recycles
-
పాత టైర్లు కావవి.. ఆ దేశంలో అవిప్పుడు ‘బంగారమే’?
Nigerian Ifedolapo Runsewe Success story: దేశాలకు అతీతంగా అన్ని చోట్ల బంగారానికి విలువ ఉంది. మన దగ్గర పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటుంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రీసైకిలింగ్ కంపెనీని స్థాపించింది. రెండేళ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో ఈ కంపెనీ మొదలైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించేవారు. వాటిని తమ రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్మెంట్ బ్రిక్స్‌గా తయారు చేశారు. రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు. అంతే దీంతో ఒక్కసారిగా ఆమె కంపెనీకి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో బ్రిక్స్‌ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండేళ్లలోనే నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది. పేవ్మెంట్ బిక్స్తో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులు కూడా తయారు చేస్తోంది రాన్‌సేవే. ఈమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్కో టైరుకు 0.20 డాలర్లు (సుమారు రూ.15) చెల్లిస్తున్నారు. దీంతో కరోనా ఉపాధి కరువైన వారంతా పాత టైర్ల వేటలో పడ్డారు. ఎక్కడ టైరు కనిపించినా వాటిని పోగేసి ఈ ప్లాంటుకు తెస్తున్నారు. దీంతో రన్సువే సక్సెస్‌పై రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. పాత టైర్లు కావవి బ్లాక్‌గోల్డ్ అంటూ పేర్కొంది. In Nigeria, hundreds of thousands of tires which would otherwise be dumped across the country have emerged as a new ‘black gold.’ Entrepreneur Ifedolapo Runsewe is transforming old tires into paving bricks, tiles and other goods, creating an entire value chain around tires pic.twitter.com/raCRbFqTOV — Reuters Business (@ReutersBiz) November 15, 2021 -
Home Creations: ఇంటికి వేద్దాం రంగుల డ్రెస్సింగ్..!
రాబోయేది చలికాలం. వర్షాలు తగ్గిపోయాక ఇంటికి కొత్తగా పెయింట్ వేసే కాలం. ఇప్పటి నుంచి వేసవి కాలం ముందు వరకు కాస్త కాంతిమంతమైన రంగులతో ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటే డల్ వాతావరణాన్ని మరింత వర్ణమయంగా మార్చుకోవచ్చు. అందుకు ఎక్కువ డబ్బు కేటాయించక్కర్లేదు. వాడని డ్రెస్సులు, దుపట్టాలు, చీరలు, షర్ట్లనూ ఇంటి అలంకరణలో ఉపయోగించవచ్చు. ఈ మాసంలో పూజలు, నోములు, వ్రతాలు, పెళ్లి వంటి వేడుకలతో లోగిళ్లు సందడి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు లివింగ్ రూమ్‌కి కళ తెచ్చేలా చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు. డ్రెస్ కుషన్ కవర్స్ కొన్ని డ్రెస్సులు పాతవైనా వాటిలోని ప్రింట్లు, జరీ బాగుండటంతో పడేయాలనిపించదు. ఇలాంటప్పుడు అంతమేరకు డ్రెస్ క్లాత్ తీసుకొని, ప్యాచ్ వర్క్ లేదా చిన్న–పెద్ద కుషన్స్కి కవర్స్‌లా డిజైన్ చే సుకోవచ్చు. సెంటర్ టేబుల్ దుపట్టా మన చేనేతలను ధరించినా, ఇంటి అలంకరణలో ఉపయోగించినా కొంగొత్త కళను మోసుకువస్తాయి. సెంటర్ టేబుల్ని డ్రెస్ దుపట్టాతో అలంకరించవచ్చు. దానిపైన ఉపయోగించే షో పీసులు ఇత్తడి లేదా వింటేజ్ లుక్ ఉన్నవి ఎంచుకుంటే ఇంటి అలంకరణ ముఖ్యంగా లివింగ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రింటెడ్ శారీ కర్టెన్స్ చాలా సందర్భాలలో ఈ ట్రిక్ కొన్ని ఇళ్లలో గమనిస్తుంటాం. అయితే, ఇంట్లో అన్ని కిటికీలకు, డోర్లకు శారీ కర్టెన్స్ వాడితే భిన్నమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది. సప్తవర్ణాల శోభ ఏడు రంగుల కాంబినేషన్ క్లాత్ మెటీరియల్‌తో కుషన్ కవర్స్‌ని డిజైన్ చేసి, అలంకరించుకోవచ్చు. దీని వల్ల ఇంద్రధనుస్సు నట్టింట్లో ఉన్న అనుభూతి కలగకమానదు. ఇలా రంగుల కాంబినేషన్‌తో చేసుకున్న డిజైన్ల వల్ల డల్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా కాంతిమంతంగా మారిపోతుంది. పాత షర్ట్లతో కొత్త మెరుపు కుషన్ కవర్స్‌కి పాత డ్రెస్సులు, శారీస్ మాత్రమే కాదు షర్ట్స్ కూడా ఉపయోగించవచ్చు. కొత్తవాటితోనే ఈ తరహా డిజైన్స్‌కు సృజనాత్మకంగా ఆలోచన చేసి, వాటిని అమలులో పెడుతున్నారు. పొట్టిగా అయినవి, నప్పనివి, వాడనివి.. షర్ట్స్ ఏవి ఉన్నా ఇలా విన్నూతంగా కుషన్ కవర్స్‌కి వాడేయొచ్చు. ఇంటికి సున్నాలు, రంగులు వేసి కొత్త కాంతి తీసుకురావడానికి కష్టపడుతున్నట్టే... రీ యూజ్ ఆలోచనతో వాడిన డ్రెస్సులను ఇలా వినూత్న డిజైన్లతో ఇంటి అలంకరణలో వాడేయొచ్చు. కొత్త కళను ఇంటికి తీసుకురావచ్చు. చదవండి: హృదయవిదారక మిస్టరీ..! కన్న బిడ్డలు బతికున్నారోలేదో తెలియక.. -
Home Creations: మీ ఇంటి అందం మరింత పెంచే.. మది మెచ్చే.. సృజనాలంకరణ!
పొలంలో ఉన్న మంచె రూపం ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తే.. పాత టీ కెటిల్ పువ్వుల గుచ్ఛాన్ని అలంకరించుకుంటే, తోపుడు బండి కాస్తా మన ఇంటి టేబుల్ మీద ట్రే అయితే, తాగేసిన కొబ్బరిబోండాలు మొక్కలకు కుండీలు అయితే, ఇత్తడి జల్లెడ గోడ మీద సీనరీగా అమరితే.. ఎంత అందంగా ఉంటుందో.. కాదేదీ ఇంటి అలంకరణకు అనర్హం అన్నట్టు మీరూ ఇలా ఎన్నో రకాల ప్రయత్నించవచ్చు. వేలాడే కొబ్బరి బోండాం తియ్యని కొబ్బరినీళ్లు తాగేస్తాం. లేత కొబ్బరి తినేస్తాం. ఆ తర్వాత ఆ బోండాన్ని పడేస్తాం. ఈసారి మాత్రం అలా పడేయకుండా కొంచెం థింక్ చేయండి. పెయింట్ బ్రష్, నచ్చిన పెయింట్ తీసుకొని రంగులు అద్దేయండి. ఆ తర్వాత ఇండోర్ మొక్కలను పెంచేయండి. వాటిని తాళ్లతో హ్యాంగ్ చేయండి. ఈ ఐడియాకు ఇంకెంచెం పదును పెడితే మరెన్నో కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురావచ్చు. మరిన్ని అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు. ఇంట్లో కుదిరిన మంచె పొలంలో ఉండాల్సింది ఇంట్లో ఎలా ఉంటుందనే నెగిటివ్ ఆలోచనలకు స్వస్తిచెప్పచ్చు ఇక. దీని తయారీని ఓ విదేశీ కంపెనీ చేపట్టింది. మన మంచె విదేశీయుల ఇంట్లో ఉంటే, మనమెందుకు ఊరుకుంటాం. ఇంకొచెం కొత్తగా ఆలోచించి వెదురుతో అందమైన విశ్రాంతి తీసుకునే మంచెను తయారుచేయించుకొని ఇంట్లో అలంకరించుకుంటాం. అతిథుల మనసు ఇట్టే మంచెకు కట్టిపడేయచ్చు. ఇంటికే వినూత్న కళ తీసుకురావచ్చు. బాల్కనీ లేదా డాబా గార్డెన్ వంటి చోట ఈ మంచె ఐడియా సూపర్బ్‌గా సెట్ అవుతుంది. టేబుల్ మీద తోపుడి బండి టీపాయ్, టేబుల్ వంటి వాటి మీద అలంకరణకు ఓ ఫ్లవర్‌వేజ్‌ను ఉంచుతారు. కానీ, తోపుడు బండిని ఉంచితే.. అదేనండి, తోపుడుబండి స్టైల్ షో పీస్ అన్నమాట. దీని మీద మరికొన్ని అలంకరణ వస్తువులు కూడా పెట్టచ్చు. చూడటానికి ప్రత్యేకంగా ఉంటుంది. రోజువారీగా వాడుకునే ట్రేగానూ ఈ బుజ్జి తోపుడుబండిని ఉపయోగించవచ్చు. ఇవి ఆన్లైన్ మార్కెట్లోనూ దర్శనమిస్తున్నాయి. ఆసక్తి ఉంటే ప్రత్యేకంగానూ తయారుచేయించుకోవచ్చు. ఓపిక ఉంటే, చెక్క, కొన్ని ఇనుప రేకులను వాడి ఈ మోడల్ పీస్‌ను స్వయంగా తయారుచేసుకోవచ్చు. గోడ మీద ఇత్తడి జల్లెడ ధాన్యాన్ని జల్లెడ పట్టడం గురించి మనకు తెలిసిందే. ఇప్పుడంటే ప్లాస్టిక్, అల్యూమినియం జల్లెడలను వాడుతున్నారు కానీ మన పెద్దలు వెదురుతో చేసినవి లేదా ఇనుము, ఇత్తడి లోహాల పెద్ద పెద్ద జల్లెడలను వాడేవారు. ఉపయోగించడం పూర్తయ్యాక గోడకు కొట్టిన మేకుకు తగిలించేవారు. గొప్పగా ఉండే ఆ పనితనాన్ని ఎక్కడో మూలన పెడితే ఎలా అనుకున్నవారు ఇలా ఇంటి గోడకు బుద్ధుడి బొమ్మతో అలంకరించి, అందంగా మార్చేశారు. ఇంటికీ వింటేజ్ అలంకరణగా ఉండే ఈ స్టైల్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. మొక్కలను నింపుకున్న టీ కెటిల్ నేటి తరానికి ప్లాస్క్‌లు బాగా తెలుసు కానీ, టీ కెటిల్ గురించి అంతగా తెలియదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్‌గా భావించే నిన్నటి తరం వస్తువులను ఇలా అందమైన గృహాలంకరణగా అమర్చుకోవచ్చు. పువ్వులతోనూ, ఇండోర్ ప్లాంట్స్ తోనూ, ఆర్షిఫియల్ ప్లాంట్స్తోనూ పాత టీ కెటిల్‌ను కొత్తగా అలంకరించవచ్చు. చదవండి: మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.! -
Home Creations: పండగవేళ కాపర్ కాంతులు.. పాత వస్తువులతో ఇంటి అలంకరణ!
పాతకాలం నాటి ఇత్తడి, ఇనుము, కలప వస్తువులతో గృహాలకంరణ చేయడం అనేది మనకు తెలిసిందే. పూర్తి వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ స్టైల్ ఇంటి అందాన్ని ఎప్పుడూ కొత్తగా చూపుతూనే ఉంది. అయితే, మంచినీటిని నిల్వచేసుకుని తాగే రాగిపాత్రలు ఇప్పుడు ఇంటి కళలో వినూత్నంగా మెరిసిపోతున్నాయి. దీపాల వెలుగుల్లో కొత్త కాంతులు విరజిమ్ముతాయి. సంప్రదాయ జిలుగులే కాదు ఆధునికపు హంగులుగానూ ‘రాగి’ తన వైభవాన్ని చాటుతోంది. ఫ్లవర్వేజ్గానూ, హ్యాంగింగ్ బెల్స్గానూ, క్యాండిల్ స్టాండ్‌గానూ, పూలకుండీలుగా, పార్టిషన్ వాల్స్గానూ రాగి తన దర్జాను చూపుతోంది. పండగ జిలుగులు పండగల వేళ సంప్రదాయ కళ ఉట్టిపడాలంటే అందుకు తగినట్టు బ్రాస్ లేదా కాపర్ ఎంపిక తప్పనిసరి. ఒక చిన్న మార్పు పండగ కళను ఇంట రెట్టింపు చేస్తుంది. దీపాల పండగకు అలంకరణలో సంప్రదాయ కళ ఎప్పుడూ తన వైభవాన్ని చాటుతుంది. ఇందుకు నాటి రాగి పాత్రలు అలంకరణలో ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. అలంకరణలో ఎన్ని ఆధునిక వస్తువులున్నా ఒక రాగి పాత్ర హోమ్ క్రియేషన్‌లో భాగం చేస్తే చాలు ఆ లుక్కే ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు, రోజువారీ వాడకంలో ఉన్న రాగి ప్లేట్లు, గ్లాసులు, టీ కెటిల్, చిన్న చిన్న రాగి పాత్రలు.. ప్రతీది ఇంటి అలంకరణలో గొప్పగా అమరిపోతుంది. అందుకు నిన్న మొన్నటి తరాలు దాచిన అపురూపమైన రాగి వస్తువులను అలంకరణకు ఎంచుకోవచ్చు. ఆధునిక కాంతి గృహాలంకరణలో కాపర్ కోటింగ్ ఓ అద్భుతాన్ని చూపడానికి ఎంచుకుంటున్నారు ఇటీవల ఇంటీరియర్ డిజైనర్లు. రాగితో డిజైన్ చేసిన టేబుల్ ల్యాంప్, హ్యాంగింగ్ ల్యాంప్‌లు ఆధునికంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రేలు, ఇండోర్ ప్లాంట్ పాట్స్ కూడా ఇదే జాబితాలో ఉంటున్నాయి. స్టాండ్లు, షెల్వ్స్, వాల్పేపర్లు, పార్టిషన్గానూ కాపర్ కొత్తగా మెరిసిపోతోంది. పాత్రలకే పరిమితం కాకుండా ఫ్రేమ్స్ రూపంలోనూ మోడర్న్ ఆర్ట్‌గా వినూత్నమైన అందాన్ని చూపుతోంది. ఖరీదులోనూ ఘనమైనదిగా కాపర్ ఇంటికి వింటేజ్ కళతో పాటు గ్రాండ్‌నెస్‌ను మోసుకువస్తుంది. కళాభిమానులు అనే కితాబులనూ అలంకరణ చేసినవారికి అందిస్తుంది. చూపులను కట్టిపడేసే రాగికి దీపకాంతులు జత చేరితే ఇక ఆ ఇంట దివ్యకాంతులు విరబూస్తాయి. -
కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు!
-
కాఫీపొడితో ఎకోఫ్రెండ్లీ కప్పులు!
జర్మనీః వ్యర్థాలనుంచీ ఉపయోగాలను సృష్టించడం ఆధునిక కాలంలో అత్యవసరంగా మారింది. పనికిరాని పదార్థాలనుంచీ విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాహనాలు, ఇతర వస్తువులు తయారు చేయడం చూస్తూనే ఉన్నాం. వాతావరణానికి హాని కలిగించేవే కాక, ఇతర వస్తువులను సైతం రీ సైకిల్ చేసి ఉపయోగించడంవల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, వస్తు ఉత్పత్తిలో పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారు చేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా ధృఢంగా ఉండటంతోపాటు, కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు. వాడిన కాఫీ పొడిని సౌందర్య సాధనంగానూ, వస్తువులను శుభ్రపరిచేందుకు, మొక్కల్లో ఎరువుగా వేసేందుకు వినియోగించడం తెలుసు. కానీ జర్మన్ కంపెనీ 'కాఫీఫామ్'.. కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వాడేసి, ఎండిన కాఫీపొడిని బయోపాలిమర్ తో కలపి అందమైన కప్పులు, సాసర్ల తయారీ చేపడుతోంది. మనం తాగే ప్రతి కప్పు కాఫీకి సుమారు రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పొడిని వాడుతుంటాం. అలా ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అలవాటుగా తాగే కాఫీ తయారీ అనంతరం.. పొడి వృధాగా పోతోందన్న జర్మనీ డిజైనర్ జూలియన్ లేచ్నర్ ఆలోచనలే కప్పు, సాసర్ల రూపం దాల్చాయి. ఇటలీ నగరం బొల్జానా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో లేచ్చర్ కు ఈ కొత్త ఆలోచన వచ్చింది. యూనివర్శిటీ విద్యార్థులు, స్నేహితులు ప్రతి తరగతి ముందు, తర్వాత, మీటింగ్ సమయాల్లో, ఒత్తడి కలిగినపుడు ఇలా తరచుగా కాఫీ తాగే అలవాటు లేచ్చర్ దృష్టిలో పడింది. అలా వాడిన కాఫీ పొడి అంతా ఏమైపోతోంది అన్న కోణంలో ఆలోచన కలిగిందే తడవుగా అతడి ప్రయత్నం ప్రారంభమైంది. కాఫీ పొడితో ఘన పదార్థాలను ఎలా తయారు చేయవచ్చు అన్న దిశగా ప్రొఫెసర్లతో చర్చించిన లేచ్చర్ సృష్టి.. పర్యావరణ అనుకూలమైన కప్పు సాసర్ల తయారీ దిశాగా కార్యరూపం దాల్చింది. అయితే ఈ ప్రయోగం ఫలించడానికి అతడికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రాధమికంగా కాఫీ పొడితో పంచదారను మిళితం చేసి ఘనపదార్థంగా తయారు చేసేందుకు ప్రయత్నించానని, అయితే అలా తయారైన కప్పులు కేవలం మూడుసార్లు ఉపయోగించిన తర్వాత పడేయాల్సిన పరిస్థితి ఉందని, దాంతో మన్నికైన కప్పుల తయారీ దిశగా జర్మన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల సహకారంతో అనేక ప్రయోగాలు చేసిన అనంతరం చివరికి బయోపాలిమర్ల మిళితంతో దృఢమైన కప్పుల తయారీ సాధ్యమైందని లేచ్చర్ వెల్లడించాడు. వాణిజ్యపరంగా విజయవంతమవ్వడంతో ప్రస్తుతం ఈ కొత్త 'కాఫీఫామ్' కప్పుసాసర్లను యూరప్ లోని పది దుకాణాలతోపాటు, కంపెనీ ఆన్ లైన్ విక్రయాలు కూడా జరుపుతోంది. ఇప్పుడు ఆన్లైన్ లో వ్యక్తిగత ఆర్డర్లతోపాటు, సౌదీ అరేబియాలోని ఓ కేఫ్, టొరొంటోతోపాటు ఓస్లో నోబెల్ శాంతి బహుమతి మ్యూజియం వారి దుకాణాల్లో అమ్మేందుకు సైతం ఆర్డర్లు రావడం ఎంతో ఆనందాన్ని నింపిందని లేచ్చర్ తన కంపెనీ విజయాలను వివరించాడు. ప్రస్తుతం చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో కప్పుల తయారీకోసం ప్రత్యేకంగా వికలాంగులకు అవకాశం ఇస్తున్నామని, త్వరలో కాఫీఫామ్ పెద్ద ఎత్తున ఉత్పత్తులు ప్రారంభించి ట్రావెల్ మగ్గులను కూడ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపాడు.