Rain water flow
-
నీళ్లలో కొట్టుకుపోయిన బైక్
-
అయోధ్య గర్భాలయంలోకి వర్షపు నీరు
అయోధ్య: హోరు వర్షం ధాటికి అయోధ్య రామాలయం గర్భాలయ నిర్మాణంలో లోపాలు వెలుగుచూశాయని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన భారీ వర్షం కారణంగా గర్భగుడిలో బాలరాముడిని పూజించేందుకు పూజారులు కూర్చునే చోట, దర్శనార్థం వీఐపీ భక్తులు వచ్చే మార్గంలోనూ వర్షపు నీరు లీక్ అవుతోందని దాస్ ఆరోపించారు. వర్షపు నీరు బయటకు వెళ్లడానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ గుడిలో లేదని తెలిపారు. దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ యాజమాన్యాన్ని ఆయన కోరారు. ‘‘ దేశవ్యాప్తంగా దిగ్గజ ఇంజనీర్లు అయోధ్య ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. జనవరి 22న ఆలయానికి ప్రాణప్రతిష్టచేశారు. ప్రపంచప్రఖ్యాత ఆలయం ప్రారంభమయ్యాక పడిన తొలి భారీ వర్షానికే నీరు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? అనుభవజు్ఞలైన ఇంజనీర్లు కట్టినా ఇలాంటి ఘటన జరగడం పెద్ద తప్పే’ అని అన్నారు. దీంతో హుటాహుటిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకున్నారు. తక్షణం కప్పుకు మరమ్మతులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ‘‘ ఆలయం మొదటి అంతస్తులో ఇంకా పనులు పూర్తికాలేదు. జూలైకల్లా పూర్తిచేస్తాం. డిసెంబర్‌కల్లా మొత్తం ఆలయనిర్మాణం పూర్తిఅవుతుంది’ అని వివరణ ఇచ్చారు. -
వానోస్తే బురదమయం.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు
చెన్నూర్: జిల్లాలోని పలు మున్సిపాల్టీల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. వానొస్తే బురదమయంగా మారి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షాలకు మురికి నీరంతా రోడ్లపై పారుతోంది. చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారి పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైపు మట్టి రోడ్డు ఉంది. వర్షం పడినప్పుడు బురదగా మారుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్ కాలనీకి వెళ్లే దారిలో కల్వర్టు పూర్తి కాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఎన్‌పీవాడ, దుబ్బాగూడెంలకు వెళ్లే దారిలో సిమెంట్ రోడ్డు శిథిలావస్థకు చేరింది. దీంతో వర్షపు నీరు నిలిచి నడక నరకప్రాయంగా మారింది. గాంధీచౌక్ నుంచి పద్మశాలి వీధికి వేళ్లే రోడ్డు మధ్యలో నీరు నిలుస్తోంది. పెద్దగూడెం, మారెమ్మవాడలలో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వర్షాలకు బురదమయంగా మారుతున్న రోడ్లను గుర్తించి అధికారులు కొత్త రోడ్ల నిర్మాణాలకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వర్షానికి కూలిన ఇళ్లు
కుల్కచర్ల : మండల పరిధిలోని అంతారం పంచాయతీ పరిధిలోని బింద్యంగడ్డ తండాలో వారం రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి మూడు ఇళ్లు కూలిపోయాయి. బింద్యం గడ్డ తండాకు చెందిన లక్ష్మణ్‌నాయక్, నీల్యనాయక్, శంకర్‌నాయక్‌ల మూడు ఇళ్లు కూలిపోయాయి, ఇళ్లు కూలడంతో ఉండటానికి ఇళ్లు లేకుండా అయిందని ప్రభుత్వం ఆదుకోని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరుతున్నారు. -
వేములవాడలో రాకపోకలు బంద్
వేములవాడ(కరీంనగర్): ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలమవుతోంది. కరీంనగర్-వేములవాడ రహదారిపైకి భారీగా వరద నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వేములవాడ సమీపంలోని శాభాష్‌పల్లి వంతెన పైకి శుక్రవారం సాయంత్రం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. వంతెనకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.