precaustions
-
హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు.. -
Beauty Tips: ముఖం మీద.. పేరుకుపోయే మురికిని.. తొలగించడిలా..!
ముఖం మీది మేకప్‌ను అయినా.. పొల్యుషన్‌తో పేరుకుపోయే మురికినైనా తొలగించడం కాస్త కష్టమే! అందుకే ఈ మసాజర్ అండ్ క్లీనర్ వచ్చింది మార్కెట్లోకి. మేకప్‌తో పాటు కాలుష్యపు జిడ్డునూ డీప్‌గా క్లీన్ చేసి.. మృతకణాలనూ తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుందీ డివైస్.దీని సిలికాన్ బ్రష్ హెడ్.. సాధారణ బ్రష్ కంటే 35 రెట్లు అధికంగా చర్మాన్ని శుభ్రపరస్తూ స్కిన్ ఫ్రెండ్లీగానూ ఉంటోంది. క్లీనింగ్ అండ్ మసాజింగ్ ఆప్షన్స్‌తో పని చేసే ఈ 2 ఇ¯Œ 1 గాడ్జెట్.. సోనిక్ వైబ్రేషన్స్‌తో, 6ఎక్స్ డీపర్ క్లీన్ అనే హై టెక్నాలజీ హీటెడ్ హెడ్‌తో వేగంగా పనిచేస్తుంది.ఒక్కసారి చార్జింగ్ పెట్టుకుంటే.. దీన్ని 20 నుంచి 30 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5 స్కి¯Œ కేర్ మోడ్స్ ఉంటాయి. వాటిలో మూడు వైబ్రేష¯Œ స్పీడ్ మోడ్స్ కాగా.. రెండు హీటెడ్ మసాజ్ మోడ్స్‌లో పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి హెడ్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ డివైస్‌ని స్త్రీ, పురుషులు ఇరువురూ వినియోగించుకోవచ్చు. ఈ పరికరాన్ని నీటితో క్లీ¯Œ చెయ్యకూడదు. చార్జింగ్ పెట్టేప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలి. దీని ధర సుమారు 65 డాలర్లు. అంటే 5,446 రూపాయలు.ఇవి చదవండి: నిజమే..! ఇది మంత్రదండంలాంటి 'ఏఐ' ఉంగరమే..!! -
స్వీయ రక్షణ - అందరి రక్షణ
-
కరోనా ఎఫెక్ట్: వెరైటీ లగ్గం పిలుపు..
సాక్షి, కడెం(మంచిర్యాల): కరోనా మహమ్మారి వివాహలపై కూడా చాలా ప్రభావం చూపింది. దీనికారణంగా బంధులు, స్నేహితుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లి .. కేవలం కొద్దిమందిలో మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ మధ్య పెళ్లే కాదు.. పెళ్లి పత్రికలు కూడా వెరైటిగా ముద్రిస్తున్నారు. తాజాగా, ‘జుట్టోల్ల లగ్గం పిలుపు.. పెద్దల దీవెనార్తులతో బెస్తారం పొద్దుపొడువంగ 6.52 గొట్టంక, నా లగ్గం’ అంటూ రూపొందించిన కడెం మండలంలోని నవబ్‌పేట్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జుట్టు మహిపాల్ వివాహ ఆహ్వాన పత్రిక ఆకట్టుకుంటోంది. పిల్లోల ఇంటికాడ లగ్గం, తలువాలు ఏసినంక బువ్వ అంటూ తెలంగాణ యాసతో.. యాదుంచుకుని మాస్కు పెట్టుకుని, శానిటైజర్ పట్టుకుని లగ్గం రావాలనే సూచనలతో.. కూడిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కరోనా టెర్రర్.. ముట్టుకోకుండానే అంటుకుంటోంది..!
సాక్షి, సిరిసిల్లటౌన్: కరోనా రోగిని నేరుగా కలువడం, వారితో దగ్గరగా మాట్లాడటం, ఒకే గదిలో, దగ్గరదగ్గరగా మెదలడం, తుంపర్లు ఇతరుల లాలాజలంతో కలువడం, లేదా ముక్కునీరుతో కలువడంతో కరోనా వచ్చేది. ఇది మొదటి వేవ్‌లో అందరం చూశాం. లక్షణాలున్న వారికి దూరంగా మెదిలి తప్పించుకున్నాం. కానీ ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి గతానికి భిన్నంగా ఉంది. మొదటి వేవ్‌లో కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోగిని ముట్టుకోకుండానే అంటుకుంటుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు వైద్యశాస్త్ర మేధావులు చెబుతున్నారు. ఫలితంగా వైరస్ ఉధృతి ఎక్కువై సామాజిక వ్యాప్తి జరుగుతుంది. జిల్లాలో ప్రజలు సామాజిక బాధ్యతను విస్మరిస్తూ...కరోనా వ్యాప్తికి కారకులైతున్న వైనంపై కథనం.. కరోనా సామాజిక వ్యాప్తి..? కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతుందన్న అంశం చర్చనీయాంశమైంది. రోజురోజుకు జిల్లాలో వందలాది సంఖ్యలో కేసులు నమోదవడం ఇందుకు బలం చేకూర్చుతుంది. అయితే కరోనా బారిన పడినవారు సరైన చికిత్స పొందుతూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం లేదు. కొందరైతే సాధారణ వ్యక్తుల్లాగే వివిధ ఫంక్షన్లు, సమావేశాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటున్నారు. పండుగల సందర్భాల్లో వేలాది జనం మార్కెట్లు, షాపింగ్‌ల కోసం భయం లేకుండా తిరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రాజకీయ ఫంక్షన్లు, సంతలు, షాపింగ్‌లకు జనాలు వేలాది సంఖ్యలో పాల్గొనడం మరో కారణమైతున్నట్లు వైద్యశాఖ మేధావులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో లెక్కకు మించిన జనాలు హాజరవడంతో వైరస్ అంటుకున్నట్లు తెలుస్తోంది. మొదటి వేవ్‌లో రోగినుంచి సాధారణ వ్యక్తికి సోకడంలో లక్షణాలు బయట పడటానికి మూడు నుంచి వారం రోజులు పట్టేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంటుకుని రెండు మూడు రోజుల్లోనే రోగి పరిస్థితి చేయిదాటే దాఖలాలు కనిపిస్తున్నాయి. కొందరిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించినా..వైరస్ జాడలు కనిపించడం లేదు. కొత్త వైరస్ ప్రభావానికి లోనైన వారికి విరేచనాలు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వగైరా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రజలు ఇలా.. ►మాస్కులు లేకుండా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దు ► అన్ని దుకాణాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి ►బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ బాటిల్ తీసుకుపోవాలి ► అన్ని షాపుల్లోనూ యజమానులు శానిటైజర్లు అందుబాటులో ఉంచి, మాస్కులు ధరించాలి ► కరోనా రోగులపై వివక్ష చూపరాదు. ► నాకేం కాదని అశ్రద్ధ చేయొద్దు. కరోనా వచ్చిందని భయపడాల్సిన పనిలేదు ► పోలీసులు అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు, పలు గ్రామాల్లో అమలు చేస్తున్న లాక్డౌన్ నియమాలను ప్రజలు పాటించాలి కోవిడ్–19 పాజిటివ్ వారు.. ► కరోనా లక్షణాలు కనపడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలి ► ఇంట్లోనే ఉంటూ..ఐసోలేషన్ నిబంధనలు పాటించాలి. బయట తిరుగొద్దు ► కరోనా సోకినవారు తప్పకుండా హోం ఐసోలేషన్ పాటించాలి. డాక్టర్ సూచలను పాటిస్తూ చికిత్స పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ► మాననికంగా ధైర్యాన్ని కోల్పోకుండా, భయానికి లోను కాకుండా ఉండాలి ►లక్షణాలు పెచ్చుమీరితే ఆస్పత్రిలో వైద్యుల పరిరక్షనలో చికిత్స పొందాలి -
బైక్ రైడింగ్‌తో నడుమునొప్పా.. అయితే ఇది మీకోసమే!
సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని నిర్ణీత ప్రమాణాలను పాటిస్తుంటారు. బైక్ నడుపుతున్నప్పుడు ఆయా అవయవాలపై ఒత్తిడి పడకుండా ఉండేలాంటి (ఎర్గానమిక్స్) జాగ్రత్తలతో వాటిని తయారు చేస్తుంటారు. దాంతో దాదాపుగా అవయవ సమస్యలు రావు. ఒకవేళ బైక్‌లోని హ్యాండిల్‌బార్, సీట్, ఫుట్రెస్ట్స్ వంటి వివిధ అంశాలు సరైన ప్రమాణాలతో లేకపోతే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలా బైక్ ఎర్గానమిక్స్ సరిగా లేక నడుమునొప్పి వస్తుందని అనుమానిస్తుంటే ఈ కింది జాగ్రత్తలు పాటించడం మంచిది. ►బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. అలాగని మరీ దగ్గరగా కూడా ఉండకూడదు. ఈ రెండు అంశాల్లో ఎక్కడ తేడా వచ్చినా నడుమునొప్పి రావచ్చు. ►బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. ►బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. నడుమునొప్పితో బాధపడేవారు తమ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, అలాగే వారు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి తగ్గవచ్చు. ఈ జాగ్రత్తల తర్వాత కూడా నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించడమే మంచిది. -
లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షయాభైవేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోని పీహెచ్సీ( PHC) స్థాయి వరకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. 11 వేల బెడ్స్ని ఆక్సిజన్ బెడ్స్‌గా మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అన్ని విభాగాల్లోని అధికారులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని పేర్కొన్నారు. ప్రజలు కూడా వారి వంతుగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. చదవండి: ఢిల్లీ నైట్ కర్ఫ్యూ: ఎవరికి సడలింపు..? -
ఆస్తమా ఎందుకు, ఎలా వస్తుందంటే..?
చలికాలం తీవ్రమైన చలి, ఎండాకాలంలో విపరీతమైన వేడిమి, అత్యధికంగా రేగే దుమ్ము వంటివి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఆస్తమా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పులు ఎక్కువగా ఉంటే ఆస్తమా లక్షణాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దాంతో ఆస్తమాతో బాధపడేవారి పరిస్థితి తీవ్రంగా తయారవడాన్ని ఆస్తమా అటాక్ లేదా ఆస్తమా ఎపిసోడ్ అంటారు. ఈ పరిస్థితి హఠాత్తుగా ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ఇది విషమించి తక్షణ వైద్యసాయం అవసరమవుతుంది. ఆస్తమా అటాక్ జరిగినప్పుడు శ్వాసవ్యవస్థలో వేగంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ►వాయునాళాల చుట్టూతా కండరాలు బిగుసుకుంటాయి. దాంతో గాలి ప్రయాణించే మార్గం మరింతగా కుంచిస్తుంది. ►శ్వాసకోశాలకు చేరే గాలి పరిమాణం బాగా తగ్గిపోతుంది ►వాయునాళాల వాపు ఎక్కువై, వాయువులు ప్రయాణం చేసే దారి మరింత సన్నబారిపోతుంది. ►వాయునాళాలలో వాపు వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు రోగనిరోధక వ్యవస్థ ఎక్కువ మ్యూకస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీంతో వాయునాళాలు మరింతగా మూసుకుపోతాయి. ఈ మార్పులతో సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయి వరకు ఆస్తమా అటాక్ జరుగుతుంది. ఈ అటాక్ ప్రారంభం లో ఊపిరితిత్తులకు కొంచెం తక్కువగానైనా ఆక్సిజన్ అందుతుంది. కానీ శ్వాసకోశాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఇది మరికొంత సమయం కొనసాగే సరికి శ్వాసకోశాలలో కార్బన్ డై ఆక్సైడ్ నిలిచిపోయి శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ స్థాయికి పడిపోతుంది. దీంతో శరీరంలోని వివిధ భాగాలకు రక్తం ద్వారా అందే ఆక్సిజన్ తగ్గుతుంది. ఈ రకమైన ఆస్తమా అటాక్ చాలా ప్రమాదకరమైనది. రోగిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. చదవండి: కాఫీ తాగడం మంచిదా..? కాదా..? -
పంద్రాగస్టు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, హైదరాబాద్ : నేడు భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పంద్రాగస్టు అనగానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పండగే.. ఎక్కడ చూసిన మువ్వనెల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తోంది. భారతీయుల గుండెల్లో దేశభక్తి పరవళ్లు తొక్కుతోంది. నా దేశానికి ఏ హాని జరగకుండా కాపాడుకుంటామని.. మాతృభూమికి ఆపద వస్తే రక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామనే ధృడ సంకల్పం ప్రతి భారతీయునిలో కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరగుతాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ఎస్జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. (స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం) ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ రోజుఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనున్నారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడ జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలకు దాదాపు 30 వేల మంది పాల్గొనేవారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు కానున్నారు. ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలాగే దేశంలోని అన్ని చోట్లా నేడు పంద్రాగస్టు వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదగా నిర్వహిస్తున్నారు. జెండా ఆవిష్కరణ వేడుకలకు కొద్ది మంది మాత్రమే పాల్గొననున్నారు. నేడు పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉదయం 10.15 గంటలకు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట స్వాతంత్ర్య సంబురాలు జరుపుకోవాల్సిన నిబంధనలను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► ప్రతి చోట భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ► ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే.. ► ప్రతి చోట శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ► వేడుకల్లో పాల్గొనే వారికి 50 మందికి మించరాదు. ► 20 నిమిషాల్లో వేడుకను పూర్తి చేయాలి. ► సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదు. -
అత్యంత అప్రమత్తత అవసరం!
సాక్షి,హైదరాబాద్: ‘కరోనా మహమ్మారి ఉధృతి తీవ్రమై పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణతో పాటు క్రమశిక్షణతో మెలగాల్సిన కీలక సమయం ఆసన్నమైంది. పరిమితంగా కొన్ని అంశాలపై మినహాయించి ఇప్పటి వరకున్న లాక్‌డౌన్‌ను దాదాపు ఎత్తివేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగడంతో పాటు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం వివిధ రంగాల్లో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మినహాయింపులు, సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కరోనా ప్రభావం తగ్గిపోయింది. ఇక తమకు ఏమీ కాదన్న భావనతో అతి విశ్వాసంతో వ్యవహరిస్తే మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తొచ్చనే హెచ్చరికలు వైద్య పరిశోధకులు, వైద్య నిపుణుల నుంచి వస్తున్నాయి. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కరోనా కేసులు ఇంకా గణనీయంగా పెరిగిన పక్షంలో మరింత కఠినమైన నిబంధనలతో మరోసారి లాక్డౌన్ విధించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎండాకాలం కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గొచ్చన్న అంచనాలు తలకిందులు కావడంతో, మరో వారం, పది రోజుల్లోనే వర్షాకాలం మొదలు కావడం, ఆ వెంటనే చలికాలం రానుండటంతో కరోనాతో పాటు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ సీజనల్ వ్యాధులు కూడా విజృంభించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న పరిణామాలు, ఏయే అంశాలపై ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సాక్షి ఇంటర్వూ్యలో వివిధరంగాలకు చెందిన వైద్య ప్రముఖులు డా.డి.శేషగిరిరావు, డా. విశ్వనాథ్ గెల్లా (పల్మనాలజీ అండ్ స్లీపింగ్ డిజార్డర్స్ స్పెషలిస్ట్), డా.కిరణ్ మాదల (క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్యకళాశాల) వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... రిలాక్స్ కావడం మంచిదికాదు సుదీర్ఘకాలం లాక్డౌన్ కొనసాగింపు వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కుంటున్నారు. మరోవైపు దాన్ని ఎత్తేయడం వల్ల కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినా సమస్యే. అందువల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. లాక్డౌన్ ఎత్తేశాక కేసులు పెరిగే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు కఠినమైన స్వయం నియంత్రణను పాటించాల్సిందే. వ్యక్తిగతంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ వచ్చేందుకు కనీసం ఏడాది పట్టొచ్చు. మారుతున్న వాతావరణాన్ని బట్టి వైరస్ వైఖరిని, స్వభావాన్ని మార్చుకుంటోంది. దీన్ని నిర్మూలించే కొంతమేరకే విజయవంతమయ్యే అవకాశాలుంటాయి. ఇక్కడి వారిలో జన్యుపరమైన అంశాలు, మలేరియా, ఇతర వ్యాధుల టీకాలు తీసుకోవడం వంటి వాటి వల్ల పశ్చిమదేశాలతో పోల్చితే వ్యాధి నిరోధకశక్తి అధికంగా ఉండటం సానుకూల పరిణామం. మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంది. అయితే మాకేమీ కాద ని, లాక్డౌన్ ఎత్తేశారని రిలాక్స్ అవడం మం చిది కాదు. భౌతిక దూరం పాటించడం, చేతు లు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం, ఇతర పరిశుభ్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి. హృద్రోగాలు, న్యూమోనియా, గ్యాస్ట్రో ఎంటరాలజీ సమస్యలు, విరేచనాలు వంటి సమస్యలున్న వారికి కరోనా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండటం అవసరం. – డాక్టర్ డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రజలు బాధ్యతతో మెలగాలి లాక్డౌన్ దాదాపు ఎత్తేసిన నేపథ్యంలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనిటీ స్ప్రెడ్ మరింత వేగంగా విస్తరించే అవకాశాలుం డటంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేకపోయినా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దు. సాయంత్రం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లడాన్ని పూర్తిగా తగ్గించాలి. సిగరెట్లు తాగడం, మద్యపానం వంటి అలవాట్లను తగ్గించుకోవడం మంచిది. ఊబకాయం ఉన్నవారితో పాటు అధిక బరువున్న వారు తమ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నినెలలుగా అసలు బయటికే వెళ్లని 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం మా పరిశోధనలో తేలింది. వారి ఇంటి నుంచి బయటికి వెళ్లి వచ్చే వ్యక్తి ద్వారా అతడికి వచ్చింది. దీంతో ఇంట్లో పెద్ద వారుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. – డా.విశ్వనాథ్ గెల్లా, పల్మనాలజిస్ట్, స్లీపింగ్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ పెద్దవాళ్లు జాగ్రత్తపడాలి ‘కరోనాకు చికిత్సపై ఇంకా స్పష్టత రాలేదు. కాంబి నేషన్ ఆఫ్ డ్రగ్స్‌తో, మరోవైపు వ్యాక్సిన్‌తో తగ్గించే దిశలో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు, పరిశోధనలు, అధ్యయనాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. తొందరగా మందులు లేదా వ్యాక్సిన్ కనుక్కోవాలనే ప్రయత్నా లు ఊపందుకున్నందున సమీప భవిష్యత్‌లోనే దీనిపై శుభవార్త రావొచ్చు. అయితే సుదీర్ఘకాలం లాక్డౌన్ విధింపు వల్ల వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌కు సడలిం పులిచ్చిన నేపథ్యంలో అందరూ బాధ్యతతో మెలగాలి. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 60 ఏళ్లకు పైబడిన వారు.. వివిధ అనారోగ్య సమస్యలున్న వా రు మరో ఏడాది పాటు ఇళ్లకే పరిమితమై, ఆరోగ్య సూత్రాలు పాటించాలి.’ – డా.కిరణ్ మాదల, క్రిటికల్‌కేర్ విభాగాధిపతి, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ -
‘శ్వాస’ వ్యవస్థ బాగుంటే వైరస్ భయం లేనట్టే!
‘శ్వాసనాళ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇప్పటికే బాధపడుతున్న వారు తాము వాడుతున్న మందులను కొనసాగించాలి. ఆస్తమా, సీఓపీడీ, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలుంటే కరోనాకు గురయ్యే అవకాశాలెక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఇవి రాకుండా చూసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే వైరస్ వ్యాపించదనేది అపోహ మాత్రమే. కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించడమొక్కటే మార్గం’అని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీకే పరంజ్యోతి సూచించారు. శ్వాసనాళ, శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సపొందేవారు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వివరాలు డాక్టర్ మాటల్లోనే.. స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడండి ఆస్తమా రోగులు స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడుతూనే ఉండాలి. దీని వాడకం కరోనాను కొంతమేర నిరోధిస్తుందని చైనీయుల అనుభవాలు చెబుతున్నాయి. లేదంటే ఆస్తమా ముదిరి కరోనా లక్షణాలు పెరగొచ్చు. ఆస్తమా రోగులు కరోనా ద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనే దానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలామందికి గతంలో ఎలాంటి శ్వాస సంబ«ంధ సమస్యలు లేవు. ఆస్తమాతో బాధపడుతూ కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు స్వల్పంగానే ఉన్నా, చికిత్స తర్వాత వీరు రికవరీ అవుతున్నట్టే నివేదికలు చెబుతున్నాయి. కరోనాకు భయపడి ఆస్తమా కోసం తీసుకుంటున్న చికిత్సను అశ్రద్ద చేయొద్దు. హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులతో జాగ్రత్త కరోనా బారినపడిన చాలామందిలో కొద్దిగా అస్వస్థతతో పాటు జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్ర హృద్రోగ, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిపై ఇది ప్రభావం చూపుతుంది. శ్వాసనాళం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఊపిరితిత్తుల నుంచి తెమడను బయటకు పంపి కరోనా బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది. ఒకవేళ దగ్గు, జ్వరం వచ్చినా శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా పెట్టుకోవడంతో పాటు, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడాలి. బ్రాంకియెక్టసిస్ (శ్వాసనాళం, దాని శాఖలు ఉబ్బడం) తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నా, శ్వాససంబంధ సమస్యలకు దీర్ఘకాలంగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి సామాజిక దూరం పాటిస్తూ, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. వైరస్‌ను తట్టుకోలేని ‘సీఓపీడీ’ ఎంఫిసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల సమస్యలు సీఓపీడీ (శ్వాస మార్గం మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోవడం)కి దారితీస్తాయి. సీఓపీడీతో బాధపడుతున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. వీరి ఊపిరితిత్తులు కొంతమేర దెబ్బతిని ఉంటాయి కాబట్టి కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి తక్కువుంటుంది. వాస్తవానికి కరోనా బారినపడే వారిలో సుమారు 50 శాతం మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. కొందరిలో స్పల్పంగా జలుబు, ముక్కు కారడం, కండరాల నొప్పి, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయి. మరికొందరిలో ‘ఫ్లూ’తరహాలో జలుబు, కండరాల నొప్పి, అలసట ఉంటుంది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండే వారిలో న్యూమోనియా, శ్వాస ఆడకపోవడం, దగ్గు అదనపు లక్షణాలుగా ఉంటాయి. సీఓపీడీ రోగులకు ఊపిరితిత్తులతో సమస్య మొదలై కరోనా బారినపడితే ఊపిరాడని పరిస్థితికి చేరుకుంటారు. అయితే చాలామంది సీఓపీడీ రోగుల్లో కరోనా సోకినా లక్షణాలు బయట పడకుండానే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఆ ఔషధాలు వాడే వారిలో రిస్క్ ఎక్కువ గతంలో ఏవైనా ఇతర వ్యాధుల బారిన పడ్డవారికి కరోనా సోకే అవకాశాలెక్కువనేది నిజం కాదు. అయితే హృద్రోగ, శ్వాస సంబంధ, డయాబెటిస్ లేదా రోగ నిరోధకశక్తిని తగ్గించే ఔషధాలు వాడే వారిలో కరోనా రిస్క్ ఎక్కువ. ఇతరులతో పోలిస్తే టీబీ వ్యాధిగ్రస్తులు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు ఒకవేళ కరోనా బారినపడినా లక్షణాలు కొద్దిగా బయటపడవచ్చు లేదా అసలు కనిపించకపోవచ్చు. టీబీ చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సూచనతో మందులు వాడుతూ సామాజిక దూరం పాటించాలి. గతంలో ఊపిరితిత్తుల్లో కొంత భాగం తొలగించినా, ఊపిరితిత్తులు చిన్నవి (స్కోలియోసిస్)గా ఉన్నా కరోనా సోకుతుందనేది అపోహ మాత్రమే. న్యూమోథొరాక్స్‌తో భయం లేదు ఇతర అనారోగ్యంతో బాధపడేవారు లేదా ఆరోగ్యవంతుల్లోనూ న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల ఛాతీ గోడ నడుమ గ్యాస్) సంభవించినా కరోనా ప్రమాదం అంతగా ఉండకపోవచ్చు. అయితే న్యూమోథొరాక్స్‌తో పాటు సీఓపీడీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇతర ఊపిరితిత్తి సంబంధ సమస్యలు రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా న్యూమోథొరాక్స్ సంభవించడం అనేది చాలా అరుదు. గతంలో ఈ వ్యాధికి గురై కోలుకున్న వారు ఇతరుల కంటే కరోనా ప్రభావానికి ఎక్కువ గురవుతారనే దానికి దాఖలాల్లేవు. కరోనా బారినపడే వారిలో కొద్దిమందిలో మాత్రమే పల్మనరీ పైబ్రోసిస్ (ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుంది. దీనినెలా నివారించాలనే దానిపై పరిశోధనలు జరగాలి. ముందు జాగ్రత్తలే మందు కరోనాను అరికట్టేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రావచ్చు. కరోనా కట్టడికి ఇప్పటివరకు ప్రత్యేక చికిత్సంటూ ఏమీలేదు. విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, జింక్ ప్రొటెక్టివ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. కరోనా గాలి ద్వారా వ్యాపించదు. దగ్గు, తుమ్ముల నుంచి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత మందులను యథావిధిగా వాడాలి. ‘కరోనా’ అనుమానాలు ఉంటే వైద్యులను సంప్ర దించాలి. -
పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..
సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి. పొంచి ఉన్న నిమోనియా .. శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు. అందుబాటులోకి పెంటావాలెంట్ వ్యాక్సిన్: చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్ టీకాతో హిమోíఫిలస్ ఇన్‌ఫ్లూయెంజా టైప్ బీ (íß బ్) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి .. పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు. గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. -
పండక్కి ఊరెళుతున్నారా.. ఇది చదవండి!
సంక్రాంతి పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదయం వేళ రద్దీని, పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, తదితర వస్తువులను విక్రయించే వారిపై నిఘా పెట్టాలని కోరారు. రాత్రివేళ అనుమానంగా కాలనీలో సంచరించేవారి గురించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శివారు కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతికినట్లు కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరారు. విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దన్నారు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిదని సూచించారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు. పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిదన్నారు. ఇంట్లో కుటుంబసభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. ఊరు వెళ్ళేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టకపోవటమే మంచిదన్నారు. వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలన్నారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలి ప్రజలకు పోలీసులు సూచించారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మంచిదన్నారు. పోలీస్‌శాఖ వారికి దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలని కోరారు. ప్రత్యేకంగా చుట్టు పక్కల వారి ల్యాండ్‌ఫోన్, సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు సమీప పోలీస్స్టేషన్లను సంప్రదించాలని తెలిపారు. సంక్రాంతి పండగ సెలవుల్లో ఇళ్లకు తాళం వేసి వేరే ఊళ్లకు, సొంతూళ్లకు వెళ్లేవారి కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఈమేరకు సూచనలతో ఒక ప్రకటన విడుదల చేశారు.