రాయదుర్గం: బీఆర్‌ఎస్ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుత్రోత్సాహంతో మురిసిపోయారు. పర్యావరణ పరిరక్షణపై ప్రాజెక్టులు రూపొందించిన తన కొడుకు ఆర్యను చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కొడుకుతో పాటు అక్కడ ఉన్న ఇతర విద్యార్థులను సైతం ఆమె అభినందించారు.
ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాలలో బుధవారం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిలకించారు. తన కుమారుడు కూడా ప్రాజెక్టును రూపొందించడం చూసి ఒక తల్లిగా గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment