Remand prisoners
-
రిమాండ్ ఖైదీలకు పాజిటివ్
సాక్షి, బెంగళూరు : రామనగర జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్లో ఉన్నామని గుండెలమీద చేయివేసుకుని ధైర్యంగా ఉన్న రామనగర ప్రజలు ఇప్పుడు గజగజ వణికిపోతున్నారు. రామనగర లోని జైలులోని ఐదు బ్యారక్‌లలో 25 మంది చొప్పున రిమాండ్ ఖైదీలను ఉంచారు. వారందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో గురువారం రాత్రి సమయానికి 5 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో తోటి ఖైదీలకూ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారితోపాటు సన్నిహితంగా మెలిగిన పోలీసుల సిబ్బంది, వైద్య సిబ్బంది,జైలు సిబ్బందికీ కరోనా వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. జైలు సిబ్బంది ధర్నా రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపిస్తూ జైలు సిబ్బంది గురువారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. నిందితులను జైలుకు తీసుకువచ్చేటప్పుడు మాస్కు, స్యానిటైజర్ లాంటివి వాడకపోవడం, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తమ ప్రాణాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జైలు అధికారులు తక్షణం నగరసభ అధికారులకు ఫోన్ చేసి మాస్కులు,స్యానిటైజర్లు తెప్పించుకున్నారు. పాదరాయనపుర నిందితులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టర్ అర్చన జిల్లా, తాలూకాస్థాయి అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. నిందితులను హజ్ భవనానికి తరలింపు రామనగర జైలులో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో పాదరాయనపుర దాడులకు సంబంధించిన నిందితులు 116 మందిని శుక్రవారం 7 కేఎస్ఆర్టీసీ బస్సుల్లో బెంగళూరులోని హజ్ భవనానికి తరలించారు. వీరితోపాటు జైలులో ఉన్న 17 మంది ఖైదీలను కూడా హజ్ భవనానికి తరలించారు.అందరికీ ముందు జాగ్రత్త చర్యగా స్క్రీనింగ్ టెస్టులు చేశారు. -
ఖైదీలను కలవాలంటే..!
నేరస్తులు ఎలాంటి వారైనా వారికీ బంధాలు ఉంటాయి. బంధుమిత్రులు ఉంటారు. నేరాలకు పాల్పడి అరెస్టయిన వారిని కలుసుకోవాలని వారి బంధుమిత్రులు ఆశిస్తారు. జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ముద్దాయిలను కలవాలంటే ఏం చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, వారిని ఎన్నిసార్లు కలవచ్చు, ఎంత సమయం మాట్లాడవచ్చు అనే అంశాలను తిరుపతి ప్రత్యేక జైలు అధికారి వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. తిరుపతి క్రైం: అనుమతి తీసుకోవడం ఇలా..జైలులో ఉన్న వారిని కలిసేందుకు ముందుగా ఓ దరఖాస్తు పూర్తి చేయాలి. అందులో ఖైదీతోపాటు కలవడానికి వచ్చిన వారి వివరాలు, ఖైదీలతో వారికున్న బంధం, చిరునామా తెలియజేయాలి. ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) ఇవ్వాలి. దరఖాస్తును జైలు సిబ్బందికి అందజేస్తే వారు ఉన్నతాధికారికి పంపిస్తారు. ఆయన దానిని పరిశీలిం చి అనుమతిని మంజూ రు చేస్తారు. ఖైదీలను సాధారణ పనిరోజుల్లో వారానికి 2 సార్లు కలవచ్చు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు కలిసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న బంధువులు ఖైదీతో సుమారు 20 నిమిషాలు మాట్లాడవచ్చు. ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాల్లో కలుసుకోవడానికి అనుమతి ఇవ్వరు. ఖైదీని తల్లిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వారి న్యాయవాదులు కలిసేందుకు అవకాశం ఉంటుంది. ఖైదీలను కలవడానికి వచ్చేవారు గతంలో పండ్లు, కవర్ ప్యాకింగ్‌తో ఉన్న బిస్కెట్లు, స్వీట్లు అందించే అవకాశం ఉండేది. ప్రస్తుతం దీన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు దుస్తులు, దుప్పట్లు మాత్రమే ఇవ్వవచ్చు. డాక్టర్ పరిశీలిస్తే సూపరింటెండెంట్ అనుమతితో మందులను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా వీటిని జైలు సిబ్బంది పరిశీలించి తరువాత ఖైదీలకు అందిస్తారు. ఖైదీలకు డబ్బులు ఇవ్వాలనుకుంటే నేరుగా ఖైదీలకు ఇవ్వరాదు. వారు ఇవ్వాలనుకున్న డబ్బును జైలు సిబ్బందికి ఇస్తే ప్రిజనర్స్ ప్రైవేట్ క్యాష్(పీపీసీ)లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ ద్వారా సంభాషణ జైలులో ఉన్న ఖైదీలకు ఫోన్ సదుపాయం కల్పిస్తారు. కాల్‌కు 5 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. ఫోన్ మాట్లాడే సమయంలో వారు మాట్లాడే మాటలన్నీ జైలు సూపరింటెండెంట్ కార్యాలయంలో రికార్డు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖైదీలు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. నెలకు 2 సార్లు ఫోన్ చేసుకోవచ్చు. 15 రోజులకొకసారి ఖైదీలకు ఉత్తరం రాసుకునే అవకాశం కల్పిస్తారు. సిబ్బంది ఎదుటే మాట్లాడాలి సిబ్బంది పర్యవేక్షణలోనే ఖైదీలతో సంబంధించిన వ్యక్తులతో మాట్లాడిస్తాం. ఖైదీల కోసం తీసుకొచ్చిన పండ్లు, బిస్కెట్లు గతంలో అనుమతిస్తున్నాము. ప్రస్తుతం భద్రత కోసం ఖైదీలకు ఎటువంటి తినుబండారాలు కానీ, క్యారీయర్ కానీ తెచ్చివ్వకూడదు. ఏదైనా మాట్లాడాలన్నా కూడా మా ముందే మాట్లాడాలి. –వేణుగోపాల్‌రెడ్డి,తిరుపతి ప్రత్యేక జైలు అధికారి -
జైలులో ఉన్నవారిని కలవాలంటే..!
పాలకోడేరు రూరల్: జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ముద్దాలను కలవాలంటే ఎలా అనే విషయాలను భీమవరం సబ్‌జైలు చీఫ్ హెడ్ వార్డర్ వీవీవీఎస్ఎం ప్రసాద్ తెలిపారు. ఏం చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, వారానికి ఎన్నిసార్లు కలవొచ్చు, ఎంత సమయం మాట్లాడవచ్చు తదితర వివరాలు తెలుసుకోండి. అనుమతి తీసుకోవడం ఇలా.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు ముందుగా ఓ దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. సంబంధిత ఖైదీ వివరాలు, కలవడానికి వచ్చిన వారి వివరాలు, ఖైదీతో వీరికున్న బంధం, చిరునామాను దరఖాస్తుపై పూరించాలి. దీంతో పాటు కలవడానికి వచ్చిన వారి ఆధార్ లేక రేషన్ కార్డు జెరాక్సు కాపీ జతచేయాలి. దరఖాస్తును జైలు సిబ్బందికి అందిస్తే వారు సూపరింటెండెంట్‌కు పంపిస్తారు. ఆయన దానిని పరిశీలించి అనుమతి ఇస్తారు. రెండు సార్లు.. 20 నిమిషాలు వారానికి రెండు సార్లు సాధారణ పనిరోజుల్లో ఖైదీలను కలవవచ్చు. ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 4 గంటలలోపు కలవవచ్చు. ఖైదీతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఖైదీ తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, వారి న్యాయవాదులు కలిసేందుకు అవకాశం ఇస్తారు. తినుబండారాలు.. వస్త్రాలు ఖైదీలను కలవడానికి వచ్చే వారు పండ్లు, కవర్ ప్యాకింగ్ (సీల్డ్ ఐటమ్స్) ఉన్న బిస్కెట్లు, స్వీట్లు అందించవచ్చు. దుస్తులు ఇవ్వవచ్చు. డాక్టర్ పరిశీలించిన తర్వాత సూపరింటెండెంట్ అనుమతితో మందులు ఇవ్వవచ్చు. ముందుగా వీటిని జైలు సిబ్బంది పరిశీలించిన తర్వాతే ఖైదీలకు అందిస్తారు. ఖైదీలకు సొమ్ములు ఇవ్వాలనుకుంటే వాటిని జైలు సిబ్బందికి ఇస్తే పీపీసీకి (ప్రజనీర్స్ ప్రైవేట్ క్యాష్) నందు డిపాజిట్ చేస్తారు. ఫోను.. పోస్టు కార్డు సౌకర్యం జైలులో ఉన్న ఖైదీలకు ఫోన్ సదుపాయం కల్పిస్తారు. కాల్‌కు 5 నిమిషాలకు రూ.10 వసూలు చేస్తారు. ఫోను సంభాషణలు జైలు శాఖ ఉన్నత కార్యాలయంలో రికార్డు అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖైదీలు మాట్లాడాల్సి ఉంటుంది. జైలులో ఫోను ఉపయోగించని వారికి నెలకు రెండు సార్లు పోస్టు కార్డులు అందిస్తారు. 15 రోజులకోసారి ఖైదీలకు ఉత్తరం రాసుకునే అవకాశం కల్పిస్తారు. -
సుదీర్ఘ రిమాండ్ ఖైదీలెవరూ లేరు
‘సుప్రీం తీర్పు’ నేపథ్యంలో లెక్క తేల్చిన జైళ్ల శాఖ హైదరాబాద్: సుదీర్ఘకాలంగా విచారణను ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా విడుదల చేయాల్సిన రిమాండ్ ఖైదీలు (విచారణ ఖైదీలు) ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు కూడా లేరని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఏపీలో ఉన్న 116 కారాగారాల్లో ప్రస్తుతం 8,234 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 5,667 మంది విచారణ ఖైదీలు. వీరు నేరం రుజువైతే పడే శిక్ష కాలంలో ఇప్పటికి పావు వంతు కాలం కూడా జైల్లో లేరని అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. నిరుపేదలైన ఖైదీల న్యాయ సహాయానికి అయ్యే ఫీజును లీగల్ సర్వీసెస్ అథారిటీ చెల్లించి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. బెయిల్‌కు పూచీకత్తు మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. నిందితులు షూరిటీలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో సుప్రీంకోర్టు సూచించిన తరహా రిమాండ్ ఖైదీలు లేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు.