Refusing
-
ఎన్నికలు ముంచుకొస్తున్నా.. కాంగ్రెస్‌కు దొరకని అభ్యర్థులు?
మధ్యప్రదేశ్‌లో తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను పూరించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే కాంగ్రెస్ నేటివరకూ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేకపోయింది. సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో వెనుకంజ వేయడమే దీనికి ప్రధాన కారణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలు ఉండగా, పరస్పర ఒప్పందంతో ఖజురహో పార్లమెంటరీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ అప్పగించింది. ఇంకా 28 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ 28 స్థానాల్లో కాంగ్రెస్ 10 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిర్ణయించగలిగింది. 18 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఇంకా నిర్ణయించలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం దిగ్విజయ్ సింగ్, అజయ్ సింగ్, అరుణ్ యాదవ్, ఉమంగ్ సింగర్, జైవర్ధన్ సింగ్, ప్రియవ్రత్ సింగ్, జితు పట్వారీ, వివేక్ తంఖా తదితర సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ ఆహ్వానించింది. అయితే వీరిలోని పలువురు తమకు ఆసక్తి లేదని చెబుతున్నారని సమాచారం. పార్టీలోని అనుభవజ్ఞులను రంగంలోకి దింపాలని యోచిస్తున్నా వారు పోటీకి విముఖత చూపడంతో అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు పలువురు ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ యోచిస్తోందని సమాచారం. పార్టీ హైకమాండ్ నేరుగా సీనియర్ నేతలతో మాట్లాడిన తర్వాతనే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వ్యాక్సిన్ వేస్తే.. ఉరేసుకుంటా.. చుక్కలు చూపించిన బామ్మ..
సాక్షి, జనగామ: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటే.. ఓ వృద్ధురాలు వైద్య సిబ్బందికి చుక్కలు చూపించింది. వ్యాక్సిన్ వేస్తే.. ఉరి వేసుకుంటానంటూ హడావుడి సృష్టించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో 80 ఏళ్ల వృద్ధురాలిని వ్యాక్సిన్ వేసుకోమని అడగగా వ్యాక్సిన్ వేస్తే ఉరి వేసుకుంటానంటూ మొండిగా వ్యవహరించింది. చదవండి: జొన్నలకు పులి కాపలా! వైద్య సిబ్బందిని మీరు వెళ్లిపోండి.. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆ వృద్ధురాలు తల బాదుకుంది. ఎంతగా నచ్చజెప్పినా ఏమాత్రం వినలేదు. సూది మందంటే చిన్న పిల్లల్లా మారాం చేయడంతో కాస్త ఫన్నీగా అనిపించింది. కొందరు కరోనా టీకా వేయించుకోవటానికి భయపడుతున్నారు. దాన్నో భూతంలా చూస్తున్నారు. మరికొందరు లేనిపోని అపోహలతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఆసక్తి చూపడంలేదు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఏమాత్రం వారి తీరులో మార్పు రావడం లేదు. చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు! -
కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే!
-
కొత్త నోటు చిరిగితే.. జేబుకు చిల్లే!
సాక్షి, హైదరాబాద్ : కొత్త నోటు.. కొత్త కొత్తగా బాగున్న నోటు.. కానీ కొంచెం చిరిగిందా.. అంతే సంగతులు. ఆ నోటును బ్యాంకులు తీసుకోవు.. రిజర్వు బ్యాంకుకు వెళ్లినా లాభం లేదు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చి 16 నెలలవుతున్నా.. చిరిగిన/దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడికి మార్గదర్శకాలు రాకపోవడమే దీనికి కారణం. చిరిగిన మేరకు కొత్త నోట్లకు జరిగిన నష్టాన్ని లెక్కించాల్సి ఉంటుందని.. ఆ మేరకు మార్గదర్శకాలు లేకపోవడంతో వాటిని తీసుకోవడం లేదని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. అయితే బ్యాంకుల నుంచి సొమ్ము డ్రా చేసుకున్నప్పుడు, ఏటీఎంలలో మాత్రం చిరిగిన కొత్త నోట్లు వస్తుండటం గమనార్హం. ‘కొత్త’సమస్యలు.. దాదాపు 16 నెలల కింద కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసి.. రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువ చేసే కొత్త నోట్లను చలామణీలోకి తెచ్చిన విషయం తెలిసిందే. పాత నోట్ల రద్దుతోనే నానా అవస్థలు పడిన జనం.. ఇప్పుడు కొత్త నోట్లతో కొత్త సమస్య ఎదుర్కొంటున్నారు. పొరపాటున చిరిగిపోయిన, దెబ్బతిన్న కొత్త నోట్లను మార్పిడి చేయడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అలా కొత్త నోట్ల మార్పిడి కోసం వస్తున్నవారిని రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాయి. ఎక్కడికెళ్లినా అదే సమాధానం.. చిరిగిన కొత్త నోట్ల మార్పిడి కోసం హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినా నిరాశే ఎదురవుతోంది. రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి కొత్త నోట్ల మార్పిడికి సంబంధించిన మార్గదర్శకాలు రాలేదని.. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే చిరిగిన నోట్లను మార్పిడి చేస్తామని అక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకు చిరిగిన నోట్లను దాచిపెట్టుకోవాలని సూచిస్తూ తిప్పిపంపుతున్నారు. అయితే తాము ఆదేశాలు ఇచ్చేవరకు చిరిగిన/ దెబ్బతిన్న కొత్త నోట్ల మార్పిడి చేయవద్దని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొంటున్నాయి. నోటు నష్టాన్ని మినహాయించుకుని.. సాధారణంగా నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం.. కరెన్సీ నోటుకు జరిగిన నష్టాన్ని లెక్కించేందుకు నోటుపై చిరిగిన/దెబ్బతిన్న/పాడైపోయిన భాగాలను కొలతలు తీస్తారు. ఆ నోటు పరిమాణానికి సరిపడా ఉండే గ్రిడ్ (గ్రాఫ్ పేపర్ మాదిరిగా ఉండే కొలమానం)పై చిరిగిన నోటును పెట్టి.. దెబ్బతిన్న భాగం నష్టాన్ని లెక్కిస్తారు. నోటు విలువ నుంచి ఈ నష్టాన్ని మినహాయించుకుని మిగతా విలువను చెల్లిస్తారు. వేర్వేరు విలువ గల కరెన్సీ నోట్ల పరిమాణం వేర్వేరుగా ఉండడంతో ఆయా నోట్ల నష్టాన్ని లెక్కించేందుకు బ్యాంకులు వేర్వేరు గ్రిడ్లను వినియోగిస్తాయి. చివరిగా పెద్ద నోట్ల రద్దుకు నాలుగు నెలల ముందు చిరిగిన/దెబ్బతిన్న నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసింది. ‘కొత్త’మార్గదర్శకాలు లేకపోవడంతో.. పాత పెద్ద నోట్లు రద్దయి కొత్తగా రూ.2 వేలు, రూ.500, రూ.200 విలువైన నోట్లు చలామణీలోకి వచ్చాక నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలేవీ జారీ కాలేదు. పాత రూ. 500 నోట్లతో పోలిస్తే కొత్త నోట్ల పరిమాణంలో తేడా ఉంది. ఇక రూ.2 వేలు, రూ.200 నోట్లు పూర్తిగా కొత్త విలువతో కూడినవి. దీంతో పాత నోట్లకు సంబంధించిన గ్రిడ్లను కొత్త నోట్లకు వినియోగించుకోలేని పరిస్థితి ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు కొత్త నోట్లకు సంబంధించిన గ్రిడ్‌లతోపాటు కొత్త మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉందని చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు బ్యాంకులు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు నిరాకరిస్తుండడం గమనార్హం. చిరిగిన నోట్లతో కమీషన్ల దందా చిరిగిన కొత్త నోట్ల మార్పిడికి బ్యాంకులు నిరాకరిస్తుండటం.. చిరిగిన నోట్ల మార్పిడి చేసే వ్యాపారస్తులకు వరంగా మారింది. భారీగా కమీషన్ల దందాకు తెరలేచింది. రూ.2 వేల చిరిగిన నోటు మార్పిడికి రూ.500 వరకు.. రూ.500 చిరిగిన నోటు మార్పిడికి రూ.200 వరకు కమీషన్‌గా తీసుకుంటుండటం గమనార్హం. దీంతో చాలా మంది అడ్డగోలు కమీషన్ కింద చిరిగిన నోట్లను మార్పించుకోవాల్సి వస్తోంది. కొందరు అంత కమీషన్ ఇవ్వలేక బ్యాంకుల్లో ఎప్పుడు మార్పిడి చేస్తారోనంటూ ఎదురుచూస్తున్నారు. -
ఆ.. మహిళపైనా మృగాళ్ళ దాడి!
మహిళ కనిపిస్తే చాలు మగాళ్ళు.. మృగాళ్ళై పోతున్నారు. రాను రాను మానవత్వం నశించి, రాక్షసులుగా మారుతున్నారు. శారీరక వాంఛలు తీర్చుకోవడం కోసం తన,పర, లింగ, వయో బేధాలను సైతం మర్చిపోతున్నారు. కనిపించిన వారిని కాటేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి మానవ మృగాల దారుణాలకు అభంశుభం తెలియని అమాయకులు బలైపోతున్నారు. పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చిన దారుణం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళపై దుండగులు ఒడిగట్టిన కిరాతక చర్య.. మానవ సమాజం తలదించుకునేలా చేసింది. తొడపై తీవ్ర గాయంతో బాధపడుతున్న ఆమె.. పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఏళ్ళ ట్రాన్స్ జెండర్ మహిళ. మాన్ సెహరా పట్టణం వాయువ్యప్రాంతంలోని ఆమె నివాసానికి చేరిన ముగ్గురు సాయుధ దుండగులు తలుపు బద్దలుకొట్టిమరీ ఆమెపై దాడికి దిగారు. తుపాకీతో కాల్చి, ఆమెపై ఆఘాయిత్యానికి ప్రయత్నించారు. లైంగిక చర్యలకు తమకు సహకరించలేదన్న కోపంతో ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. బాధితురాలు తీవ్రంగా ఎదుర్కోవడంతో కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసు అధికారి అమ్మర్ నియాజ్ తెలిపారు. దుండగులను నిర్బంధించేందుకు దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. బాధితురాలు గాయం నుంచి కోలుకొంటోందని, ఆస్పత్రినుంచి ఆమెను డిశ్చాడ్చి చేసినట్లు పోలీసులు తెలపడంతో విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘటనతో పాకిస్తాన్ మాన్ సెహరా ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లక్ష్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయంటూ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సభ్యులు, హిజ్రా కమ్యూనిటీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళన చేపట్టారు. అధికారులు నేరస్థులను పట్టుకొని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లకు రక్షణ కల్పించాలని, భద్రత పెంచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిజానికి ప్రపంచంలోని ఇతర దేశాల్లోకంటే ట్రాన్స్ జెండర్లు పాకిస్తాన్ లో తమ హక్కులను వినియోగించుకుంటుండగా, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యం, విషయంలో మాత్రం పక్షపాత ధోరణి కనిపిస్తుంది. వాటిలో అట్టడుగున ఉండటంతోపాటు అనేక వేధింపులను, హింసను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటికీ పాకిస్తాన్ తోపాటు, భారత్, బాంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాల్లో పలువురు హిజ్రాలు దాడులు, మానభంగాలకు గురవ్వడమేకాక, వేశ్యలుగా కూడ పనిచేస్తున్నారు. కొందరు పొట్టపోసుకొనేందుకు ట్రాఫిక్ లైట్లవద్ద, వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. కాగా ఇటీవలి కాలంలో ఒక్క ఖైబర్ పఖ్తున్ఖ్వ ప్రాంతంలోనే తమ కమ్యూనిటీ సభ్యులపై కనీసం ఐదు దాడులు జరిగినట్లు ట్రాన్స్ జెండర్ సంఘాలు చెప్తున్నాయి. మే నెలలో పెషావర్ ప్రాంతంలో ఓ ట్రాన్స్ జెండర్ మహిళపై ఆమె స్నేహితుడు పలుమార్లు దాడి చేయడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. పైగా ఆమెను మేల్, ఫిమేల్ వార్డుల్లో ఏ వార్డులో చేర్చాలో తెలియక ఆలస్యం చేయడంతోనే ఆమె చనిపోయినట్లు స్నేహితులు చెప్పడం ఆందోళన రేకెత్తించింది. తమకు ఐడీ కార్డులు జారీచేయాలంటే లింగ నిర్థారణ పరీక్షలు తప్పనిసరి అంటున్నారని, అందుకు తాము అంగీకరించకపోతే కార్డులు ఇవ్వడంలో వివక్ష చూపిస్తున్నారని పాకిస్తాన్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అల్మాస్ బాబీ తెలిపారు. ఇప్పటికైనా వివక్షను విడనాడి, తమనుసైతం మనుషులుగా గుర్తించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
'నా మనసులో మాట చెప్పడం ఇష్టంలేదు'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై వ్యాఖ్యానించడానికి, రాజీవ్ కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. దీనిపై ఏం చేయాలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు. దీనిపై గురువారం స్పందించిన రాహుల్ దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే గురువారం పార్లమెంట్లో అన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడు రాసిన లేఖను కేంద్ర హోంశాఖ బయటపెట్టడం శోచనీయమన్నారు. కాగా తమిళనాడు రాసిన లేఖను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను విడుదల చేసే విషయంలో, కేంద్రం అనుమతి కావాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే.