Proud moment
-
అల్లు అర్జున్ను చూసి తండ్రిగా గర్వపడుతున్నా : అల్లు అరవింద్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నానని అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కొడుకు బన్నీపై ప్రశంసలు కురిపించారు. 'గతంలో నన్ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారు. నా సినిమాల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొంతమంది అయితే వాళ్ల పిల్లలకు నన్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని పరిచయం చేస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం ఉంటుంది? ఒక తండ్రిగా నాకు అది గర్వకారణం.బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు మరోసారి గర్వపడుతున్నా. ఇక నా మనవరాలు అల్లు అర్హ కూడా సినిమాల్లోకి వచ్చేసింది. సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో అర్హ కీలక పాత్రలో నటించింది. తనను స్క్రీన్‌పై చేసేందుకు మేమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
Kalvakuntla Kavitha: పుత్రోత్సాహంతో ఎమ్మెల్సీ కవిత
రాయదుర్గం: బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహంతో మురిసిపోయారు. పర్యావరణ పరిరక్షణపై ప్రాజెక్టులు రూపొందించిన తన కొడుకు ఆర్యను చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కొడుకుతో పాటు అక్కడ ఉన్న ఇతర విద్యార్థులను సైతం ఆమె అభినందించారు. ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో బుధవారం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిలకించారు. తన కుమారుడు కూడా ప్రాజెక్టును రూపొందించడం చూసి ఒక తల్లిగా గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. -
తండ్రిగా అక్షయ్ గర్వపడ్డవేళ..
విశాఖపట్నం: అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన(ఐఎఫ్ఆర్)లో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను గర్వ పడేలా చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా తన కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకొని మంచి బాలుడు అని అనడం తండ్రిగా గర్వపడే విషయమని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీ, ఆర్నవ్ చెవిని పట్టుకొన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు కూడా ఇది మరచిపోలేని సంఘటన అని, వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందని తల్లి ట్వింకిల్ కన్నా ట్విట్ చేశారు. ఐఎఫ్ఆర్-2016 బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు, ఐఎఫ్ఆర్-2016లో అత్యంత ముఖ్య ఘట్టం.. నౌకాదళ పాటవాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం సమీక్షించారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ఈ సమీక్ష చేశారు. సంప్రదాయబద్ధమైన 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించారు. అందులో పయనిస్తూ సముద్రజలాల్లో లంగరు వేసి ఉన్న 100 యుద్ధ నౌకల సామర్థ్యాన్ని సమీక్షించారు. వాటిలో భారత యుద్ధ నౌకలు 71 కాగా మిగిలినవి విదేశీ యుద్ధ నౌక లు. ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే యుద్ధ నౌకల్లో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. Proud moment in a father's life, when the Prime Minister pulls your son's ear in jest & calls him a good boy ;) pic.twitter.com/0NWRyDtWh6 — Ranjit Katiyal (@akshaykumar) February 6, 2016 When a picture is truly worth a thousand words.. #BigMoment https://t.co/WCXzdlaK52 — Twinkle Khanna (@mrsfunnybones) February 6, 2016