Registration services
-
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించిన రాషŠట్ర ప్రభుత్వం, అన్ని గ్రామాల్లో శరవేగంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. రీ సర్వే పూర్తయి, ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ నంబర్) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దశలవారీగా విస్తరణ తొలిసారి 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభించి, రెండోదశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందుకోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్టులుగా నోటిఫై చేసి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది. బాధ్యతలు ఎవరికంటే... అక్కడ పనిచేసే కార్యదర్శులకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా అధికారం కల్పించారు. డిజిటల్ అసిస్టెంట్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కార్యదర్శులకు సహకరించే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇందుకోసం సీఎస్ జవహర్ రెడ్డి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. త్వరలో మరో రెండువేల గ్రామాల్లో... ఇప్పటివరకు గ్రామ సచివాలయాల్లో 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇందుకోసం సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సచివాలయాలతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూముల రీ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాలు, రెండో దశలో మరో 2 వేల గ్రామాల్లో పూర్తవడంతో ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలుండడంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభంకానున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఇక ఈజీ ఆయా గ్రామాల ప్రజలు ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లను తమ సచివాలయాల్లోనే సులభంగా చేసుకోవచ్చు. తాజాగా అనుమతించిన గ్రామాలతో కలిపి మొత్తం 4,077 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించినట్లయింది. అలాగే ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు, ఈసీలు పొందడం వంటి పనుల్ని ఈ కార్యాలయాల్లోనే చేసుకోవచ్చు. -
రిజిస్ట్రేషన్ల సులభతరానికే కార్డు–2.0
దొండపర్తి(విశాఖ దక్షిణ): ప్రజలకు సులభతర, సురక్షిత రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే కార్డు–2.0 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ తెలిపారు. నూతన దస్తావేజుల రిజిస్ట్రేషన్ విధానం కార్డు–2.0పై ఉన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన విధానం, సాఫ్ట్వేర్ పనితీరు, దాని ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో అప్పటి అవసరాలకు తగినట్లుగా రూపొందించిన రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నామని చెప్పారు. అయితే, రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటికీ చెక్‌పెట్టి, మెరుగైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో రెండువేల గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా దస్తావేజుల తయారీ నుంచి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందుగానే అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రధానంగా చిన్నచిన్న కారణాలతో దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించే అవకాశం ఉండదని ఐజీ వివరించారు. ప్రయోగాత్మకంగా 23 చోట్ల.. ఈ కార్డు–2.0ను ప్రయోగాత్మకంగా 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిషేధిత భూములు, స్టాంప్ డ్యూటీ విలువ, మార్కెట్ విలువ, డాక్యుమెంట్ జనరేషన్, సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆటో మ్యుటేషన్ ఇలా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఎటువంటి ఫిర్యాదులు, ఇబ్బందులు తలెత్తలేదని ఐజీ రామకృష్ణ చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. విష ప్రచారాన్ని నమ్మొద్దు ఇక కార్డు–2.0పై కొంతమంది మిలిటెంట్ తరహాలో విషప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్, ఈ–సైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను తనఖా సంస్థలు, బ్యాంకులు అంగీకరించవన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 వచ్చిన తరువాత ఈ–సైన్ ద్వారా ప్రజలు దస్తావేజుల మీద సంతకాలు చేయవచ్చని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అదే విధంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి దూరమవుతుందనడంలో నిజంలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆన్ లైన్ లోనే రిజిస్ట్రేషన్ సేవలు
-
గత వందేళ్లలో ఎవరు చేయనిది చేస్తున్నాడు:స్పీకర్ తమ్మినేని సీతారాం
-
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్: సీఎం జగన్
-
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతామని.. దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.. అన్ని గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. చదవండి: రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. ‘‘భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు. 2023 కల్లా సమగ్ర రీ సర్వే చేసి యూనిక్ ఐడీ కార్డ్, డేటా అప్డేట్ ఇస్టాం. తొలి దశలో 51 గ్రామాల్లోని.. 29,563 ఎకరాల భూముల రీసర్వే చేశాం. ఎమ్మార్వోల ద్వారా భూ యజమానుల అభ్యంతరాలను పరిష్కారం చేశాం. ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు ఇస్తామని’’ సీఎం పేర్కొన్నారు. -
మీ కళ్ల ముందే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్: సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్న సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
Time: 11:41 AM రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. Time: 11:27 AM వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దాదాపు రూ.1,000 కోట్ల ఖర్చుతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలను అధికారులు రీసర్వే చేశారు. ఇందులో భాగంగా వారికి చెందిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి.. 3,304 అభ్యంతరాలను పరిష్కరించారు. ఈ భూమి రికార్డులను సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో మిగిలిన భూముల రీసర్వేను కూడా పూర్తి చేయనున్నారు. తర్వాత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన భూకమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి.. చేతులు మారినా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది. భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్‌తో కూడిన భూపటాన్ని యజమానులకు జారీ చేస్తుంది. గ్రామ స్థాయిలోనే భూరికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయి. శాశ్వత భూ హక్కు సర్వే ప్రతి అడుగులో భూ యజమానులను భాగస్వాములను చేశారు. మండల మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాలను పరిష్కరించారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్ర భూసర్వే పూర్తయిన వాటికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం జారీ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. శాశ్వత భూహక్కు పత్రం ఉండటం వల్ల ఇకపై భూలావాదేవీలు పారదర్శకంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుంది. దళారీ వ్యవస్థ రద్దవడంతోపాటు లంచాలకు చోటు ఉండదు. భూ యజమానులకు తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవు. ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్ డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరిస్తారు. భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పొందొచ్చు. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం అందడం వల్ల భూములు, ఆస్తులు సురక్షితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూవివాదాలు తలెత్తవు. భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులుంటాయి. పారదర్శకంగా ఉండటం వల్ల భూ యజమానులు రుణాలు పొందడం కూడా సులభం కానుంది. ఇక గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులనే సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. రెవెన్యూ శాఖ(స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ మేరకు సోమవారం రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. భూరికార్డులను సులభంగా తనిఖీ చేసుకునేలా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల స్థాయిలో వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలోనే రిజి స్ట్రేషన్ సేవలందించేందుకు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలను ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వేరు చేసి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్టులుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త సబ్ డిస్ట్రిక్టులు ఇవే.. శ్రీకాకుళం జిల్లా.. శింగన్నవలస, డోల, విజయనగరం జిల్లా.. సోంపురం, పెదమనపురం, విశాఖపట్నం జిల్లా.. నునపర్తి, చింతపల్లి–1, తూర్పుగోదావరి జిల్లా.. పాలగుమ్మి, మాధవపురం, గుడివాడ, భూపాలపట్నం–2, తాళ్లపొలం, బండపల్లి, రంగాపురం, తోగుమ్మి, పెదపుల్లేరు, కృష్ణా జిల్లా.. పోతిరెడ్డిపాలెం, లింగవరం, మర్రిబంధం, షేర్ మహ్మద్‌పేట, గుంటూరు జిల్లా.. తుమ్మలపాలెం, నడికుడి–3, ఉన్నవ, దుగ్గిరాల–1, ప్రకాశం జిల్లా.. శివరామపురం, కొప్పోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. నువ్వూరుపాడు, దుండిగం, భీమవరం, మొగల్లూరు, చిత్తూరు జిల్లా.. అగరమండళం, రామభద్రాపురం, విట్టలం, నర్సింగపురం, వైఎస్సార్ జిల్లా.. రేగిమానుపల్లె, మొయిళ్లకాల్వ, కర్నూలు జిల్లా.. ముసనహల్లి, పందిపాడు గ్రామ సచివాలయాల్లోనే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలోకొస్తాయన్నారు. పంచాయతీ, వార్డు పరిపాలన కార్యదర్శులను కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లకు సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా సచివాలయాల పరిధిలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను వీరే నిర్వహిస్తారని స్పష్టం చేశారు. -
ఇంటినుంచే రిజిస్ట్రేషన్ సేవలు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్ర ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్ సేవలు పొందేలా ఆన్లైన్ విధానాన్ని గత నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ విధానం ద్వారా కక్షిదారులు తమ ఇంటి వద్ద నుంచే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఏలూరు రేంజ్ డీఐజీ కె.లక్ష్మీనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా డీఐజీ మాట్లాడుతూ 1883లో రిజి స్ట్రేషన్ శాఖ ఆవిర్భవించిందని, అప్పటి నుంచి వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వస్తోందన్నారు. 1999లో ప్రారంభించిన కంప్యూటరీకరణతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరమైందని, ప్రస్తు త ఆన్లైన్ విధానం మరింత సౌలభ్యంగా ఉంటుందని చె ప్పారు. ఆన్లైన్ విధానం ద్వారా మీ సేవా కేంద్రాలకు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లకుండా ఉచితంగా ఈసీలు, దస్తావేజు సర్టిఫైడ్ కాపీలు పొందవచ్చన్నారు. దస్తావేజుల కీలక సమాచారం పౌరులచే నమోదు చేయడానికి, సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి ఈ విధానం దోహదపడుతుందన్నారు. ఈ విధానం ముఖ్యంగా బ్యాం కర్లు, న్యాయవాదులు, రియల్ఎస్టేట్ వ్యాపారులకు మేలుచేస్తుందన్నారు. గతనెలలో ఏలూరు రిజిస్ట్రేషన్ జిల్లాలో 380, భీమవరం రిజిస్ట్రేషన్ జిల్లాలో 280 లావాదేవీలు జరిగాయని స్పష్టంచేశారు. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్లు, కక్షిదారులు పాల్గొన్నారు. -
4రోజులు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం
హైదరాబాద్: రికార్డులను యునికోడ్ ఫార్మట్‌లోకి మార్చే క్రమంలో ఈనెల 23 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగం కమిషనర్ అండ్ ఐజీ విజయకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈనెల 27 నుంచి సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
త్వరలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
తాడేపల్లిగూడెం : త్వరలో రిజిస్ట్రేషన్ల సేవలను ఆన్లైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దిశగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే కనుక అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన భూములు, లేదా కట్టడాలను ఎక్కడినుంచి అయినా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు వివరాలను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ ఎం.సాయిప్రసాదరెడ్డి శుక్రవారం వెల్లడించారు. భూముల విలువను నిర్ధారించే క్రమంలో భాగంగా పట్టణంలో పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో భూముల విలువలు పెరుగుతాయన్నారు. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి విలువను నిర్ధారిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల శాఖ ఆదాయం కేవలం 60 శాతం మాత్రమే వచ్చిందన్నారు. 2014-15లో పెరగనున్న భూముల విలువ కారణంగా జిల్లాలో రూ.375 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సర్టిఫికెట్ల కాపీలను ఎవ్వరికి వారే తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుందన్నారు. ఆయన వెంట సబ్ రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ పి.శేఖర్ ఉన్నారు. -
రిజిస్ట్రేషన్లు బంద్
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు స్వల్ప బ్రేక్ పడనుంది. జిల్లాలో ఈ నెల 30న సాయంత్రం 6 నుంచి.. జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలగనుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సెంట్రల్ సర్వర్‌ను విభజించాల్సి ఉండటంతో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. మీసేవ కేంద్రాల ద్వారా ఈసీలు, నకళ్ల జారీ సైతం స్తంభించనుంది. రిజిస్ట్రేషన్ శాఖలో సీసీఏ(కార్డ్ సెంట్రలైజ్డ్ అప్లికేషన్) విధానం అమలు చేస్తున్నందున ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన లావాదేవీల వివరాలు హైదరాబాద్‌లోని సెంట్రల్ సర్వర్‌లో నమోదవుతుంది. సాధారణంగా ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా 500 పైబడి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. ఈసీలు 800 వరకు జారీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్ల ఫీజు తగ్గించడంతో ఆదాయం భారీగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో గత ఏడాదిలో లక్ష్యాన్ని కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో 65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను ఇప్పటికీ నిర్దేశించకపోయినా.. ఆ ప్రభావం శాఖ కార్యకలాపాలతో పాటు ఆదాయంపై చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.