయక టైబ్రేక్‌లలో తన సత్తా చాటుకున్న ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఇరీనా క్రుష్‌తో జరిగిన రెండో రౌండ్లో హారిక టైబ్రేక్‌లో 1.5-0.5తో విజయం సాధించి ముందంజ వేసింది. శనివారం నిర్ణీత రెండు గేమ్‌లు ముగిసిన తర్వాత వీరిద్దరు 1-1తో సమఉజ్జీగా నిలిచారు. దాంతో ఫలితం తేలడానికి ఆదివారం రెండు టైబ్రేక్ గేమ్‌లను నిర్వహించారు. తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 70 ఎత్తుల్లో గెలుపొంది... తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 58 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో హారిక ఆడుతుంది. మరోవైపు ఈ టోర్నీలో ఆడిన నాలుగు గేముల్లోనూ నెగ్గిన కోనేరు హంపి ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అలీసా గలియమోవా (రష్యా)తో తలపడుతుంది.