Rimes
-
రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ చాంబర్ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్ జైసింగ్ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైసింగ్ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యుడైన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. -
వికలాంగులకు వైద్య పరీక్షలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :రెండు నెలల క్రితం తిరుపతి బర్డ్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా వికలాంగులకు, మానసిక వికలాంగులకు, పోలియో గ్రస్తులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 120 మంది శస్త్ర చికిత్సలు చేసుకోగా బుధవారం రిమ్స్ ఆస్పత్రిలో వారికి ఫిజియోథెరపీ, ఇతర వైద్య పరీక్షలు చేశారు. బర్డ్ సంస్థ వైద్యుడు సుశ్రీత్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేశారు. శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు, ఇతర పరికరాలు అందజేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 60 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణరావు, వైద్యులు మేఘనాథ్, వినయ్‌కుమార్, హరికేతన్, శ్రావణ్, నాగార్జున పాల్గొన్నారు.