ramalingareddi
-
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
మిరుదొడ్డి: హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విధిగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. శనివారం మిరుదొడ్డి, చెప్యాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను హరితహారం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొక్కలను నాటి సంరక్షిస్తేనే మానవ మనుగడ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పంజాల కవిత, జెడ్పీటీసీ సభ్యురాలు లింగాల జయమ్మ, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నంట బాపురెడ్డి, వైస్ చైర్మన్ వంజరి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు గొట్టం భైరయ్య, ధార స్వామి, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలసత్వం వహిస్తే సహించేది లేదు ఇంకుడు గుంతల నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మండల అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యపు ధోరణి వీడి ప్రజా సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయాలన్నారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పార్కు ప్రారంభం
బెంగళూరు : మారుతీమందిర వార్డులోని కెనరాబ్యాంక్ కాలనీలో ఏర్పాటుచేసిన పార్కును ఆదివారం రాష్ట్ర రవాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి, కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ ప్రారంభించారు. ఈ పార్కును రెండన్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించారు. ఇందులో యువకులు, వయోవృద్ధులు వ్యాహ్యాళికి వెళ్లడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటపరికరాలు ఉన్నాయి. మహాత్మాగాంధీతో పాటు ఇతర నాయకులు విగ్రహాలతోపాటు కెనరాబ్యాంక్ వ్యవస్థాపకులు అమ్మెంబల్ సుబ్బారావ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కును వినియోగించుకుని ఆహ్లాదం పొందాలని పేర్కొన్నారు. అంతకు ముందు నగరమేయర్ శాంతకుమారి వినాయక లేఔట్లో ఉన్న పార్కులో పొడిచెత్తను వేరుచేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ వీ.సోమణ్ణ, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ, డెప్యూటీమేయర్ కే.రంగణ్ణ, స్థానిక కార్పొరేటర్లు వాగీశ్ప్రసాద్, మోహన్‌కుమార్, ఉమేష్ శెట్టి పాల్గొన్నారు. -
చెత్త ఉద్యోగులపై చర్యలు
సీఎం సిద్ధరామయ్య హెచ్చరిక ‘బీవీజీ’ నిర్లక్ష్యం వల్లే చెత్త సిటీగా బెంగళూరు నిర్లక్ష్యపు గుత్తేదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోండి సాక్షి, బెంగళూరు : చెత్త సేకరణ, నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. మరోసారి బెంగళూరులో చెత్త సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. స్థానిక మహాలక్ష్మి లే అవుట్లో రూ.3 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల బెంగళూరు చెత్తసిటీగా పేరు తెచ్చుకోవడానికి చెత్త నిర్వహణ పనులు దక్కించుకున్న బీవీజీ సంస్థ నిర్వాహకమే కారణమని ఆరోపించారు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం బీబీఎంపీ పరిధిలో 130 వార్డులో చెత్త తొలగింపు పనులను కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. ఈ చెత్త నిర్వహణలో విఫలమైన గుత్తేదారులపై చట్టపరమైన చర్యలకు వెనకాడవద్దని అధికారులను హెచ్చరించారు. పన్నుల వసూలు విషయంలో సంబంధిత అధికారులకు విధించించిన లక్ష్యాలను వెంటనే పూర్తి చేయూలన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి.. వాననీటిలో కొట్టుకుపోయి ఓ చిన్నారి మరణించిన ఘటనకు సంబంధించి ఒక్కరికి కూడా శిక్షపడలేదని గీతాలక్ష్మి ఉదంతాన్ని ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య ఉటంకించారు. ఇదే సంఘటన పాశ్చాత్య దేశాల్లో జరిగితే సంబంధిత అధికారికి ఎంతటి కఠిన శిక్ష విధించే వారో ఊహించలేనిదని బీబీఎంపీ అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు హితవు పలికారు. కార్యక్రమంలో మేయర్ శాంతకుమారి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.