Public Manifesto
-
గద్వాల్ పబ్లిక్ మేనిఫెస్టో
-
పటాన్ చేరు పబ్లిక్ మేనిఫెస్టో ఏ పార్టీకి ప్రజల ఓటు?
-
గ్రేటర్ హైదరాబాద్‌లో హీటెక్కిస్తున్న ఎన్నికల ప్రచారం
-
పబ్లిక్ మేనిఫెస్టో 14th March 2019
-
పబ్లిక్ మేనిఫెస్టో - వైఎస్ఆర్ జిల్లా
-
పబ్లిక్ మేనిఫెస్టో - కర్నూలు
-
పబ్లిక్ మేనిఫెస్టో నంద్యాల కర్నూలు జిల్లా
-
వైఎస్సార్సీపీ ప్రజా మేనిఫెస్టోకు శ్రీకారం
సాక్షి, శ్రీకాకుళం రూరల్: పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని కులాలు, వర్గాలకు ప్రాతినిథ్యం కల్పిస్తూ మేనిఫెస్టో రూపొందించనున్నామని శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం చెప్పారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్ప నకు జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతా రాం మాట్లాడుతూ జిల్లాలో వివిధ కులాలు ఉన్నాయని.. వారి సమస్యలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈనెల 5వ తేదీలోగా ప్రణాళిక తయారుచేసి మేనిఫెస్టో కమిటీకి అందిస్తామన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 70 శాతం మంది వ్యవసాయ ఆధారిత పంటలపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులను ఆదుకోవాలని ఆయన ప్రతిపాదిం చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఏడు వేల కుటుంబాలు వంశధార నిర్వాసితులుగా మిగిలిపోయిన విషయం గుర్తించి, పార్టీ అధికారంలోకి వస్తే ఆదుకుంటామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం నిర్వాసితులను ఆదుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని.. వారికి మంచినీటి సమస్య, రహదారి సమస్య తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీకూర్మం, శ్రీముఖలింగం పురాతన దేవాలయాలు అయినప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉన్నాయని, అక్కడ ప్రగతి పనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. వంశధార కుడి కాలువ, ఎడమ కాలువ అభివృద్ది చెందినప్పటికీ నేరేడి బ్రిడ్జి సమస్య తీవ్రంగా ఉందని, ఇది అంతర రాష్ట్ర సమస్యగా తీవ్రరూపం దాల్చిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. పలాస, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పాలని ఆయన కోరారు. ఉద్దానం పరిసర ప్రాంతాల్లో వారు పండించే పంటలు జీడిమామిడి, కొబ్బరి, ములక్కాడలు కాకుండా కొత్త పంటలు పండించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. జీడి పరిశ్రమకు ప్రత్యేకమైన బోర్డును రూపొందించాలని ఆయన మేనిఫెస్టోలో ప్రతిపాదించారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ తిలక్ మాట్లాడుతూ గ్రామస, నియోజకవర్గ, జిల్లాస్థాయి మేనిఫెస్టోలు రూపొందించాక రాష్ట్రస్థాయిలో మేనిఫెస్టోలు ఇచ్చే ప్రక్రియను దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టారని, ఆ విధంగానే రిమ్స్, అంబేద్కర్ యూనివర్సిటీలు వచ్చాయని గుర్తుచేసారు. పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదరి అప్పలరాజు మాట్లాడుతూ నవరత్నాలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించాలన్నారు. గార, శ్రీకాకుళం మండల పార్టీ నాయకులు పీస శ్రీహరి, మూకళ్ళ తాతబాబు, బీసీ సెల్ అధ్యక్షుడు సురంగి మోహన్‌రావు, లీగల్ సెల్ నాయకుడు రఘుపాత్రుని, మాజీ ఎంపీపీ మంజుల, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొన్నాడ రుసి, పార్టీ నాయకులు జేజే మోహన్‌రావు, పి.శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు క్రిష్ణమూర్తి, యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్, గిరిజన నాయకుడు ఎండయ్య తదితరులు తమ సూచనలు అందజేశారు. -
పబ్లిక్ మేనిఫెస్టో 23rd February 2019
-
పబ్లిక్ మేనిఫెస్టో 22nd February 2019
-
పబ్లిక్ మేనిఫెస్టో- విశాఖపట్నం
-
పబ్లిక్ మేనిఫెస్టో 20th February 2019
-
పబ్లిక్ మేనిఫెస్టో 19th February 2019
-
పబ్లిక్ మేనిఫెస్టో
-
పబ్లిక్ మేనిఫెస్టో - రాజమండ్రి
-
పబ్లిక్ మేనిఫెస్టో శ్రీకాకుళం జిల్లా
-
సాక్షి పబ్లిక్ మేనిఫెస్టో అనంతపురం
-
పబ్లిక్ మేనిఫెస్టో ముషీరాబాద్ నియోజకవర్గం
-
పబ్లిక్ మేనిఫెస్టో గుడిమల్కాపూర్ డివిజన్
-
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా- యాకుత్‌పురా
-
పబ్లిక్ మేనిఫెస్టో రాజేంద్ర నగర్ నియోజకవర్గం
-
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా- సికింద్రాబాద్
-
పబ్లిక్ మ్యానిఫెస్టో జనం సాక్షిగా - మహేశ్వరం
-
పబ్లిక్ మేనిఫెస్టో జనం సాక్షిగా - శేరిలింగంపల్లి
-
పబ్లిక్ మేనిఫెస్టో కూకట్పల్లి
-
పబ్లిక్ మేనిఫెస్టో కంటోన్మెంట్ - సికింద్రబాద్
-
ప్రజా మేనిఫెస్టో
పాలకుల ముందు ప్రజల మేనిఫెస్టో సిటీజనుల ఆకాంక్షలు, అభిప్రాయాల మేరకు రూపకల్పన మౌలిక సదుపాయాలు, పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానాంశాలు రూపొందించిన పలు స్వచ్ఛంద సంస్థలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. ప్రచారం పదునెక్కింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు అరచేతిలో అభివృద్ధి చూపిస్తున్నాయి. గ్రేటర్ ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అద్భుతాలు చేస్తామంటూ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. పార్టీల హామీలు, నాయకుల మాటలు శ్రద్ధగా, ఓపిగ్గా వింటున్న ప్రజలు ఏం అనుకుంటున్నారు? అసలు వారేం కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానమే ‘ప్రజా మేనిఫెస్టో’. అవును.. ప్రజలే తమ మేనిఫెస్టోను రూపొందించి పార్టీల ముందుంచితే ఎలా ఉంటుంది. అచ్చంగా అదే పనిచే శాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. ప్రజల పక్షాన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, కోవా, అప్సా, అభిప్రాయ్, బస్తీ వికాస్ మంచ్, లెట్స్ ఓట్, యునెటైడ్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సెల్ఫ్ హెల్ప్, ఛత్రి... తదితర 15కు పైగా స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి. మౌలిక సదుపాయాలు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం.. తదితర అంశాలపై ‘ప్రజా మేనిఫెస్టో’ను రూపొందించి పార్టీల ముందుంచాయి. ముఖ్యాంశాలు.. ► విశాలమైన రోడ్లు, పాదచారులకు అనుగుణంగా ఫుట్‌పాత్‌లు. ఆక్రమిత ఫుట్‌పాత్‌ల పరిరక్షణ. ► మురుగు, వర్షపు నీటిని బయటకు పంపేందుకు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. ► ప్రతి వార్డుకు ఒక పార్కు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతను స్థానికులకే అప్పగించాలి. ప్రతి వార్డులో ఒక ఆటస్థలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదం చేసే ఆటలను ప్రోత్సహించాలి. ► అన్ని కాలనీలు, ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వీటి నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ► ప్రతి రోజు ఒక వ్యక్తికి 100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలి. ► చెత్త సేకరణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ► నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కాలుష్యం దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలి. ► దోమలు, కుక్కలు, పందుల బెడదను తొలగించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ► ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సేవలన్నింటినీ జీహెచ్ఎంసీలోని ప్రత్యేక విభాగం కింద చేర్చి 24 గంటల పాటు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ► ఆస్తిపన్నుపై శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలి. అవినీతి లేని, పారదర్శక పరిపాలనను అందజేయాలి. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి. ► అన్ని విభాగాల్లో పౌరసేవా పత్రం అమలు. ► వార్డు కమిటీల్లో పార్టీ కార్యకర్తలు, బంధుగణాలకు తావు లేకుండా చూడాలి. చట్టంలో పేర్కొన్న విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు ఉండాలి. ► కార్పొరేటర్లకు ఏడాదికి కేటాయించే రూ.కోటి నిధులతో చేపట్టే పనుల వివరాలను వార్డు కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మురికి వాడల అభివృద్ధి, పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ► హుస్సేన్‌సాగర్, మూసీ నది ప్రక్షాళనను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. చార్మినార్ పరిరక్షణ, సుందరీకరణ చర్యలు చేపట్టాలి. అక్రమ కట్టడాలను అరికట్టాలి. సంబంధిత అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.