Prema Katha Chitram
-
మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్ 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమ కథా చిత్రమ్. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. -
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
‘ప్రేమకథా చిత్రమ్ 2’ మూవీ స్టిల్స్
-
ఇద్దరు భామలతో ‘ప్రేమ కథా చిత్రం 2’
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమకథా చిత్రం. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను ప్రారంభించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. హరి కిషన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఒక హీరోయిన్గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించనుంది. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు. -
నవ్వు.. భయం.. ఖాయం
‘ప్రేమకథా చిత్రమ్, జక్కన్న’ వంటి హిట్స్ అందించిన ఆర్పీఏ క్రియేషన్స్ ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్ 2’ రూపొందించనుంది. ‘బ్యాక్ టు ఫియర్’ అన్నది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా హరికిషన్ దర్శకత్వంలో ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ ఇవ్వగా, అమరేందర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. అఖిల్ రెడ్డి తొలి సన్నివేశానికి డైరెక్షన్ చేశారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథా చిత్రమ్’ హిలేరియస్ కామెడీతో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ప్రారంభించాం. హరికిషన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే కథ ఇది. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. కెమెరామెన్ సి.రాంప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీత దర్శకుడు జేబీ, డైలాగ్ రైటర్ చంద్రశేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, ఆర్.పి. అక్షిత్ రెడ్డి. -
స్కూల్ డేస్ గుర్తొస్తాయి!
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు, యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ దృష్టంతా ఇప్పుడు యాక్టింగ్‌పై ఉంది. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’ ద్వారా జీవీ హీరోగా మారారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ ఉత్సాహంతో ‘త్రిష ఇల్లేనా నయనతార’లో హీరోగా నటించారు. ఇప్పుడు జీవీ నటించిన మూడో చిత్రం ‘పెన్సిల్’ ఈ నెల 13న విడుదల కానుంది. తెలుగమ్మాయి శ్రీదివ్య ఇందులో కథానాయిక. ఎం.పురుషోత్తం సమర్పణలో మణి నాగరాజ్ దర్శకత్వంలో జి.హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘పాఠశాల జీవితాన్ని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసే చిత్రం ఇది. పాటలకు, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది’’ అని జీవీ అన్నారు. ‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన నేను తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం ఇది. జీవీ ప్రకాశ్‌గారు హీరోగా నటించడంతో పాటు మంచి పాటలిచ్చారు’’ అని నిర్మాత హరి చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: వడ్డీ రామానుజం. -
అది లేకుండా బతకలేను!
ఇంటర్వ్యూ ‘ప్రేమకథా చిత్రమ్’ చూసిన వాళ్లెవరికీ నందిత గురించి, ఆమె ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి హడలెత్తించిన నందిత... నిజ జీవితంలో మాత్రం చాలా కూల్‌గా ఉంటుంది. సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడుతుంది. క్రమశిక్షణతో మెలుగుతుంది. ఈ క్యూట్ యాక్ట్రెస్ గురించి మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలియాలంటే... తను చెప్పిన ఈ కబుర్లు చదవండి మరి! * తరచుగా కాకుండా అప్పుడప్పుడూ ఓ సినిమా చేస్తున్నారు. అవకాశాలు లేవా? చాలామంది ఈ ప్రశ్న అడిగారు నన్ను. నాకు అవకాశాలకు లోటేమీ లేదు. కాకపోతే సినిమాలతో పాటు చదువు మీద కూడా దృష్టి పెట్టాను. దాంతో రెండిటికీ సమయం బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చి తక్కువ సినిమాలు చేశాను. అంతే తప్ప చాన్సులు లేక కాదు. * అసలు సినిమాల్లోకి ఎలా వచ్చారు? నేను పదో తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్నప్పుడు దర్శకుడు తేజ ‘స్టార్ హంట్’ పెట్టారు. నేను సరదాగా నా ఫొటోలు పంపాను. తర్వాత ఆ విషయం మర్చిపోయి నా మానాన నేను కాలేజీలో చేరిపోయాను. కానీ ఆడిషన్‌కి రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్తే ‘నీకూ నాకూ డ్యాష్ డ్యాష్’ సినిమాలో చాన్స్ వచ్చింది. * మొదటి సినిమాయే ఫెయిలైంది. బాధ కలిగిందా? అదేం లేదు. నిజానికి ఆ సినిమా పేరు జనాల్లోకి నెగటివ్‌గా వెళ్లింది. అది ఫలితాల మీద చెడు ప్రభావం చూపించిం దనుకుంటా. ఆ తర్వాత పేరు మార్చారు. అయినా నాకు తెలిసి ఆ పేరులో తప్పేమీ లేదు. ఏదైనా అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఏదేమైనా నా మొదటి సినిమా ఫెయిల్యూర్ని రెండో సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ మర్చిపోయేలా చేసిందిలెండి. * కెరీర్ ప్రారంభంలో అంత మంచి పాత్ర రావడం అదృష్టం కదా? కచ్చితంగా. మామూలుగా, దెయ్యం పట్టిన అమ్మాయిలా రెండు రకాలుగా టాలెంట్‌ని ప్రదర్శించే చాన్స వచ్చింది. అమ్మానాన్నలతో కలిసి థియేటర్లో ఆ సినిమా చూశాను. ఆడియెన్స రెస్పాన్స చూసి ఎంత సంతోషమేసిందో. * అసలు మీకు ఎలాంటి పాత్రలు చేయాలనుంది? నాకు ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టం. బర్ఫీ, ఫ్యాషన్ లాంటి సినిమాల్లో చాలా చాలెంజింగ్ రోల్స్ చేశారు తను. అలాగే అనుష్క కూడా ఉమన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తారు. చాలా గొప్ప నటి ఆవిడ. నాకూ అలాంటివి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. * ఏ హీరోతో అయినా చేయాలని ఉందా? మహేశ్‌బాబు. ఆయన నా ఫేవరేట్ హీరో. ఆయనతో నటించాలని ఎవరికి మాత్రం ఉండదు! * నటి అయ్యాక, అవ్వకముందు... జీవితంలో తేడా ఏంటి? సినిమాల్లోకి రాకముందు నందిత ఓ మామూలు అమ్మాయి. అప్పుడు తను కొందరికే తెలుసు. కానీ ఇప్పుడు చాలామందికి తెలుసు. అంతకు మించి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే కాస్త ఎక్కువ బిజీ అయిపోయి ఫ్రెండ్స్ తోను, ఇంట్లో వాళ్లతోను ఎక్కువ టైమ్ గడపలేకపోతున్నాను. * ఎప్పుడైనా తీరిక దొరికితే ఏం చేస్తుంటారు? పుస్తకాలు విపరీతంగా చదువుతాను. అమెరికన్ రచయిత నికొలస్ పార్క్స రచనలంటే చాలా ఇష్టం. * మీలో మీకు నచ్చేది? క్రమశిక్షణ. నాన్న ఆర్మీ అధికారి. దాంతో చిన్నప్పట్నుంచీ ఇంట్లో డిసిప్లిన్ చాలా ఎక్కువ. ఆ క్రమశిక్షణ నాకు ఎప్పుడూ మంచి పేరే తెచ్చింది. * మీలో మీకు నచ్చనిది? నా ఉంగరాల జుత్తు. దాన్ని మేనేజ్ చేయలేక, అందంగా దువ్వుకోలేక ముప్పుతిప్పలు పడుతుంటా. * మీలో మీరు మార్చుకోవాలనుకునేది? ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ అంటే పడి చచ్చిపోతాను నేను. పిజ్జా అయితే మరీను. అస్సలు కంట్రోల్ చేసుకోలేను. కాకపోతే నటిని కాబట్టి బరువు పెరగకుండా యోగా, వ్యాయామం చేసి మేనేజ్ చేస్తుంటా. * ఇది లేకుండా బతకలేను అనుకునేది? నా జర్మన్ షెపర్డ్ కుక్క. అది నా బెస్ట్ ఫ్రెండ్. అది లేకపోతే నాకేం తోచదు. * మీరు లేకుండా బతకలేనని ఎవరైనా చెప్పారా? (నవ్వుతూ) అదేం లేదులెండి. అయినా నేను కో-ఎడ్యుకేషన్‌లో చదవలేదు. చుట్టూ అందరూ అమ్మాయిలే. కాబట్టి అందుకు అవకాశమే లేదు. * పోనీ ఎలాంటి అబ్బాయి ఐలవ్యూ చెబితే బాగుంటుందనుకుంటారు? నవ్వుతూ ఉండేవాడు. నవ్వించేవాడు. సెన్సాఫ్ హ్యూమర్ ఉండేవాళ్లే నాకు ఎక్కువ నచ్చుతారు. -
ఆచితూచి అడుగులు...
ఆ మధ్య ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన యువ హీరో కథానాయకుడు సుధీర్‌బాబు. గమ్మత్తేమిటంటే, అంత పెద్ద వాణిజ్య విజయం తరువాత చకచకా సినిమాలు చేస్తూ, తెగ బిజీగా ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ, ఈ యువ హీరో మాత్రం హడావిడి పడడం లేదు. ఇటీవలే ముగిసిన 2014లో ఆయన నటించిన ఒక్క చిత్రం కూడా రిలీజ్ కాలేదు. ‘‘ఒక ఘన విజయం తరువాత ఎవరి మీదైనా అంచనాలుంటాయి. అలాగే నా మీద కూడా! మధ్యలో చేసిన ‘ఆడు మగాడ్రా బుజ్జి’ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే, మంచి కథలు, వైవిధ్యభరితమైన స్క్రిప్టులు ఎంచుకోవాలని చూస్తున్నా’’ అని సుధీర్‌బాబు చెప్పారు. అయితే, ఈ కొత్త ఏడాదిలో ఏకంగా ఒకటికి నాలుగు సినిమాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. నటనకు సంబంధించి తనను తాను మెరుగుపరుచుకొనేందుకు కృషి చేస్తున్న ఈ ఉత్సాహవంతుడు త్వరలోనే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...’ అనే చిత్రం ద్వారా పలకరించనున్నారు. ఈ వినోదాత్మక ప్రేమ కథ నటుడిగా తన సత్తా చాటుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అలాగే, ‘స్వామి రారా’ చిత్రం సీక్వెల్ కూడా శరవేగంతో సిద్ధమవుతోంది. మరో రెండు చిత్రాలకు సంతకం చేసే పనిలో ఉన్నారు. ‘‘ఈ కొత్త ఏడాది అంతా బిజీగా సాగనుంది’’ అంటున్నారాయన. మొత్తానికి, నిరుటి కరువు కూడా తీరుస్తూ, ఈసారి ఆయన సినిమాలు నాలుగు రిలీజ్ కావడం సిద్ధమన్న మాట! ఇంకేం! ఆల్ ది బెస్ట్ సుధీర్! -
లైఫ్ కథా చిత్రమ్
ఈ రోజుల్లో.. చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. బస్‌స్టాప్ మూవీతో ట్రెండ్ సెట్ చేసిన ఈ డెరైక్టర్.. నిర్మాతగా ప్రేమ కథాచిత్రమ్తో హిట్ కొట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. దర్శకుడిగా కొత్తజంట సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మారుతీ దాసరి.. తనకు పాఠాలు నేర్పింది ఈ హైదరాబాదే అంటున్నారు. రూ.15 వేలతో సిటీలో అడుగుపెట్టిన తనను ఇప్పుడు కార్లలో తిరిగే స్థాయికి చేర్చింది భాగ్యనగరమే అని చెబుతారు. భాగ్యనగరితో ముడిపడిన తన జీవనచిత్రాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. మాది మచిలీపట్నం. పేదరికంలో పెరిగాను. నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడిని. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాను. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో సిటీ రైలు ఎక్కేశాను. నిజాంపేటలోని మా అక్క వాళ్లింటో దిగాను. లాంగ్ జర్నీ అప్పట్లో నిజాంపేటకు బస్సులు తక్కువ. ఇక ఆటోలు రావడం కూడా గగనమే. జేఎన్టీయూ నుంచి నిజాంపేట వరకూ నడిచేవాణ్ని. జూబ్లీహిల్స్‌లోని హార్ట్ ఇనిస్టిట్యూట్ అకాడమీలో టూడీ యానిమేషన్ కోర్స్‌లో చేరాను. ఉదయం పదింటికే నిజాంపేట నుంచి సైకిల్ మీద జేఎన్టీయూ బస్టాప్ చేరుకునేవాణ్ని. తెలిసిన వాళ్ల షాప్ దగ్గర సైకిల్ పార్క్ చేసి బస్సులు మారి రెండింటికి ఇన్స్టిట్యూట్కు వెళ్లేవాణ్ని. ఐదింటికి క్లాస్ అయిపోయాక బయల్దేరితే.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిది దాటేది. ఇలా చదువు కన్నా జర్నీకే ఎక్కువ టైం పట్టేది. బొమ్మలేయడం సరదా నాకు బొమ్మలేయడం అంటే సరదా. సిటీ రోడ్లపై బాగా చక్కర్లు కొట్టేవాడిని. ఆ టైంలోనే బస్టాప్‌ల దగ్గర వేచి ఉండే ప్రయాణికుల బొమ్మలు గీసేవాడిని. గోల్కొండ, చార్మినార్, జూపార్క్‌లోని జంతువులు, పక్షులు ఇలా ఎన్నో బొమ్మలు వేశాను. టైం దొరికితే చాలు హైదరాబాద్ అందాలను నా స్కెచింగ్‌లో చూపించే ప్రయత్నం చే సేవాడిని. టర్నింగ్ పాయింట్ 2008లో నాకు పెళ్లయింది. తర్వాత యానిమేషన్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తూ జీవనం కొనసాగించా. ఈ టైంలోనే బన్నీ వాసుతో పరిచయం నా లైఫ్‌ను కొత్త మలుపు తిప్పింది. ఆర్య సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా అవకాశం వచ్చింది. తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్, ప్రేమిస్తే సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాను. యాడ్స్ తీశాను. ఇక నా డెరైక్షన్ గురించి మీకు తెలిసిందే. బెస్ట్ లొకేషన్ నేను తొలినాళ్లలో చూసిన నగరానికి.. ఇప్పటి సిటీకి ఎంతో తేడా ఉంది. హైటెక్ సిటీకి వెళ్లి చూడండి.. మరో ప్రపంచం కనిపిస్తుంది. అక్కడ షూట్ చేసిన సీన్లు విదేశాల్లో తీసినంత రిచ్‌గా వస్తున్నాయి.అందుకే నా సినిమాల్లో సిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాను. ..:: వాంకె శ్రీనివాస్ -
‘లవర్స్’ సినిమా మొదట హిందీలో చేద్దామనుకున్నా!
‘‘హిందీలో ఓ సినిమా చేయాలనుకుని, మొదట ‘లవర్స్’ కథ తయారు చేసుకున్నా. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే, దర్శకుడు మారుతి ‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో రీమేక్ చేయమని అడిగాడు. కుదర్లేదు. ఆ సమయంలోనే మారుతి ‘లవర్స్’ కథ విని తెలుగులో చేయమని అడిగారు. భవిష్యత్తులోనైనా ‘లవర్స్’ని హిందీలో చేస్తాను’’ అని దర్శకుడు హరినాథ్ చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘లవర్స్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందని హరినాథ్ ఆనందం వెలిబుచ్చారు. తన సినీప్రస్థానం గురించి హరినాథ్ వివరిస్తూ -‘‘న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీలో ఫిలిమ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్‌లో స్పెషల్ కోర్స్ చేశాను. ముంబైలో మూడు హిందీ సినిమాలకు పని చేశాను. శ్రీకాంత్ హీరోగా ‘లక్కీ’ సినిమాతో దర్శకునిగా మారాను. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లి ‘లవర్స్’ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాలే చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. ‘లవర్స్’ మేకింగ్ గురించి హరనాథ్ మాట్లాడుతూ -‘‘కథలో ఫ్రెష్‌నెస్ ఉంది. అలాగే ఆర్టిస్టుల్లోనూ ఫ్రెష్‌నెస్ ఉంది. సుమంత్ ఆశ్విన్, నందిత, సప్తగిరి ఈ సినిమా విజయంలో మెయిన్ పిల్లర్స్. మారుతి స్క్రిప్టు సైడ్ ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది. ఆయన క్రియేటివ్ సైడ్ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు’’ అని తెలిపారు. -
''ప్రేమ కథా చిత్రమ్'' తెరవెనుక కథ
-
మా కుటుంబం మొత్తం గర్విస్తున్నాం - మహేష్‌బాబు
‘‘తన సినిమాల ఆడియో వేడుకలకు అతిథిగా రావడం తప్ప సుధీర్‌కి నేను చేసింది ఏమీ లేదు. తను స్వశక్తితో పైకొచ్చాడు. మా కుటుంబం మొత్తం అతడిని చూసి గర్విస్తున్నాం’’ అని మహేష్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు కథానాయకునిగా కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. అస్మితాసూద్ కథానాయిక. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ప్రేమకథా చిత్రమ్’ మాదిరిగానే.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఈ సందర్భంగా మహేష్‌బాబు ఆకాంక్షించారు. కృష్ణ మాట్లాడుతూ -‘‘సుధీర్ తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు. రెండో సినిమాతో హిట్ సినిమా హీరో అనిపించుకున్నాడు. ఈ మూడో సినిమాతో మాస్ హీరోగా ఎదగాలి’’ అని చెప్పారు. ‘‘కృష్ణగారిని ఏమడిగినా కాదనలేరు. వెంటనే సపోర్ట్ ఇస్తారు. కానీ మహేష్ అలా కాదు. ప్రొఫెషనల్‌గా ఎలాంటి సహకారం అందించాలన్నా ముందు వాళ్ల అర్హత ఏంటో చూస్తాడు. అర్హత లేని వాళ్లను మహేష్ ఎంకరేజ్ చేయడు. హీరోగా ఎదగడానికి నాకు మహేష్ సపోర్ట్ అవసరం. తననుంచి సహకారం అందాలంటే... ముందు నాకు కొన్ని అర్హతలుండాలి. అందుకే హీరోకి ఉండాల్సిన అర్హతలన్నింటినీ సాధించాలని ఇండస్ట్రీకి రాకముందే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నాకు కెరీర్‌పై భయం లేదు. ఎందుకంటే... నాకు సపోర్ట్ మహేష్ ఉన్నారు. ఆయన అభిమానులున్నారు. జీవితాంతం కష్టపడతాను. నన్నెక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు’’ అని సుధీర్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఇంకా విజయనిర్మల, నరేష్, బెల్లంకొండ సురేష్, భీమనేని శ్రీనివాసరావు, గోపిచంద్ మలినేని, వీరు పోట్ల, అజయ్, పూనమ్‌కౌర్, పద్మాలయ మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గీత స్మరణం
పల్లవి : ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... ఓ మై లవ్... ఏ చోట ఉన్నా నీడల్లే నీవెంట ఉన్నా నన్నే నేను నీలో చూస్తు వున్నా ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా ఏదోలా నీ తోడు కానా... నువ్వే లేని నేనే నేను కానా నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం : 1 కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే నీవేగా నీవేగా నీవేగా... నా చుట్టూ నీవేగా ఇలా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం : 2 నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే నీవేగా నీవేగా నీవేగా... నేనంటూ నీవేగా ప్రియా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చిత్రం : ప్రేమకథా చిత్రమ్ (2013) రచన : కాసర్ల శ్యామ్ సంగీతం : జె.బి., గానం : లిప్సిక