Rai
-
'ఆజాదీ'కి.. ఓ పర్యాయపదం..
నియంతలకు భయమెప్పుడూయుద్ధమంటేనో, బాంబులంటేనో కాదు..ప్రశ్నలంటే, ప్రశ్నించే శక్తులంటేనే!నాగులు కోరల్లో విషముంచుకుని బుసకొట్టేదిబలముందని కాదు..కాలి చెప్పుల అదుళ్లకు అదిరిన భయంతోనే...అబద్ధాలతో రొమ్మిరిచి నిలబడొచ్చనుకునే వాళ్ళు సత్యం ముందు కురుచనవుతున్నామని తెలిస్తే...కుట్రల చిట్టా పేరుస్తారు నిన్ను చిన్నగా చూపడానికి!సముద్రం తన గర్భాన రేగు అగ్నిపర్వతాల అలజడులను..అగుపడకుండా దాచగలదేమో కానీ బద్దలవకుండా ఆపలేదు!ఎగిసి పడే లావాను అడ్డుకోనూ లేదు!!అరుంధతీ...నీ గొంతెప్పుడూ ఏకాకి కాదు,వేల గొంతులు నినదిస్తాయి ఆజాదీ కోసం..నీ భుజమెప్పుడూ ఒంటరీ కాదు,మా భుజాలను నీ భుజంతో అంటుకడతాం ఆజాదీ కోసం..నీ అడుగులెప్పుడూ ఖాళీగా ఉండవులక్షలాదిగా నీ అడుగుల్లో అడుగులేస్తూ ప్రవహిస్తాం!మానవత్వపు పరిమళాలను పంచే ఆజాదీ కోసం..అరుంధతీ...నీ పేరిపుడు ‘ఆజాదీ’కి..ఓ పర్యాయపదం!– దిలీప్. వి, 8464030808 (హక్కుల గొంతుక అరుంధతీ రాయ్‌కి మద్దతుగా...) -
Mohit Rai: స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా..
స్టార్స్‌ని వాళ్లు పోషించే పాత్రలకు తగ్గట్టుగా.. వాళ్లు అటెండ్ అయ్యే ఈవెంట్లకు అనుగుణంగా తీర్చిదిద్దడమంటే అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు! కానీ దాన్ని అవలీలగా చేసేసే స్కిల్ పేరే మోహిత్ రాయ్!‘స్టయిలిస్ట్ బై డే, బ్యాట్మన్ బై నైట్’ అని తనను తాను వర్ణించుకునే మోహిత్ రాయ్ స్వస్థలం ఢిల్లీ. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. వెంటనే హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్లో ఫ్యాషన్ స్టయిలిస్ట్‌గా ఉద్యోగం దొరికింది. అక్కడ మూడేళ్లు పనిచేశాక ముంబైకి మకాం మార్చాడు. అక్కడైతే అవకాశాలు ఎక్కువుంటాయని. అక్కడ ‘ద వార్డ్‌రోబిస్ట్’లో క్రియేటివ్ డైరెక్టర్‌గా చేరాడు.రెండేళ్లకు ‘హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా’లో ఫ్యాషన్ డైరెక్టర్‌గా కొలువు దొరికింది. అప్పుడే.. ‘ఫాలో మీ టు’ ఫొటో సిరీస్‌తో ఫేమస్ అయిన రష్యన్ ఫొటోగ్రాఫర్ మురాద్ ఉస్మాన్ తన భార్య నటాలియాతో ఇండియా వచ్చాడు. ఆ ఇద్దరితో అద్బుతమైన కవర్ షూట్ చేయించాడు హార్పర్స్ బజార్ కోసం. అది వైరల్ అయి మోహిత్‌ని పాపులర్ చేసింది. ఆ ఖ్యాతిని తన అంట్రప్రెన్యూర్షిప్కి పిల్లర్‌గా వేసుకున్నాడు. ‘ఎమ్ఆర్ (మోహిత్ రాయ్) స్టయిల్స్’ను స్థాపించాడు.ఈ సంస్థ స్టార్ స్టయిలింగ్, సెలబ్రిటీ వెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. దీని ద్వారానే మోహిత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అతను మొదట స్టయిలింగ్ చేసింది.. హీరోయిన్ సోనాక్షీ సిన్హాకు. తర్వాత చిత్రాంగదా సింగ్, కరీనా కపూర్, కంగనా రనౌత్, శిల్పా శెట్టిలాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరికో స్టయిలిస్ట్‌గా చేశాడు.ఎమ్ఆర్ స్టయిల్స్ బాధ్యతలు చూసుకుంటూనే తన స్నేహితుడు షోహ్న దాస్‌తో కలసి ‘గ్రెయిన్ ఫ్యాషన్ కన్సల్టెన్సీ’నీ ప్రారంభించాడు. పలు ఫ్యాషన్ లేబుల్స్‌కి డిజైన్, స్టయిలింగ్‌లో గైడెన్స్ ఇస్తుందీ సంస్థ.‘స్టార్‌కున్న ఇండివిడ్యువల్ స్టయిల్ అండ్ పర్సనాలిటీని ఎలివేట్ చేయటమే స్టయిలిస్ట్ జాబ్’అని నమ్మే మోహిత్ రాయ్‌ని ‘మీకిష్టమైన సెలబ్రిటీ ఎవరు’ అని అడిగితే ‘సోనాక్షి సిన్హా’ అని చెబుతాడు. ‘ఫ్యాషన్ విషయంలో సోనాక్షీ ఎక్స్పరిమెంటల్ అండ్ ఓపెన్. రెండేళ్లు ఆమెతో కలసి పనిచేశాను. స్టయిలిస్ట్‌ని నమ్ముతుంది. చెప్పేది వింటుంది. డిఫర్ అయితే డిస్కస్ చేస్తుంది. ఆ చర్చలు నాకెంతో ఉపయోగపడ్డాయి. నా పనిని మెరుగుపరచాయి. అందుకే సోనాక్షీ అంటే నాకు చాలా రెస్పెక్ట్’ అంటాడు మోహిత్ రాయ్."నా పనిని చూసుకున్న ప్రతిసారీ .. అరే ఇంతకన్నా బాగా చేసుండాల్సింది అనిపిస్తుంది. అందుకే రోజూ ఆత్మవిమర్శ చేసుకుంటాను. పొరపాట్ల నుంచి పాఠాలు గ్రహిస్తాను. దానివల్ల నా పనితీరు రోజురోజుకి మెరుగవుతుంది. సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నప్పుడు మన వర్క్ స్టయిల్ హార్డ్‌వర్క్ అండ్ స్మార్ట్వర్క్ల కాంబినేషన్‌గా ఉండాలి!" – మోహిత్ రాయ్ -
దేశంలో రిటైల్ పరిశ్రమ జోరు..19 శాతం వృద్ధితో
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ పరిశ్రమ తన జొరు కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల కాలంలో 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. కరోనాకు ముందు 2019 సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ వృద్ధి కనిపించింది. క్యూఎస్ఆర్, పాదరక్షల విభాగాలు ఈ కాలంలో బలమైన పనితీరు నమోదు చేయడం ద్వారా వృద్ధికి మద్దుతుగా నిలిచినట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. ఈ రెండు విభాగాల్లో అమ్మకాల వృద్ధి 30 శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా చూస్తే తూర్పు భారత్‌లో రటైల్ పరిశ్రమ 21 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతంలో 19 శాతం వృద్ధి కనిపించగా, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో 18 శాతం మేర పెరుగుదల నమోదైంది. సౌందర్య, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ పరిశ్రమల్లో వృద్ధి 2019 ఇదే కాలంతో పోల్చినప్పుడు కేవలం 7 శాతం నమోదైనట్టు రాయ్ తెలిపింది. వినియోగదారులు తిరిగి స్టోర్లకు వచ్చి షాపింగ్ చేస్తున్నారని, ఆన్లైన్లో కొనుగోళ్లను సైతం వారు ఆస్వాదిస్తున్నారని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ తెలిపారు. గడిచిన రెండేళ్లలో భారత రిటైల్ పరిశ్రమలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నట్టు రాయ్ చైర్మన్ బిజో కురియన్ తెలిపారు. ఆఫ్‌లైన్ రిటైలర్లు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం పెద్ద ఎత్తున పెరిగినట్టు చెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇతర మార్కెట్ల కంటే భారత్‌లో రిటైల్ పరిశ్రమ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుంది. ఓమ్నిచానల్ రిటైల్ (ఆఫ్‌లైన్, ఆన్లైన్) అన్నది రిటైలర్లకు సాధారణ నియమంగా మారింది’’అని కురియన్ వివరించారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) వల్ల లక్షలాది చిన్న వర్తకులు సైతం డిజిటల్ కామర్స్‌లో భాగస్వాములు అవుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
దేశంలో రిటైల్ జోరు: కోవిడ్ ముందుకంటే మెరుగ్గా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారాలు కోవిడ్ ముందస్తు స్థాయిల కంటే ఆరోగ్యకరమైన వృద్ధిని కొనసాగించాయి. 2019తో పోలిస్తే ఈ ఏడాది జూలై అమ్మకాలు 18 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బుధవారం తెలి పింది. ‘రిటైల్ వ్యాపారం తూర్పు భారత్‌లో అత్యధికంగా 25% వృద్ధి సాధించింది. దక్షిణాదిలో 21, ఉత్తరాది 16, పశ్చిమ భారత్‌లో 10% అధికమైంది. అత్యధికంగా 32 శాతం వృద్ధితో క్రీడా సామాగ్రి అమ్ముడైంది. పాదరక్షలు, ఫర్నీ చర్, గృహాలంకరణ వస్తువుల విభాగాలు ఒక్కొక్కటి 23 శాతం, దుస్తులు, వస్త్రాలు 22, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, గృహాపకరణాలు, ఎలక్ట్రానిక్స్ 17% దూసుకెళ్లాయి. ఆభరణాలు 15 శాతం, ఆహారం, సరుకులు 11, సౌందర్య సాధనాలు, వెల్నెస్, వ్యక్తిగత సంరక్షణ 3% పెరిగాయి. పండుగల సీజన్లో మెరుగైన విక్ర యాలు ఉంటాయని రిటైలర్లు ఆభాభావం వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారాలు 2019తో పోలిస్తే జూన్‌లో 13 శాతం ఎగశాయి. -
పుంజుకున్న రిటైల్ వ్యాపారం
న్యూఢిల్లీ: దేశీయంగా రిటైల్ వ్యాపారం గాడిన పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విక్రయాలు గతేడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 10 శాతం పెరిగాయని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శంగా పేర్కొంది. 2020 ఫిబ్రవరి విక్రయాలతో పోల్చి చూసినా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమ్మకాలు 6 శాతం అధికంగా నమోదైనట్టు వెల్లడించింది. రాయ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. పశ్చిమాదిన విక్రయాల్లో 16 శాతం వృద్ధి కనిపిస్తే.. తూర్పు భారతంలో 4 శాతం, ఉత్తరాదిన 17 శాతం, దక్షిణ భారత్‌లో 4 శాతం మేర అధిక అమ్మకాలు నమోదైనట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ‘‘ఈ గణాంకాలు రిటైల్ వ్యాపారంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలియజేస్తున్నాయి. కనిపిస్తున్న వృద్ధి ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసింది కాదు. కొన్ని విభాగాల్లో విక్రయాలు ఇంకా పరిమాణాత్మక వృద్ధి దశను చూడాల్సి ఉంది’’ అని రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ పేర్కొన్నారు. అధిక వృద్ధి ఈ విభాగాల్లోనే.. గడిచిన రెండు సంవత్సారాలలో ఫిబ్రవరి నెలతో పోల్చి చూసినప్పుడు చాలా విభాగాల్లో విక్రయాలు పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ 28 శాతం, ఫుడ్, గ్రోసరీ 19 శాతం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) విభాగాల్లో 16 శాతం చొప్పున ఈ ఏడాది ఫిబ్రవరిలో వృద్ధి నమోదైంది. వస్త్రాలు, పాదరక్షల విభాగాల్లోనూ రెండంకెల స్థాయిలో విక్రయాలు జరిగినట్టు తెలిపింది. ‘‘చాలా రాష్ట్రాలు ఇప్పుడు స్టోర్ సమయాలు, రిటైల్ కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేశాయి. దీంతో సాధారణ పరిస్థితులను ఆశించొచ్చు. కానీ ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌పై యుద్ధం వ్యాపారాలపై ప్రభావం చూపిస్తాయి’’ అని రాయ్ పేర్కొంది. -
గాడిలో పడ్డ వ్యాపారం
న్యూఢిల్లీ: రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగ్గా ఉన్నట్టు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (రాయ్) ప్రకటించింది. కరోనా ముందు నాటి విక్రయాల్లో 96 శాతానికి చేరుకున్నట్టు పేర్కొంది. 2020 సెపె్టంబర్లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 2021 సెపె్టంబర్లో 26 శాతం వృద్ధి కనిపించినట్టు తెలిపింది. దక్షిణాది 33 శాతం వృద్ధితో ముందుండగా.. తూర్పు భారత్‌లో 30 శాతం, పశి్చమ భారత్‌లో 26 శాతం చొప్పున అమ్మకాలు పుంజుకున్నాయి. ఉత్తరాదిలోనూ 16 శాతం అధికంగా అమ్మకాలు జరిటినట్టు తెలిపింది. వినియోగదారు సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోందని రాయ్ పేర్కొంది. ‘‘కన్జ్యూమర్ డ్యురబుల్స్, ఎల్రక్టానిక్స్, ఆహారం, గ్రోసరీ, క్విక్ సరీ్వస్ రెస్టారెంట్లు కరోనా ముందు నాటి స్థాయికి పూర్తిగా కోలుకున్నాయి. క్రీడా ఉత్పత్తులు, వ్రస్తాలు కూడా గణనీయంగా పుంజుకున్నాయి. సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు (సెలూన్, పాదరక్షలు, ఆభరణాలు) ఇంకా కరోనా ముందస్తు నాటికి చేరుకోవాల్సి ఉంది’’అని రాయ్ తెలిపింది. -
రిటైల్ అమ్మకాలు పుంజుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ విక్రయాలు గాడిన పడుతున్నాయి. కరోనా ముందు నాటి విక్రయాల్లో (2019 జూలై) 72 శాతానికి ఈ ఏడాది జూలైలో చేరినట్టు రిటైలర్ల జాతీయ సంఘం (రాయ్) తెలిపింది. రానున్న పండుగల సందర్భంగా విక్రయాలు మరింత జోరందుకుంటాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈఏడాది జూన్‌లో కరోనా ముందు నాటి విక్రయాల్లో 50 శాతానికి కోలుకున్నట్టు తెలిపింది. దక్షిణాదిన రిటైల్ అమ్మకాలు మరింత బలంగా ఉన్నట్టు వివరించింది. కరోనా ముందు నాటితో పోలిస్తే 82 శాతానికి పుంజుకున్నాయని తెలిపింది. పశ్చిమభారతావనిలో విక్రయాలు ఇంకా కోలుకోవాల్సి ఉందంటూ.. జూలైలో 57 శాతానికి చేరినట్టు వివరించింది. మహారాష్ట్రలో లాక్డౌన్లు సుదీర్ఘకాలం పాటు కొనసాగడమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. వేగంగా సేవలు అందించే రెస్టారెంట్ల వ్యాపారం (క్యూఎస్ఆర్) ఈ ఏడాది జూలైలో కరోనా ముందు నాటితో పోలిస్తే 97 శాతానికి చేరుకున్నట్టు రాయ్ తెలిపింది. ఆధునిక రిటైల్ వ్యాపారంపై ఆంక్షలను తొలగించి, సాఫీ కార్యకలాపాలకు వీలు కల్పిస్తున్నందున రానున్న పండుగల సీజన్లో విక్రయాలు గణనీయంగా పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్టు రాయ్ సీఈవో కుమార్ రాజగోపాలన్ వివరించారు. -
షాపింగ్ ఖర్చులు తగ్గించుకుంటాం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాక్డౌన్ తదనంతరం షాపింగ్ వ్యయాలను తగ్గించుకుంటామని అత్యధిక మంది కస్టమర్లు చెబుతున్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సర్వేలో తేలింది. లిట్మస్ వరల్డ్‌తో కలిసి ఆర్ఏఐ చేసిన ఈ సర్వేలో 4,239 మంది పాలుపంచుకున్నారు. షాపింగ్ వ్యయం తగ్గించుకుంటామని 78 శాతం మంది తెలిపారు. కొనుగోళ్లకు ఖర్చులు గణనీయంగా కోత పడుతుందని 41 శాతం మంది, కొంత మేర మాత్రమే తగ్గించుకుంటామని 37 శాతం మంది, గతంలో మాదిరిగానే వ్యయం చేస్తామని 16 శాతం మంది, భారీగా ఖర్చు పెట్టుకుంటామని 6 శాతం మంది వెల్లడించారు. లాక్డౌన్ తొలగించిన తర్వాత మూడు నెలల్లో దుకాణాలకు వెళతామని 62 శాతం మంది, 3 నెలల తర్వాత ఏడాది లోపు సందర్శిస్తామని 32 శాతం, ఏడాది వరకు దూరంగా ఉంటామని 6 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల్లో రిటైల్ స్టోర్లకు వెళ్లేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 75 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. కస్టమర్లలో విశ్వాసం పెంచాలి.. ఈ నేపథ్యంలో రికవరీ నెమ్మదిగా ఉంటుందని అసోసియేషన్ వ్యాఖ్యానించింది. కొన్ని నెలలుగా ఆదాయాలు లేకపోగా రిటైలర్లు నష్టపోయారని తెలిపింది. రిటైలర్లు భద్రత, శుభ్రత ప్రాధాన్యతగా తీసుకొని, కస్టమర్లలో విశ్వాసం పెంచాలని ఆర్ఏఐ సీఈవో కుమార్ రాజగోపాలన్ స్పష్టం చేశారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడరాదని సూచించారు. ఇక షాపింగ్ లిస్ట్ విషయంలో ఆహారోత్పత్తులు, దుస్తులకు ప్రాధాన్యత అని 52 శాతం మంది తెలిపారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ అని 31 శాతం, సౌందర్యం, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అని 25 శాతం మంది చెప్పారు. లాక్డౌన్ తదనంతరం మూడు నెలల్లో రిటైల్ ఎకానమీ తిరిగి పుంజుకుంటుందని లిట్మస్ వరల్డ్ మార్కెటింగ్ హెడ్ కుశాల్ తల్రేజా తెలిపారు. -
మళ్లీ వర్మతో... వివేక్ ఓబె'రాయ్'
కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాయ్’. వర్మ ‘రక్తచరిత్ర’లో నటించిన వివేక్ ఓబెరాయ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బెంగళూరులో విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ- ‘‘30 రూపాయలతో ప్రారంభమవుతుంది అతని జీవితం. 30 ఏళ్ల నేర జీవితంలో 30 వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇరవై హత్య కేసుల్లో నుంచి 21 నెలల్లో ఎలా బయటపడ్డాడు? ‘నేరస్థుడి జీవితం చీకటి’ అని చరిత్ర చెబితే, ‘కాదు. వేయి సూర్యుల వెలుగు’ అని ఎలా నిరూపించాడు? నేరాలు చేసినతణ్ణి కోట్ల మంది ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘యాభై ఐదు కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న చిత్రం ఇది. హిందీ హక్కులను రాజు చద్దా, సునీ లుల్లా, తమిళ హక్కులను సౌతిండియన్ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత చెప్పారు. ముత్తప్ప రాయ్, వివేక్ ఓబెరాయ్, దాసరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సరబ్జిత్ సోదరిగా 'ఐశ్వర్యరాయ్'
-
‘రేయ్’వర్కింగ్ స్టిల్స్