quarterly earnings report
-
రూ.3,793 కోట్లు లాభం.. ఏసీలకు గిరాకీ
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ (పీజీసీఐఎల్) సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.3,793 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.3,781 కోట్లతో పోలిస్తే కేవలం రూ.12 కోట్లు పెరిగింది. ఆదాయం రూ.11,530 కోట్ల నుంచి రూ.11,846 కోట్లకు వృద్ధి చెందింది. స్థిరాస్తుల స్థూల విలువ రూ.2,78,983 కోట్లకు చేరింది. సెప్టెంబర్ క్వార్టర్లో రూ.38,575 కోట్ల విలువ చేసే ఎనిమిది ప్రాజెక్టులకు పవర్‌గ్రిడ్ విజయవంతమైన బిడ్డర్‌గా అర్హత సాధించింది.రూ.4.5 డివిడెండ్..వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. అలాగే పవర్‌గ్రిడ్ కాలా అంబ్ ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ పర్లి ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ వరోరా ట్రాన్స్మిషన్, పవర్‌గ్రిడ్ జబల్పూర్ ట్రాన్స్‌మిషన్‌ను పవర్‌గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (పీజీఇని్వట్)కు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర పెద్దగా మార్పుచెందకుండా రూ.318 వద్ద క్లోజ్ అయింది. బ్లూస్టార్ ఆకర్షణీయ ఫలితాలుకూలింగ్ ఉత్పత్తుల సంస్థ బ్లూస్టార్ లిమిటెడ్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.71 కోట్ల నుంచి రూ.96 కోట్లకు దూసుకుపోయింది. 35 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,276 కోట్లుగా నమోదైంది. బలమైన ఆర్డర్ల పైప్‌లైన్‌తో అన్ని విభాగాల్లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు.. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ కొనసాగినట్టు బ్లూస్టార్ తెలిపింది. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, వాణిజ్య ఏసీ సిస్టమ్స్ ఆదాయం 33 శాతం పెరిగి రూ.1,428 కోట్లకు చేరింది. ఈ విభాగం మార్జిన్లు 2.2 శాతం బలపడ్డాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టుల విభాగంలో తయారీ రంగం, డేటా సెంటర్ల నుంచి వృద్ధి కనిపించింది. యూనిటీ ప్రొడక్టుల (రూమ్ ఏసీలు కూడా) ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.767 కోట్లుగా నమోదైంది. ప్రొఫెషనల్ ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్ సిస్టమ్స్ ఆదాయం స్వల్పంగా క్షీణించి రూ.80 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఏసీల వ్యాపారం సానుకూలంఅన్ని విభాగాల్లోనూ అవకాశాలు ఆశావహంగా ఉన్నట్టు, రూమ్ ఏసీలు, వాణిజ్య ఏసీల వ్యాపారం మంచి పనితీరు చూపిస్తున్నట్టు సంస్థ చైర్మన్, ఎండీ ఎస్ అద్వానీ తెలిపారు. 2024–25 సంవత్సరం పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. డైరెక్టర్ పీవీ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ప్రాజెక్టులు, సొల్యూషన్లు) నియమించినట్టు సంస్థ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్లూస్టార్ షేరు ఒక శాతానికి పైగా పెరిగి రూ.1,878 వద్ద క్లోజ్ అయింది. -
టాటా స్టీల్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్‌కు లాభాలు
టాటా స్టీల్ సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.759 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,511 కోట్ల నష్టం ఎదురుకావడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,910 కోట్ల నుంచి రూ.54,503 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వ్యయాలు రూ.55,853 కోట్లుగా ఉంటే, సమీక్షా త్రైమాసికంలో రూ.52,331 కోట్లకు పరిమితమయ్యాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,806 కోట్ల మూలధన వ్యయాలను వెచ్చించింది. కంపెనీ నికర రుణభారం రూ.88,817 కోట్లుగా ఉంది. కంపెనీ వద్ద రూ.26,028 కోట్ల లిక్విడిటీ ఉంది. టాటా స్టీల్ యూకే ఆదాయం 600 మిలియన్ పౌండ్లుగా ఉంటే, 147 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నష్టం నమోదైంది. నెదర్లాండ్ కార్యకలాపాల నుంచి 1,300 మిలియన్ పౌండ్ల ఆదాయం రాగా, 22 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ కళింగనగర్ ప్లాంట్ ప్రారంభమైనట్టు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహణ వాతావరణం ఎంతో సంక్లిష్టంగా ఉన్నట్టు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో వృద్ధి స్దబ్దుగా ఉన్నట్టు అంగీకరించారు. యూకే ప్రభుత్వంతో నిధులపై ఒప్పందాన్ని చేసుకున్నామని, గ్రీన్ స్టీల్‌కు మళ్లే దిశగా పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేరు ధర ఒక శాతం లాభపడి రూ.154 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్.. ఫర్వాలేదుగల్ప్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.84 కోట్లకు, ఆదాయం 6 శాతం పెరిగి రూ.849 కోట్లకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.74 కోట్లు, ఆదాయం రూ.802 కోట్లుగా ఉండడం గమనార్హం. అనిశి్చత మార్కెట్ పరిస్థితుల్లో మంచి పనితీరు చూపించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్జిన్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టామని, దీంతో స్థూల మార్జిన్లలో మెరుగుదల నమోదైనట్టు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ గంగ్వాల్ తెలిపారు. లాభదాయకత పెంచుకోవడం ద్వారా వాటాదారులకు మరింత విలువ సమకూర్చుతామని ప్రకటించారు. డిమాండ్‌పై సానుకూల అంచనాలతో ఉన్నామని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత లూబ్రికెంట్ల రంగంపై విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. పటిష్ట ఫలితాలతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 6 శాతం ఎగసి రూ.1,263 వద్ద ముగిసింది. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జెన్ టెక్, తాజ్ జీవీకే, రేమండ్ ఫలితాలు
ఆటో, టెలికం రంగ బ్యాటరీల తయారీ దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 233 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, నిల్వలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,372 కోట్ల నుంచి రూ. 4,450 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,044 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు పెరిగాయి. తయారీ వ్యయాలు, నిల్వల పద్దు రూ. 107 కోట్ల నుంచి రూ. 229 కోట్లకు పెరిగింది. కాగా.. ద్విచక్ర, కార్ల విభాగాలలో రీప్లేస్మెంట్ మార్కెట్ నుంచి భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు ఎక్సైడ్ పేర్కొంది. ఇండస్ట్రియల్– యూపీఎస్, సోలార్ విభాగంలోనూ డిమాండ్ నెలకొన్నప్పటకీ హోమ్ యూపీఎస్ విభాగం మందగించినట్లు వెల్లడించింది.జెన్ టెక్నాలజీస్ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జెన్ టెక్నాలజీస్ ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 242 కోట్లకు పెరిగింది. లాభం రూ. 17 కోట్ల నుంచి రూ.65 కోట్లకు ఎగిసింది. ప్రథమార్ధానికి సంబంధించి ఆదాయం రూ. 196 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు, లాభం రూ. 64 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి తమ ఆర్డర్ బుక్ రూ. 957 కోట్ల స్థాయిలో పటిష్టంగా ఉందని సంస్థ సీఎండీ అశోక్ అట్లూరి తెలిపారు. తాజ్ జీవీకేప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆదాయం రూ. 107 కోట్లుగా, లాభం సుమారు రూ. 20 కోట్లుగా (స్టాండెలోన్ ప్రాతిపదికన) నమోదైంది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 90 కోట్లు కాగా, లాభం రూ. 11 కోట్లు. తాజ్ డెక్కన్ హోటల్ పునరుద్ధరణ పనులు పూర్తవడంతో రాబోయే త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. బెంగలూరులోని యెలహంకలో నిర్మిస్తున్న 253 గదుల తాజ్ హోటల్‌ను 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్రేమండ్రేమండ్ లిమిటెడ్ సెపె్టంబర్ త్రైమాసికానికి రూ.59 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.161 కోట్లతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గిపోయింది. మొత్తం ఆదా యం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.512 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,101 కోట్లకు చేరింది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ వ్యాపారాల్లో మంచి వృద్ధిని చూసినట్టు సంస్థ చైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా ప్రకటించారు. థానేలో రిటైల్ స్పేస్ ప్రాజెక్ట్ పార్క్ అవెన్యూని ప్రారంభించినట్టు చెప్పారు. -
ఏబీబీ ఇండియా, ఐఆర్‌ఎప్‌సీ ఫలితాలు
ఎలక్ట్రిఫికేషన్, ఆటోమేషన్ దిగ్గజం ఏబీబీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. జులై–సెప్టెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతం జంప్‌చేసి రూ.440 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ.362 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ.2,846 కోట్ల నుంచి రూ.3,005 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 11 శాతం అధికంగా రూ.3,342 కోట్ల విలువైన ఆర్డర్లు అందుకుంది. దీంతో మొత్తం ఆర్డర్ల విలువ రూ.9,995 కోట్లకు చేరింది. ఇది 25 శాతం వృద్ధి.ఇదీ చదవండి: ఐపీఓకు సిద్ధమవుతున్న కంపెనీలివే..ఐఆర్ఎఫ్సీ లాభం ప్లస్ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీ..ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ.1,613 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.1,545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.6,762 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ.5,218 కోట్ల నుంచి రూ.5,288 కోట్లకు స్వల్పంగా పెరిగాయి. మినీరత్న కంపెనీ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 2024 సెప్టెంబర్‌కల్లా రూ.4,62,283 కోట్లకు చేరాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 0.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరు ఇలా..
ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?డాబర్ లాభం నేలచూపుఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది. -
రోడ్డున పడనున్న 'యాహు' ఉద్యోగులు!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం యాహు కంపెనీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల సంఖ్యలో భారీగా కోత విధించనుంది. నేడు త్రైమాసిక లాభాల రిపోర్టు విడుదల చేసిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. సంస్థలో పనిచేసే 15 శాతం ఉద్యోగులు.. దాదాపు 1600 మందికి పైగా ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తోందని యాహు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మరిస్సా మేయర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. మేనేజ్ మెంట్ మార్పుల్లో భాగంగా డైరెకర్టపై ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తోంది. యాహూ లాభాలు క్రమక్రమంగా తగ్గుతున్నందున సంస్థ నిర్వహణ ఖర్చును అదుపులో పెట్టేందుకు ఉద్యోగులను తీసేయడం మార్గంగా ఎంచుకుంది. చాలా మార్పులు రావాలని స్టార్ బోర్డ్ భావిస్తోంది. గతేడాది డిసెంబర్ లో యాహు కంపెనీలో ఓ ఇన్వెస్టర్ స్ప్రింగ్ ఓల్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ను నియమించడంతో పాటు 80శాతం ఉద్యోగాలకు కోతపెట్టింది. చైనాకు చెందిన అలిబాబా కంపెనీలో తన వాటాలు విక్రయించవద్దని నిర్ణయించుకుంది. గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో యాహు ఫలితాలు సాధించలేదన్న విషయం తెలిసిందే. ఉద్యోగులపై వివక్ష చూపిస్తోదంటూ, చట్టాలను ఉల్లంఘిస్తుందన్న ఆరోపణలతో యాహుకే చెందిన ఓ ఉద్యోగి సిలికాన్ వ్యాలీలోని ఫెడరల్ కోర్టులో సొంత సంస్థపై దావా వేశాడు. సరిగ్గా అదేరోజు కంపెనీ ఉద్యోగుల కోత విషయం బయటకు రావడంతో సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. యాహు ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది.