వైరల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల విమర్శలు-ప్రతివిమర్శలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా.. సోషల్ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్‌లు చేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ‘బీ టీం’ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ- బీఆర్ఎస్‌ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డును విడుదల చేసింది.
తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో పేర్కొంటూ క్రియేటివిటీని చూపించింది. అంతేకాదు వేదిక దగ్గరి నుంచి ముహూర్తం.. ఇలా ప్రతీ విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య సెటైర్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment