Purnacandar Rao
-
పోలీసు ఉద్యోగ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రాత పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పరిశీలకులు, సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్లు, పరీక్షాకేంద్రాల సిబ్బందికి జేఎన్టీయూహెచ్లో మంగళవారం అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న ఎస్ఐ సివిల్ విభాగానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, ఎస్ఐ కమ్యూనికేషన్స్ విభాగానికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న కానిస్టేబుల్ పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ, 25న ఎస్ఐ సీటీవో పరీక్షలను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బయో ఇన్విజిలేషన్ ద్వారా వేలిముద్రలను సేకరిస్తున్నామని, తరువాత నిర్వహించబోయే దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలతో సరిపోల్చడం ద్వారా నకిలీల ఆట కట్టిస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్లతో మాత్రమే పరీక్ష రాయాలని సూచించారు. అనంతరం పరీక్షల కో ఆర్డినేటర్ ఎన్.వి.రమణరావు, కో-కోఆర్డినేటర్ జి.కె.విశ్వనాథ్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బంది విధి విధానాల గురించి వివరించారు. పరీక్షలకు ముందు, తరువాత తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. -
ఇక స్మార్ట్‌గా బస్ టికెట్
-
ఇక స్మార్ట్‌గా బస్ టికెట్
స్మార్ట్‌ఫోన్ ద్వారా బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ప్రారంభించిన ఎండీ పూర్ణచందర్రావు రిజర్వేషన్ కేంద్రాలపై తగ్గనున్న ఒత్తిడి సాక్షి, హైదరాబాద్: ఇకపై ఆర్టీసీ ప్రయాణం మరింత సులభతరమైంది. జేబులో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ కేంద్రాల వద్ద పడిగాపులు అవసరం లేదు. 30 రోజు ల అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలుకొని, అప్పటికప్పుడు బయలుదేరే బస్సులకూ రిజర్వేషన్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్‌లోకి తెచ్చే పథకాన్ని ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్రావు సోమవారం బస్‌భవన్‌లో ప్రారంభించారు. దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులందరికీ టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు ఎండీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ టీఎస్ఆర్టీసీ బస్ డాట్ ఇన్’’ ద్వారా, ఏపీ ప్రయాణికులు ‘‘డ బ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్ డాట్ ఇన్’’ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం తో రిజర్వేషన్, ఏటీబీ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశముంటుందని అంచనా. ప్రయా ణానికి గంట ముందు కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రతి రోజూ లక్షా 41 వేల టికెట్లు ఆర్టీసీలో ప్రతి రోజూ లక్షా 41 వేల సీట్లు అడ్వాన్స్, కరెంట్ బుకింగ్‌ల ద్వారా నమోదవుతున్నాయి. వీటిలో 45 వేల టికెట్లు ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓపీఆర్ఎస్) ద్వారా భర్తీ అవుతున్నాయి. వీటిలో 13,743 టికెట్లు ఆర్టీసీ బస్స్టేషన్లలోని రిజర్వేషన్ కేంద్రాల ద్వారా, 16,578 టికెట్లు ఏటీబీ ఏజెంట్ల ద్వారా బుక్ అవుతుండగా, ఇంటర్నెట్ ఈ-బుకింగ్ ద్వారా 13,235, ఇతర ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్స్ ద్వారా 1,444 బుక్ అవుతున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లో సైతం అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సులు నడిచే అన్ని ప్రాంతాలకు ఈ స్మార్ట్‌ఫోన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. -
ఆర్టీసీ విభజనలో వుళ్లీ కదలిక
అధికారులతో నిపుణుల కమిటీ భేటీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులపై ఆరా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విభజన ప్రక్రియులో వుళ్లీ కదిలిక వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన వ్యవహారాలను పర్యవేక్షించే నిపుణుల కమిటీ వుంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావుతో పాటు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో భేటీ అయిన కమిటీ సభ్యులు.. సంస్థ విభజనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరించారు. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య, రెండు రాష్ట్రాల వుధ్య ఉద్యోగుల పంపిణీకి ప్రాతిపదిక, ఉన్నతస్థారుు అధికారుల కేటారుుంపు, ఆర్టీసీ డిపోల సంఖ్య, బస్సుల సంఖ్య, వాటి కేటారుుంపులు, ఆస్తులు, అప్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో విభజనకు సంబంధించి ఆర్టీసీ అంతర్గత కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను కూడా అధికారులు కమిటీ వుుందుంచారు. ఉవ్ముడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది.