production of electricity
-
కృష్ణపట్నంపై మళ్లీ మొదటికి..
విద్యుత్ ఉత్పత్తిపై మాట మార్చిన ఏపీ ప్రాజెక్టులో విజయవంతమైన వాణిజ్య ఉత్పత్తి బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంట్ షట్‌డౌన్ చేసిన ఏపీ కేంద్రం జోక్యం కోరిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుత్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఇంతకాలం ప్రయోగాత్మక ఉత్పత్తి అంటూ ప్రాజెక్టులోని మొత్తం విద్యుత్‌ను వాడుకుంటూ వచ్చిన ఆ రాష్ట్రం. తాజాగా వాణిజ్యోత్పత్తి ప్రారంభమైనా, బొగ్గు నిల్వలు లేవంటూ ప్లాంటును షట్‌డౌన్ చేసిం ది. వాటా ప్రకారం న్యాయంగా రావాల్సి న విద్యుత్‌ను పంపిణీ చేయాలని పట్టుపడుతున్న తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా బుధవారం అధికారికంగా వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం 72 గంటల పాటు నిర్విరామంగా ప్లాంట్‌ను నడిపి... విజయవంతంగా సీవోడీ ప్రక్రియను ఏపీ జెన్కో పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్ నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 53.89 శాతం విద్యుత్ తెలంగాణకు, 46.21 శాతం ఏపీకి పంపిణీ చేయాలి. అధికారిక ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. అందులోంచి తమకు రావాల్సిన వాటా అందుతుందని టీజెన్‌కో, రాష్ట్ర సర్కారు ఎదురుచూశాయి. కానీ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన రోజునే.. బొగ్గు కొరత పేరు చెప్తూ కృష్ణపట్నం తొలి యూనిట్‌ను ఏపీ జెన్కో షట్‌డౌన్ చేయడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ‘సీవోడీ విజయవంతంగా పూర్తయింది. తర్వాత అరగంట సేపు ప్లాంటు నడిచింది. బొగ్గు కొరత కారణంగా యూనిట్‌ను షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి నెలకు నాలుగు లక్షల టన్నుల బొగ్గు అందాలి. కానీ రెండు లక్షల టన్నులే అందింది. బొగ్గు లేని కారణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేయడం అనివార్యమైంది..’ అని ఏపీ జెన్కో వర్గాలు వెల్లడించాయి. దీంతో కృష్ణపట్నం విద్యుత్ వస్తుందని ఆశపడిన తెలంగాణ సర్కారు మళ్లీ భంగపడింది. కావాలనే..! వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లోనే కృష్ణపట్నంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. కానీ ఇంతకాలం ట్రయల్న్,ర ఇన్ఫర్మ్పవర్ పేరుతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు షెడ్యూల్ చేయకుండా ఏపీనే వినియోగించుకుంది. విద్యుత్ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోగాత్మక విద్యుత్ అంటూ పంపిణీకి నిరాకరించింది. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఒప్పందాలు అమల్లోకి వస్తాయని గత నెలలో జరిగిన కృష్ణపట్నం పాలకమండలి సమావేశంలో ఏపీ జెన్కో అధికారులు ప్రకటించారు. తీరా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రోజునే షట్‌డౌన్ చేయటం అంటే.. తెలంగాణకు విద్యుత్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడమేనని ఇక్కడి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆ రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉంది. అందువల్ల కృష్ణపట్నం ప్లాంట్‌ను షట్‌డౌన్ చేసినా వారికి నష్టమేమీ లేదు. కానీ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణను మరింత చిక్కుల్లోకి నెట్టేయాలనే ఏపీ సర్కారు ఈ కుట్రకు పాల్పడిందని తెలంగాణ జెన్కో అధికారులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని, సీఎం తన ఢిల్లీ పర్యటనలోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించే అవకాశముందని వారు తెలిపారు. -
నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద
హైదరాబాద్: నాగార్జునసాగర్‌కు వరద తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో నిల్, ఔట్‌ఫ్లో 41వేల యూసెక్కుల నీరు ఉంది. నాగార్జున సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఆరు యూనిట్ల ద్వారా 600 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నారు. -
నాగార్జునసాగర్‌కు నిలిచిపోయిన వరద
నల్గొండ : నాగార్జునసాగర్‌కు వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 579 అడుగులన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఔట్‌ఫ్లో 53 వేల 300 క్యూసెక్కుల నీరు ఉంది.7 జనరేట్లర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. -
వృథా నీటితో విద్యుత్ ఉత్పత్తి
చిన్నరావిరాలలోని మూసీ వంతెన వద్ద ప్రయోగం సక్సెస్ రూ.2.50 లక్షలు వెచ్చించిన సుమన్‌రెడ్డి పెద్దఅంబర్‌పేట: మూసీలోని వృథా నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ఓ బీటెక్ విద్యార్థి అందరిని అబ్బురపరిచాడు. హయత్‌నగర్ మండలం చిన్నరావిరాలలోని మూసీ వంతెన వద్ద అదే గ్రామానికి చెందిన కొలను మోహన్‌రెడ్డి కుమారుడు కొలను సుమన్‌రెడ్డి ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. మినీ హైడల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. మూసీ వంతెన వద్ద నీటి నుంచి విద్యుత్‌ను తయారు చేసి 3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటార్ పంప్సెట్లను నడిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రాజెక్టు రూపకల్పన విద్యార్థి సుమన్‌రెడ్డి మాటల్లోనే.. ‘మూసీ వంతెన వద్ద వృథా అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే హైడల్ పవర్ జనరేషన్ ప్రాజెక్టును తయారు చేశా. ఈ ప్రాజెక్టును తయారు చేయడానికి రూ.2.50 లక్షల వరకు ఖర్చు చేశా. ఇలాంటి ప్రయోగం ద్వారా వృథాగా పోతున్న నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి మూసీ పరిసర గ్రామాలకు సరఫరా చేయవచ్చు. దీని తయారీ కోసం బ్యాలెన్సింగ్ వీల్స్ రెండింటిని వినియోగించా. ఒక్కోటి 350 కిలోల చొప్పున ఉంటుంది. ఎనిమిది బ్లేడ్లు, 10 కేవీ డైనమో, 3 హెచ్‌పీ మోటార్ సహాయంతో ఈ యంత్రాన్ని రూపొందించగలిగాను. ఇందుకోసం రెండు నెలల పాటు శ్రమించాను. ప్రస్తుతం దీని ద్వారా 7 కేఈ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వంతెన కట్ట ఎత్తు తక్కువగా ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంది. ఎత్తుగా ఉన్న ప్రాంతంలో అమర్చితే ఉత్పిత్తిని మరింత పెంచుకోవచ్చు. నా ప్రయోగం సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నా’నని సుమన్‌రెడ్డి తెలిపారు. ప్రశంసించిన భువనగిరి ఎంపీ బీటెక్ విద్యార్థి సుమన్ ప్రయోగం గురించి తెలుసుకున్న భువనగిరి ఎంపీ బూరనర్సయ్య గౌడ్ ఆదివారం చిన్నరావిరాలలోని మూసీ వంతెనను సందర్శించారు. వృథా నీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్లు నడిపిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. సుమన్ కృషిని అభినందించారు. విద్యార్థులు ఇలాంటి పరిశోధనలపై దృష్టిసారించి దేశాభివృద్ధిలో భాగస్వావుులు కావాలని ఆయన ఆకాంక్షించారు. పరిశోధనలపై దృష్టి పెట్టే విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. -
ఎన్ఎల్సీలో సమ్మె సైరన్
ఎన్ఎల్సీ కార్మికులు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. సమ్మె నోటీసును మంగళవారం యాజమాన్యానికి సమర్పించారు. సమ్మెలోకి ఎప్పటి నుంచి దిగుతారనే వివరాలను సెప్టెంబరు మూడో తేదీన ప్రకటించనున్నారు. సాక్షి, చెన్నై: కడలూరు జిల్లా నైవేలిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ) ఉంది. ఇక్కడ వేలాదిగా ఉద్యోగ, కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. నేల బొగ్గు తవ్వకాలు, విద్యుత్ ఉత్పత్తి విభాగంలో అత్యధిక శాతం ఒప్పంద కార్మికులు పనులు చేస్తున్నారు. వీరంతా కొన్నేళ్లుగా తమ డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఉద్యమిస్తున్నారు. గత ఏడాది నైవేలి వాటాల విక్రయానికి కేంద్రం యత్నించడం ఇక్కడి ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహాన్ని రేపింది. తమ డిమాండ్ల సాధనతోపాటుగా వాటాల విక్రయానికి వ్యతిరేకంగా సమ్మెబాట పట్టడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు కోర్టు అక్షింతలు, కేంద్రం దిగి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వాటాల విక్రయానికి సిద్ధ పడింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనతో కార్మికులు సమ్మెను వీడారు. అదే సమయంలో, తమ డిమాండ్ల మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ డిమాండ్ల గురించి పట్టించుకున్న వారే లేరని చెప్పవచ్చు. తరచూ యాజమాన్యం, కార్మికులు చర్చలు సాగించడం అది విఫలం కావడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు మళ్లీ సమ్మె నినాదాన్ని కార్మిక సంఘాలు అందుకున్నాయి. సమ్మె నోటీసు : ఎన్ఎల్సీ పరిధిలో అన్ని రాజకీయ పక్షాల అనుబంధ కార్మిక విభాగాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఎన్ఎల్సీ కార్మిక సమాఖ్యగా ఆవిర్భవించడం జరిగింది. ఈ సమాఖ్య నేతలు తిరుమావళవన్, శ్రీధరన్, రాజ వన్నియన్, ఉదయకుమార్, స్టాలిన్, హెండ్రి, రాజప్పన్, రవిచంద్రన్, శ్రీనివాసులు తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. 2013లో తమకు ఇచ్చిన హామీ మేరకు, సుప్రీం కోర్టు మార్గ దర్శకాల మేరకు డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అయితే, యాజమాన్యం ఖాతరు చేయని దృష్ట్యా, సమ్మెకు సిద్ధ పడాల్సిందేనన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాల కల్పన తదితర డిమాండ్లతో కూడిన ప్రకటనను సిద్ధం చేశారు. కార్మిక నిబంధనల మేరకు సమ్మె సైరన్ మోగించేందుకు నెల రోజులకు ముందుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దృష్ట్యా, ఎన్ఎల్సీ ఉన్నతాధికారి ముత్తుకు కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. సమ్మెకు దిగే తేదీ వివరాలను సెప్టెంబరు మూడో తేదీ ప్రకటించనున్నామని వివరించారు. ఆ రోజున కార్మిక సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశానికి నాయకులు పిలుపు నిచ్చారు. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు ముందుగా కొన్ని రోజుల పాటుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ యాజమాన్యం దిగి రాని పక్షంలో సమ్మె అనివార్యం కాబోతున్నది. ఈ కార్మికల సమ్మె నినాదం అందుకున్న దృష్ట్యా, ఎన్ఎల్సీ భద్రతా సిబ్బంది, అక్కడి పోలీసులకు ఇక చేతి నిండా పనే. ఈ సమయంలో ఎక్కడ ఆందోళనలు చేస్తారో, ఎప్పుడు వివాదాలు చెలరేగుతాయోనన్న ఉత్కంఠతో భద్రతను పర్యవేక్షించాల్సిందే. -
ఇంటికి సోలార్ పవర్ కావాలంటే..
సోలార్ పవర్. ప్రస్తుతం అందరి చర్చ దీనిపైనే. పర్యావరణానికి హాని కలిగించకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం.. సిస్టం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 50 శాతం రాయితీ లభిస్తుండడం.. వంటి అంశాలు నగరవాసులకు ఆసక్తిని కలిగిస్తోంది. కరెంట్ కోతల నుంచి విముక్తి పొందేందుకు ‘సోలార్ రూఫ్ టాపింగ్ ఎనర్జీ ప్రొడ్యూస్ సిస్టం’ను ఇంటిపై అమర్చుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే. - సాక్షి, కరీంనగర్ ప్రయోజనం.. ►సోలార్‌సిస్టం ఏర్పాటుకు కావాల్సిన కనీసం 10 చదరపు గజాల స్థలం మీ భవనంపై ఉండేలా చూసుకోవాలి. ఉంటే మీ దగ్గరలో ఉన్న విద్యుత్ వినియోగదారుల సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ ఉచితంగా దరఖాస్తును పొందవచ్చు. ►ఇందు కోసం మీరు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, అడ్రస్, ఐడి ఫ్రూప్‌లతో పాటుగా ఎస్ఎస్పీడీఎస్ పేరుపై రూ.1000 డీడీ తీసి అక్కడ ఇవ్వాలి. ► దరఖాస్తుతో పాటుగా రెండు ఎన్వలప్ కవర్లపై సెల్ఫ్ అడ్రస్ రాసి రూ.5 పోస్టల్ స్టాంప్‌లను అతికించి ఇవ్వాలి. ► మీ దరఖాస్తును స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ఏడీఈ) పరిశీలించి, సోలార్ సిస్టంను ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాన్ని పరిశీలిస్తారు. స్థలం అనుకూలంగా ఉంటే పదిహేను రోజుల పని దినములలో మీకు అప్రూవల్ లెటర్ వస్తుంది. తర్వాత మీరు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏదైనా డీలరును సంప్రదించి పని మొదలు పెట్టవచ్చు. ►డీలరు ఇందుకు కావాల్సిన సోలార్ పరికరాలు, ఇన్వ్ర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేస్తారు. పని పూర్తి అయినప్పుడు మీకు ఇంపోర్ట్-ఎక్స్పోర్ట్ మీటరును అమరుస్తారు. ఈ మీటరు కోసం మీరు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ►3 కేవీ వరకు డొమస్టిక్: ఒక మీటరు కనెక్షన్‌కు 3 కేవీ వరకు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇస్తారు. 1 కేవీకి 10 చదరపు మీటర్ల స్థలం అవసరం. ►ప్రతి అదనపు కిలోవాట్‌కు 10 చదరపు మీటర్ల స్థలం కావాలి. 1కేవీ నుంచి 3కేవీ వరుకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని డొమస్టిక్గా పరిగణిస్తారు. 99.99 శాతం ఈ విధానానికి అందరూ అర్హులే. 5 కేవీ సామర్ధ్యం నుంచి ప్రభుత్వం కేవలం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది. అమ్ముకోవచ్చు: ఈ సిస్టం ద్వారా పొందిన విద్యుత్‌ను మీ ఇంటి అవసరాలకు వాడుకొని... మిగులు విద్యుత్‌ను తిరిగి విద్యుత్ గ్రిడ్‌కు అమ్ముకోవచ్చు. ఉదా: మీరు ఒక నెలలో 700 యూనిట్లు ఉత్పత్తి చేశామనుకుందాం. అందులో మీరు 500 మాత్రమే వాడుకుంటే మిగిలిన 200 యూనిట్లను గ్రిడ్ కొనుగోలు చేస్తుంది. - ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కవ వాడుకుంటే వాడుకున్న దానికే బిల్లు కట్టాలి. ఉదా : 700 యూనిట్లు ఉత్పత్తి చేసి 800 యూనిట్ల కరెంట్ వాడుకుంటే మీరు 100 యూనిట్లకు బిల్లు చెల్లించాలి. -
ఇక్కడి సొమ్ముతో అక్కడ సోకులు
సాక్షి, విశాఖపట్నం : ‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు విశాఖకు అన్యాయం చేశారు. ఇక్కడి వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక వనరులను అక్కడికి తరలించారు. జిల్లా వనరులు దోపిడీకి గురయ్యాయి. అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర విభజన జరిగితే పర్యాటక, పారిశ్రామిక, ఉన్నత విద్య, విద్యుత్ రంగాల్లో నగరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది’ అని విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) ఆవేదన వ్యక్తం చేసింది. నగరానికి జరగబోయే నష్టాలను వీడీసీ ఉపాధ్యక్షుడు, సింబయాసిస్ సీఈఓ ఒ.నరేష్కుమార్ విలేకరులకు వివరించారు. పారిశ్రామికంగా విశాఖకు ఉన్న గుర్తింపు కారణంగా ఇక్కడ భూములకు ఎనలేని విలువ వచ్చిందని, వుడా పేరుతో వీటిని ప్రభుత్వం వేలం వేయించి కొన్ని వేల కోట్ల నిధులను తరలించుకు పోయారన్నారు. ఆ నిధులతో రాజధానిని పలు రకాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. మొదటినుంచీ భూములు విక్రయించగా వచ్చిన వేల కోట్ల నిధులను విశాఖ అభివృద్ధికి వెచ్చిస్తే దేశంలోనే ప్రముఖ మెట్రోనగరంగా విశాఖ అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు. విభజన కారణంగా హైదరాబాద్‌ను వదులుకోవలసి వస్తే తీసుకున్న నిధులను తిరిగి విశాఖకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఐటీ రంగం టర్నోవరు ప్రస్తుతం రూ. 60 వేల కోట్ల వరకు ఉందని, అక్కడ ఐటీ వృద్ధిలో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ఇంజినీరింగ్ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇప్పుడు విభజన కారణంగా మన విద్యార్థులకు అక్కడ ఐటీ రంగంలో అవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయస్థాయి ప్రతిష్టాత్మక ఐఐఐటీ, ఐఐటీ, ఎఎస్బీ, నిఫ్ట్ వంటి క్యాంపస్‌లు అక్కడే ఉన్నాయి.. ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖలో ప్రతిష్టాత్మక క్యాంపస్ ఒక్కటి కూడా లేదు.. ఇప్పుడు ఆయా జాతీయ క్యాంపస్‌ల్లో విద్యార్థులు పరాయి విద్యార్థుల్లా చదువుకోవలసి వస్తుందన్నారు. విశాఖ అంటే అందరికి పర్యాటక రంగం గుర్తుకు వస్తుంది.. కానీ ఇక్కడ పర్యాటకపరంగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులను ఒక్కటి కూడా అభివృద్ధి చేయలేదని చెప్పారు. విభజన కారణంగా విశాఖ పర్యాటక వృద్ధి మరింత వెనక్కువెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ రాష్ట్రంలోనే అత్యంత లాభాల్లో నడుస్తోందని, కానీ దీనికి మిగిలిన డిస్కంలతో పోల్చితే అతితక్కువగా 15.7 శాతమే విద్యుత్ కేటాయిస్తున్నారని, దీని వల్ల ఇక్కడ ఐటీ,పారిశ్రామిక రంగం వృద్ధిలో మందగమన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని విశ్లేషించారు. ఇక్కడ డిస్కమ్‌కు వచ్చిన లాభాల్లో రూ. 3 వేల కోట్లను హైదరాబాద్ డిస్కమ్‌కు అడ్డగోలుగా మళ్లించారని, ఆ నిధులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.