prohibition orders
-
Anand Mahindra: తాలిబన్ల ఇలాకాలో ఆ ఛాన్స్ వస్తేనా..
కఠిన ఆంక్షలు, నిషేధాజ్క్షలతో ఒకప్పుడు తాలిబన్లు అఫ్గన్లకు ప్రత్యక్ష నరకం చూపించారు. మళ్లీ వాళ్ల పాలనలో భయంభయంగానే గడపాల్సి వస్తోంది అక్కడి ప్రజలు. పైకి అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఒకలా సందేశం ఇస్తూ.. అంతర్గతంగా అసలు రంగును బయటపెట్టుకుంటున్నారు తాలిబన్లు ఇప్పుడు. మాట కాదన్నా.. ఎదురు తిరిగినా ఉరి తీసి వేలాడేస్తున్నారు. తాజాగా మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమంటూ ఫత్వా జారీ చేసిన తాలిబన్లు, బార్బర్లు, సెలూన్ నిర్వాహకుల జీవనోపాధిపై పెద్దదెబ్బే వేశారు. ఈ నేపథ్యంలో కొందరు దుకాణాలు మూసేసుకుంటుండగా.. తెగిస్తున్న కొందరికి చావు బెదిరింపులు అందుతున్నాయట. అయితే సమకాలీన అంశాలపై నిత్యం స్పందించే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఈ సీరియస్ పరిణామంపై తనదైన శైలిలో ఓ ట్విటర్ పోల్ నిర్వహించారు. ఒకవేళ మీరు గనుక అఫ్గనిస్తాన్‌లో ఓ షేవింగ్ రేజర్ కంపెనీ సేల్స్ పర్సన్ అయ్యి ఉంటే.. ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు? అంటూ నాలుగు ఆఫ్షన్లు ఇచ్చారాయన. ఒకటి.. బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఎయిర్‌పోర్ట్‌కు తిరుగు టపా కట్టడం, రెండు.. ఆ ఆదేశాల్ని మార్చేలా లాబీయింగ్ చేయడం, మూడు.. గడ్డం సంరక్షణ కోసం కొత్త ప్రొడక్ట్‌ను కనుగొనడం, నాలుగు.. మీ ముందు ఇంకేమైనా మార్గం ఉందా? అని అడిగారు. అఫ్కోర్స్.. దానికి నెటిజన్స్ కూడా అంతే ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారనుకోండి. Imagine you’re a salesperson in Afghanistan for a Shaving Razor company, which of the following options would you pursue? 1) Pack your bags, head for the Airport 2) Lobby for a modification in this order 3) Invent a disruptive new product for beard-care 4) Other? https://t.co/MVIO9wUShu — anand mahindra (@anandmahindra) September 27, 2021 I will introduce new range of Beard care and essential… like Gillett did from sword to razor 🪒 — Saurabh Jain (@mrsaurabhj) September 27, 2021 Color for Beard -- time for Godrej to put up Hair Dye color factory :-) — Equiideas (@Equiideas09) September 27, 2021 Will take over and start manufacturer of gun 😃 — InduKalpa (ইন্দুকল্প) (@indukalp) September 27, 2021 Here we have options to choose But their they don't have any option They only have rules to follow 😜 — Sumit Koushik (@sumitkoushik1) September 27, 2021 ‘Others’ option includes hand cutting, limbs cutting & death by hanging from crane. So choose your option carefully if opting for OTHERS. — Devesh Dhingra (@Dev_Dh14) September 27, 2021 ఇదిలా ఉంటే అఫ్గన్ హెల్మండ్ ప్రావిన్స్‌లో మగవాళ్లు స్టైల్‌గా క్రాఫ్ చేయించుకోవడం, గడ్డం తీసేయడాన్ని నిషేధిస్తూ ఫత్వా జారీ చేసింది తాలిబన్ సంస్థ. అంతేకాదు ఇస్లామిక్ ఓరియెంటేషన్ మంత్రిత్వ శాఖ సెలూన్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి.. కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు ఆ ఆదేశాల్ని ఎదురు ప్రశ్నించడానికి వీల్లేదని కూడా పేర్కొంది. ఇక ఆ ఆదేశాల్లో సెలూన్లలో పాటల్ని ప్లే చేయకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మరో బాంబు పేల్చిన తాలిబన్లు -
H1B Visa: హెచ్1బీ వీసాలపై గుడ్‌న్యూస్
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన నిషేధ కాలవ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీన్ని పొడిగించకూడదని బైడెన్ భావించినట్లు తెలిసింది. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బైడెన్ వద్దనుకోవడం.. టెక్ కంపెనీలకు మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేయడం తెల్సిందే. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బైడెన్ వ్యాఖ్యానించారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి. హెచ్1బీ ప్రాథమిక ఈ–రిజిస్ట్రేషన్ ఎంపిక పూర్తి రాబోయే ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ విదేశీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ íపీరియడ్‌లో సరిపడ్డా ఈ– అప్లికేషన్లు వచ్చాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. అమెరికాలో ఉద్యోగానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు ఎంతో కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని అమెరికా పౌరసత్వం మరియు వలసదారుల సేవా కేంద్రం (యూఎస్సీఐఎస్) పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు తప్పనిసరి. వీటికి కేవలం భారత్ నుంచే కాక పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. -
పోలింగ్‌కు 48 గంటల్లోపు మేనిఫెస్టోపై నిషేధం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు నిర్దేశించింది. అంతేకాదు, పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోను కూడా ఎన్నికల నియమావళిలో భాగంగా మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్–126 ప్రకారం.. ఒకే దఫా లేదా పలు దఫాలుగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలయ్యే సమయంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయరాదు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి అమలయ్యే ‘ఎన్నికల ప్రశాంత’ సమయంలో ఎటువంటి తరహా ప్రచారం చేయరాదని నిబంధనలు చెబుతున్నాయి’ అని ఎన్నికల సంఘం పేర్కొంది. దీని ప్రకారం, ఏప్రిల్ 11, 18, 23, 29, మే 6, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం కుదరదు. కాగా, ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో, 2014లో మొదటి విడత పోలింగ్ రోజునే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ చర్య ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందంటూ కాంగ్రెస్ అభ్యంతరం తెలపగా, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పోలింగ్‌కు 72 గంటల ముందు పార్టీలు మేనిఫెస్టో ప్రకటించడం సరికాదని ప్రత్యేక కమిటీ ఇటీవలే తన అభిప్రాయాన్ని ఈసీకి తెలిపింది. -
నేడు తెరుచుకోనున్న ‘శబరిమల’
శబరిమల: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమల అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో గత నెలలో పూజల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమ యింది. భారీగా పోలీసులను మోహరిం చడంతోపాటు ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది. మొత్తం 2,300 మంది పోలీసులను మోహరించింది. ఈ చర్యలపై పండాలం రాచ కుటుంబం, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆలయం వద్ద విధి నిర్వహణ నిమిత్తం యువ మహిళా జర్నలిస్టులను పంపవద్దని ‘శబరిమల కర్మ సమితి’ మీడియా సంస్థలను కోరింది. నేటి సాయంత్రం 5 గంటలకు.. ట్రావెన్కోర్ చిట్టచివరి రాజు తిరునాళ్ బలరామ వర్మ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించే శ్రీ చిత్ర అట్ట తిరునాళ్ పూజల కోసం నేటి సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. తాంత్రి కందారు రాజీవరు, ప్రధాన పూజారి ఉన్ని కృష్ణన్ నంబూద్రిలు ఆలయ ద్వారాలను తెరిచి, శ్రీకోవిల్‌లో దీపాలు వెలిగిస్తారు. మంగళవారం తిరునాళ్ పూజల అనంతరం రాత్రి 10 గంటలకు ఆలయాన్ని తిరిగి మూసివేస్తారు. మండల పూజల కోసం తిరిగి ఈ నెల 17న ఆలయాన్ని తెరిచి మూడు నెలలపాటు దర్శనం కోసం అనుమతిస్తారు. విధి నిర్వహణలో భాగంగా ఆలయం వద్దకు రుతుక్రమం వయసున్న మహిళా జర్నలిస్టుల ను పంపొద్దని వీహెచ్‌పీ, హిందూ ఐక్యవేదిక తదితర సంస్థలతో కూడిన ‘శబరిమల కర్మ సమితి’ మీడియా నిర్వాహకులను కోరింది. 50 ఏళ్ల లోపు మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించిన పక్షంలో పరిస్థితి చేయిదా టిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియా సంస్థల ఎడిటర్లకు లేఖలు పంపింది. పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. -
వచ్చేవారం మళ్లీ నిషేధం
వలసలపై త్వరలో మరో ఉత్తర్వు: ట్రంప్ ► అప్పీలు కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన సర్కారు వాషింగ్టన్ : వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని శుక్రవారం ఆయన ప్రకటించారు. పాత ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేస్తామని వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అది చాలా తప్పుడు నిర్ణయం. దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైంది. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం’ తెలిపారు. ట్రంప్‌కు టెక్సస్ రాష్ట్రం మద్దతు మరోవైపు ట్రంప్ నిషేధ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రంప్ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ శుక్రవారం సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... ‘ట్రంప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్... వలసల ఉత్తర్వులపై ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు. మీడియా పట్ల ట్రంప్ విమర్శలపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ను ఆసక్తికరంగా స్పందించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఒకసారి ఏమన్నారంటే... రాజకీయ నాయకులు వార్తపత్రికల గురించి ఫిర్యాదు చేయడమంటే... సముద్రం గురించి నావికుడు ఫిర్యాదు చేయడమే’ అని పేర్కొన్నారు. మీడియాను విమర్శిస్తూ ట్రంప్ సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు.