raghunadh reddy
-
రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సమ్మిళిత అభివృద్ధి, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుసార్లు ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని కోరారని గుర్తుచేశారు.ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం ఏపీ ప్రజల్ని మోసం చేయడం, వారికి అన్యాయం చేయడమేనని అన్నారు. టీడీపీ మద్దతుతోనే కేంద్రం ప్రభుత్వం నడుస్తున్నందున హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలన్నారు. విశాఖలో రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏపీలో నాలుగు నూతన ఓడరేవుల నిర్మాణం ప్రారంభం కావడంతోపాటు ఆరు ఓడరేవుల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. నూతన ఓడరేవుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రసారాలు నిలిపివేసిన టీవీ ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని కోరారు.దాడుల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందిరాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి పార్టీల నేతలు చేస్తున్న దాడుల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. దాడుల్ని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలైమనందున కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. దాడులు పునరావృతం కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని కోరారు. -
సీఎం జగన్ కి మా కృతజ్ఞతలు
-
రైతులకు సకాలంలో అందిస్తాం
► పంట రుణం రూ.3939.58 కోట్లు ► ఖరీఫ్ సీజన్‌కు రూ. 2954.28 కోట్లు ► రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు ► లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి వెల్లడి కడప అగ్రికల్చర్: ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు రైతులకు భారీగానే ఇవ్వాలని బ్యాంకర్లు సంకల్పించారు. సీజన్ ప్రారంభానికి ముందే రుణాలు అందించడానికి ప్రణాళికలు తయారు చేశాం.. అని జిల్లా లీడ్‌బ్యాంకు చీఫ్ మేనేజర్ లేవాకు రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం కడప నగరం ఏడురోడ్ల కూడలిలోని బ్యాంకు కార్యాలయంలో ఆయన సాక్షితో మాట్లాడారు. ఈ ఏడాది పంట రుణాలు మొత్తం రూ.3939.58 కోట్లుగా ఖరారు చేశామన్నారు. ఇందులో ఖరీఫ్ సీజన్‌కు రూ. 3939.58 కోట్లు, రబీ సీజన్‌కు రూ.985.30 కోట్లు ఇవ్వాలని ప్రణాళికలు తయారు చేశామన్నారు. అలాగే వ్యవసాయంలో దీర్ఘకాలిక రుణాలు రూ.321.75 కోట్లు, వ్యవసాయ గోడౌన్ల నిర్మాణాలకు, ఇతర అభివృద్ధి పనులకుగాను రూ.144.68 కోట్లు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు, బిజినెస్ సెంటర్లకుగాను రూ.79.61 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.5085.63 కోట్లు ఖర్చు చేయాలని బ్యాంకులకు చెప్పామన్నారు. అప్రాధాన్యత రంగాలకు రూ. 853.57 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మే నెల 1 వ తేదీ నుంచి రుణాలను రైతులకు ఇవ్వాలని అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ఏడాది అన్ని రకాల పంట రుణాలు కలిపి రూ.5900 కోట్లకుగాను, రూ.5483 కోట్ల రుణాలు అందించారని అన్నారు. ఈ ఏడాది ముందుగా కొత్త రుణాలు రెన్యూవల్ చేయాలని బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ఆదేశాలు ఇచ్చారన్నారు. రైతులు పంట సాగు సమయంలో కాకుండా రుణాలు ఇచ్చే మొదటి నుంచే రెన్యూవల్ చేసుకోవడం, కొత్త రుణాలు తెచ్చుకుంటే బ్యాంకర్లకు ఒత్తిడి తగ్గుతుందన్నారు. అలాగే రైతులకు కూడా ఒక వైపు వర్షాలు పడుతుంటే, మరోవైపు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవడం, ఇంకో వైపు రుణాల కోసం వెంపర్లాడడం కంటే ముందుగానే రుణాలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు.