వికలాంగులకు వైద్య పరీక్షలు
Published Thu, Sep 12 2013 12:12 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :రెండు నెలల క్రితం తిరుపతి బర్డ్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా వికలాంగులకు, మానసిక వికలాంగులకు, పోలియో గ్రస్తులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా 120 మంది శస్త్ర చికిత్సలు చేసుకోగా బుధవారం రిమ్స్ ఆస్పత్రిలో వారికి ఫిజియోథెరపీ, ఇతర వైద్య పరీక్షలు చేశారు. బర్డ్ సంస్థ వైద్యుడు సుశ్రీత్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు చేశారు.
శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు, ఇతర పరికరాలు అందజేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 60 మంది హాజరై పరీక్షలు చేయించుకున్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణరావు, వైద్యులు మేఘనాథ్, వినయ్‌కుమార్, హరికేతన్, శ్రావణ్, నాగార్జున పాల్గొన్నారు.
Advertisement
Advertisement