Ranil Vikram Singha
-
#SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది... ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే... 2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి. 2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది. చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీ కప్పులో తుపాను వివాదం
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కచ్చతీవు వివాదం వార్తల్లో ఉంటుంది. పరిమిత రాజకీయ జీవితకాలం ఉన్న ఈ అంశాన్ని భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునేవారు గమనించాల్సింది, నాయకుల మధ్య వ్యక్తిగత సమీకరణాలు విధాన మార్గదర్శ కాలుగా పనిచేశాయి. దానివల్ల వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. కాబట్టి గత నిర్ణయాల పట్ల అర్థంలేని వివాదాలు ప్రయోజనం చేకూర్చవు. ఇంకా ముఖ్యంగా, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ ఒక వారం క్రితం భారత ఎన్నికల వేదికపై కచ్చతీవు వివాదం విరుచుకుపడినప్పుడు, 1994 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జేఎన్ దీక్షిత్‌తో మూడు దశాబ్దాల క్రితం గడిపిన సాయంత్రాల వైపు నా మనస్సు మళ్లింది. కొలంబోలో ఉన్న సమయంలో ‘వైస్రాయ్’ నామ కరణం పొందిన దీక్షిత్ 1985 నుండి 1989 వరకు భారత హైకమిషనర్‌గా, ఒక రకంగా మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన సహ చరులు చాలామంది, విదేశీ వ్యవహారాల రహస్యాలను తాము చని పోయేంతవరకు దాచిపెడుతున్న సమయంలో, దౌత్యంపై జాతీయ మీడియాలో రాజకీయ కాలమ్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ విదేశాంగ కార్యదర్శి జేఎన్ దీక్షిత్. నేను దీక్షిత్‌తో గురుగావ్‌లో గడిపాను. శ్రీలంకలో తాను పని చేసిన సంవత్సరాల గురించి ఆయన ఒక పుస్తకం రాయాలను కున్నారు. ఆయన పదవీకాలం భారత్, శ్రీలంక సంబంధాలలో అక్ష రాలా అత్యంత విస్ఫోటనా కాలం. ఇది జనావాసాలు లేని కచ్చతీవు ద్వీపంపై ప్రస్తుత టీకప్పులో తుపాను లాంటిది కాదు. అవి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన హెచ్చు తగ్గులతో కూడి, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎదుర్కొంటున్న దురదృష్టకరమైన సంవత్సరాలు. విదేశీ సంబంధాలలో ఇటు వంటి అస్థిరత చివరికి రెండేళ్ల వ్యవధిలోనే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస విషాద హత్యలకు దారితీసింది. దీక్షిత్‌కు జనాల కోసం రాయడం గురించి సందేహాలున్నాయి. రచయితగా మారే క్రమంలో నాలాంటి చాలామంది జర్నలిస్టులను ఆయన రప్పించుకున్నారు. ‘అసైన్ మెంట్ కొలంబో’ శీర్షికతో శ్రీలంకపై రాస్తున్నానంటూ దీక్షిత్ వెల్లడించిన పుస్తకం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. అధికారిక రహస్యాల చట్టంలోని నిబంధనలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఆయన దానిని జ్ఞాపకాల నుండి మాత్రమే రాయాలనుకున్నారు. ఈలోగా, అంతగా వివాదాస్పదం కాని మరో మూడు పుస్తకాలను ప్రచురించారు. ఒక సాయంత్రం, శ్రీలంక సందర్శనకు విచ్చేసిన ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందానికి తాను ఏర్పాటు చేసిన రిసెప్షన్ గురించి ఆయన నాకు చెప్పారు. హైకమిషనర్ ప్రత్యేక అతిథిగా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి సిరిమావో బండారు నాయకే ఆ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన వారి మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది. కొంచెం మత్తులో ఉన్న భారతీయ సందర్శకులలో ఒకరు, సిరిమావో బండారునాయకే అధికారంలో ఉన్నప్పుడు ద్వీపంలో అంతర్యుద్ధం చెలరేగి ఉండినట్లయితే, ఎల్టీటీఈ అగ్రనేత వేలుపిళ్లై ప్రభాకరన్ విషయంలో ఆమె ఏమి చేసి ఉండే వారంటూ చికాకు కలిగించే ప్రశ్నను అడిగారు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, బండారునాయకే ఇలా తిప్పికొట్టారు: ‘నేను న్యూఢిల్లీలో ఉన్న మా సోదరికి ఫోన్‌చేసి, ఈ ప్రభాకరన్ అనే వ్యక్తినీ, లంక తమిళ సమస్యకు అతని రకమైన పరిష్కారాన్నీ నేను క్రమబద్ధీ కరించేటప్పుడు ఈ అంశంపై దృష్టిసారించకుండా వేరే వైపు చూడ మని అడిగి ఉంటాను.’ ఆ ‘సోదరి’ మరెవరో కాదు, ఇందిరా గాంధీ. అనూహ్యంగా, శ్రీలంక జాతి కలహాల సమయంలో కొలంబోలో భారతదేశ మొదటి కార్యదర్శిగా ఉన్న నిరుపమారావు ఆ సమయంలో తన ప్రాణాలకు ముప్పు కలిగే స్థితిలో ఉన్నారు. ఏప్రిల్ 1న కచ్చతీవు వివాదం చెలరేగిన కొన్ని గంటల్లోనే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంటులో నిరుపమ వ్యాఖ్యానిస్తూ, తనను 1983లో ఉన్నట్లుండి శ్రీలంక నుండి స్వదేశం పంపించి వేశారని రాశారు. ‘1974 ఒప్పందం ముగింపులో ఇందిరా గాంధీ, సిరిమావో బండారునాయకే మధ్య వ్యక్తిగత సమీకరణం నిర్ణయాత్మక పాత్ర పోషించింది’ అని రాశారు. కచ్చతీవు చర్చల విషయంలో తనను రక్షించాల్సిందిగా ఇందిరకు బండారునాయకే వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారనీ, లేకుంటే ఆమెకు రాజ కీయంగా విపత్తు తప్పేది కాదనీ నిరుపమ చెప్పారు. దశాబ్దాల తర్వాత పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో దీక్షిత్ దీన్నే చెప్పారు. తరు వాత నిరుపమారావు 2004 నుండి 2006 వరకు కొలంబోలో హై కమిషనర్‌గా పనిచేశారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పార్థ ఘోష్ ఇలా రాశారు: ‘బండారునాయకే దుఃస్థితిని ఇందిరా గాంధీ స్పష్టంగా గ్రహించారు. భారత ప్రతినిధి బృందం ప్రతిస్పందించకముందే పరిస్థితిని తారుమారు చేశారు. ఇందిర ప్రదర్శించిన ఈ ఔదార్యపు సంకేతాన్ని బండారునాయకే 1990 చివరిలో ఎంతో కృత జ్ఞతతో గుర్తు చేసుకున్నారు.’ ఘోష్ ఆ సంవత్సరాన్ని 2000 అని పేర్కొని ఉండాలి, అంటే బండారునాయకే ప్రధానమంత్రిగా తన చివరి పదవీకాలం పూర్తయ్యే వరకు అన్నమాట. ఒక దశాబ్దం పాటు శ్రీలంక ఏకైక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె కుమార్తె చంద్రికా కుమారతుంగ కూడా భారత్ 1974లో ప్రదర్శించిన ఈ స్నేహ పూర్వకమైన సంకేతాన్ని మరచిపోలేదు. కొలంబోలో తనకంటే ముందే పనిచేసిన దీక్షిత్, నిరుపమా రావు కాలం నుండి కచ్చతీవు విషయంలో పెద్దగా మార్పు రాలేదనే వాస్త వాన్ని అమృత్సర్ నుండి బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తరణ్‌జిత్ సింగ్ సంధూ కూడా ధృవీకరించగలరు. సం«ధూ 2000 నుండి 2004 వరకు శ్రీలంకలో భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గానూ, హైకమిషనర్‌గానూ పనిచేశారు. 2017లో సంధు భారత హైకమిషన్ లో బాధ్యతలు స్వీకరించి నప్పుడు, శ్రీలంక బీజింగ్ అందాలకు పడిపోయింది. భారత ప్రభావ పరిధిలో ఉండటం మానేసింది. అధ్యక్షుడిగా మహింద రాజపక్స చైనా అనుకూల విధానాలను కలిగి ఉన్నప్పటికీ, తరణ్‌జీత్ సింగ్ సంధూ, ప్రతిపక్ష నాయకుడిగా రాజపక్సను ఒకసారి కాదు రెండుసార్లు భారత్‌ను సందర్శించేలా చేసే ఆహ్వానం కోసం పట్టుబట్టారు. ఆ రెండు సార్లలో మొదటి సందర్శన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహింద రాజపక్స మధ్య ఏర్పడిన బంధం... శ్రీలంక కీల కమైన రాజకీయవేత్తను భారత మద్దతుదారుగా మార్చింది. రెండేళ్ల తర్వాత, మహింద ప్రధాని అయినప్పుడు, భారత్ లెక్కించినట్లుగానే, ఆయన తొలి బాహ్య సదస్సు మోదీతోనే వర్చువల్‌గా జరిగింది. మహింద సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన కోసం భారత్‌నే ఎంచుకున్నారు. ఏప్రిల్ 19న తమిళనాడులో ఓటింగ్ జరిగేదాకా పరిమిత రాజకీయ జీవితకాలమే ఉన్నప్పటికీ, కచ్చతీవు వివాదాన్ని ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునే వారందరూ నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. రాజపక్స కుటుంబం రాజకీయ అరణ్యంలో ఉన్నప్పటికీ భారత్–శ్రీలంక సంబంధాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కంటే మెరుగైన మిత్రుడు భారత్‌కు దొరకరు. ప్రస్తుత ప్రధాని దినేశ్ గుణవర్దన విషయంలోనూ ఇది నిజం. యూఎస్‌లో తన క్లాస్మేట్ అయిన జయ ప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు దినేశ్ తండ్రి ఫిలిప్ గుణవర్దనను బ్రిటిష్‌వాళ్లు బొంబాయిలో బంధించారని కొద్దిమంది భారతీయులకే తెలుసు. విదేశాంగ కార్యదర్శిగానూ పనిచేసిన నిరుపమారావు ప్రకారం, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’ కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కొలంబోలో విక్రమసింఘే భారీ ర్యాలీ
కొలంబో: శ్రీలంకలో రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్వాసనకు గురైన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మద్దతుదారులు మంగళవారం రాజధాని కొలంబోలో భారీ ర్యాలీ నిర్వహించారు. తనను తొలగించి, పార్లమెంట్‌ను సుప్తావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నారని విక్రమసింఘేను ఆరోపించారు. నవంబర్ 16వ తేదీన జరిగే పార్లమెంట్ సమావేశంలో బలం నిరూపించుకునేందుకు విక్రమ సింఘేతోపాటు ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్స ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విక్రమసింఘేకు మద్దతుగా యూఎన్‌పీ నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. విక్రమసింఘే ఈనెల 26వ తేదీ నుంచి ఉంటున్న ప్రధాని అధికార నివాసం వరకు ప్రదర్శనకారులు తరలివెళ్లారు. అక్కడ నిర్వహించిన సభలో విక్రమసింఘే మాట్లాడుతూ.. అధ్యక్షుడు సిరిసేన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే కుట్రపూరితంగా తనను తొలగించారని విమర్శించారు. యూఎన్‌పీతోపాటు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పక్షాలు పార్లమెంట్‌ను తక్షణమే సమావేశపరచాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. పార్లమెంట్ వేదికగా బలం నిరూపించుకునేందుకు విక్రమసింఘేకు అవకాశం ఇవ్వాలని సభలో పాల్గొన్న స్పీకర్ జయసూర్య అధ్యక్షుడిని కోరారు. ఇవే పరిస్థితులు కొనసాగితే దేశంలో రక్తపాతం తప్పదని అన్నారు. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరచాలన్న డిమాండ్‌కు 126 మంది ఎంపీలు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. తమ ర్యాలీకి లక్ష మందికి పైగా జనం హాజరయ్యారని యూఎన్‌పీ అంటుండగా 25వేల మంది మాత్రమే వచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బలం కూడగట్టుకునే పనిలో నూతన ప్రధాని మరోవైపు, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకునేందుకు నూతన ప్రధాని రాజపక్స ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్లో 16 మంది సభ్యుల బలమున్న తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) ప్రస్తుతం కీలకంగా మారిన తరుణంలో ఆ పార్టీ నేత సంపంతన్ మంగళవారం రాజపక్సతో భేటీ కావడం గమనార్హం. అయితే, బలనిరూపణ సమయంలో పార్లమెంట్లో తటస్థంగా ఉండాలని రాజపక్స తమను కోరినట్లు టీఎన్ఏ తెలిపింది. పార్లమెంట్‌లోని 225 మంది సభ్యులకుగాను విక్రమసింఘేకు 106 మంది సభ్యులుండగా, రాజపక్సకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్‌కు 95 మంది ఉన్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 18 మంది మద్దతును రాజపక్స కూడగట్టాల్సి ఉంది. కొందరు యూఎన్‌పీ సభ్యులు తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నందున బల నిరూపణలో నెగ్గుతామనీ, విక్రమసింఘేకు ఓటమి ఖాయమని రాజపక్స ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరిచి, రాజ్యాంగ సంక్షోభం తొలగించాలంటూ అధ్యక్షుడు సిరిసేనపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి పెరిగింది. -
భారత్, శ్రీలంక మధ్య ‘ఆర్థిక’ బంధం
లంక ప్రధానితో మోదీ చర్చలు న్యూఢిల్లీ: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేతో ప్రధాని మోదీ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఆ తరువాత భారత్, శ్రీలంక మధ్య ఆర్థిక సహకార ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఆర్థిక సహకారానికి ఎజెండాను నిర్దేశిస్తుంది. ఇరు వర్గాలకు ప్రయోజనం కలిగించే ఈ ఎజెండాను త్వరితగతిన అమలుచేయడానికి కట్టుబడి ఉన్నామని రెండు దేశాలు ప్రకటించాయి. శ్రీలంకలో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు వీలున్న మౌలిక వసతుల ప్రాజెక్టులను గుర్తించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఆర్థిక, సాంకేతిక సహకారం ఒప్పందంపై జరుగుతున్న చర్చలను కూడా త్వరలోనే ముగిస్తామని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. శ్రీలంక తన శాంతి పునరుద్ధరణ ప్రక్రియను రెండేళ్లలో పూర్తిచేస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ తెలిపింది. సముద్ర లోతుల్లో మన జాలర్లు చేపలు పట్టడానికి సంబంధించి తీసుకున్న చర్యలను శ్రీలంకకు వివరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జాలర్లపై బలప్రయోగం చేయకూడదని కూడా ఆ దేశాన్ని కోరామని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది. ‘ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై శ్రీలంక ప్రధానితో సమగ్ర చర్చలు జరిపాం’ అని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సమావేశం తరువాత మోదీ ట్వీట్ చేశారు. ‘గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు సమీక్షకు ప్రస్తుత సమావేశం ఉపకరిస్తుంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. -
మళ్లీ దాడి!
సాక్షి, చెన్నై : శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే భారత పర్యటనలో ఉండగానే, ఆ దేశ నౌకాదళం తమిళ జాలర్లపై విరుచుకు పడింది. కచ్చదీవుల సమీపంలో ఓ పడవను ధ్వంసం చేసిన శ్రీలంక సేనలు సముద్రంలో ముంచేశారు. మరి కొన్ని పడవల్లోని వలల్ని నాశనం చేశారు. నీటమునిగిన పడవలో ఉన్న నలుగుర్ని సహచర జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. శ్రీలంక సేనల వీరంగాన్ని ఖండిస్తూ గురువారం నుంచి రా మేశ్వరం జాలర్లు సమ్మె సైరన్ మో గించారు. తమిళ జాలర్లకు కడలిలో భద్రత లేదన్న విషయం తెలిసిందే. సరిహద్దులు దాటినా, కచ్చదీవులకు సమీపంలో వేట సాగించినా, శ్రీలంక నౌకాదళం వీరంగానికి గురి కావాల్సిందే. శ్రీలంక సేనల చేతికి చిక్కితే చాలు బందీగా ఆదేశ చెరలో నెలల తరబడి మగ్గాల్సిందే. జాలర్ల సంఘాలు ఏకమై ఉద్యమ బాట పట్టినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, కొన్ని నెలల అనంతరం మళ్లీ ఇక్కడికి బందీగా వెళ్లిన వాళ్లు తిరుగు పయనం కావడం పరిపాటే. ఈ పరిస్థితుల్లో ఈనెల నాలుగో తేదీ నుంచి శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన భారత పర్యటనను పురస్కరించుకుని ఆ దేశ చెరలో పదుల సంఖ్యలో ఉన్న తమిళ జాలర్లను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. దినదిన గండంతో కడలిలోకి వెళ్తున్న జాలర్లు, రనిల్ రాకతోనైనా తమ మీద దాడులకు తగ్గుతాయా..? అందుకు తగ్గ చర్యలు కేంద్రం తీసుకునేనా, ఒత్తిడి పెంచేనా అన్న ఎదురుచూపుల్లో జాలర్లు నిమగ్నం అయ్యారు. అయితే, రనిల్ భారత్‌లో ఉండగానే శ్రీలంక సేనలు విరుచుకు పడి తమ ప్రతాపం చూపించి వెళ్లడాన్ని తమిళ జా లర్లు జీర్ణించుకోలేకున్నారు. ఈ దాడితో జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మళ్లీ దాడి : రామేశ్వరానికి చెందిన జాలర్లు బుధవారం రాత్రి వేట నిమిత్తం కడలిలోకి వెళ్లారు. ఐదు వందల మంది జాలర్లు వందకు పైగా పడవల్లో కచ్చదీవుల సమీపంలో వలల్ని విసిరి వేటలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అటు వైపుగా నాలుగు బోట్లలో పదుల సంఖ్యలో శ్రీలంక సేనలు వచ్చి రాగానే విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో తమిళ జాలర్లపై దాడులకు దిగారు. విసిరి ఉన్న వలల్ని తెంచి పడేస్తూ వీరంగం సృష్టించారు. వీరి చేతికి చిక్కితే ఎక్కడ బందీ కావాల్సి వస్తుందో అన్న ఆందోళనలో పడ్డ జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయినా, వదలి పెట్టకుండా వెంటాడిన సేనలు ఆంతోనికి చెందిన ఓ పడవను చుట్టుముట్టి ధ్వంసం చేశారు. ఆ పడవకు రంధ్రం పెట్టి సముద్రంలో ముంచేశారు. ఆ పడవలో ఉన్న నలుగురు సముద్రంలో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన సహచర జాలర్లు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గురువారం ఉదయాన్నే ఈ దాడి సమాచారంలో జాలర్ల సంఘాల నేతలు రామేశ్వరానికి పరుగులు తీశారు. సమ్మె సైరన్ : తాజా దాడుల్లో ఓ పడవ మునగడం, లక్షలాది రూపాయల విలువగల వలలు నాశనం కావడంతో జాలర్ల సంఘాల్లో ఆక్రోశం రగిలింది. సమ్మె సైరన్ మోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి మత్స్యశాఖ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో జాలర్లు, నేతలు నిరసనకు దిగడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది. జాలర్లు హఠాత్తుగా సమ్మె సైరన్ మోగించడంతో ఎక్కడి పడవలు అక్కడే ఒడ్డుకు పరిమితమయ్యాయి. అలాగే, చేపల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యాపారులు ఒట్టి చేత్తో వెను దిరగాల్సి వచ్చింది. అలాగే, ఉత్పత్తి చేసిన ఐస్‌గడ్డలను స్టోరేజ్‌లో భద్ర పరచుకోవాల్సిన పరిస్థితి ఆయా యాజమాన్యాలకు ఏర్పడింది. ఈ సమ్మె కారణంగా వ్యాపారులు, చేపల్ని తరలించే వాహనాలకు, ఐస్గడ్డల ఉత్పత్తిలో పనిచేస్తున్న కార్మికులు పని లేకుండా పోయింది. ఈ సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో అన్న ఆందోళన వారిలో బయలు దేరింది. ఇక, వీరిని బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.