సన్నబియ్యం సరఫరాపై కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యం అక్రమార్కులకు సర్కారు అడ్డుకట్ట వేస్తోంది. అక్రమార్కులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించి వాటి స్థానంలో దొడ్డుబియ్యాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరçఫరాల శాఖ ఉన్నతాధి కారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు ఇటీవల పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి అన్నం వండించి నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలు, హాస్టళ్లకు కొత్తగా తెల్లని సంచుల్లో 50 కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు.
ఈ సంచులపై బియ్యం సరఫరా చేసిన మిల్లర్ పేరు, ఏ రోజు సంచులు నింపారు, మిల్లు ఉన్న ప్రాంతం, బియ్యం రకం తదితర వివరాలను ముద్రిస్తు న్నారు. ఈ సంచులను రేషన్ డీలర్లు, పాఠశాలలు, వసతి గృహాల నుంచి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే గుర్తించవచ్చంటున్నారు. తనిఖీల సమ యంలో అధికారులు అప్పటి కప్పుడు అన్నం వండించి సన్నబియ్యమే వినియోగిస్తున్నారని ఎంఈవోలకు ధ్రువీకరణపత్రాన్ని అందించాలి. దీనిని ఎంఈవో డీఈవోకి అందించాలి. ఆ తర్వాత డీఈవోలు జాయింట్ కలెక్టర్‌కు నివేదిక అందించాల్సి ఉంటుంది.