సాక్షి, కడెం(మంచిర్యాల): కరోనా మహమ్మారి వివాహలపై కూడా చాలా ప్రభావం చూపింది. దీనికారణంగా బంధులు, స్నేహితుల మధ్య ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లి .. కేవలం కొద్దిమందిలో మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. అయితే, ఈ మధ్య పెళ్లే కాదు.. పెళ్లి పత్రికలు కూడా వెరైటిగా ముద్రిస్తున్నారు. తాజాగా, ‘జుట్టోల్ల లగ్గం పిలుపు.. పెద్దల దీవెనార్తులతో బెస్తారం పొద్దుపొడువంగ 6.52 గొట్టంక, నా లగ్గం’ అంటూ రూపొందించిన కడెం మండలంలోని నవబ్‌పేట్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జుట్టు మహిపాల్ వివాహ ఆహ్వాన పత్రిక ఆకట్టుకుంటోంది.
పిల్లోల ఇంటికాడ లగ్గం, తలువాలు ఏసినంక బువ్వ అంటూ తెలంగాణ యాసతో.. యాదుంచుకుని మాస్కు పెట్టుకుని, శానిటైజర్ పట్టుకుని లగ్గం రావాలనే సూచనలతో.. కూడిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment