అధికారులతో నిపుణుల కమిటీ భేటీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులపై ఆరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) విభజన ప్రక్రియులో వుళ్లీ కదిలిక వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజన వ్యవహారాలను పర్యవేక్షించే నిపుణుల కమిటీ వుంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావుతో పాటు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో భేటీ అయిన కమిటీ సభ్యులు.. సంస్థ విభజనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరించారు.
సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య, రెండు రాష్ట్రాల వుధ్య ఉద్యోగుల పంపిణీకి ప్రాతిపదిక, ఉన్నతస్థారుు అధికారుల కేటారుుంపు, ఆర్టీసీ డిపోల సంఖ్య, బస్సుల సంఖ్య, వాటి కేటారుుంపులు, ఆస్తులు, అప్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో విభజనకు సంబంధించి ఆర్టీసీ అంతర్గత కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను కూడా అధికారులు కమిటీ వుుందుంచారు. ఉవ్ముడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఆర్టీసీ విభజనలో వుళ్లీ కదలిక
Published Wed, Jul 2 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement