puspa
-
పుష్ప-2 మూవీ స్టిల్స్.. ఫోటోలు షేర్ చేసిన రష్మిక
-
పుష్ప 2రిలీజ్ పై సూపర్బ్ అప్డేట్ ఇచ్చిన కేశవ
-
మరో డైరెక్టర్ ని పాన్ ఇండియా కి తీసుకు వెళ్లనున్న అల్లు అర్జున్
-
అల్లు అర్జున్ సెంటిమెంట్ ప్లాన్ అదుర్స్ ఇక పుష్ప2 కలెక్షన్ ఊచకోతే
-
సత్తిగాని రెండెకరాలు
-
పుష్ప2 మూవీను మలుపు తిప్పనున్న రణవీర్ సింగ్
-
హత్యా..? ఆత్మహత్యా?
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో ఆదివారం ఉదయం అదృశ్యమైన తోట వంశీ(19) అనే యువకుడు, మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో రైల్వేట్రాక్‌పై సోమవారం శవమై కనిపించాడు. తల, మొండెం వేరయ్యాయి. తల్లిందండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పథకం ప్రకారం ఎవరైనా హత్య చేశారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనేది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోదావరిఖని సీతానగర్‌లో తోట సత్యనారాయణ-పుష్ప దంపతులకు శ్రావణ్‌కుమార్, సాయికుమార్, వంశీ ముగ్గురు సంతానం. సత్యనారాయణ ఆటోరిక్షా డ్రైవర్. పుష్ప కూరగాయల మార్కెట్లో కూలీ. పదో తరగతి వరకు చదివిన చిన్న కొడుకు వంశీ(19) లారీపై పని చేస్తున్నాడు. ప్రేమ వ్యవహారంలో గొడవలు.. తన కాలనీలోని ఓ యువతిని వంశీ ప్రేమించాడనే విషయంలో కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి గతంలో కోర్టు వరకు వెళ్లాయి. కొంతకాలం తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. యువతి చైన్‌ను వంశీ తీసుకున్నాడని వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం పంచాయితీ చేయడానికి పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వంశీ ఆచూకీ లభించలేదు. సిమ్ ఆధారంగా సమాచారం.. బల్లార్ష రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లాట్‌ఫాం చివరన రైలు పట్టాలపై వంశీ మృతదేహం ఉందని రైల్వే పోలీసులు సోమవారం సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. మృతదేహం వద్ద మూడు రైల్వే టిక్కెట్లు, సెల్‌ఫోన్ సిమ్ లభించాయి. సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మూడు రైల్వే టిక్కెట్లలో రెండు టిక్కెట్లు రామగుండం నుంచి బల్లార్ష వరకు, ఒక టిక్కెట్ కాగజ్‌నగర్ నుంచి బల్లార్ష వరకు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల ప్రాతంలో గోదావరిఖనికి చెందిన ఓ యువకుడికి బల్లార్షలో కనిపించినట్లు తెలిసింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బల్లార్ష ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని గోదావరిఖనికి తరలించారు. -
చిన్నారులకు పుష్పగుచ్ఛం
బ్యాచ్‌లర్ ఆఫ్ సోషల్ వర్క్... గ్రాడ్యుయేషన్ విషయంలో ఇలాంటి కోర్సును ఎంచుకునేవారు కచ్చితంగా ప్రత్యేకమైన వ్యక్తులే అయి ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైనవారిలో ఒకరు నేపాల్‌కు చెందిన పుష్ప బస్నెత్. సోషల్‌వర్క్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన పుష్ప, గత ఏడు సంవత్సరాలుగా తన సేవాకార్యక్రమాలతో పీహెచ్‌డీల స్థాయికి ఎదిగింది. గ్రాడ్యుయేషన్ రోజుల్లో తన కాలేజీ అసెస్మెంట్లో భాగంగా పుష్ప... ఖాట్మండులోని మహిళా కేంద్ర కారాగాన్ని సందర్శించింది. జైళ్లలో వాస్తవ పరిస్థితులను గమనించిన పుష్ప దృష్టి అక్కడున్న చిన్నారుల మీద పడింది. వారి గురించి వాకబు చేస్తే... వారి తల్లులు వివిధ నేరాలు చేసి జైలు శిక్షను అనుభవిస్తున్నారనీ, సంరక్షణకు మరో మార్గం లేక ఆ పిల్లలను కూడా జైలులోనే ఉంచామని అధికారులు వివరించారు. ఆ చిన్నారుల పరిస్థితిని చూసి పుష్ప ఆవేదన చెందింది. వారి పసిప్రాయం జైలులోనే గడిచిపోవడం దురదృష్టకరం అనిపించింది. ఏదోవిధంగా ఆ చిన్నారులకు జైలు నుంచి విముక్తి కల్పించి, బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలని కృత నిశ్చయురాలైంది. చిన్నారులను సంర క్షించే బాధ్యత స్వీకరిస్తానని ఆమె ముందుకొచ్చింది. జైలు అధికారులతో, ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడింది. అయితే అటు అధికారులు గాని, ఇటు పిల్లల తల్లిదండ్రులు గాని స్పందించలేదు. ఆఖరికి పుష్ప తల్లిదండ్రులు కూడా ... చక్కగా చదువుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోమన్నారు. పుష్ప మాత్రం తను సోషల్‌వర్క్‌లో డిగ్రీ పుచ్చుకున్నది సాధారణ ఉద్యోగాల కోసం కాదన్నట్టుగా స్నేహితుల, దాతల సహకారంతో ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్మెంట్ సెంటర్’ (ఈసీడీసీ) ను స్థాపించింది. తనే కర్త, కర్మ, క్రియగా మొదలైన ఈ స్వచ్ఛంద సేవాసంస్థ కార్యకలాపాల్లో భాగంగా... మొదటగా జైలు నుంచి ఐదుగురు పిల్లలను తెచ్చుకుని పగలంతా తన దగ్గర పెట్టుకుని సాయంత్రానికి వదలి రావడం ప్రారంభించింది. అలా మొదలైన పుష్ప శిక్షణ ఇప్పుడు దాదాపు వందమంది చిన్నారులకు ఉచితంగా వసతి, ఆహారం, చదువు, వైద్య సేవలను అందించడం వరకు విస్తరించింది. ఈ సేవాకార్యక్రమాలతో పుష్పకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉన్నవారిగా సీఎన్ఎన్ చానల్ కొంతమందికి ఇచ్చే ‘హీరోస్’ గుర్తింపుతో పాటు, ప్రోత్సాహకంగా వారు ఇచ్చే మూడు లక్షల డాలర్లను బహుమతిగా అందుకుంది. శ్రీకృష్ణ జన్మస్థానంలో బాల్యం గడపాల్సిన బాలలకు స్వేచ్ఛను, విముక్తిని ప్రసాదించి, విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఈ పుష్పం చిన్నారుల పాలిట సేవాగుచ్ఛం.