Recovery process
-
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
విక్రమ్ ధ్వంసం కాలేదు
బెంగళూరు/కరాచీ: చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్ ముక్కలు కాలేదు. ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్ ఉన్నట్లు గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇస్రోకు పాక్ వ్యోమగామి మద్దతు.. విక్రమ్ వైఫల్యంపై పాక్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేసిన వేళ పాకిస్తాన్ నుంచే ఇస్రోకు మద్దతు లభించింది. చంద్రయాన్–2 ప్రయోగం గొప్ప ముందడుగని పాక్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం ప్రశంసించారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు చంద్రయాన్–2తో చారిత్రాత్మక ప్రయోగం చేపట్టిన ఇస్రోను అభినందిస్తున్నా. ఈ ప్రయోగంతో దక్షిణాసియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమ కూడా గర్వపడేలా ఇస్రో చేసింది’ అని కితాబిచ్చారు. పారిశ్రామికవేత్త రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అనే సంస్థ ప్రయోగించిన వాహకనౌక ద్వారా అంతరిక్షంలో విహరించిన నమీరా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ. -
చివర్లో పెరిగిన రూపాయి
ముంబై: డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బుధవారం ట్రేడింగ్‌లో భారీ హెచ్చుతగ్గులకు లోనై రోలర్ కోస్టర్ ప్రయాణాన్ని తలపించింది. క్రితం ముగింపు 67.63తో పోలిస్తే ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 68.10 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 68.62 వద్ద కనిష్టాన్ని తాకింది. తరవాత నెమ్మదిగా పుంజుకోవడం మొదలైంది. ఈ బాటలో బలపడుతూ వచ్చిన రూపాయి గరిష్టంగా 66.80ను సైతం చేరింది. చివరకు 56 పైసలు బలపడి 67.07 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులకు తోడు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలరు విలువ క్షీణించడం రూపాయి రికవరీకి దోహదపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో రూపాయి 163 పైసలు కోల్పోవటం తెలిసిందే. ఒక దశలో రిజర్వ్ బ్యాంకు కల్పించుకుని స్పాట్ మార్కెట్లో డాలర్లను భారీగా విక్రయించడం కూడా రూపాయికి బలాన్నిచ్చిందని విశ్లేషకులు చెప్పారు. మరోవైపు విదేశీ వాణిజ్య రుణాలను సాధారణ కార్పొరేట్ వ్యవహారాలకు కంపెనీలు వినియోగించుకోవచ్చునని ఆర్బీఐ చెప్పటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని తెలిపారు.