Rice supply
-
హమాలీల సమ్మెతో పేదలకు ప‘రేషన్’!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో రేషన్ బియ్యం కోసం పేదలు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇప్పటివరకు చాలా జిల్లాల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. స్టేజ్–1 గోడౌన్ల నుంచి జిల్లాల్లోని మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు బియ్యం వచ్చినప్పటికీ ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి హమాలీలు సమ్మె చేస్తున్న కారణంగా చాలా చోట్ల బియ్యం గ్రామాలకు చేరడం లేదు. రెండేళ్లకోసారి పెంచాల్సిన హమాలీ రేట్లను గడువు దాటి ఏడాదైనా పెంచకపోవడంతోపాటు ఇటీవల ఇచ్చిన హామీని కూడా పౌరసరఫరాల శాఖ కమిషనర్ పట్టించుకోకపోవడంతో సమ్మెలోకి వెళ్లినట్లు హమాలీలు చెబుతున్నారు. రేట్లు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తామని హమాలీలు తెగేసి చెబుతున్నారు. సమ్మె ఫలితంగా నాలుగు రోజులుగా చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు తెరుచుకోవడంలేదు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించడం లేదు. హమాలీలు సమ్మె నోటీసు ఇచ్చినా.. రాష్ట్రంలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న హమాలీల రేట్లను రెండేళ్లకోసారి పెంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా 2022 వరకు రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగింది. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యాన్ని దించడానికి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు తరలించడానికి హమాలీలకు క్వింటాలుకు రూ. 26 లెక్కన కూలి చెల్లిస్తున్నారు. ఈ రేట్లను 2024లో సవరించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు గతేడాది అక్టోబర్ 4న పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వద్ద జరిగిన సమావేశంలో కూలి రేట్లను రూ. 26 నుంచి రూ. 29కి పెంచేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో డిసెంబర్ 18న హమాలీలు పౌరసరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నెలాఖరులోగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాకుంటే జనవరి 1 నుంచి సమ్మెలోకి వెళ్తామని నోటీసు కూడా ఇచ్చారు. అలాగే గతేడాది డిసెంబర్ 28న మరోసారి నోటీసు పంపారు. అయినప్పటికీ రేట్ల పెంపు ఉత్తర్వులు కొత్త ఏడాదిలోనూ విడుదల కాకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెకు దిగినట్లు హమాలీ సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. మునీశ్వర్, ఎస్. బాలరాజ్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి మినహా... రాష్ట్రంలో 187 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా సుమారు 3,600 మంది హమాలీలు పనిచేస్తున్నారు. వారంతా ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, బీఆర్‌ఎస్‌కేయూ సంఘాల్లో సభ్యులుగా ఉండగా ఏఐటీయూసీ అనుబంధ హమాలీ సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. బీఆర్‌ఎస్‌కేయూ మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతిస్తున్నట్లు హమాలీ సంఘం నాయకులు చెప్పారు. రాష్ట్రంలో 17,335 దుకాణాలు ఉండగా అందులో శనివారం 9,319 దుకాణాలనే తెరిచారు. అంటే దాదాపు సగం దుకాణాలు ఇప్పటికీ తెరవలేదు. తెరిచిన చోట కూడా కోటా పూర్తిస్థాయిలో బియ్యం రాలేదని సమాచారం. -
పాఠశాలలకు నేరుగా బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్ డెలివరీ చేస్తుండగా.. ఈ నెల నుంచి ఐసీడీఎస్ (అంగన్వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని నేరుగా రవాణా చేయనుంది. తద్వారా ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూర్చనుంది. ఇప్పటివరకు అంగన్వాడీలు రేషన్ దుకాణం నుంచి, స్కూళ్లు, హాస్టళ్ల యాజమాన్యాలు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వ్యయప్రయాసలతో బియ్యం తెచ్చుకునేవారు. ఒకరోజు ప్రత్యేకంగా బియ్యం కోసం కేటాయించాల్సి వచ్చేది. పైగా రవాణా, ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఇబ్బందులు పడేవారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వమే రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఫైన్ క్వాలిటీ ధాన్యం సేకరణ రాష్ట్రంలో అంగన్వాడీలు, స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థుల భోజనానికి ఏడాదికి 2.54 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఇప్పటివరకు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సార్టెక్స్ బియ్యాన్ని (సాధారణ రకాలు) ఫోర్టిఫై చేసి ఆహారంగా అందిస్తోంది. వచ్చే జనవరి నుంచి ఫైన్ క్వాలిటీ (స్థానిక రకాలు, సన్న రకాలు) బియ్యాన్ని కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2022–23 ధాన్యం సేకరణలో మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అవసరమైన ఫైన్ క్వాలిటీ ధాన్యాన్ని ఏడాదికి 4 లక్షల నుంచి 5 లక్షల టన్నుల మేర రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. తద్వారా విద్యార్థులకు, రైతులకు మేలు జరగనుంది. దీనికితోడు అప్పుడే పండిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం ద్వారా వచ్చే బియ్యంతో వండే అన్నం ముద్దగా ఉంటుందనే ఫిర్యాదులను పరిష్కరించేలా.. సేకరణకు, మిల్లింగ్‌కు మధ్య రెండు నుంచి మూడునెలల వ్యవధి ఉండేలా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఏప్రిల్ నుంచి అన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాలతో పాటు ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఆహారంగా తీసుకున్న వారిలో రక్తహీనత శాతం తగ్గినట్టు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మొత్తం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేలా అంగన్వాడీలు, స్కూల్ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే.. మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు బియ్యానికి అదనంగా చేర్చడాన్ని రైస్ ఫోర్టిఫికేషన్ అంటారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–బి12 వంటి కీలక సూక్ష్మపోషకాలను బియ్యంలో అదనంగా చేరుస్తారు. విటమిన్ టాబ్లెట్ కంటే పవర్ఫుల్ ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ రైస్ విటమిన్ టాబ్లెట్ కంటే ఎంతో పవర్ఫుల్. అందుకే రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. దీంతోపాటు విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో 9,260 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, హాస్టళ్లకు విస్తరిస్తున్నాం. – అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ప్రజల సంక్షేమం కోసమే ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీ
విజయనగరం గంటస్తంభం: రేషన్ బియ్యం అంటే ఏదో మొక్కుబడిగా అందివ్వడం కాదు. అవి ప్రతీఒక్కరూ వినియోగించుకునేవిగా ఉండాలి. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడాలి. ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్‌ను అందిస్తోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటివరకూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనే వీటిని పంపిణీ చేస్తుండగా ఈ నెల నుంచి జిల్లాలోని అందరికీ అందిస్తోంది. వీటిని వృథా చేసుకోకుండా వినియోగించుకుంటే వారి ఆరోగ్యానికి, పిల్లలకు ఎంతో మంచిది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లా ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీకి రాష్ట్రంలో విజయనగరం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో జిల్లాలో 78.7శాతం పిల్లల్లో, 75.5శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు తేలడంతో తొలి ప్రాధాన్యతగా జిల్లాను ఎంపిక చేశారు. రక్తహీనత నివారించేందుకు ఈ బియ్యం దోహదపడుతా యన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా అందజేస్తున్నారు. గతంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని మరపట్టి వాటిని రేషన్‌డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేది. ఇప్పుడు అదే ధాన్యం మరపట్టి బియ్యంలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అదనంగా చేర్చుతున్నారు. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలు చేర్చడం వల్ల పోషకా హార లోపాన్ని అధిగమించేలా చేస్తుంది. జిల్లాలో 21 రైస్ మిల్లుల్లో ఇప్పుడు ఫోరి్టఫైడ్ రైస్ తయారవుతోంది. ఈ ఏడాది 1.10లక్షల మెట్రిక్ టన్నులు తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా అవసరమైన బియ్యా న్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తారు. ఎక్కువ మంది పోషకాహార లోపం నుంచి బయట పడేందుకు ఈ బియ్యం సరఫరా చేయాలని సర్కారు యోచించింది. ఈ రైస్ వల్ల రుచి బాగుంటుంది. వంట చేసే విధానంలో ఏమీ మార్పు ఉండదు. పోషకాహార లోపంతో సమస్యలు పోషకాహార లోపంవల్ల చాలా ఇబ్బందులున్నాయి. పోషకాహార లోపం ఉన్నవారు ఎత్తు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడడం, మానసికంగా అలసిపో వడం, నాలుక పాలిపోవడం, తలవెంట్రుకలు రాలడం, ఏకాగ్రత లోపించడం, బలహీనంగా, చికాకుగా ఉండడం, అరచేతులు, అరికాళ్లు పాలిపోవడం, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. రేషన్ బియ్యం పొందేవారిలో కష్టపడే వారు ఎక్కువ. పోషకాహార లోపం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఫోరి్టఫైడ్ రైస్ సరఫరా చేస్తోంది. ఫోలిక్ యాసిడ్ ఫోర్టిఫైడ్ రైస్‌లో ముఖ్యంగా లభించేది ఫోలిక్ యాసిడ్. బాలింత తల్లుల్లో పెరుగుదలకు తోడ్పడుతుంది. పిండం అభివృద్ధి చెందుతుంది. పసిపిల్లల్లో మెదడు, వెన్నెముక పెరగడానికి తోడ్పడుతుంది. రక్త నిర్మాణం బాగా జరుగుతుంది విటమిన్ బి–12 మెదడు, నాడీ మండలం పని చేయడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. ఐరన్ మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల్లో ఐరన్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని సరైన మోతాదులో ఉంచి రక్తహీనత అరికట్టడంలో ఐరన్‌ది ప్రధాన పాత్ర. ఫోర్టిఫైడ్ రైస్ తినడం వల్ల అందులో ఐరన్ రక్తహీనతతో పోరాడుతుంది. వృథా చేయవద్దు ప్రభుత్వం ఫోరి్టఫైడ్రైస్ సదుద్దేశంతో సరఫరా చేస్తోంది. దీనికోసం అదనంగా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. కార్డుదారులు వాటిని వండి తింటే వారి ఆరో గ్యం బాగుంటుంది. సాధారణ బియ్యంలో మి ల్లింగ్ సమయంలో పోషకాలు కలుపుతున్నాం. బియ్యంపై ప్రజలు అపోహలు వీడాలి. ఇందులో కలిపే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి–12 వంటి అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. కార్డుదారులంతా వాటిని వినియోగించుకోవాలి. - జి.సి. కిశోర్‌కుమార్, సంయుక్త కలెక్టర్, విజయనగరం -
అన్నం పెడుతున్న ఆంధ్రప్రదేశ్
లాక్డౌన్ వల్ల పలు రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. దీంతో ఏపీలోని భారత ఆహార సంస్థ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీరుస్తున్నారు. రాష్ట్రంలో సేకరించిన బియ్యాన్ని కేరళ,కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, బెంగాల్‌కు పంపించినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది. సాక్షి, అమరావతి: లాక్డౌన్ వేళ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతోంది. ఆపద సమయంలో దేశానికి ఆహార భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల కొన్ని రాష్ట్రాలకు ఆహార కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని ప్రత్యేక గూడ్స్ రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించి ప్రజల ఆకలి తీర్చడంలో మన రాష్ట్రం కీలక భూమిక పోషించింది. రాష్ట్రంలో ఎఫ్‌సీఐ ద్వారా సేకరించిన బియ్యాన్ని కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 116 గూడ్స్ రైళ్ల ద్వారా పంపించినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్ చెప్పారు. అండమాన్, నికోబార్ దీవులకు కూడా కొంతమేర బియ్యం పంపించామన్నారు. విపత్తు వేళ ఆకలి తీరుస్తూ.. ► కరోనా విపత్తును ఎదుర్కోవడంలో భాగంగా.. పేదల కడుపు నింపేందుకు అవసరమైన బియ్యం ఏ రాష్ట్రానికి అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా గుర్తించింది. ► ఆయా రాష్ట్రాలకు ఏ మేరకు బియ్యం అవసరమనేది అంచనా వేసి మన రాష్ట్రం నుంచి యుద్ధప్రాతిపదికన తరలించింది. ► రాష్ట్రంలోని ఎఫ్‌సీఐ గోదాముల నుంచి వివిధ రాష్ట్రాలకు ఇప్పటివరకు 3.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తరలించారు. వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు కోరితే సబ్సిడీపై బియ్యం ఇస్తారు. ధాన్యం సేకరణకూ ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ► ఆహార కొరత ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా ఖరీఫ్‌లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎఫ్‌సీఐతో కలిసి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించింది. ► రబీ సీజన్లో 25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించేందుకు రాష్ట్ర సివిల్ సప్లైస్, ఎఫ్‌సీఐ సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన సివిల్ సప్లైస్ సంస్థ ధాన్యం సేకరణను మరింత ముమ్మరం చేసింది. ► రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది లేకుండా ముందుజాగ్రత్తగా తగినన్ని బియ్యం నిల్వలను కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉంచింది. 3రాష్ట్రంలోని పేదలు ఆహారానికి ఇబ్బంది పడకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నెలలో 3 విడతలుగా సరుకులను అధికారులు ఉచితంగా పంపిణీ చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడినప్పటికీ 1.48 కోట్ల పేద కుటుంబాలకు బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా అందజేశారు. -
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
-
ఇంటివద్దకే పింఛన్లు
సాక్షి, అమరావతి : దేశ చరిత్రలో తొలిసారిగా సామాజిక పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయనుంది. అదికూడా ఫిబ్రవరి 1వ తేదీనే ఈ ప్రక్రియ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది. అర్హులైన కొత్త వారికి కూడా జనవరి నెల నుంచి పింఛన్లను మంజూరు చేసింది. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితరులకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దే వీటిని ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1,320.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సామాజిక పింఛనన్లు పొందుతున్న వారందరూ కూడా పేదలే అయినందున.. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు అందుకున్నట్లుగానే వీరికి కూడా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్‌ను అందజేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అత్యధిక ప్రాధాన్యతనూ ఇస్తోంది. మరోవైపు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిని శ్రీకాకుళం జిల్లాలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పింఛన్ల పంపిణీ కాగా, శనివారం ఉ.8 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది మ.1 గంటకల్లా పూర్తిచేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి పింఛన్ల మొత్తాలను వారి ఖాతాల్లో జమచేశారు. వలంటీర్లకు ఆ డబ్బులను శుక్రవారం మధ్యాహ్నానికల్లా అందజేయనునున్నారు. -
గోనె సంచులకు బార్ కోడ్..
సాక్షి, హైదరాబాద్: ధాన్యం రవాణా, ప్రజాపంపిణీ రవాణా, బియ్యం సరఫరా వంటి అంశాల్లో వినియోగిస్తున్న గోనె సంచుల విషయంలో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థకు చెందిన గోనె సంచులు దుర్వినియోగం కాకుండా ప్రతీ సంచికి బార్‌కోడింగ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ గన్నీ బ్యాగుకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఇవ్వనుంది. దీని ద్వారా మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి వీలుకానుంది. ఈ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయడం ద్వారా వచ్చిన సమాచారాన్ని సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. ఇది దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమల్లోకి తెస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌లలో త్వర లో దీనిని ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. మార్చే వీలు లేకుండా.. ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ఉపయోగించడం ద్వారా గోనె సంచుల వివరాలను మార్చడానికి వీలుండదు. సంచులు ఏ గోదాములో, ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ రేషన్ షాపు వద్ద వీటిని వినియోగిస్తున్నారు వంటి వివరాలు పౌరసరఫరాలశాఖ వద్ద ఉంటాయి. ఈ సంచులను ఒకటి, రెండు సార్లు లేదా మల్టీ యూజ్‌గా ఉపయోగించారా? లేదా? అన్న విషయాలు తెలుసుకునే వీలుంది. ఈ సంచి ఉపయోగించే ప్రతి సందర్భంలోనూ స్కాన్ చేసి దాని వివరాలు అందుబాటులో ఉంచుతారు. ఈ విధానానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీగా నామకరణం చేశారు. ప్రతీ సీజన్లో ధాన్యం కొనుగోలు సమయంలో పౌరసరఫరాలశాఖ గోనెసంచులను కొనుగోలు చేసి మిల్లర్లకు అందజేస్తోంది. మిల్లర్లకు కేటాయిం చిన ధాన్యానికి సరిపడా సంచులు ఇవ్వాల్సిన జిల్లా మేనేజర్లు.. అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారు. పైగా కస్టమ్ మిల్లింగ్ పెండింగ్‌లో ఉండటం, ఇచ్చిన గోనెసంచులు తిరిగి వెనక్కి రాకపోవడం, దీంతో మళ్లీ సీజన్ లో కొత్త బ్యాగులను కొనివ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ విధంగా ఏకంగా ఆరేళ్లలో కొన్ని కోట్ల గోనెసంచులు లెక్కాపత్రం లేకుండా మాయమయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం దాదాపు కావాల్సిన 12 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. ఈ సంచుల్లో అక్రమాలకు తావులేకుండా బార్‌కోడింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను ప్రవేశపెట్టారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడి
ప్రత్తిపాడు: మండలంలోని వివిధ గ్రామాల్లోని నిత్యావసర వస్తువుల దుకాణాలు(రేషన్ షాపు)పై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. 361.10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఈదాడులు నిర్వహించినట్టు విజిలెన్స్ సీఐలు టి.రామ్మోహన్ రెడ్డి, సాయి రమేష్, సత్య కష్ణ ప్రత్తిపాడులో గురువారం సాయంత్రం తెలిపారు. మండలంలోని ఏలూరులో రెండు, పెద్దిపాలెంలో రెండు, ప్రత్తిపాడు, ఉత్తరకంచి గ్రామాల్లోని ఒక్కొక్క రేషన్ షాపు వెరసి ఆరు షాపులపై దాడులు నిర్వహించారు. ఏలూరు షాపు నంబర్–6లో 12 క్వింటాళ్లు, షాపు నంబర్ 38లో మూడు క్వింటాళ్లు, పెద్దిపాలెం షాపు నంబర్ 15లో 11 క్వింటాళ్లు, షాపు నంబర్ 16లో మూడు క్వింటాళ్లు, ప్రత్తిపాడు షాపు నంబర్ 11లో ఐదు క్వింటాళ్లు, ఉత్తరకంచి షాపు నంబర్ 28లో మూడు క్వింటాళ్లు వెరసి 37 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడాన్ని అధికారులు గుర్తించారు. బియ్యం నిల్వలు తేడాగా ఉండడంతో ఈ ఆరు షాపుల్లో ఉన్న 361.10 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు ఏలూరులో 26 కేజీలు, పెద్దిపాలెంలో 39 కేజీలు, ప్రత్తిపాడులో 14 కేజీలు, ఉత్తరకంచిలో 12 కేజీలు వెరసి 91 కేజీల పంచదారను కనుగొన్నారు. డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్ సీఐలు తెలిపారు. జేసీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, డీసీటీఓ రత్నాకర్, ఏజీఓ మహేష్, ఎస్సై రామకష్ణ, ప్రత్తిపాడు ఎంఎస్ఓ ఎస్కే ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కులకు అడ్డుకట్ట!
సన్నబియ్యం సరఫరాపై కొత్త నిబంధనలు సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యం అక్రమార్కులకు సర్కారు అడ్డుకట్ట వేస్తోంది. అక్రమార్కులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించి వాటి స్థానంలో దొడ్డుబియ్యాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరçఫరాల శాఖ ఉన్నతాధి కారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి అన్నం వండించి నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలు, హాస్టళ్లకు కొత్తగా తెల్లని సంచుల్లో 50 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఈ సంచులపై బియ్యం సరఫరా చేసిన మిల్లర్ పేరు, ఏ రోజు సంచులు నింపారు, మిల్లు ఉన్న ప్రాంతం, బియ్యం రకం తదితర వివరాలను ముద్రిస్తు న్నారు. ఈ సంచులను రేషన్ డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాల నుంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే గుర్తించవచ్చంటున్నారు. తనిఖీల సమ యంలో అధికారులు అప్పటి కప్పుడు అన్నం వండించి సన్నబియ్యమే వినియోగిస్తున్నారని ఎంఈవోలకు ధ్రువీకరణపత్రాన్ని అందించాలి. దీనిని ఎంఈవో డీఈవోకి అందించాలి. ఆ తర్వాత డీఈవోలు జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాల్సి ఉంటుంది. -
‘రేషన్’ కోసం మైళ్ల దూరం..
కామారెడ్డి : జిల్లాలో ఒక మున్సిపాలిటీతో పాటు 323 పంచాయతీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 478. మరో వందకుపైగా శివారు గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లాలో 2,22,513 కుటుంబాల్లో 9,72,625 నివసిస్తున్నారు. అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి 2,46,039 ఉన్నాయి. వీరికి 578 రేషన్ షాపుల ద్వారా నెలనెలా 48.50 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. అలాగే కిరోసిన్, గోధుమలు, చక్కెర సరఫరా చేస్తున్నారు. అయితే అన్ని సరుకులను ఒకేసారి అందించడం లేదు. బియ్యం, చక్కెర ఒకసారి, కిరోసిన్ మరోసారి పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆయా సరుకులను తెచ్చుకోవడానికి లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు రెండు సార్లు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో 30 రేషన్ షాపులు ఉండగా, బాన్సువాడ, ఎల్లారెడ్డిలాంటి పట్టణాల్లో పదికిపైగా రేషన్ షాపులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేకపోవడంతో ప్రజలు సరకుల కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 70కి పైగా హాబిటేషన్లలో రేషన్‌షాపులు లేవు. ఆయా గ్రామాల ప్రజలంతా సమీపంలో ఉన్న రేషన్‌షాప్‌లకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లేసరికి డీలర్ లేకుంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. ఒక్కోసారి డీలర్లు సమయానికి రాలేదంటూ రేషన్ సరకులు ఎగ్గొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో.. మారుమూల మండలాల్లోని చాలా గ్రామాల్లో రేషన్ షాపులు అందుబాటులో లేవు. జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన జుక్కల్‌లో పరిస్థితి మరీ దారుణం. జుక్కల్ మండలంలో లొంగన్, చిన్నగుళ్ల, కత్తల్వాడి, మంగాపూర్, మెబాపూర్, సిద్దాపూర్, దోస్పల్లి, బంగారుపల్లి, సావర్గావ్, శక్తినగర్, మైలార్ తదితర గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. ఈ మండలంలో 24 రేషన్ షాపులు ఉండగా 13 మంది డీలర్లు మాత్రమే ఉన్నారు. 11 దుకాణాలు ఇన్చార్జీల పాలనలో నడుస్తున్నాయి. మద్నూర్ మండలంలో 42 గ్రామాలుండగా 33 గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఉన్నాయి. గోజేగావ్, సలాబత్పూర్, ఇలేగావ్, లచ్మాపూర్, రాచూర్, చిన్న తడ్గూర్, ఖరగ్, అంతాపూర్, సోమూర్ గ్రామాల్లో రేషన్ దుకాణాలు లేవు. ఆయా గ్రామాల ప్రజలు పక్క గ్రామంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో తుక్కోజీవాడి, ముద్దొజీవాడి గ్రామాల్లో రేషన్ షాపులు లేవు. లింగంపేట మండలంలో గట్టుమైసమ్మతండా, ఒంటరిపల్లి, కొట్టాల్‌గడ్డ తండా, రాంపల్లి గ్రామాల ప్రజలు కూడా రేషన్ సరకుల కోసం పొరుగు గ్రామాలపై ఆధారపడాల్సిందే. గాంధారి మండల కేంద్రానికి ఆవాస గ్రామాలైన మాధవపల్లి, గుడిమెట్, పిసికిల్గుట్ట, తిమ్మాపూర్ గ్రామాల ప్రజలు గాంధారికి వెళ్లాల్సి. కరక్వాడీ గ్రామస్తులు బూర్గుల్కు వెళతారు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లోనూ కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. రేషన్‌షాపులు ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా లాభం లేకుండాపోయిందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో రేషన్ షాప్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
‘బియ్యం సరఫరా లేదు.. భోజనం పెట్టలేం’
ఇస్కాన్ మందిర నగర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ రాజమండ్రి సిటీ : ఇస్కాన్ ఫుడ్ రిలీప్ ఫండ్‌కు ఇవ్వాల్సిన బియ్యం సరఫరాను రెవెన్యూ అధికారులు నిలిపివేయడంతో శనివారం నుంచి ఇస్కాన్ మందిరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇస్కాన్ మందిరం రాజమండ్రి శాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇస్కాన్ మందిరంలో ఆయన మాట్లాడుతూ తమకు అందాల్సిన 200 క్వింటాళ్ల బియ్యం నిలిచిపోయాయని, అందువల్ల భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 2012 సంవత్సరానికి సంబంధించి ప్రతి పాఠశాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున పనివారికి ఇచ్చేందుకు నెలకు రూ.58 వేల చొప్పున రిలీజ్ అయ్యాయని, వాటినిజిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఇస్కాన్‌కు మధ్యాహ్న భోజన పథక పునరుద్ధరణ విషయమై నగర కమిషనర్ రవీంద్రబాబును వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వినతులు అందలేదన్నారు.