Raitu
-
ప్రజాభిప్రాయం మేరకే ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్‌లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు. -
రైతులను మోసం చేసింది మీ బాబే రామోజీ
సాక్షి, అమరావతి: రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానాలను అప్పట్లో తుంగలో తొక్కినా రామోజీరావు తన పత్రికలో ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఇచ్ఛిన హామీలకంటే మిన్నగా రైతులకు ఈ ప్రభుత్వం సాయం చేస్తుంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. దుష్ప్రచారమే లక్ష్యంగా అబద్ధాలను పోగేసి ‘సున్నా వడ్డీలో మహా మోసం’ అంటూ మరో కథనాన్ని శనివారం ఈనాడు పత్రిక అచ్చేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పైసా భారం పడకుండా ఉచిత పంటలబీమా, సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, సకాలంలో సున్నా వడ్డీ రాయితీ సహా రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నా నిజాలను వక్రీకరించి వక్రరాతలు రాసేసింది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగు వేళ తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో శ్రీకారం చుట్టింది. రూ. లక్ష లోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాక మునుపే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించడం కోసం ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. గతంలో రైతుపైనా వడ్డీ భారం గతంలో రూ. లక్ష లోపు పంట రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తే, మిగిలిన 4 శాతం వడ్డీని రైతులు భరించేవారు. ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవి. గతంలో క్లయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే అధికారం ఉండేది. దీంతో ఎంత మంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. పారదర్శకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాలు) పోర్టల్ ((https://karshak.ap.gov.in/ysrsvpr/))లో ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఏడాదిలోగా రూ. లక్ష లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, ఒక వేళ జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాలో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వంప్రతీ ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తోంది. రైతులలో జవాబుదారీతనాన్ని పెంచడం, సకాలంలో రుణ చెల్లింపు అలవాటు పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలకే జమ చేస్తోంది. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లింపు టీడీపీ ఐదేళ్ల హయాంలో సుమారు 40.61 లక్షల మందికి కేవలం రూ. 685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 4.5 ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 39.08 లక్షల మంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిలున్నాయి. కాగా రబీ 2021–22, ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాయితీ సొమ్మును డిసెంబర్లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడ్డీ రాయితీని సకాలంలో అందించడమే కాదు. రైతులకు సంస్థాగత రుణాలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2019 ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటి వరకు రూ. 8,24,428 కోట్ల పంట రుణాలను ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించారు. అంతేకాదు వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా 14 లక్షల మంది కౌలురైతులకు రూ. 8,054 కోట్ల వ్యవసాయ రుణాలు అందించింది. ఈ ఏడాది అత్యధికంగా 8.22 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, వారిలో ఇప్పటికే 4.88 లక్షల మందికి రూ.1,385.25 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. అంతేకాదు.. రైతు భరోసా కింద 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ. 33,209.81 కోట్లు, రాయితీపై విత్తన సరఫరా కోసం 74.45 లక్షల మందికి రూ. 1,316.57 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.50 లక్షల మందికి రూ. 7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్లు చెల్లించి రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. మరో వైపు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తోంది. -
రైతు భరోసా కేంద్రాల సేవలు భేష్
జరుగుమల్లి (టంగుటూరు): ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయని బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వైస్ ప్రెసిడెంట్, అగ్రి బిజినెస్ హెడ్ ఆశిష్ అగర్వాల్‌లు ప్రశంసించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని రైతు భరోసా కేంద్రాన్ని అగ్రి నేషనల్ ఇన్సూరెన్స్ మేనేజర్ సుదేష్ణ, బజాజ్ ఇన్సూరెన్స్ స్టేట్ మేనేజర్ శాంతి భూషణ్, ఒంగోలు ఏడీఏ బి.రమేష్ బాబుతో కలిసి గురువారం వారు సందర్శించారు. రబీ సీజన్ పంటల బీమాకు సంబంధించి (ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ–క్రాప్ నమోదు, పంట కోత ప్రయోగాలు తదితర వివరాల గురించి వ్యవసాయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఏ ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయని రైతులను ఆరా తీశారు. పంట సాగు చేసిన వెంటనే ఈ–క్రాప్‌లో వివరాలు నమోదు చేయించుకుంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టం సంభవిస్తే బీమా వర్తిస్తుందని రైతులకు వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులను పంపిణీ చేస్తున్న తీరు, గత సంవంత్సరం రబీలో ఈ–క్రాప్ నమోదు చేయించుకున్న రైతుల రశీదులను ఈ సందర్భంగా వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని వారు కొనియాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిష్ అగర్వాల్ తదితరులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి స్వర్ణలత, ఏఈవో ఎన్.వెంకటేశ్వర్లు, వీఏఏ ఎల్.ప్రైసీ రీమల్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. -
43 లక్షల మందికి ‘వైఎస్సార్ రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 43 లక్షల మందికి సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకానికి కౌలు రైతులు దరఖాస్తు చేసుకోవడానికి మరో నెల పొడిగించామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకానికి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. మార్కెటింగ్ సీజన్ ప్రారంభం అయ్యిందని, పత్తి కొనుగోలుకు సీసీఏ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వేరుశనగకు కూడా త్వరలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ విషయంలో నిరంతరం సమీక్ష చేస్తున్నామన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు. అపరాల బోర్డు ఏర్పాటు చేయబోతున్నామని.. వాటికి కూడా గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని.. దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో నేరుగా రైతులే పాల్గొనేందుకు చర్యలు చేపడతామన్నారు. బయో ప్రొడక్ట్స్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, దానిపై కూడా చర్యలు చేపట్టేందుకు చర్చిస్తామన్నారు. కౌలు రైతుల విషయంలో రికార్డుల సమస్యలు ఉన్నాయని..వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎంవీఎస్ నాగిరెడ్డి వెల్లడించారు. -
పోలీస్ థ్రిల్లర్...
ఫ్లాష్.. ఫ్లాష్.... సృజనాత్మక దర్శకుడిగా పేరొందిన కృష్ణవంశీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాలకృష్ణ 100వ చిత్రంగా ‘రైతు’ ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం కృష్ణవంశీకి వచ్చినట్లు ఆ మధ్య కృష్ణానగర్ గుప్పుమంది. అయితే, క్రిష్ దర్శకత్వంలో చారిత్రక కథ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ అనుకోకుండా తెర మీదకు వచ్చింది. దాంతో, కృష్ణవంశీ సారథ్యంలోని ‘రైతు’ ప్రాజెక్ట్‌ను తన 101వ సినిమాగా బాలకృష్ణ చేయాలనుకుంటున్నట్లు ఆంతరంగిక వర్గాల కథనం. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ తక్షణమే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దాని గురించి ‘సాక్షి’ ఆరా తీస్తే, ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ‘గోవిందుడు అందరి వాడేలే’ తరువాత కొంతకాలంగా రకరకాల స్క్రిప్ట్‌లు తయారుచేసుకుంటూ కృష్ణవంశీ బిజీగా గడిపారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ, వివిధ భాషల్లో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ భారీ చిత్రాన్ని తీయాలని మొదట్లో ఆయన అనుకున్నారు. అయితే, మరింత సమయం పట్టే ఆ కథను ప్రస్తుతానికి పక్కనపెట్టి, ఒక పోలీస్ యాక్షన్ స్టోరీని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఒక యువ పోలీసు అధికారి పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ భారీ బడ్జెట్ వాణిజ్యపంథా చిత్రానికి యువ హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నారు. ఊహించని అనేక ట్విస్టులు, కావలసినంత నాటకీయత, బోలెడన్ని యాక్షన్ సన్నివేశాలు - ఈ కథలో ఉంటాయట. ‘‘పోలీస్ నేపథ్యంలో చాలా వాస్తవికంగా ఉండే కథ ఇది. చాలా రోజులుగా మదిలో మెదులుతున్న ఈ స్క్రిప్ట్ సందీప్ కిషన్‌తో అయితే బాగుంటుందని కృష్ణవంశీ భావించారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో దర్శకుడు, హీరో చాలా ఉత్సాహంగా ఉన్నారు’’ అని ఆంతరంగిక వర్గాలు పేర్కొన్నాయి. కృష్ణవంశీ పరిచయం చేసిన ఒక హీరోయిన్ ఈ సినిమాలో కీలక పాత్ర ధరిస్తున్నారు. మరో హీరోయిన్ను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అలాగే, పరభాషకు చెందిన ఒక ప్రముఖ కథానాయకుడు గౌరవపాత్ర ధరించనున్నారు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్‌కు కావాల్సిన పోలీస్ అనుమతులు, వగైరాల కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ నెల 27 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలే షూటింగ్ జరిగే ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణం వహించనున్నారు. ఈ హాలీవుడ్ తరహా థ్రిల్లర్‌ను శరవేగంతో పూర్తిచేసి, ఆగస్టు 15కి కానీ, దసరాకి కానీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరిన్ని వివరాల కోసం, క్రియేటివ్ దర్శకుడి కొత్త వెండితెర విశ్వరూపం కోసం మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే! -
రైతు రాజ్యం 26th March 2015
-
రైతు రాజ్యం 9th March 2015
-
రైతు రాజ్యం 3rd February 2015
-
రైతు రాజ్యం 19th January 2015
-
రైతు రాజ్యం 16th Jan 2015
-
రైతు రాజ్యం 14th January 2015
-
రైతు రాజ్యం 13th January 2015
-
రైతు రాజ్యం 12th January 2015
-
రైతు రాజ్యం 9th January 2015
-
రైతు రాజ్యం 8th Jan 2015
-
రైతు రాజ్యం 7th January 2015
-
రైతు రాజ్యం 6th Jan 2015
-
రైతు రాజ్యం 6th January 2015
-
రైతు రాజ్యం 5th Jan 2015
-
రైతు రాజ్యం 5th January 2015
-
రైతు రాజ్యం 31st December 2014
-
రైతు రాజ్యం 30th Dec 2014
-
రైతు రాజ్యం 30th December 2014
-
రైతు రాజ్యం 29th December 2014
-
రైతు రాజ్యం 26th Decembeer 2014
-
రైతు రాజ్యం 25th December 2014
-
రైతు రాజ్యం 22nd December 2014
-
రైతు రాజ్యం 18th Dec 2014
-
రైతు రాజ్యం 17th December 2014
-
రైతు రాజ్యం 15th December 2014
-
రైతు రాజ్యం 12th December 2014
-
రైతు రాజ్యం 11th December 2014
-
రైతు రాజ్యం 10th December 2014
-
రైతు రాజ్యం 8th December 2014
-
రైతు రాజ్యం 6th December 2014
-
రైతు రాజ్యం 5th Dec 2014
-
రైతు రాజ్యం 4th December 2014
-
రైతు రాజ్యం 3rd Dec 2014
-
రైతు రాజ్యం 3rd december 2014
-
రైతు రాజ్యం 2nd Dec 2014
-
రైతు రాజ్యం 2nd December 2014
-
రైతు రాజ్యం 28th November 2014
-
రైతు రాజ్యం 27th November 2014
-
రైతు రాజ్యం 26th November 2014
-
రైతు రాజ్యం 25th November 2014
-
రైతు రాజ్యం 24th November 2014
-
రైతు రాజ్యం 21st November 2014
-
రైతు రాజ్యం 20th November 2014
-
రైతు రాజ్యం 19th November 2014
-
రైతు రాజ్యం 18th November 2014
-
రైతు రాజ్యాం 17th November 2014
-
రైతు రాజ్యం 14th Nov 2014
-
రైతు రాజ్యం 14th November 2014
-
రైతు రాజ్యం 13th November 2014
-
రైతు రాజ్యం 12th November 2014
-
రైతు రాజ్యం 10th November 2014
-
రైతు రాజ్యం 7th November 2014
-
రైతు రాజ్యం 6th November 2014
-
రైతు రాజ్యం 5th November 2014
-
రైతు రాజ్యం 4th November 2014
-
రైతు రాజ్యం 3rd November 2014
-
రైతు రాజ్యం 31st Oct 2014
-
రైతు రాజ్యం 17 October 2014
-
రైతు రాజ్యం 16th Oct 2014
-
రైతు రాజ్యం 16th OCtober 2014
-
రైతు రాజ్యం 15th October 2014
-
రైతు రాజ్యం 14th October 2014
-
రైతు రాజ్యం 10th October 2014
-
రైతన్న రాజ్యం 11th Aug 2013
-
రైతన్న రాజ్యం 4th Aug 2013
-
రైతురాజ్యం 28th July 2013
-
Raitanna Rajyam 27th July 2013
-
రైతన్న రాజ్యం 13th May 2013