వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
జి.మాడుగుల (విశాఖపట్టణం జిల్లా) : జి.మాడుగుల మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ నీలమ్మ(45) ఆదివారం ఉదయం 11 గంటలకు వడదెబ్బకు గురై మృతిచెందింది. మట్టి కందకాలు తవ్వే పనులకు వెళ్లిన నీలమ్మ ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలింది. తోటి కూలీలు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆమె అక్కడే కన్నుమూసింది.