remand peter
-
'ఈనెలా నగదు రూపంలోనే పింఛన్లు'
హైదరాబాద్: ఈనెల 5 నుంచి 10 వరకు తెలంగాణలో ఆసరా పింఛన్లు పంపిణీ చేయనున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ తెలిపారు. ఈనెలలో కూడా నగదు రూపంలో పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. మొత్తం లబ్ధిదారుల సంఖ్య 27.38 లక్షలని తెలిపారు. అనర్హుల ఏరివేతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. లబ్దిదారుల్లో అనర్హులను గుర్తిస్తే సర్పంచ్ లకు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో రహదారులు అభివృద్ధి పనులు ఫిబ్రవరి నుంచి చేపట్టనున్నట్టు రేమండ్ పీటర్ తెలిపారు. -
93 లక్షల కుటుంబాల డేటా నమోదు పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వేలో భాగంగా సేకరించిన 93 లక్షల కుటుంబాల సమాచారాన్ని కంప్యూటరీకరణ చేసే ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో త్వరలో కంప్యూటరీకరణ పూర్తవుతుందని అధి కారులు వివరించారు. 1.05 కోట్ల కుటుంబాల్లో ఇప్పటివరకు 93 లక్షల కుటుం బాల డేటాను కంప్యూటరీకరించినట్లు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే 21 లక్షల కుటుంబాలను సర్వే చేయగా 8 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తయిందని, మిగిలింది పూర్తి చేసేందుకు ఇతర జిల్లాలకూ సర్వే పత్రాలను పంపిస్తున్నట్లు వివరించారు. సమగ్ర సర్వే కంప్యూటరీకరణ పూర్తయినట్లు కలెక్టర్లు సర్టిఫికేషన్ చేసి పంపించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. -
స్థానిక ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ మూడు రోజులపాటు రాజధానిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకరోజు శిక్షణను ఒకేసారి ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ, సీఎం మాత్రం మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలని.. అందులో ఒకరోజు మొత్తం తానే శిక్షణ ఇస్తానని వారికి వివరించారు. అయితే, ఈనెల 22 తర్వాత శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 51.05 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ సమగ్ర సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు 51,05,072 కుటుంబాల వివరాలను కంప్యూటరీకరణ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ వివరించారు. ఈనెల 11వ తేదీలోగా ఈ కంప్యూటర్లలో డేటా నిక్షిప్తం చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. -
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
-
సర్వే రోజు ఇంట్లో ఉండాల్సిందే
* టీ సర్కార్ స్పష్టీకరణ * హాస్టల్స్‌లో చదువుకుంటున్న * విద్యార్థులకు మాత్రం మినహాయింపు * హైదరాబాద్ సహా... రాష్ట్రమంతటా ఈనెల 19న ఒకే రోజు సర్వే * విదేశాలకు వెళ్లినవారు, వలసలు వెళ్లినవారు అవసరం అనుకుంటే రావచ్చు సాక్షి, హైదరాబాద్: ఈనెల 19న జరిగే సమగ్ర ఇంటింటి సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకరో, ఇద్దరో ఉండి వివరాలు చెబుతామంటే కుదరదని వెల్లడించింది. కేవలం హాస్టళ్లలోని విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తామని, అయితే వారు హాస్టల్లో ఉన్నట్లు రుజువులు ఇవ్వాలని, ఆ విద్యార్థులు ఏ హాస్టల్లో చదువుతున్నారో నమోదు చేసుకుంటామని స్పష్టం చేసింది. శుక్రవారం రెండున్నర గంటలపాటు సర్వేపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ‘సెర్ప్’ సీఈ వో మురళీలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తరువాత రేమండ్ పీటర్ తనను కలసిన విలేకరులతో మాట్లాడారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ప్రయోజనం పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని, సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించడానికి యత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏవిధమైన పథకాలు ప్రవేశపెట్టాలన్నా.. దానికి సమగ్ర సమాచారం ఉంటేనే.. ఆ కార్యక్రమాలు ఫలవంతం అవుతాయని రేమండ్ పీటర్ వివరించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరయ్యాక... వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల.. వారికి రావాల్సిన పెన్షన్, రేషన్‌ను మధ్య దళారీలు తినేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులున్నా అనేకమంది వివిధ కారణాలతో సరుకులు తీసుకోవడం లేదని, వారిపేరుతో దళారీలు వాటిని దోచుకుంటున్నారని, ఇలాంటి వాటిని తొలగించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. సూరత్, ముంబై వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్న వారికి.. ఇక్కడ సంక్షేమ పథకాలతో అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు మొత్తం సర్వే నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఏర్పా ట్లు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోల సమావేశంలో విడుదల చేసిన సర్వే ఫార్మాట్‌కు ఆ సమావేశంలో వచ్చిన సూచనల మేరకు కొన్ని మార్పులు చేశామని అన్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, శనివారం సర్వే తుది ఫార్మాట్‌ను ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామని ఆయన వివరించారు. స్థానికతకు.. సర్వేకు సంబంధం లేదు: రేమండ్ పీటర్ సమగ్ర ఇంటింటి సర్వేకు స్థానికతకు ఏమాత్రం సంబంధం లేదని రేమండ్ పీటర్ వెల్లడించారు. సర్వే ఫార్మాట్లో ఏ రాష్ట్రం నుంచి వచ్చారు..? ఎంతకాలం నుంచి ఉంటున్నారు..? వంటి ప్రశ్నలు ఉండబోవని స్పష్టం చేశారు. కాగా, కలెక్టర్ల సదస్సు సమయంలో మహ బూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలంలో బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఎక్కువగా ఉన్నారని, మరి వారి పేర్లను, రాష్ట్రాన్ని నమోదు చేయాలా.? అని జిల్లా కలెక్టర్ సందేహం వ్యక్తం చేయడంతో.. నమోదు చేయాలని భావించి, సవరించిన ఫార్మాట్‌ను జిల్లాలకు పంపించారు. కాని ఆ తరువాత అది వివాదాస్పదమవుతుండటంతో తుది ఫార్మాట్లో ఆ కాలాన్ని తొలగించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది ఫార్మాట్ ఇస్తున్నట్లు రేమండ్ పీటర్ వివరించారు. -
10 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు
హైదరాబాద్: పది మంది ఐఏఎస్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి... అపార్డ్ డైరెక్టర్‌గా రేమండ్ పీటర్‌కు అదనపు బాధ్యతలు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ బదిలీ మహబూబ్‌నగర్ కొత్త కలెక్టర్‌గా జీడీ ప్రియదర్శిని ఖమ్మం జిల్లా కొత్త కలెక్టర్‌గా కె.ఇలంబర్తి నిజామాబాద్ జిల్లా కొత్త కలెక్టర్‌గా రొనార్డ్ రాస్ స్త్రీ శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌గా అమరపాళి నియామకం ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్‌గా జె.నివాస్‌కు అదనపు బాధ్యతలు నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా ప్రీతిమీనా వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా హరినారాయణ్ నియామకం నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ డి.వెంకటేశ్వరరావు బదిలీ